Friday, April 21, 2023

:::: మనస్సు ఒక వంటమనిషి ::::

 *:::: మనస్సు ఒక వంటమనిషి ::::*

 వంటవాడు రకరకాల కూరగాయలతో రకరకాల కూరలు చేస్తాడు. అలాగే ఒకే కూరగాయతో రకరకాల కూరలు చేస్తాడు.

  మన మనస్సు కూడా ఆరితేరిన వంట మనిషి. బాహ్య ప్రపంచంలోని ముడి పదార్థాలు వంటి వివిధ సంఘటనలను, పదార్ధాలను, విషయాలను, వండి, మనకు కొన్ని ఆకర్షణీయంగా, ఇష్టంగా, మరల్చి, మనలను వాటి వెంట విచక్షణ మరచి వెంట పడేలా చేస్తుంది.
   కొన్నింటిని అయిష్ట పడేలా చేసి దాని నుండి పారి పోయేలా చేస్తుంది.
   అక్కడ వున్నది ఒకటైతే దాని  రూపు రేఖలు మార్చి వేస్తుంది.
  ఈ ప్రపంచపు అసలు స్వరూపం ఏమిటో కనపడ నివ్వక, తన పాక విద్య సహాయంతో మనకు మరోలా దర్శింప చేస్తుంది. మనలను ఏడిపిస్తుంది, భయపెడుతుంది.
    ఒకొక్క సారి రెండు మూడింటిని కలిపి కల్పనతో మనలను ఊహాలోకాల్లో విహరింప చేస్తుంది.

*షణ్ముఖానంద 98666 77994*

No comments:

Post a Comment