స్త్రీలు ప్రేమకు ముందు ఎందుకు పరీక్షిస్తారు | Relationship Psychology
https://youtu.be/G8BOWf8Uass?si=UIorvJP5c5qU-dl7
https://www.youtube.com/watch?v=G8BOWf8Uass
Transcript:
(00:03) మగాడు ఒక ఆడదాని కోసం యుద్ధాలు చేసేది కేవలం తన అందం కోసమే కాదు. ఒకవేళ ఆ అందమైన అమ్మాయి ఆ అబ్బాయికి పడిపోతే తనకి ఎక్కడ లేని సంతోషం వస్తుంది. అది ఎలా అంటే మీరెవ్వరూ సాధించలేనిది మీకంటే ఒక గొప్పవాడిని అని చూపించుకోవడానికే ఫైనల్ లో ఒక అమ్మాయి నా కూడా పడిపోయింది అని చెప్పుకోవడానికే ఆమెను పొందడం ద్వారా తన వాల్యూ తన స్టేటస్ తన మగతనం నిజమని నిరూపించుకోవడం.
(00:34) అందుకే తనకే తెలియకుండా ఆ బ్యూటీని తన వల్లో పడేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. ఎన్ని ఫెయిల్యూర్స్ అయినా ఫేస్ చేస్తాడు. కానీ ఒక స్త్రీ పోరాటం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె తన లుక్స్ ని చూసో మాటలకో తాను చూపించే ప్రేమకో పడిపోదు. కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఏ ఆడదైనా ముందు ఇప్పుడు చెప్పిన వాటికి పడవచ్చు. బట్ మోస్ట్లీ ఫైనల్ గా వాళ్ళు తీసుకునే డెసిషన్ మాత్రం వేరే.
(01:00) అందుకే ఒక స్త్రీ ప్రేమలో పడే ముందు గమనిస్తుంది. భయం ఎదురైనప్పుడు అతను ఎలా స్పందిస్తాడు. ఓడిపోయినప్పుడు తనను తానే ఎలా చూసుకుంటాడు బాధ్యత వచ్చినప్పుడు తీసుకుంటాడా లేదా తప్పించుకుంటాడా ఇవన్నీ ఆమె గమనిస్తుంది. ఇది పరీక్షలా కనిపించొచ్చు కానీ నిజానికి అది తన భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నం పవర్ ఉన్నవాడి దగ్గరే చివరకు సెటిల్ అవుతుంది.
(01:24) ముందు ఒక మగడు చూపించే ప్రేమకి లేదా అతను మాటలకి పడిన ఫైనల్ డెసిషన్ మాత్రం వేరే. అదే పవర్. స్త్రీకి మగాడు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు అతను ఒక ఆశ్రయం ఒక డెసిషన్ మేకర్ ఒక దారి చూపించే మనిషి అందుకే ఆమె బలాన్ని చూస్తుంది. కానీ అది శారీరక బలం కాదు తన కోపాన్ని నియంత్రించగల శక్తి తన కోరికలను కట్టడి చేయగల స్థైర్యం తప్పు జరిగితే బాధ్యత తీసుకునే ధైర్యం ఇదే ఆమెకు భద్రతనిస్తుంది.
(01:56) చాలా మగాళ్ళు మౌనంగా ఉండటం బలమని అనుకుంటారు. కానీ స్త్రీకి ఆ మౌనం స్పష్టత లేకపోవడంలా అనిపిస్తుంది. అందుకే ఆమె ప్రశ్నలు అడుగుతుంది. మాట్లాడమంటుంది. కొన్నిసార్లు విసిగిస్తుంది కూడా అది తగాదా కోసం కాదు అతని లోపల ఏముందో తెలుసుకోవాలనే ప్రయత్నం ఎందుకంటే మాటల్లోనే మనిషి ఆలోచనలు విలువలు బయట పడతాయి గనుక.
(02:22) మగాడు ఎక్కువగా చూపుతోనే ఆకర్షితుడు అవుతాడు. కానీ స్త్రీ ప్రవర్తనను చూసి నిర్ణయం తీసుకుంటుంది. ఆమెకు ప్రేమ అనేది దీర్ఘకాలిక నిర్ణయం తప్పు వ్యక్తిని ఎంచుకుంటే దాని ప్రభావం తన జీవితం మొత్తం మీద పడుతుందని ఆమెకు తెలుసు. అందుకే జాగ్రత్తగా అడుగేస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ముందుగానే నిర్ణయాలు తీసుకుని వాటి నుండి బయటకు రాలేక అక్కడే ఇరుక్కుపోయారు.
(02:46) ఈ పోరాటం మగాడికి కొన్నిసార్లు అవమానంలా అనిపించవచ్చు. నన్నుఎందుకు ఇంతగా ప్రశ్నిస్తోంది అనే కోపం రావచ్చు కానీ ఆమె దృష్టిలో ఇది పరీక్ష కాదు జాగ్రత్త ఆమె అతన్ని మార్చాలని చూడదు. అతను నిజంగా ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. స్త్రీకి గొప్ప మాటలు అవసరం లేదు. కష్ట సమయంలో కనిపించే చిన్న చర్యలు చాలు అతను ఎంత సంపాదిస్తున్నాడో సంపాదించలేని సమయంలో కూడా ఎలా నిలబడతాడో ముఖ్యం.
(03:14) పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మంచివాళ్లే కానీ పరిస్థితులు చెడిపోయినప్పుడు ఎవరు ఎలా ఉంటారో అదే అసలైన నిజం. అందుకే మగాడు ప్రెజెంట్ ని చూసి ప్రేమిస్తే స్త్రీ భవిష్యత్తును చూసి నిర్ణయం తీసుకుంటుంది. ఆమె చేసే పోరాటం ప్రేమకు వ్యతిరేకమని అనుకుంటాం. బట్ ప్రేమకు ముందే జరిగే ఒక స్పష్టత ప్రక్రియ. తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలన్నది తెలుసుకునే ప్రయత్నం.
(03:39) ఒక స్త్రీ ఒక మగాడితో పోరాడేది అతన్ని ఓడించడానికి కాదు తనను తాను కాపాడుకోవడానికి అతనిపై ఆధిపత్యం చూపించాలనే ఉద్దేశం కూడా కాదు అతనిపై నిజంగా ఆధారపడగలనా అనే స్పష్టత కోసం ప్రేమ కోసం పోరాటం చేయడం కాదు ఆమె ఉద్దేశం. ప్రేమ వచ్చిన తర్వాత ఆ ప్రేమను భరించగల బలమైన మనిషేనా అని తెలుసుకోవడమే. తన జీవితం తన భద్రత తన భవిష్యత్తు ఎవరి చేతిలో పెట్టబోతుందో అర్థం చేసుకోవడానికి ఆమె ప్రశ్నలు అడుగుతుంది. గమనిస్తుంది.
(04:11) కొన్నిసార్లు ఎదిరిస్తుంది కూడా అది అనుమానం కాదు జాగ్రత్త అనవసరమైన తగాదా కాదు అవసరమైన స్పష్టత ఎందుకంటే ఆమెకు ప్రేమ అనేది క్షణిక భావోద్వేగం కాదు. జీవితాన్ని మోసుకెళ్లే నిర్ణయం. అందుకే ఒక స్త్రీ చేసే పోరాటం ప్రేమకు వ్యతిరేకం కాదు ప్రేమకు ముందు జరిగే సహజమైన రక్షణ ప్రక్రియ
No comments:
Post a Comment