Thursday, April 9, 2026

భర్త ఉన్నా.. మరో మగాడు ఎందుకు? | Why Women Seek Validation Outside? | స్త్రీ సైకాలజీ

భర్త ఉన్నా.. మరో మగాడు ఎందుకు? | Why Women Seek Validation Outside? | స్త్రీ సైకాలజీ

Author Name:Bujji Creations

Youtube Channel Url:https://www.youtube.com/@bujjicreations1999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EbvpNRWiink



Transcript:
(00:00) పెళ్లయింది మూడు ముళ్ళు పడ్డాయి ఏడు అడుగులు నడిచారు. మరి ఇంకొకరితో ప్రేమ ఏంటి వినడానికి వింతగా ఉన్నా ఇది ఈ రోజుల్లో ఒక చేదు నిజం కొందరు తన పార్ట్నర్ ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ మరికొందరు మాత్రం పక్కనే ఉన్న మనిషిని వదిలేసి పరాయ వ్యక్తి నీడ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు ఇది ఆకర్షణ లేక అవసరమా దీని వెనక ఉన్న ఆ చీకటి రహస్యం ఏంటో చూసేద్దాం.
(00:40) సమాజం ముందు ఆదర్శ దంపతులుగా కనిపిస్తూనే లోలోపల ఒక యుద్ధం చేస్తుంటారు కొంతమంది ఒక మగాడు తన భార్య దగ్గర దొరకని గౌరవం కోసం బయట వెతుకుతుంటే ఒక స్త్రీ తన భర్త ఇవ్వని సమయం కోసం మరొకరి దగ్గర ఆశపడుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీరికి ఒకరి మీద ఒకరికి కోపం లేదు ద్వేషం కూడా లేదు. కానీ తమని తాము కోలుకోతున్నామన్న ఒక వెలితి ఆ వెలితిని పూడ్చడానికి కొందరు చేసే ప్రయత్నం చివరికి వాళ్ళ జీవితాలనే బూడిద చేస్తుంది.
(01:24) సైకాలజీ ప్రకారం పెళ్లి తర్వాత మరో వ్యక్తి వైపు మనసు మల్లడానికి అసలు కారణం కేవలం కొత్తదనం కాదు అది మనసుకు కావలసిన ప్రేమ ఆదరణ లేకపోవడం కొందరు తన పార్ట్నర్ పక్కన ఉన్నా వాళ్ళతో మనసువెప్పి మాట్లాడలేక ఒక రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. ఆ గ్యాప్ ను పూడ్చడానికి ఎవరో ఒకరు కావాలని మనసు ఆరాటపడుతుంది. మరి కొందరిలో ఇతరులు నన్ను మెచ్చుకోవాలి అని ఎదురుచూసేవాళ్ళు ఉంటారు.
(02:05) అంటే తన పార్ట్నర్ తనని పొగడకపోయినా లేదా తనని పట్టించుకోకపోయినా ఎవరో పరాయి వ్యక్తి ఇచ్చే ఆ చిన్న గుర్తింపు కోసం ఆ చిన్న పార్టీ పాజిటివ్ అటెన్షన్ కోసం బంధాన్ని దాటి అడుగువేస్తారు. మరికొందరు దీన్ని వ్యసనంగా మార్చుకుంటారు. ఈ దారి తప్పడానికి ప్రధాన కారణం మెదడులో డొపమైన్ అనే హార్మోన్ ఉంటుంది. ఒక్కసారిగా అది పెరగడం వల్ల వచ్చే తాత్కాలిక ఉత్సాహం ఎక్సైట్మెంట్ వల్ల కొత్త వ్యక్తితో మాట్లాడటం దొంగచాటుగా చాటింగ్ చేయడం అనేది మెదడులో ఒక రకమైన త్రిల్లును
(02:52) కలిగిస్తుంది. ఆ త్రిల్లి ఇచ్చే కిక్కులో పడి తాము చేస్తున్నది తప్పని తెలిసినా ఆ తాత్కాలికమైన ఆనందం కోసం తన పర్మనెంట్ బంధాన్ని కూడా పణంగా పెడతారు. నిజానికి ఆ పరాయ వ్యక్తి మీద ఉన్నది ప్రేమ కాదు అది కేవలం ఒక ఎమోషనల్ ప్రొజెక్షన్ మాత్రమే అంటే మనకు లోపల ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీల్ ఎదుటివాళ్ళు కూడా అనుకుంటున్నారు అని ఊహించడం తన పార్ట్నర్ లో లేని లక్షణాలను ఆ వ్యక్తిలో ఉన్నట్టు ఊహించుకొని భ్రమపడతారు.
(03:34) ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే ఏ బంధమైనా కొన్ని రోజుల తర్వాత కొత్తదనాల్ని కోల్పోతుంది. కొందరు ఈ నిజాన్ని అంగీకరించలేక ఎప్పుడూ ఆ కొత్తదనం ఎక్సైట్మెంట్ కోసం ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారుతూనే ఉంటారు. కానీ గుర్తుంచుకోండి ఆకర్షణ మాత్రం ఎప్పుడూ క్షణికమే మీ బంధంలో ప్రశాంతత లేకపోతే దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించండి లేదా కుందాతనంగా వివరించండి అంతేకానీ ఒక అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి మరోప అబద్ధాలాడుతూ
(04:19) మీ ఆత్మగౌరవాన్ని కోల్పోకండి చివరిగా ఒక్క మాట ఒకరి వ్యక్తిత్వం అనేది ఇది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కష్టం కావచ్చు కానీ అది ఇచ్చే హుందాతనం మాత్రం వెలకట్టలేనిది. ప్రేమని కాపాడుకోవడం కష్టం కానీ ఆకర్షణకి పడిపోవడం మాత్రం చాలా ఈజీ ఇప్పుడు ఒక్కసారి మీరే ఆలోచించండి మీకు ప్రేమ కావాలా లేదా ఆకర్షణకు పడిపోతారా మరి మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.
(05:05) ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.

No comments:

Post a Comment