దేన్నీ సొంతం చేసుకోకండి! Why You Own Nothing In Life Satyagrahi
https://youtu.be/Znezh2sdGU4?si=lPWg8q0FIY0aU0h6
https://www.youtube.com/watch?v=Znezh2sdGU4
Transcript:
(00:00) మీకు బాగా నచ్చిన వస్తువో లేకపోతే మీకు బాగా నచ్చిన మనిషో మీకు దక్కలేదని ఏడుస్తున్నారా అయితే ఒక్క నిజం తెలిస్తే ఆ బాధ ఇప్పుడే పోతుంది. అసలు మనం ఏడుస్తుంది ఆ దక్కలేదని కాదు అది నాది అని చెప్పుకునే ఛాన్స్ రాలేదని ఒకసారి ఆలోచించండి మీ చేతిలో ఉన్న ఫోను మీరు కూర్చున్న కుర్చి ఆఖరికి మీ పక్క ఉన్న మనుషులు వీళ్ళఎవరు శాశ్వతంగా మీతో ఉంటారని గ్యారెంటీ ఉందా? ఈ ప్రపంచంలో ఏది నీది కాదు నువ్వు కూడా ఈ ప్రపంచానివి కావు.
(00:27) ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే మన ప్రశాంతత వెతుక్కుంటూ ఎక్కడో తిరుగుతున్నాం. అసలు సమస్య ఏంటంటే ఈ రోజుల్లో మనల్ని పట్టి పీలుస్తున్న అతి పెద్ద జబ్బు ఏంటో తెలుసా సొంతం చేసుకోవాలనే పిచ్చి దీన్ని ఇంగ్లీష్ లో ది ట్రాప్ ఆఫ్ ఓనర్షిప్ అంటారు. మనకు నచ్చిన ప్రతీది మన జేబులో ఉండాలి మన బీరువలో ఉండాలి లేదా మన పేరు మీద రిజిస్టర్ అయి ఉండాలి.
(00:47) ఒక మంచి బైక్ చూస్తాం అది మన గ్యారేజ్ లో ఉండాలి. ఒక అందమైన అమ్మాయినో లేకపోతే అబ్బాయినో చూస్తాం వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ అవ్వాలి. ఒక మంచి జాబ్ చూస్తాం అది మనకే రావాలి. ఇలా ప్రతి వస్తువు మీద ప్రతి మనిషి మీద మనం ముద్ర వేయాలని తాపత్రయ పడతాం. ఒకసారి గమనించండి ఏదైనా వస్తువు మనది కానంతవరకే దాని మీద మనక ఒక రకమైన గౌరవం ఇష్టం ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది నాది అనే ముద్ర పడుతుందో అప్పటి నుంచే భయం మొదలవుతుంది.
(01:10) దాన్ని ఎవరైనా పట్టుకుంటే కోపం అది పాడైపోతే బాధ అది ఎక్కడ పోతుందని ఇన్సెక్యూరిటీ. మనం ఒక వస్తువుని కొన్నప్పుడు మనం ఆ వస్తువు యజమాని అనుకుంటాం కానీ నిజానికి మనం ఆ వస్తువుకి బానిసలం అవుతాం. అది ఇచ్చే ఆనందం కంటే అది ఎక్కడ దక్కకుండా పోతుందో అన్న బాధే మనల్ని ఎక్కువసేపు వెంటాడుతుంది. ప్రేమ విషయంలో కూడా ఇదే జరుగుతుంది.
(01:32) ప్రేమించడం అంటే ఏంటి ఎదుటి వ్యక్తి నాకే సొంతం కావాలని కోరుకోవడం కాదు ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఒక మనిషి మన మాట వినకపోయినా మనకి దక్కకపోయినా మనం తట్టుకోలేకపోతున్నాం. అక్కడే డిప్రెషన్ మొదలవుతుంది. నాది అనుకున్నది నా దగ్గర లేదు అనే వెలితి మనల్ని లోపల నుంచి తినేస్తుంది. ఈ పిచ్చి వల్లే మనం ఉన్నదాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం.
(01:51) లేని దాని కోసం ప్రాకులాడతాం. ఈ ఓనర్షిప్ అనే మైండ్సెట్ మనల్ని ఇనుప గోలుసులతో బంధించేస్తుంది. అసలు మనకి సొంతం చేసుకోవాలనే ఆరాటం ఎందుకు వస్తుంది? దీని వెనుకున్న సైకాలజీ ఏంటి? సింపుల్ అండి. మనకు చిన్నప్పటి నుంచే సొసైటీ ఒక విషయాన్ని నూరుపోసింది. అదేంటంటే నీ దగ్గర ఎన్ని వస్తువులు ఉంటే నువ్వు అంత గొప్పవాడివి.
(02:11) నీ దగ్గర ఎంతమంది మనుషులు ఉంటే నీకు అంత పవర్ మన ఐడెంటిటీ మన దగ్గర ఉన్న ఒక వస్తువుతో పోల్చుకుంటాం. నా దగ్గర ఐఫ ఉంటే నేను స్మార్ట్ నా దగ్గర లగ్జరీ కార్ ఉంటే నేను సక్సెస్ ఫుల్ ఈ భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. కానీ లోతుగా ఆలోచిస్తే ఈ ప్రాబ్లం మన ఈగో నుంచి పుడుతుంది. నేను అనే అహంకారం ఎప్పుడు దేన్నో ఒకదాన్ని పట్టుకోవాలని చూస్తుంది.
(02:29) ఆ వస్తువు లేకపోతే నా ఉనికి లేదేమో అని భయపడుతుంది. అందుకే మనం ఒక వస్తువుని ప్రేమిస్తున్నాం అనుకుంటాం కానీ నిజానికి ఆ వస్తువు వల్ల వచ్చే స్టేటస్ ని మనం ప్రేమిస్తాం. మనం ఒక మనిషిని ప్రేమిస్తున్నాం అనుకుంటాం కానీ ఆ మనిషి నా పక్కన ఉండటం వల్ల నా ఈగో కి వచ్చే సాటిస్ఫాక్షన్ మనం కోరుకుంటాం. సో మరో కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అనే నిజాన్ని మనం అంగీకరించలేకపోతున్నాం.
(02:53) మనం పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదో పోయేటప్పుడు ఏమి తీసుకుపోము. మధ్యలో ఉండే ఈ కాసేపు ప్రయాణంలో అన్ని మనమే అనుకోవడం ఎంత పెద్ద అమాయకత్వం ఒక అద్ది ఇంట్లో ఉంటూ అది నా సొంత ఇల్లు అని ఫీల్ అయ్యి గోడకు చిన్న గీత పడినా సరే గుండెలు బాదుకుంటున్నట్లు ఉంటుంది మన పరిస్థితి. మన బాడీ కూడా మనది కాదు అది కూడా ప్రకృతి ఇప్పుడు ఇచ్చిందే. ఇలాంటిది మన బయట వస్తువుల మీద ఒక ఓనర్షిప్ ట్యాగ్ వేయడం వల్ల మనం అనవసరమైన టెన్షన్ కి గురవుతున్నాం.
(03:17) మనకి దక్కని ప్రతిది మనల్ని బాధ పెడుతుందంటే దానికి కారణం అది కాదు మనలో ఉన్న నీది నాది అనే బేధమే. సో ఈ ఓనర్షిప్ ట్రాప్ నుంచి బయటపడాలంటే మన ఆలోచన తీరుని మార్చుకోవాలి. దీనికి ఒక అద్భుతమైన మార్గం ఉంది అదేంటంటే ప్రేమించడం అంటే జేబులో పెట్టుకోవడం కాదు ఒక వస్తువుని గాని మనిషిని గాని మనసారా ప్రేమించండి. కానీ దాని మీద అధికారాన్ని కోరుకోకండి.
(03:39) నీమ్ కరోలిీ బాబా జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఆయన దగ్గర ఒక పాత శంఖం ఉండేది. ఆయనకి ఎంతో ఇష్టం ఒక రోజు దాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. అది చూసి భక్తులు చాలా బాధపడ్డారు. వెతికి తెస్తాం అన్నారు. ఇప్పుడు బాబా నవ్వి ఒక మాట చెప్పారు. ఇది కొంతకాలం నా దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకొందరి దగ్గరికి వెళ్ళింది. ఇది ఎక్కడున్న శంఘమే కదా దాని ధ్వని ఎక్కడున్న ఒకటే కదా అదే అసలైన విముక్తి.
(03:58) ఒక [సంగీతం] వస్తువుని ఎంత ఘాఢంగా ప్రేమించారో అవసరం తీరాక అంతే సులభంగా వదిలేయగలగాలి. మనకు నచ్చిన వస్తువు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది నాది అని కాకుండా ఇది ఇప్పుడు నా దగ్గర ఉంది అనుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న పదాల మార్పు మన మనసు మీద పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. అది మీ దగ్గర ఉన్నంతసేపు దాన్ని ఎంజాయ్ చేయండి. దాని విలువని గౌరవించండి.
