Pasupula Pullarao...8919291603... సమస్త మానవాళి సమస్యలకు మూల కారణం జన్మ జన్మల చెడు కర్మల ఫలితమే అని ఎందరో గురువులు, పెద్దలు, అధ్యాత్మిక పుస్తకాలలో వివరించడం జరిగింది.
సమస్యలను పోగొట్టుకోవాలి అంటే సరైన సాధన ద్వారా దగ్ధం చేసుకోవాలని దాని పేరే జ్ఞానాగ్ని కర్మ దగ్దనం అని కూడా చెప్పడం జరిగింది.
మరి ఆ విధంగా ధ్యాన, జ్ఞాన ప్రచారాలు జరుగుచున్నాయో లేదో కొద్దిగా సాధకులు,ప్రచారకులు ఆలోచించాలి...
ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకోవడం అలాగే ఎవరికి తోచింది, నచ్చింది ప్రచారలు చేయడం అనేది అన్ని అధ్యాత్మిక సంస్థలలో జరుగుతున్న ప్రక్రియ...
ధ్యానం చేసే విధానం, అలాగే అందరితో సరైన సాధన చేయించడం జరగాలి కదా. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమి జరుగుతుంది, దాని ద్వారా శారీరక వ్యవస్థలో మార్పు ఎలా జరుగుతుంది, నాడీమండలం శుద్ది ఎలా జరుగుతుంది, అందువలన గత, వర్తమాన, భవిష్యత్ చెడు కర్మలు ఎలా దగ్ధం అవుతాయి అనేది కొత్త సాధకులకు వివరంగా విపులంగా వివరించాలి కదా. అలా జరుగుతుందా... గంటల గంటల ఊకదంపుడు ఉపన్యాసాలు,ప్రసంగాలతో ధ్యానుల సమయాన్ని వృదా చేస్తున్నారు కదా.. ఒకాయన పురాణ కాలక్షేపం అంటూ మొత్తం సమయాన్ని పురాణాల గురించే ఎక్కువగా చెబుతాడు...dna activation, మూడో కన్ను ఉత్తేజం, కుండలినీ శక్తి ఉత్తేజం, సోల్ కౌన్సెలింగ్ ఇలా కొందరు ఎవరికి వారు వ్యక్తిగత అజెండా తో ప్రచారాలు చేయడం అంటే అసలైన ధ్యాన సాధన కు చెదలు పట్టించడమే.. ఇప్పటికైనా ధ్యాన సాధన కు ప్రాముఖ్యత ఇస్తూ సరైన సాధన మాత్రమే చేయండి..A to Z ఫలితాలు పొందడం జరుగుతుంది కొంత సమయం తర్వాత...సమయం పట్టేది ఎందుకంటే జన్మ జన్మల చెడు కర్మలు దగ్దం కావడం జరగాలి కదా.
No comments:
Post a Comment