Thursday, April 9, 2026

జీవితం రిపీట్ అవుతోందా? ఇది యాదృచ్చికం కాదు 🕉️ (Karma Secret) ఈ సిగ్నల్స్ వస్తే గతజన్మ మాట్లాడుతోంది

జీవితం రిపీట్ అవుతోందా? ఇది యాదృచ్చికం కాదు 🕉️ (Karma Secret) ఈ సిగ్నల్స్ వస్తే గతజన్మ మాట్లాడుతోంది

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0VgS0LbAYzM



Transcript:
(00:07) ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఒకే రకమైన సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది లైఫ్ లో రిపీట్ లో లూప్ లో పెట్టినట్టు ఒకే రకమైన ప్రాబ్లమ్స్ ఒకే రకమైన మనుషులు ఒకే రకమైన నిరాశలు సరే చిన్న తేడాలు ఉంటాయి వీటిలో కానీ కథ దాదాపు ఒకేలా ఉంటుంది వీటన్నిటిలో ఇది యాదృచ్చికం లేదా రాండమ కాదండి ఇది మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం సంస్కారంతో నమస్కారం మిత్రమా నా పేరు వంశి నేను జగమంత కుటుంబం నాది ఛానల్ లో అప్పుడప్పుడు ఎంట్రీ ఇచ్చి ఆసక్తికరమైన ఉపయోగపడే విషయాలు మీకు ఇచ్చి వెళ్తుంటాను.
(00:38) సరే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒకసారి ఒక ఫ్రెండ్ మోసం చేస్తాడు. కొంతకాలం తర్వాత ఇంకో ఫ్రెండ్ కూడా అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకు జాబ్ లో ప్రాబ్లం వస్తుంది. కట్ చేస్తే జాబ్ మారుతారు కానీ అక్కడ మునుపు లాంటి పరిస్థితే ఇంకోలాగా వస్తుంది. ఒక రిలేషన్షిప్ లో మనకు బాధ కలిగింది. అయితే కొత్త రిలేషన్షిప్ లో కూడా ఇలాగే జరుగుతుంది.
(00:59) ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు ఈ వీడియో శాంతం చూసి తెలుసుకోవాలి. ఓకే మీకుొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మగధీర లాంటి సినిమాలో పూర్వజన్మ సీన్స్ చూస్తున్నప్పుడు ఒక్కసారిగా గూస్ బంస్ అంటే జల్లుమని ఒళ్ళు జల్దరించినట్టు లేదా పులకరింత అంటామే అలా చేతుల మీద మెడ మీద జుట్టు లేచి నిలబడడం ఇలా జరిగిందా మీకు ఆ సమయంలో కళ్ళల్లో కూడా సన్నగా నీరు తిరుగుతుంది.
(01:20) అలా అయిందా అది ఎందుకో గూస్ బంస్ వెనక సీక్రెట్ ఏంటో ఇవాళ తెలుసుకోండి. ఆ మగధీర సినిమా సీన్ లోని ఆ విషయం మీలో ఒక డీప్ లెవెల్ ని టచ్ చేసిందండి. ఎప్పుడైతే మీ ఆత్మ డీప్ గా స్పందిస్తుందో దేనికైనా ఆత్మ తన రెస్పాన్స్ ను సిగ్నల్ గా మీకు ఇలా అందిస్తుందన్నమాట. రోమాలు నికబడుచుకోవడం ఆత్మ యొక్క సిగ్నల్. మరచిపోయిందేదో గుర్తుకు వచ్చిన సిగ్నల్ మీ ఆత్మ మీకు ఇస్తోంది అని గుర్తుపెట్టుకోండి.
(01:43) గూస్ బంప్స్ ఎప్పుడు వస్తాయి ఒక లోతైన జ్ఞాపకం మీ సబ్కాన్షియస్ మైండ్ కి మాత్రమే తెలిసిన ఒక జ్ఞాపకం వస్తే వస్తాయి. లేదా ఏదైనా ఆపదను మీ సబ్కాన్షియస్ మైండ్ పసిగడితే లేదా విశ్వ ప్రేమ ఆర్ ఒక దైవంతో మీకు తెలియని సంబంధం జ్ఞప్తికి వస్తే ఇంకా సంగీతం వింటున్నప్పుడు లోతైన తెలియని ఫీలింగ్ టచ్ అయితే అప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి.
