Thursday, April 9, 2026

 మతాన్ని బట్టి ఆచారామొచ్చిందా ? ఆచారాన్ని బట్టి మతం వచ్చిందా ?
ఆచారం మతం నాకు తెలుసున్నంత వరకూ విడదీసి చూడరాదు

ఇతర మతాల గురించి నాకు తెలియదు

సనాతన ధర్మంలో ఉన్న ఆచార వ్యవహారాలు భౌగోళిక ప్రాంతీయ పరిస్థితుల్లో, వర్ణాశ్రమము ను బట్టి వయసునుబట్టి కాస్త మార్పులు ఉంటాయి

ఫ్లెక్సిబిలిటీ సనాతన ధర్మం లో కాస్త ఎక్కువే అదేఋబలమూ బలహీనత కూడా

ప్రాంతీయత ..

భగవదర్చనం కానీ అభిషేకం గానీ చేసినప్పుడు పైన వస్త్రం కెవలం ఉత్తరీయం తో కచ్చాపోసి కట్టిన ధోవతితో చేయాలి

నార్త్ లో చలి ప్రదేశాలలో పైన ట్విట్టర్ తో ఉంటారు మరి అంత చలిలో తప్పదు

అలాగే ఉత్తర భారతంలో ఎక్కువగా శుక్ల యజుర్వేదంలో పండితులు. దక్షిణాన కృష్ణ యజుర్వేదము ఉంటాయి

కాబట్టి కొన్ని మార్చుకుటాయి

దెశకాల పరిస్థితుల కి అనుగుణంగా

మళ్ళీ అందరిదీ సనాతన ధర్మమే

వీటన్నిటికీ అతీతం భక్తి .. స్వచ్ఛమైన భక్తి ఉండాలి ఆ తరువాత ఆచారమూ ఉండాలి

డా సూర్యనారాయణ వెన్నేటి

No comments:

Post a Comment