Saturday, April 1, 2023

6. ఆత్మ జ్ఞానం మోక్షమార్గం

 🔥 *"6"* 🔥
   🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
   🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
     💖🔥💖🔥💖🔥💖
           💖🔥🕉🔥💖
                 💖🔥💖
                       💖
*"ఒక్క మాటలో చెప్పాలంటే మానవునిలోని సకల భయాలు, దుర్గుణాలు, దుఃఖాలు ఒక్క దెబ్బకు తొలగిపోవాలంటే కేవలం ఒక్క “బ్రహ్మచర్యం” పాటిస్తే చాలు."* 

*ఇంకేం అవసరం లేదు.* 

*"[ బ్రహ్మచర్యం అంటే శరీరంలోని వీర్యాన్ని అశాస్వతమయిన, కృత్రిమమయిన సంభోగ ఆనందం కోసం వృధాగా బయటకు వెళ్ళనివ్వకుండా జీవించినంతకాలం శరీరంలోనే నిలుపుకోవడం ]."*

*"బ్రహ్మచర్యం పాటించని సాధారణ మానవుడు మరణించినప్పుడు అతడి శరీరం కట్టెలా అయిపోయి తేజోహీనంగా కనిపిస్తుంది. అదే బ్రహ్మచర్యం పాటించిన ఒక యోగి మరణించినప్పుడు అతడి శరీరం కాంతివంతంగా కనిపిస్తుంది."*

*"మరణం తర్వాత కూడా అతడి ముఖంలో తేజస్సు ఉట్టిపడుతుంది."* 

*"అతని శరీరంనుంచి ప్రాణశక్తి వెళ్ళిపోయినా అతడి దేహంలో తేజస్సు తగ్గదు."* 

*"బౌతికమయిన సంపదలు, సుఖాల వలన మానవుని ముఖంలో కనిపించే తేజస్సు, ఆనందం క్షణికం, కృత్రిమం."*

 *"బ్రహ్మచర్యం పాటిస్తూ ఆత్మ దర్శనం చేసుకున్న యోగి ముఖంలో కనిపించే తేజస్సు శాశ్వతం."*

*"కాబట్టి మానవులు బ్రహ్మచర్యం ఒక సంవత్సరం పాటు నిష్టగా పాటిస్తే ఆ తర్వాత ఏదో ఒక క్షణంలో ఎవరికయినా “ఆత్మ దర్శనం” తప్పక అవుతుంది అని అందరూ గ్రహించాలి."* 

*"అలాగే అనారోగ్యంతోనో, మరేదో ఇతర కారణంతోనో మరణానికి చేరువయివుండి తమ ఆయుష్షులో ఒక సంవత్సరకాలం మిగిలి ఉండనివారు ఆందోళన చెందాల్సిన పనిలేదు."* 

*"ఆత్మ దర్శనానికి అసలు ఆయుష్షు ఎంతుందనేది ముఖ్యం కానే కాదు."* 

*"ఈ క్షణం నుంచి ఆత్మను భావన చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ మరొక పది క్షణాల తర్వాత మరణించినా తప్పక “మోక్షం” లభిస్తుంది."*

*అదెలాగో వినండి.*

 *ఆత్మకు ఆకారం లేదు.* 

*ఆత్మ నిరాకారం.* 

*"నేను ఆత్మను అని భావన చెయ్యడమంటే ఈ బౌతికమయిన ప్రపంచాన్ని త్యజించడమే."* 

*అదే మోక్షం.*

*"ప్రపంచం అనే ఆకారాన్ని నమ్మడమే బంధం."* 

*"మనస్సనే తెరలోంచి అజ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చూసే ఆత్మను జ్ఞానంతో దర్శించడమే మోక్షం."*

 **అంతే. ఇక దీనికి కాలంతో పనేముంది."*

*"కాబట్టి మానవుని లక్ష్యం మోక్షం అయితే అది ఎప్పుడయినా సాధ్యమే."* 

*"ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు."* 

*"భగవంతుడు శ్రీ వసిష్ఠ మహర్షి, భగవంతుడు శ్రీ వేదవ్యాసమహర్షి, భగవంతుడు శ్రీ వాల్మీకిమహర్షి చెప్పిందే మేమిక్కడ చెబుతున్నాం."* 

