🔥 *"7"* 🔥
🔥🔥 *"ఆత్మ జ్ఞానం"* 🔥🔥
🔥🔥 *"మోక్షమార్గం"* 🔥🔥
💖🔥💖🔥💖🔥💖
💖🔥🕉🔥💖
💖🔥💖
💖
*"ఆత్మ జ్ఞానం ౹ మోక్ష మార్గం ౹ సృష్టి రహస్యం ౹ ఏడు జన్మలు ఏమిటి ? ౹ నేను అంటే ఎవరు ? ౹ దుఃఖం ఎలా తొలగుతుంది ? ౹ జ్ఞాన విచారణ ౹ మానవుడు జిజ్ఞాసతో అన్వేషిస్తున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు ౹"*
*"అసలు దైవం, భగవంతుడు అని లోకంలోని జనులు పలికేది అట్టి శాంతస్థితి లో నిలిచి వున్న మానవున్నే."*
*"అట్టి భగవత్ స్థితిని పొందడం కొరకు మానవుడు చెయ్యాల్సిందల్లా మనసులో ఏదీ భావించకపోవడమే."*
*"ఏవేవో కల్పిత విషయాలు భావించడంలో మనసుకు కొంత శ్రమ ఉందేమోగాని అసలు ఏదీ భావించకపోవడంలో శ్రమ ఏమి ఉంది."*
*"ఈ మాత్రం దానికి ఏకంగా “ముక్తి” అని చెప్పబడే “బ్రహ్మానంద” స్థితి లభిస్తుంటే అది వదలిపెట్టి మాకు ఏదో లభిస్తే ఆనందం మరేదో పొందితే ఆనందం ఇంకేదో దొరికితే ఆనందం అని బిగ్గరగా పాటలు పాడుకుంటూ… చేతిలోని ద్రాక్ష పళ్ళను నేల మీద జారవిడచి"*
*"ఆహా..! ఆ వేప చెట్టుకు వ్రేలాడుతున్న వేప పళ్ళు ఎంత రుచిగా ఉంటాయో గదా ఎక్కి కోసుకుంటాను అని వేప చెట్టు ఎక్కే వాణ్ని ఏమనాలి!"*
*ఇక్కడొక చిత్రం చూడండి.*
*"ధన౦ లేని వాడు అయ్యో నాకు ధనం లేదే అని దుఃఖిస్తున్నాడు."*
*"ధనం వున్నవాడు అయ్యో ఆ స్త్రీని పొందలేకపోయానే ఆ పదవిని పొందలేక పోయానే అని ఏడుస్తున్నాడు."*
*"మనుషులంతా లేచిన మొదలుకుని “ఆనందం” కొరకు ప్రయత్నిస్తున్నారు."*
*"కానీ అందరూ దుఃఖిస్తున్నారు."*
*"భూమినంతా పరిపాలించే చక్రవర్తి కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ శత్రురాజు వచ్చి తనను చంపి తన రాజ్యాన్ని వశం చేసుకుంటాడో అని భయపడుతూనే బ్రతుకుతుంటాడు."*
*"అజ్ఞానం తొలగనంతవరకు మానవుని తీరు ఇలానే ఉంటుంది."*
*“భగవంతుడు” గురించి ఇప్పుడు అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం."*
*"ఒక వ్యక్తి ఒక చర్చ్, మసీద్ లేక గుడికో వెళ్ళాడు అనుకుందాం."*
*"అతను తనకు పది అడుగుల దూరంలో వున్న భగవంతుని విగ్రహాన్ని చూస్తూ తన కుమార్తె మంచి మార్కులతో పరీక్ష పాసయ్యేలా చూడమని తన మనస్సులో కోరుకుంటున్నాడు."*
*"అతను అలా కోరుకునేది అతని ప్రక్కనే నించుని వున్న మరియొక వ్యక్తికి వినిపిస్తుందా?"*
*"వినిపించదు."*
*"సరే! కోరుకునే అతని చెవులకయినా అది వినిపిస్తుందా?"*
*"అతనికీ అది వినిపించదు."*
*"ఎందుకంటే అతను కోరుకునేదేదయితే ఉందో అది అతని బుద్దిలో ఉంది కాబట్టి."*
*"అది బయటకు వినిపించదు."*
*"మరి కోరుకునే వాని శరీరంలో భాగమయిన అతని చెవులకే అతను కోరుకునేది వినిపించనప్పుడు పది అడుగుల దూరంలో ఉన్న భగవంతుడు అది ఎలా వినగలడు?"*