(02:05) లాజికల్ మెథడ్ అంటుంది ఇదంతా ఒక కోయిన్సిడెన్స్ కదా అని కానీ కాదు మిత్రమా మన జీవితం యాదృచ్చికం ఏమాత్రం కాదు. పూర్వజన్మలు కర్మలు వీటి గురించి సైన్స్ ఏమంటుంది ఒక పక్కన మెయిన్ స్ట్రీమ్ సైన్స్ వీటిని నమ్మను అంటుంది. మరో పక్క మాత్రం కొన్ని శాస్త్రాలు సైన్స్ే చెప్తుంది. వినండి సైన్స్ లో ఒక కాన్సెప్ట్ ఉంది న్యూరల్ పాత్వేస్ అని ఏదైనా ఆలోచన లేదా రియాక్షన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయిందనుకోండి మీ బురలో మీ బ్రెయిన్ మెదడు ఉందే అందులో ఒక దృఢమైన పాత్వే సృష్టి జరుగుతుంది.
(02:36) ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక రోడ్ లాంటిది బ్రెయిన్ లో ఏర్పడుతుందన్నమాట. తుప్పల్లో ఎవరైనా పదే పదే ఒకటే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా ఒక కాలి బాట ఏర్పడుతుందా అలాగే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను మన ప్రాచీన సనాతన ధర్మంలో ఏమన్నారు కర్మ అన్నారు. మనం చేసిన పనులు మన అనుభవాలు మన ఎమోషన్స్ భౌతిక బ్రెయిన్ లో న్యూరల్ పాత్వేస్ అనే రోడ్లు వేస్తాయని చెప్పాను కదా మరి అవి మనిషి చనిపోయాక బ్రెయిన్ తో పాటే చితిలో కాలిపోతాయి.
(03:03) కానీ ఆ పాత్వేస్ యొక్క అదృశ్య రూపాలు మనతో వస్తాయండి. అలా ఎలా అని అడగండి. వైబ్రేషన్ అంటే ప్రకంపన రూపంలో మన శరీరం వదిలేశాక మనతో వస్తాయి. అలా మనతో తీసుకువచ్చిన వైబ్రేషన్స్ నే కర్మ అనే పదంతో సంబోధించారు ఋషులు. ఆగు మిత్రమా కర్మ అంటే నా కర్మ అనో అదొక పనిష్మెంట్ అనో అర్థం కాదు. కర్మ అంటే అర్థం మెమరీ, జ్ఞాపకం మీరు చేసిన క్రియలు, యాక్షన్స్, మీ ఎమోషన్స్, మీ అనుభవాలు ఇవి వైబ్రేషన్స్ రూపంలో మీ మానసిక సూక్ష్మ శరీరాల్లో స్టోర్ అవుతాయి.
(03:33) అవే మరుజన్మలోకి మనం తెచ్చుకుంటున్నాం అని గురువులు దివ్య దృష్టితో చూసి చెప్పారండి. తెలుసా ఈ కర్మలు అనే వైబ్రేషన్స్ ను బట్టే మీ DNAన్ఏ లో ఏ విషయాలు యాక్టివ్ గా ఉండాలో ఏ విషయాలు నిద్రాణమై ఉండాలో అలా ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్లో తల్లికి ఉన్న షుగర్ వ్యాధి ఒక కొడుక్కి వచ్చింది ఇంకో కొడుక్కి రాలేదు. ఎందుకు కర్మ ప్రకారం ఒక కొడుక్కి షుగర్ అనే ఆస్పెక్ట్ అతని DNAన్ఏ లో ఇనాక్టివ్ గా ఉండిపోయింది.
