...ఆధ్యాత్మిక కథలు*
ఈ రోజు కథ (ది: 24- 01- 2026)
శిష్యుడుగా మారిన దొంగ
ఓ సాయంత్రం వేళ షిచిరికోజెన్ అనే జెన్ గురువు సుత్త పిటకంలోని కొన్ని సూత్రాలని వల్లే వేసుకుంటుండగా ఓ దొంగ ఇంట్లో దూరి డబ్బు ఇస్తావా, ప్రాణం ఇస్తావా అని కత్తి చూపి బెదిరించాడు.
షిచిరి అతనితో అన్నాడు "నన్ను చికాకు పెట్టకు, ఆ బల్ల సొరుగులో డబ్బు ఉంటుంది చూడు," అని సూత్ర పఠనంలో నిమగ్నుడయ్యాడు. కొద్దిసేపు అయ్యాక సూత్ర పఠనం ఆపి దొంగతో అన్నాడు, “అంతా పట్టుకెళ్ళకు, రేపు పొద్దున్నే పన్ను చెల్లించటానికి కొంత నాకు అవసరం.”
దొంగ దొరికినంత ఎక్కువ మొత్తం మూట కట్టుకొని బయలుదేరబోతుండగా షిచిరి అతడితో అన్నాడు, “బహుమానం స్వీకరించినప్పుడు, దాతకు కృతజ్ఞతలు చెప్పడం విధాయకం.”దొంగ అలాగే అతడికి కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డాడు.
కొన్నాళ్లకు దొంగ రక్షక భటులకు పట్టుబడ్డాడు. చేసిన నేరాల్ని ఒప్పుకున్నాడు, షిచిరి ఇంట్లో చేసిన దాంతో సహా. సాక్షిగా షిచిరిని పిలిచినప్పుడు, అతడు చెప్పాడు, "ఇతడు దొంగ కాదు, కనీసం నాకు సంబంధించినంతవరకు. అతనికి నేనే డబ్బు ఇచ్చాను. అందుకు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు.”
తనకు విధించిన కారాగార శిక్ష అనుభవించిన తర్వాత అతడు షిచిరిని కలుసుకొని అతనికి శిష్యుడయ్యాడు.
No comments:
Post a Comment