*"ఒక వేళ భగవంతుడు తప్పక అన్నీ వింటాడు అనుకుంటే ఆ భగవంతుడు అతడి కోరిక వినడానికి ఎక్కడ ఉండి ఉండాలి."*
*"కోరుకునేదంతా వుండే అతడి బుద్దిలోనే ఆ భగవంతుడు ఉండి ఉండాలి!"*
*"అతని బుద్ది అతని కంటే వేరైనదా?*
*వేరయినది కాదు."*
*"మరి అతని బుద్ది అతనికంటే వేరైనది కానప్పుడు అతని బుద్దిలో వున్నది కూడా అతని కంటే వేరైనది కాదు గదా!"*
*"మరి అతని బుద్దిలో భగవంతుడు వున్నప్పుడు అతను “భగవంతుడే” అవుతాడు కదా."*
*"దీన్ని బట్టి మనకు అర్ధం అయ్యేదేంటి?"*
*"భగవంతుణ్ణి మనసులో భావన చేసేవాడే భగవంతుడు."*
*"ఇది అజ్ఞానం తొలగించుకున్న తర్వాత ప్రతి మానవునికీ అర్ధం అవుతుంది."*
*"మరయితే భగవంతున్ని పూజించడం ప్రార్దించడం యొక్క పరమార్ధం ఏంటి అంటే..!"*
*"ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది వారి వారి శరీరాలతో కాదు గదా!"*
*"మాట్లాడుకునేటప్పుడు ఒకరి మనోబుద్దులు మరొకరి మనోబుద్ధులతో కలుస్తూ ప్రతిస్పందిస్తుంటాయి."*
*"శ్రీరాముని గుడిలోకి వెళ్లి శ్రీరాముని గురించి మన మనసుతో ధ్యానిస్తూ భావన చెయ్యడం వల్ల మన మనస్సు శ్రీరాముని మనస్సుతో కలుస్తుంది."*
*"శ్రీ రాముడు సాక్ష్యాత్తు “భగవంతుడు” అనే భావన మన మనస్సులో ఏర్పడి ఉండి మనం భావన చెయ్యడం చేత అత్యంత శక్తి కలిగిన శ్రీ రాముని మనో బుద్ధులు మన మనస్సులోకి ప్రవేశించి ఆ భావన మనలో ఉన్న కాసేపు మనమే శ్రీ రాముని ప్రతిబింబంగా అయిపోతాం."*
*"అప్పటి ఆ కొద్ది సమయంలో శ్రీరామునికీ మనకూ తేడా ఉండదు."*
*"శ్రీ రాముని మనస్సు మన మనస్సులోకి ప్రవేశించి ఉండటం చేత ఆ కొద్ది క్షణాలలో మన మనసుకు ఎంతో శాంతి ఎప్పుడూ మనకే కనిపించని మంచి మంచి గుణాలన్నీ మనకు తెలీకుండానే మనలో ఆ కొద్దిసేపు ఏర్పడతాయి."*
*"మన మనసులో ఎన్ని కష్టాలు ఉన్నా “భగవంతుని” గుడిలో ఉన్న కాసేపు మనం చాలా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఇదే."*
*"కావాలంటే చూడండి చాలా మంచివాడయిన ఒక గుణవంతుడు ఒక చెడ్డ వాడియొక్క చెడు గురించి విని అతడి గురించి ఆలోచిస్తునప్పుడు మంచివానిలో క్రోధం పెరుగుతుంది."*
*"మరి మంచి వానిలో క్రోధం ఎక్కడి నుంచి వచ్చింది. ?"*
*"ఎక్కడ నుంచి వచ్చిందంటే ఎప్పుడయితే ఒక మంచి గుణవంతుడు ఒక చెడ్డ వాని చెడు గురించి తన మనస్సుతో ఆలోచిస్తున్నాడో అప్పుడు ఆ చెడ్డవాడి మనస్సులోని చెడ్డ గుణాలు మంచి వాడి లోకి ప్రవేశించి మంచివాడే ఆ కొద్దిసేపు చెడ్డవాడిగా మారిపోయి క్రోధంతో ప్రవర్తిస్తున్నాడు."*
*"చూసారా ఈ మనస్సు యొక్క మాయాజాలం ఎలాంటిదో.!"*
*"లోకంలో చెడు గుణాలు కలిగిన వారితో స్నేహం చెయ్యడం వల్ల చెడు లక్షణాలు మంచి గుణాలు కలిగిన వారితో స్నేహం చెయ్యడం వలన మంచి లక్షణాలు జనులకు ఏర్పడడం అనేది అందరూ చూస్తున్నదే గదా."*
*"ఒక్క మాటలో చెప్పాలంటే అది గుడిలో ఉన్నప్పుడు కానివ్వండి లేదా బయట మరెక్కడయినా ఉన్నప్పుడు కానివ్వండి ఎవరయితే నిరంతరం భగవంతుడు “శ్రీరామచంద్రుని” గుణాలను తన మనస్సులో గుర్తుకు తెచ్చుకుంటూ భావన చేస్తుంటాడో అతడు కొన్నాళ్ళకు “శ్రీరాముడే” అయిపోతాడు."*
*ఇదే సత్యం.*
*"గుడికి వెళ్లి భగవంతుని భావన చెయ్యడంలోని రహస్యం ఇదే."*
*"కాబట్టి మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోడానికి మనం నిత్యం జ్ఞానులను, దేవుళ్ళను మనసులో భావిస్తూ ధ్యానిస్తూ ఉండాలి."*
*"దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు ఇలా ఎవరి నమ్మకం ఎక్కడుంటే అక్కడకు వారు వెళ్లి ధ్యానిస్తూ ఉండాలి."*
*"నేను ఎక్కడకూ వెళ్ళలేను ఉన్నచోటే ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తాను అంటే అదీ మంచిదే."*
*"భగవంతుణ్ణి నిరంతరం మనసులో ధ్యానిస్తూ ఉండటం ముఖ్యంగాని ఎక్కడ ఉండి ధ్యానిస్తున్నామనేది విషయమే కాదు."*
*"ఎందుకంటే ధ్యానించే వాడే భగవంతుడు."*
*"తనను తాను ధ్యానించడానికి అతడు ఎక్కడుంటే ఏముంది."*
*"తానే భగవంతుడు అనే సంగతి మానవుడు మరచిపోవడం వల్ల ఆ విషయం తిరిగి అతడికి అనుభవంలోకి రావడానికే ఈ భగవంతుడు, ధ్యానము అనేదంతా."*
*"అంటే తనలోని భావనే తనయొక్క దుఃఖానికీ ఆనందానికీ రెంటికీ కూడా కారణం అవుతోంది."*
*"మరి అది దుఃఖమయినా కానివ్వండి లేక ఆనందం అయినా కానివ్వండి అన్ని అనుభవాలూ ఉన్నది తనలోనే అయినప్పుడు మరిక ఆనందాన్ని పొందడానికి బయట వస్తువుల కొరకు మానవుడి ఎదురు చూపులెందుకు?"*
*"మన భావన ఏదో పొందాలి అని భావిస్తే అది పొందేంత వరకు దుఃఖం. దాన్ని పొందాక కోరుకున్నది పొందాను అని భావించగానే ఆనందం కలుగుతున్నాయి."*
*"దీన్నిబట్టి మన భావనే అటు దుఃఖానికీ ఇటు ఆనందానికీ రెండింటికీ కారణమవుతోంది అని తెలుస్తోంది గదా."*
*"కోరుకున్నది లభించింది అని మానవుడు భావించగానే అతడికి ఆనందం కలుగుతోంది గదా!"*
*"మరి ఆ ఆనందం వస్తువు లభించనప్పుడు ఎక్కడ దాగి ఉంది. మానవుని లోనే గదా!"*
*"అంటే ఆనందం అనేది మానవునిలోనే అన్ని వేళలా ఉంది."*
*"అతడిలోనే అన్ని వేళలా వున్న ఆనందాన్ని అతడు ఏ బాహ్య వస్తువుల అవసరం లేకుండానే నేరుగా అనుభవించే అవకాశం కలిగి వుండి కూడా అతడు తన అజ్ఞానం వల్ల బయటి వస్తువులతో తన ఆనందాన్ని ముడి పెట్టుకుని ఏదో లభిస్తేనే నాకు ఆనందం అనుకుంటూ జీవితమంతా వాటికొరకు ప్రయత్నాలు చేస్తూ ప్రతిక్షణం దుఃఖిస్తూ ఒకరోజు మరణిస్తున్నాడు."*
*"ఎంతటి దయనీయ స్థితి ఇది."*