(03:59) కర్మలు మన జీవితాన్ని ఎలా నడిపిస్తున్నాయి అంటే ఇదిగో ఇలా కూడా నడిపిస్తున్నాయి. మిత్రమా మీరు రియాక్ట్ అవుతున్నాను అనుకుంటారు జీవితంలో కానీ నిజానికి మీ లోపల ఉన్న స్మృతి అనే వైబ్రేషన్ మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతుంది. మీ చేత అలా రియాక్ట్ అయ్యేలా చేస్తోంది. మళ్ళీ మళ్ళీ మీ చేత అటువంటి మనుషులనే అటువంటి జాబ్ పరిస్థితులనే మీలోంచి అటువంటి ప్రవర్తనే బయటికి వచ్చేలా ఆకర్షిస్తుంది.
(04:22) ఒక్క క్షణం తీసుకొని దీర్ఘ శ్వాసతో ఈ విషయాన్ని మీ లోపలకు ఇంకనివ్వండి మరో రెండు నిమిషాల్లో మీకు సొల్యూషన్ కూడా దొరకబోతుంది. సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకాస్త డీప్ గా అనిపిస్తుంది కానీ ఆసక్తికరంగా ఉంటుంది వినండి. మన తెలుగువాడైన డాక్టర్ న్యూటన్ కొండవీటి తన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ సెషన్స్ లో వేల మందితో గొప్ప అనుభవాలు రికార్డు చేశారు మీకు తెలిసే ఉంటుంది.
(04:44) ఒక వ్యక్తిని హిప్నోటైజ్ చేసి గతంలోకి తీసుకువెళ్ళారు ఆయన. అతడి పుట్టుక వరకు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ఇంకా వెనక్కు పూర్వజన్మలోకి తీసుకెళ్ళారు. అకస్మాత్తుగా ఈ మనిషి రష్యన్ భాష మాట్లాడడం మొదలు పెట్టాడు అప్పుడు. ఈ జన్మలో అతనికి రష్యన్ ఏమాత్రం రాదండి. ఆయన మాటలన్నీ రికార్డ్ చేసి ఎక్స్పర్ట్ కి వినిపిస్తే అది రష్యన్ భాష అని నిర్ధారణ అయింది తెలుసా? అలాగే ఇంకొక ఆయనకు విమానాలు అంటే భయం.
(05:08) హిప్నాటిజం సెషన్ లో తనను తాను ఒక పైలట్ గా చూసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆ జన్మలో ఆయన ఎక్కిన విమానం కూలిపోయి చనిపోయారు. డాక్టర్ న్యూటన్ గారు తర్వాత వెరిఫై చేస్తే సరిగ్గా ఆయన చెప్పిన 1952 ఏప్రిల్ సమయంలో ఆ ప్లేన్ ప్రమాదానికి నిజంగానే గురి అయింది అని తెలిసింది. అంటే ఇది గత జన్మకు ప్రూఫా లేదా కేవలం ఒక మిస్టరీనా? ఆ డిసిషన్ మీకే వదిలేస్తున్నాను.
(05:30) అయితే ఒక మాట వినండి. 2000 ఏళ్ల క్రితం బుద్ధుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేయించారు ఆయన స్టూడెంట్స్ కి. అలాగే మన కాలంలో ఈ ప్రపంచంలో డోలోరిస్ కెనోన్, బ్రయాన్ వైస్ వంటి ఎంతో మంది కొన్ని వేల మందిని హిప్నోటైజ్ చేసి ఇలాంటి పాస్ట్ లైఫ్ లలోకి తీసుకెళ్లి ఎన్నెన్నో సెషన్స్ రికార్డుల్లో ఉంచారు. ఈ సెషన్స్ అన్నిటిలో పాల్గొన్న మనుషులు తాము స్వయంగా చూసాము అని చెప్పిన విచిత్రమైన అనుభవాలు రికార్డ్ అయ్యాయండి.
