Tuesday, June 2, 2026

 ఒకప్పుడు ఒక అడవిలో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కాకి తన గూడు కట్టుకుని జీవించేది. ఎంతో ప్రేమతో గుడ్లు పెట్టి, వాటి నుంచి పిల్లలు పుడతాయని ఆశగా ఎదురు చూసేది. 

అయితే అదే చెట్టు కింద ఒక దుష్ట పాము నివసించేది. కాకి గుడ్లు పెట్టిన ప్రతిసారీ, అది ఆహారం కోసం బయటకు వెళ్లిన సమయంలో పాము చెట్టు పైకి ఎక్కి గుడ్లను తినేసేది.

ఇలా పదేపదే జరుగుతుండటంతో కాకి తీవ్రంగా బాధపడింది. ఒకరోజు పాము తన గుడ్లను తినడం కాకి స్వయంగా చూసింది. 

👉పాముతో నేరుగా పోరాడే శక్తి తనకు లేదని గ్రహించిన కాకి ఒక తెలివైన ఉపాయం ఆలోచించింది.

దగ్గరలోని రాజభవనానికి వెళ్లిన కాకి, యువరాణి స్నానం చేయడానికి ముందు తీసి పెట్టిన బంగారు హారాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. వెంటనే రాజభటులు కాకిని వెంబడించారు. 

👉కాకి ఆ హారాన్ని పాము పుట్టలో పడేసింది. హారం కోసం వెతికిన భటులకు పాము కనిపించడంతో వారు దానిని చంపేశారు. దీంతో కాకి సమస్య పూర్తిగా తొలగిపోయింది. 

💕తన శత్రువైన పాము పీడ విరగడైందని, ఇకపై తన గుడ్లకు ఎలాంటి ఢోకా లేదని కాకి ఎంతో ఆనందపడింది. ఆ రోజు నుండి కాకి ప్రశాంతంగా గుడ్లు పెట్టి, పిల్లలను చేసుకుని సంతోషంగా జీవించింది.🍁

No comments:

Post a Comment