*"ధనం లేని వాని కథ ఇలా ఉంటే సిరి సంపదలు కలిగిన ధనవంతుడి కథ మరోలా ఉంది."*
*"ధనవంతుడు తన ధనానికి కూడా ఏమాత్రం లొంగని ఈ మరణం అనేదాన్ని తలచుకుని గజ గజ వణుకుచున్నాడు."*
*"ఈ చావు ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ సంపదలు అన్నీ ఇక్కడ వదలి వెళ్ళవలసిందే కదా!"*
*"అసలు లోకంలో “మరణం” అనేది లేకుంటే ఎంత బాగుండు!"*
*"ఈ లోకంలో ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది చావును తప్పించుకున్న వాడు ఈ ముల్లోకాలలో ఒక్కడు కూడా లేడు కదా!"*
*"ఈ చావనేది ధనవంతుడు, పేదవాడు అనే భేదం చూడదు గదా!"*
*"అసలు ఈ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ నిత్యం తన మరణాన్నే తలచుకుంటూ దుఃఖిస్తున్నాడు."*
*"ఈ “శరీరమే నేను” అనే నమ్మకం కలిగి ఉన్నందున అతడికి ఈ దుస్థితి. డబ్బు లేనివాడు డబ్బు కొరకు దుఃఖిస్తుంటే డబ్బున్నవాడు మరణం గురించి భయపడుతూ దుఃఖిస్తున్నాడు."*
*"దుఃఖానికి కారణాలు వేరవ్వచ్చు గాని దుఃఖం మాత్రం ఇద్దరిలోనూ ఉంది."*
*"ఇప్పుడు జ్ఞానుల దృష్టిలో ఈ మరణం అనేదాని రూపం ఏంటో పరిశీలిద్దాం."*
*"ఈ మరణం అనే దాని తర్వాత ఏం జగుగుతుంది అనేదానికి అసలు “మరణం” అనేది ఒకటి ఉంటేనే కదా ఏదైనా జరగటానికి అనేదే జ్ఞానుల సమాదానం."*
*ఇక్కడ దేనికీ మరణమూ లేదు.*
*దేనికీ జననమూ లేదు.*
*ఉన్నది కేవలం ఏకైక నిరాకార “చైతన్యమే”.*
*అదే అన్ని జీవులలో ఉన్న “ఆత్మ”.*
*“కదిలేదీ అదే - కదిలించేదీ అదే”."*
*"శరీరాలు అనే ఆకారాలన్నీ ఆత్మలోనే ఆత్మకంటే వేరుగా బాహ్యంలో కనిపిస్తున్నాయి తప్ప శరీరాలు అనేవి అసలు లేనే లేవు."*
*"అజ్ఞానం తొలిగాక మానవుని యొక్క అంతిమ అనుభవం ఇదే. దీన్ని మించిన మరొక అనుభవమూ లేదు."*
*"దీన్ని మించిన మరొక సత్యమూ లేదు అని జ్ఞానులు చెబుతున్నారు."*
*"ఇదెంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ !"*
*"ఇది మొత్తం చదివేటప్పటికి మనకూ ఈ లోకం యొక్క మాయా జాలమంతా స్పష్టంగా అర్ధం అవుతుంది."*
*"ఈ లోకంలో “దుఃఖమే” మరణం."*
*"దుఃఖం లేని మరణం ఈ ఐదు లోకాలలో ఎక్కడా లేదు."*
*"మరి మానవుడు దుఃఖం తొలగించుకుంటే మరణాన్ని జయించినట్లే గదా!"*
*"మరి ఈ దుఃఖం ఎలా తొలగుతుంది ?"*
*"ఈ లోకంలో కాలంతో పాటు నశించే ఆశాస్వతమయిన వాటన్నింటినీ త్యజిస్తూ రాగా చివరికి ఏది త్యజించడానికి వీలుకాదో అదే దుఃఖం లేనిది."*
*"అది ఏదో జాగ్రత్తగా వినండి."*
*"లోకంలోని అన్నింటినీ ఇది అశాశ్వతం..."*
*"ఇది అశాశ్వతం అని త్యజించే “నువ్వే” అది."*
*"అన్నింటినీ ఏదయితే త్యజిస్తోందో ఆ త్యజించేదే త్యజించడానికి వీలుకానిది."*
*"అదే మనిషిలోని “ఆత్మ”.*
*ఆత్మ అంటే “నువ్వే”.*
*"అన్నింటినీ అశాశ్వతం.."*
*"అశాశ్వతం అనుకుంటూ త్యజించిన తర్వాత చివరకు అన్నింటినీ త్యజించిన నువ్వు మిగిలిపోతావు గదా."*
*"ఆ త్యజించడానికి వీలుకాని చివరికి మిగిలిన “నువ్వే” ఆ శాశ్వతమయిన “భగవంతుడివి”."*
*"అంతేగాని నువ్వు సాదారణమయిన మానవుడివి కాదని తెలుసుకోవాలి."*
*"నువ్వు లోకాన్ని పట్టుకుని ఉంటే మానవుడిగా మిగిలిపోతావు."*
*"నువ్వు లోకాన్ని త్యజిస్తే భగవంతుడివి అయిపోతావు."*
*అంతే తేడా."*
*"ఇక్కడ త్యజించడం అంటే అర్ధం నాది, నావి అని మనసులో అనుకునే కాలంతో పాటు నశించే అశాశ్వతమయిన వాటినన్నింటినీ ఇవేవీ నావి కాదు అని వాటి మీద అభిమానాన్ని మనసులోంచి తొలగించడమే.!"*
*"ఆసక్తి రహితంగా అభిమాన రహితంగా జీవించడం అలవాటు చేసుకుంటే నీ యొక్క ఆత్మే స్వయంగా “ఆత్మ సాక్షాత్కారానికి” ద్వారాలు తెరుస్తుంది."*
*"మనసులోకి లోక విషయాలను రానివ్వకుండా దేనిమీదా ఆసక్తి పెంచుకోకుండా మనసును దీర్గ కాలం పాటు నిర్విషయ స్థితిలో నిలుపుకోగలిగితే మనస్సు విషయ రహితం అయిపోయి ఆత్మలో ఏకమైపోతుంది."*
*"నేను ఈ శరీరాన్ని.*
*ఇప్పుడు నేను పుట్టాను."*
*"ఇప్పుడు నేను మరణిస్తున్నాను.*
*ఇది నాకు సుఖం."*
*"ఇది నాకు దుఃఖం అని నిరంతరం భావన చేసే మనస్సు అదృశ్యం అయిపోయాక ఇక మరణం ఎవరికి ?"*
*"మరణాన్ని గ్రహించేది ఒకటి ఉంటేనే గదా మరణం అనే అనుభవం ఉండేది."*
*"గ్రహించే మనస్సే లేకపోతె ఇక మరణానుభవం ఎవరికి?"*
*"కాబట్టి మరణానుభవం ఎక్కడ ఉండదో అక్కడ మరణం లేనట్లే."*
*"మరిక ఆ ఆత్మసాక్షాత్కార స్థితిని సాధించడానికి ఆలస్యం ఎందుకు?"*
*"అలాగే మనస్సు తొలగినప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే!*
*అది నిర్విషయ స్థితి."*
*"అంటే ఏ విషయాలూ మనిషికి జ్ఞప్తిలో లేనటువంటి స్థితి అది. మనస్సు మనిషి స్వస్వరూపమయిన “ఆత్మ”లో ఏకమైపోయినప్పుడు ఆ స్థితి లభిస్తుంది."*
*"మనిషి అప్పుడు ఆత్మస్థితిలో నిలిచి ఉంటాడు."*
*"ఆ స్థితిలో మనిషికి ఆలోచనలు ఉండవు."*
*"కేవలం “ఆనందం” మాత్రమే ఉంటుంది."*
*"ఆ ఆనందం పొందడానికి అందరూ అర్హులే."*
*"మరి అందరికీ ఆ స్థితి ఎందుకు లభించడంలేదు అంటే..!"*
*"మానవుడు కదిలించేదాన్ని వదిలేసి కదిలేదాన్ని చూసుకుంటూ “ఇదే నేను” అనుకుంటున్నాడు."*
*"అంటే ఆలోచన వల్ల శరీరం కదులుతుంది."*
*"శరీరం తనంతట తానుగా ఎటూ కదలదని అందరికీ తెలిసిందే."*
*"మన యొక్క ఆలోచనల వల్లే ఈ శరీరం ఎటయినా కదలడం అనేది జరుగుతుంది."*
*"ఇక్కడ కదిలేది శరీరం.*
*శరీరాన్ని కదిలించేది ఆలోచన.*
*కాబట్టి కదిలే శరీరం సత్యమా?*
*కదిలించే ఆలోచన సత్యమా?*
*కదిలేది జడం.*
*కదిలించేది చైతన్యం."*
*"కదిలించేది సత్యం అవుతుందిగాని కదిలేది సత్యం ఎలా అవుతుంది?"*
*"ఇక ఈ శరీరం ఆకారం కలిగి ఉంది."*
*"దాన్ని కదిలించే చైతన్యం నిరాకారం."*
*"మరి ఆకారం లేని చైతన్యానికి మరణం ఎక్కడిది ?"*
*"ఒక గ్రామంలో అగ్ని చెలరేగితే ఆ గ్రామంలోని ఇళ్ళన్నీ కాలి బూడిదవుతాయి. అక్కడి ఆకాశం బూడిదవుతుందా ?"*
*"కాదు. ఎందుకంటే ఆకాశానికి ఆకారం లేదు."*
*"ఆకారం లేనిదాన్ని ఏదీ తాకలేదు."*
*"అదేవిదంగా శరీరాన్ని కదిలించే ఆత్మకు కూడా నాశనమనేదే లేదు."*
*"ఒక శరీరం మరణిస్తే ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది లేదా ముక్త స్థితిలోకయినా వెళ్ళిపోతుంది."*
*"మరి శోకమెందుకు."*
*"మానవుడి దృష్టి తాను ధరించిన శరీరం మీద ఉంటే మాత్రం ‘నేను ఈ శరీరం’ అనే భావన అతడికి వుంటుంది."*
*"అప్పుడిక అతడి దృష్టిలో బాహ్య ప్రపంచమూ వుంటుంది."*
*"దుఃఖంమూ వుంటుంది.*
*"చివరికి మరణమూ వుంటుంది."*
*"తర్వాత ఇంకో శరీరాన్ని ధరించి ఈ లోకాలలోకి తిరిగి రావలసీ ఉంటుంది."*
*"కాబట్టి నేను ఈ శరీరం అనుకోవడం అనేది మనసులోంచి చెరిపెయ్యాలి."*
*"అలాగే మరణం అనే మూర్చ తర్వాత ఆత్మ తిరిగి ఏ రకమయిన శరీరాన్ని ధరించి ఏ లోకంలోకి వెళ్లి సుఖ దుఃఖాలు అనే అనుభవాలను పొందుతోందో ఎవ్వరూ చెప్పగలిగేది కాదు."*
*"జీవించినంత కాలం మనం చేసిన పవిత్రమయిన మరియు అపవిత్రమయిన కర్మల ఆధారంగా మన మనసులో ఏర్పడి ఉన్న సంస్కారాల యొక్క అల్ప అధిక స్థాయిలను బట్టి ఒక నూతన శరీరాన్ని ఆత్మ తిరిగి ధరిస్తుంది."*
*"ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఐదు లోకాలలో ఆత్మ శరీరాలను ధరించి అనుభవాలను పొందుతోంది."*
*"కాబట్టి మానవులు తాము చేసే కర్మలను నిత్యం గమనించుకుంటూ ఉండాలి."*
*"తాము చేసేవి మంచి కర్మలా? లేక చెడ్డవా అని!"*
*"కనుక ఇప్పుడే ఇక్కడే మానవుడి దృష్టి గనక ‘జ్ఞాన మయం’ అయితే శరీర బ్రాంతిని వదలిపెట్టి కేవలం నిరాకార “ఆత్మ” ఒక్కటే సత్యమని అదే తనయొక్క స్వరూపమని తాను ఈ నశించే శరీరం కాదని అతడు గ్రహించగలడు."*
*"అలా గ్రహించడమే జన్మ-కర్మల నుంచీ శరీరాలనే భ్రమల నుంచీ మానవునికి ‘ముక్తి’."*
*"వుఅదే మానవ శరీరాన్ని ధరించడం యొక్క పరమ ప్రయోజనం కూడా."*
*"మానవుడు గనక తన జీవిత పర్యంతం మనసులో లోక విషయాలను భావించక పొతే సుఖదుఃఖాలు అనే రెండూ అతడికి అనుభవానికి రావు."*
*"సుఖ దుఃఖాలు రెండూ మానవుని మనస్సుకు అనుభవానికి రానప్పటి ఆ స్థితినే “పరమశాంత” స్థితి అని “మోక్షం” అని “బ్రహ్మానందం” అని శాస్త్రాలు చెబుతున్నాయి."*
*"మానవుడు అట్టి పరమ“శాంతి” కొరకు ఎందుకు ప్రయత్నం చెయ్యకూడదు."*
No comments:
Post a Comment