(05:54) వాళ్ళందరూ చెప్పిన ఒక మాట మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చూడండి ఈ జన్మ మొదలవ్వకముందు గత జన్మ ముగిసిన తర్వాత ఈ రెండు పాయింట్ల మధ్య ఒక గ్యాప్ ఉందే ఆ సమయంలో ఒక విషయం జరుగుతుంది అని దాదాపు అన్ని వేల మంది దర్శించి చెప్పారు. ఏం చెప్పారు ఆ గ్యాప్ సమయంలో మనం ఒక రఫ్ స్క్రిప్ట్ రాసుకుంటాం నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి అని ఎటువంటి పరిస్థితులు రావాలి ఎవరు మన జీవితంలోకి ఎప్పుడు రావాలి వారు ఎలా ప్రవర్తించాలి ఇలాంటివన్నీ ఆ స్క్రిప్ట్ లో రాసుకుంటాం.
(06:21) అంటే ఏంటి మనకు ఎదురయ్యే పరిస్థితులు ఏదో యాదృచ్చికంగా రాండంగా గా జరగట్లేదా? మన చుట్టూ ఉన్నవారు మన స్క్రిప్ట్ ప్రకారమే ప్రవర్తిస్తున్నారా? దీన్నే కర్మ అంటున్నామా? ఆలోచించండి మీకు ఇది అర్థం చేసుకునే శక్తి ఉంది. కనుకనే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. సరే మరి ఫ్రీ విల్ లేదా మనకి కావలసినట్టు ఈ జన్మలో బతకడం జరగదా అవ్వదా? అనే ప్రశ్నకు సమాధానం అరటి పండు వలిచినట్టు వలిచి మీ చేతుల్లో పెడతాను కాసేపట్లో.
(06:46) ఇప్పుడండి మీకు నచ్చే ట్విస్ట్ వస్తుంది. ఈ జీవితం మీరు ఆ గ్యాప్ లో రాసుకున్న స్క్రిప్టే కావచ్చు కానీ మీ సినిమా డైరెక్షన్ మాత్రం మీ చేతుల్లో ఉంది. కానీ 100లో 99 మంది ఈ విషయం తెలియకుండానే పుట్టి చనిపోతున్నారండి. మీరు జాగృతితో ఉంటే, అవేర్నెస్ నిండి ఉంటే జరిగిన పాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఒకరోజు మీకు జరుగుతున్నది మీరు అబ్జర్వ్ చేస్తారు.
(07:08) ఇది మళ్ళీ జరుగుతోంది అని మనసులో అనుకుంటారు. అక్కడేనండి కర్మ బ్రేక్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు రాసుకున్నదే జరుగుతోంది రిపిటిషన్స్ అవుతున్నాయి కానీ జరుగుతున్న దానికి వేరే మలుపు నేను ఇవ్వాలి అని మీకు అనిపించిందో అక్కడే మీ ఫ్రీ విల్ స్వేచ్ఛ సంకల్పం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు అడగాలి ఎలా ఈ ఫ్రీ వీల్ ను ఉపయోగించాలి సమాధానంగా రెండు విధానాలు ఉన్నాయి.
(07:29) మొదటి విధానం మొదట ప్రవాహంలో కొట్టుకుపోకుండా మళ్ళీ మళ్ళీ ఏదైనా రిపీట్ అవుతోంది అని గుర్తించడం మొదటి స్టెప్ అండి దానికోసం ఈ సాధన ట్రై చేయండి. ఈసారి మీకు తెలిసినట్టుగా అనిపిస్తున్న ప్రాబ్లం మళ్ళీ వచ్చిందనుకోండి. ఒకటి వెంటనే రియాక్ట్ అవ్వకండి. రెండు దీర్ఘ శ్వాస తీసుకోండి. మూడు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి.
(07:50) ఇది కొత్త పరిస్థితా లేక జరుగుతూ వస్తున్నదేనా? ఈ ఒక్క ప్రశ్నే మిత్రమా మీ జీవితాన్ని మెల్లిగా మారుస్తూ పోతుంది. ఎప్పుడైతే మీరు అవేర్నెస్ జాగృతిలోకి విషయాన్ని తీసుకొచ్చారో మెల్లిగా సమాధానం కూడా మెదడుకు ఇవ్వబడుతుంది. ఇక రెండవ విధానం మీ అవేర్నెస్ మీ లోపల పెరగాలి. అందుకోసం మీ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని పెంచాలి. అప్పుడు ఏమవుతుంది? హెచ్చు స్థాయిలో ఉన్న వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ లేదా అవేర్నెస్ వల్ల పాటర్న్స్ ను గుర్తించడం సాధ్యమవుతుంది.
