Sunday, January 25, 2026

 బందీ!
*****
నిలబడి నీళ్లుతాగు 
ఇది పాతసామెత!
ఎగబడినీళ్ళుతాగు 
ఇది కొత్తసామెత!
అవీప్రక్కవాడినీళ్లు!

వెనిజులావాడిదికాదు 
గ్రీన్ లాండ్ వాడిదికాదు 
ఇరాన్ వాడిదికాదు
ఆ చమురు బావులు
వాడికి కావాలి!

ఎక్కడిసంపదలన్నీ
అవివాడికే సొంతం!
11యుద్ధాలు ఆపిన
శాంతి కాముకుడు 
వాడికి అడ్డొస్తే ఎలా?

దేశాధ్యక్షుణ్ణే కాదు
వాడి భార్యనుకూడా
లేపుకుచ్చిన
రావణాసురుడు!
వీణ్ణేం చెయ్యాలి?

ప్రపంచమంతాయింతే
స్పీడు పెరిగింది!
దొరికినచోటల్లా
హింసా దౌర్జన్యాలు!
ఎవడేమనుకున్నాసరే!

భారత్ లో ఐతే
ఎవడిమీదికి
దండెత్తలేడు!
తనపిల్లల్ని
తానే తినేస్తాడు!

 కాశ్మీర్ మణిపూర్ 
సహజసంపదలు 
ఎవరికప్పగించాలి!
దేశ సంపదలన్నీ 
అదానీ అంబానీలకే!

రెచ్చిపోయారు 
తెగించేశారు 
సామ్రాజ్యవాదుల 
కబంధహష్టాల్లో 
ప్రపంచం బందీ!
       ******
-తమ్మినేని అక్కిరాజు 
      హైదరాబాద్ 
      25-1-2026

No comments:

Post a Comment