Sunday, January 25, 2026

 విదురా !
నాకు భయంగా ఉంది
నా మనస్సు ఆందోళణగా ఉంది
కంటికి కునుకు కూడా రావడం లేదు

అన్నాడు ధృతరాష్ట్రుడు

**********

అన్నా...!

బలవంతుడు దండెత్తినపుడు 
బలహీనుడైన రాజుకూ ....

చోరులు పొంచి ఉన్నారని
అతి సంచయం చేసిన వానికీ ....

పరుల సొమ్మును 
అపహరించ పొంచిన చోరులకూ ....

పర స్త్రీ వ్యామోహంతో 
కొట్టుమిట్టాడే కాముకునికీ ...

భయమూ ...
మానసిక ఆందోళణా ....
కంటి మీద కునుకూ కరువౌతాయి

వీటిలో నువ్వేదో 
పరిశీలించుకో ఆత్మపరీక్ష చేసుకో

అంటాడు విదురుడు సూటిగా

********

వ్యాసప్రోక్త 
మహాభారతంలోనూ ...
ఆణిముత్యం విదుర నీతి

తొల్లటి కథనూ
కవిత్రయ భారతంలోని
తిక్కన నాటకీయత నూ జోడించి
తేట తెనుగు వచనంలోకి మలచి 
మనకందించారు తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి 

********

నిజమైన హితుడు
నిన్నెలా హెచ్చరిస్తాడో తెలియాలంటే
సదా నీ మేలు కోరే నేస్తం నీ తప్పులనెలా ఎత్తి చూపుతాడో అవగతమవ్వాలంటే
చదవాలి విదుర నీతి


- రత్నాజయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment