*“Die Empty”✌️*
_A book written by —-Todd Henry_
==================
_(ఇది మీరెప్పుడూ వినని, చదవని విషయం... ఒక గొప్ప పుస్తక పరిచయం.. చదవకుండా వదలొద్దు)_
*🔶 [ఇప్పటిదాకా నేనెంత దురదృష్టవంతుణ్ణో!!!???? "ఇంత గొప్ప పుస్తకం ఉందని నాకిప్పటి వరకూ తెలియకపోవడం ఎంత బాధాకరం!?" --- అయితే ఇప్పటికిప్పుడు నేనెంత అదృష్టవంతుణ్ణి అయ్యానో చెప్పలేను.!!!!*
*😃 ఈ పుస్తకం గురించి ఇప్పుడైనా తెలుసుకోగలిగినందుకు నా జన్మ ధన్యమయ్యింది అనిపిస్తోంది! ఒక వాట్సాప్ గ్రూపులో ఒక కుర్రాడు పెట్టిన పోస్టు ఇది. చదువుతూంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉందో! మీరూ చదవండి. ఆ పుస్తకంలోని ఆ గొప్ప విషయం తెలుసుకోండి. దాన్ని గురించి ఆలోచించండి...*
*(నేను చదివిన ఆ పోస్టు లోని విషయాన్ని నేను అస్సలేమీ మార్చలేదు. కేవలం ఆకర్షణీయంగా ఉండి, అందరికీ చదవాలనే ఆసక్తి కలిగించడానికి మాత్రమే కొన్ని రంగులూ, హంగులూ అద్దానంతే...) దయచేసి ఒక్కసారి ఖచ్చితంగా చదవమని కోరుతూ, మీ…....*
*—వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా}* 🙏🙏🙏🙏🙏
*👍🔶 అతిపెద్ద, అతిగొప్ప నీతిని తెలిపే ఈ చిన్ని పుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.*
*ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ ఉంది... టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.*
*🌺_‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ ఉంది?’_ అనేది ఆ ప్రశ్న.*
*🌷‘పెట్రోలు, గ్యాస్ అపారంగా ఉన్న గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.*
*అప్పుడా డైరెక్టర్ అవేవీ కావంటూ… అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.*
*‘ఈ లోకంలో అత్యంత ఖరీదైన స్థలం ఏదంటే… _“స్మశానం”_*
*‘ఎందుకంటే......*
*అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.*
*‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే ఉన్నారు, ఇంకా చనిపోతూనే ఉన్నారు.*
*పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి..!?!’*
*డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.*
*ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.*
*👌ఆయన ఈ పుస్తకంలో ఒకచోట ఇలా అంటాడు.*
*❇️‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి...అని’*
*💠నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:....*
*✴️‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడిపోయేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.*
*❤️‘మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.*
*🧠‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.*
*🤔‘మీకేదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.*
*❤️‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’*
*🙏 ఉన్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలో ఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!*
*🌺‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....*
_“Let us Die Empty”_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*_{సేకరణ:-- --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*

No comments:
Post a Comment