(04:19) కానీ అది మీ నుంచి దూరమైనప్పుడు దాన్ని ఒక పక్షిలా ఎగరనివ్వండి. ఎందుకంటే దేన్నైనా గట్టిగా పట్టుకుంటేనే అది నలిగిపోతుంది. లేదా మిమ్మల్ని గాయపరుస్తుంది. డిటాచెడ్ అటాచ్మెంట్ అంటే ఇదే. మీరు దేన్నైనా అనుభవించొచ్చు. కానీ దానికి బానిస అవ్వకూడదు. ఆ వస్తువు ఉన్నా లేకపోయినా మీ సంతోషం మారకూడదు. ఒక వస్తువు లేదా మనిషి మీ దగ్గర లేకపోవడం వల్ల మీరు అసూపర్ణం కాదు. మీరు ఎప్పుడూ సంపూర్ణులే.
(04:42) ఈ విషయం తెలిస్తే ఆ ఓనర్షిప్ అనే గొలుసు వాటంతటవే విడిపోతాయి. ఈరోజు నుంచి మన లైఫ్ ని ఒక కొత్త యాంగిల్ లో చూద్దాం. ఈ ఫిలాసఫీని కేవలం వినడం కాదు ప్రాక్టికల్ గా అప్లై చేద్దాం. ఎలాగో తెలుసా? ఈరోజు మీ దగ్గర ఉన్న మీకు ఇష్టమైన వస్తువుని తీసుకోండి. అది ఒక డ్రెస్ కావచ్చు, ఒక గ్యాడ్జెట్ కావచ్చు దాన్ని ఈరోజే మీ ఫ్రెండ్స్ కో లేక వేరే వాళ్ళకో వాడమని ఇవ్వండి.
(05:01) అది మీ దగ్గర లేనప్పుడు మీకు కలిగే ఆ చిన్న భయాన్ని ఆ ఇన్సెక్యూరిటీని గమనించండి. మీ మనసు అది పాడైపోతుందేమో వాళ్ళు సరిగ్గా చూసుకోరేమో అని 100 వంకలు పెడుతుంది. అదే మీ అటాచ్మెంట్ దాన్ని గమనిస్తూనే ఇది నాది కాదు కొంతకాలం నా దగ్గర ఉందంతే అని మనసుకి గట్టిగా చెప్పుకోండి. ప్రతిరోజు పడుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.
(05:21) ఈరోజు నేను వాడిన వస్తువు ఏ వస్తువు కూడా రేపు నా దగ్గర ఉండకపోవచ్చు. ఆఖరికి ఈ ఊపిరి కూడా ఈ ఒక్క స్పృహ ఉంటే మీరు మనుషులతో ప్రవర్తించే తీరు మారిపోతుంది. మీ దగ్గరఉన్న మనుషుల మీద కోపడటం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళు మీ సొత్తు కాదు అని మీకు అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు మీతో ఉన్న ప్రతి నిమిషాన్ని ఒక గిఫ్ట్ లా ఫీల్ అవుతారు.
(05:40) మీ లైఫ్ లో ఉన్న ప్రతి వస్తువుని ఒక అతిథిలా చూడండి. అతిథి వచ్చినప్పుడు గౌరవిస్తాం, ఉన్నంతసేపు సేవ చేస్తాం, వెళ్ళేటప్పుడు నవ్వుతూ సాగనపుతాం. ఇదే రియల్ లైఫ్ ప్రొడక్టివిటీ. ఇదే రియల్ హ్యాపీనెస్. ఒక విషయం గుర్తుంచుకోండి మీరు దేన్నైతే నాది అని గట్టిగా పట్టుకుంటారో అది మిమ్మల్ని బంధిస్తుంది. దేన్నైతే మీరు స్వేచ్ఛగా వదులుతారో అది మీకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.
(06:00) ఈ క్షణం నుంచి ఈ సొంతం చేసుకోవాలని పిచ్చిని వదిలేయండి. మీ దగ్గర ఏముంది అన్నది ముఖ్యం కాదు మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అన్నదే ముఖ్యం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను చాలా కాస్ట్లీ హెల్మెట్ కొన్నాడఅన్నమాట. కొన్న తర్వాత ఆన ఏంటంటే సరదాగా బైక్ వేసుకొని బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక మంచి సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందని చెప్పేసి అక్కడికి వెళ్తాడు.