*"తప్పక విశ్వసించి ప్రయత్నించి చూడండి అప్పుడు మీకే సత్యం అర్ధం ఆవుతుంది."* 

*"భయమే మరణం – ధైర్యమే మోక్షం."* 

*"కాబట్టి మానవుడు ముందు తన జీవిత లక్ష్యం ఏంటో నిర్ణయించుకోవాలి."*

*"తల వంచుకుని నించున్నవానికి భూమి కనిపిస్తుంది గాని ఆకాశం కనిపించదు."* 

*"ఆకాశం చూడాలనుకుంటే తల ఎత్తి చూడాలి."*

**ఎవరి జీవిత లక్ష్యం అయితే మోక్షమో అట్టి వారి మార్గంలో ఇక కోరికలు, భౌతిక భోగాలూ అనేవి ఉండనే ఉండవు."*

*"అలాగే భోగమార్గంలో వెళ్లేవారి గమ్యంలో మోక్షం ఉండదు."* 

*"కాబట్టి ఎవరయితే తమ జీవితపర్యంతం మనస్సులో లోక విషయాలను మననం చెయ్యకుండా మనస్సును నిర్విషయస్థితిలో ఉంచుకోవడం అనేది కొనసాగిస్తారో అట్టివారికి ఏదో ఒకనాటికి పరమశాంతి స్థానమయిన “ఆత్మదర్శనం” అనుభవంలోకి వస్తుంది."*

*"అట్టివారు మరణాన్ని జయించినవారే అవుతారు."*

**వారిక ఈలోకం లోనూ మరే లోకం లోనూ తిరిగి జన్మించరు."* 

*ఇదే సత్యం.*

*"కాబట్టి అత్యంత విలువయిన మానవ శరీరాన్ని మోక్షం కొరకు ఉపయోగించడం అత్యవసరమా?"* 

*"లేక మూన్నాళ్ళ ముచ్చటయిన ఈ శరీర సుఖ భ్రమలా అనేది స్వయంగా మానవుడే తేల్చుకోవాలి."* 

*"మనస్సు నిండా ఆశ నింపుకుని ఉండి లోకంలోని భోగాలను అనుభవిస్తూ శరీరాన్ని కోల్పోయేవారికి తిరిగి వెంటనే మానవదేహం లభించదని జ్ఞప్తిలో ఉంచుకోవాలి."*

*"మానవుడు జ్ఞానులను కలిసి జ్ఞాన విచారణ చెయ్యడం వదలేసి ఆనందాన్ని పొందడానికి వస్తువుల కొరకు, బంధుమిత్రుల కొరకు, భార్యా పుత్రుల కొరకు, భోగ భాగ్యాల కొరకు అన్వేషిస్తున్నాడు."*

*"అవన్నీ లభిస్తే “ఆనందం” అనుకుంటున్నాడు."*

**లభించనప్పుడు దుఃఖిస్తున్నాడు."* 

*"అతడి ప్రయత్నంలో కొన్ని అతడికి లభించి కొద్దిగా కృత్రిమమయిన ఆనందాన్ని కలిగించినా అవన్నీ ఎప్పటికీ అతడితోనే ఉంటాయా?"*

*"ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఈ పంచ లోకాలలో కాలంతో పాటు నశించని వస్తువంటూ ఏదయినా ఒక్కటయినా ఉందా?"* 

*"లేనే లేదు. అన్నీ నశించేవే. అంటే ఈ లోకంలో మానవుడు పొందినవన్నీ ఏదో ఒక నాటికి కోల్పోక తప్పదు."*

 *"మరి పొందిన వస్తువులు కోల్పోయే సమయంలో తిరిగి దుఃఖమే మిగులుతుంది గదా!"* 

*"అసలు ‘నేను’ అనుకుంటున్న అతడి శరీరమే ఒకనాటికి అతడితో ఉండదని అతడు గ్రహించాలి."*

 *ఇక వస్తువుల సంగతి సరే సరి!* 

*"కాబట్టి మానవుడికి ఈ సుఖ దుఃఖాలు అనే అనుభవాలు ఎలా కలుగుతున్నాయి అని విచారించి చూస్తే నాకు ఏదో కావాలి అనే భావన వల్ల దుఃఖం నేను కోరుకున్నది లభించింది అనే భావన వల్ల ఆనందం మానవుడికి కలుగుతున్నాయి."*
            💖🔥💖🔥💖
                  💖🕉️

No comments:

Post a Comment