Sunday, January 25, 2026

 లక్ష్య శిఖరం..
 పోరాట పథం..

ఓటమి ఒడిలో నిద్రపోకు...
కన్నీటి చలమలో కరిగిపోకు!
సముద్రపు కెరటం పడిపోయేది...
మళ్ళీ ఎగిసిపడటానికే అని మర్చిపోకు!
అలసటను ఆయుధంగా మార్చుకో!
అడ్డంకులను మైలురాళ్ళుగా మార్చుకో!
చీకటిని తిడుతూ కూర్చుంటే వెలుగు రాదు...
నీలోని సంకల్పమే సూర్యుడై ఉదయించాలి!
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. నిరీక్షించకు...
నీ గమ్యానికి నువ్వే సారథివై సాగిపో!
విమర్శల రాళ్ళతో నిన్ను కొట్టేవారుంటారు...
ఆ రాళ్ళతోనే నీ విజయానికి పునాది వేసుకో!
మౌనం నీ బలహీనత కాకూడదు...
అది రేపటి సునామీకి ముందున్న నిశ్శబ్దం కావాలి!
గుర్తుంచుకో...
సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే...
భయపడి కాదు, గర్జించి దూకడానికి!
మొక్కను నరికితే చిగురిస్తుంది...
మనుషులు నిన్ను అణిచివేస్తే...
నువ్వు ఒక విస్ఫోటనమై ఎదగాలి!
కాలం నీ కోసం ఆగదు...
కాలాన్ని నీ కాలికింద బంధించు!
సత్యం వైపు నిలబడు...
న్యాయం కోసం గొంతు ఎత్తు!
నీ అడుగు జాడలు...
రేపటి తరానికి దారిచూపే దీపాలు కావాలి!

Bureddy blooms.

No comments:

Post a Comment