(06:19) ట్రై చేస్తే సినిమా టికెట్లు దొరుకుతాయి. కానీ ఇప్పుడు తానఏంటి ఆ హెల్మెట్ బైక్ మీద పెట్టి రావాలా లేకపోతే తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట. బైక్ మీద పెడితేనేమో అది చాలా కాస్ట్లీ హెల్మెట్ మనోడు ఇష్టంగా కొనుక్కున్నాడు. సో దాంతో దాన్ని ఎవరైనా దొబ్బుకెళ్తే మనోడికి ఏంటంటే బాధ మామూలు కాదన్నమాట. వర్ణ తీరం.
(06:36) కాకపోతే థియేటర్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలా? స్కూల్లో పెట్టుకొని సినిమా చూడాలా కంఫర్ట్ గా ఉండదు. సో బేసికల్ గా మన జీవితంలో మనం చాలా వస్తువుల మీద ఎక్కువగా ప్రేమ పెంచేసుకుంటాం. వాటి ధర కూడా మనల్ని భయపెడుతూ ఉంటుంది అన్నమాట. ఇంత ఖర్చు పెట్టి మనం కొన్నాము అని చెప్పేసి. మీరు నమ్ముతారో నెంబర్ చాలా మంది మధ్య తరగతి జీవితాన్ని ఇష్టపడతారు.
(06:54) ఎందుకంటే కాస్ట్లీ వస్తువులు కొనుక్కొని అవి ఉంటాయో పోతాయో తెలియక మరి ముఖ్యంగా ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవించలేక అవి ఉన్నాయో లేదో చూసుకుంటూ జీవితాంతం గడుపుతూ ఉంటారు. సో నేను ఏమంటానంటే మీ జీవితంలో కాస్ట్లీ వస్తువులు ఉండాలనుకోవడం తప్పులేదు. కానీ అవి ఎల్లకాలం ఉండాలనుకోవడం తప్పన్నమాట ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రుల్ని వాళ్ళ పిల్లలు అసహించుకుంటారు.
(07:15) ఎందుకంటే వాళ్ళ పిల్లలైనంత మాత్రాన జీవితాంతం ఇష్టపడాలని చెప్పేసి రూల్ లేదు కదా అందులోనూ నా పిల్లలు నా పిల్లలే అని చెప్పేసి వాళ్ళని అతిగా ఆరాపం చేయడం వల్ల వాళ్ళకి కష్టాలు తెలియవు. అందులోనూ తల్లిదండ్రులు కష్టపడుతున్నారని సంగతి కూడా వాళ్ళకి అర్థం కాదు. ఫ్యూచర్ లో ఆ తల్లిదండ్రులని వదిలించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు జాలీగా పెంచారు.
(07:33) ఎటువంటి కష్టాలు వాళ్ళ ముందు పడలేదు. అందులోన వాళ్ళకి ఎటువంటి కష్టాలు చూపించలేదు. సో మనుషులే మనుషుల్ని వదిలేసి పోతున్న ఈ రోజుల్లో కొన్ని వస్తువులకి కొంత డబ్బుకి కొన్ని ఉద్యోగాలకి ఇవి నాతోనే ఉండాలి నేను వీటితోనే ఉండాలని చెప్పేసి ముడేసుకుంటూ కూర్చుంటే మన జీవితం మొత్తం నరకంలా మారుతుంది కాబట్టి మీ దగ్గర ఏమున్నా అది ముఖ్యం కాదు మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అన్నదే ముఖ్యం సో జీవితం అంటే పోగు చేసుకోవడం కాదు అనుభవించడం అనుభవించిన ప్రతిదాన్ని కృతజ్ఞతతో వదిలేయటం నేటి నుంచే మారండి ఈ అటాచ్మెంట్ అనే మాయ నుంచి బయటపడండి మీరు ఎప్పుడైతే దేనికి ఓనర్
(08:06) కానని తెలుసుకుంటారో అప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది మీదే అని అర్థం అవుతుంది. ఆ స్వేచ్ఛని అనుభవించండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ లైఫ్ లో మార్పు వస్తుందని అనిపిస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువో లేకపోతే జ్ఞాపకమో లేకపోతే మనిషో మీకు దూరమైతే ఉండగలరా? ఒకవేళ ఉండలేకపోతే ఆ వస్తువు ఏంటో కొంచెం కామెంట్ చేయండి.
(08:30) చూద్దాం ఎంతమంది ఆ మాయ నుంచి బయట పడడానికి రెడీగా ఉన్నారో లేదో తెలుస్తుంది. దయచేసి వస్తువు మాత్రం కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అంతే కాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీ కోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
(08:57) ఓం ఓం
No comments:
Post a Comment