(08:16) పాటర్న్స్ కి ఉపాయాలు కూడా సిద్ధించడం మొదలవుతుంది. సరే అవేర్నెస్ వైబ్రేషన్ పెరగాలంటే ఏంటి మార్గం? మార్గం ధ్యానం. ధ్యానం ప్రాక్టీస్ చేస్తే మీ అవేర్నెస్ ఇంకా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతాయి. ధ్యానం అంటే మరేం కాదండి అవేర్నెస్ ను ప్రాక్టీస్ చేసి అందులో మాస్టర్ అవ్వడమే ధ్యానం. వైబ్రేషన్ ను పెంచేదే ధ్యానం. అందుకే మిత్రమా రోజుకు కనీసం 24 నిమిషాలు మెడిటేషన్ చేయండి.
(08:37) ఎందుకంటే ధ్యానంలో వచ్చే ఆ నిశ్శబ్దం ఉందే అందులోనే పాటర్న్స్ స్పష్టంగా కనిపిస్తాయి మీకు. ఓ విషయం చెప్పనా మీరు ఈ వీడియోలో ఈ మాటలు వింటున్నారు ఇంత దూరం విన్నారు అంటే మీరు రెడీ అయిన స్టేజ్ లో ఉన్నారు అని అర్థం ఇది యూనివర్స్ తల్లి సిగ్నల్ అండి 2026 చాలా మందికి ఆ ఏముంది మరో సంవత్సరం కానీ కొందరికి మాత్రం 2026 ఒక షిఫ్ట్ గా మారబోతుంది.
(09:03) మీరు ఆ కొందరిలో ఉన్నారో లేదో ఒక విషయం నిర్ణయిస్తుంది. ఏంటది? మీరు అవేర్నెస్ లో జీవిస్తున్నారా లేదా ఆటో పైలట్ లో ఒక యంత్రంలా జీవిస్తూ కాలం యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మిత్రమా త్వరలో తురియం మెడిటేషన్ ట్రైనింగ్ మొదలు పెడుతున్నాం. జగమంత కుటుంబం నాది మెంబర్షిప్ ఏరియాలో మైండ్ యాక్టివిటీ స్టేట్ నుండి అవేర్నెస్ స్థితిలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి తురియం మెడిటేషన్ను డిజైన్ చేశం.
(09:26) ఆసక్తి ఉంటే అది మొదలైనప్పుడు మీరు జాయిన్ కావచ్చు. 11 రోజుల ట్రైనింగ్ మొదలయ్యే ముందు ఇన్ఫర్మేషన్ పంపుతాం మీకు. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి కి తురియం అని మెయిల్ చేయండి మీరు కావాలంటే మిత్రమా ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ అంతకంటే మాకు ముఖ్యం ఈ వీడియో మరికొందరికి మీ వంతుగా అందించడం 2026 న్యూ ఎర్త్ షిఫ్ట్ కు ముఖ్యమైన సంవత్సరం అండి భూమి తల్లికి మీ వంతు సాయం చేయండి వీడియో షేర్ చేయడం ద్వారా కర్మ గురించి పూర్వజన్మ గురించి కొత్తదైన లోతైన కోణాన్ని తెలుసుకున్నారు ఇవాళ మీకు అభినందనలు వీడియో నచ్చితే కర్మ అని కామెంట్ చేయండి
(09:57) ఆనందిస్తాం గుర్తుపెట్టుకోండి జీవితం మిమ్మల్ని పరీక్షించడం లేదు కేవలం మరచిన ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తుంది. వంశీకి సెలవించండి మరో వీడియోలో మళ్ళీ కలిసే అవకాశం ఇప్పించండి. జై కాలభైరవ జై భారత్ జై గురుదేవదత్త

No comments:

Post a Comment