Thursday, April 9, 2026

 *_సినిమా వెర్రి.._*
_*ముదిరి పిచ్చి..!*_
_____________________
*8 apr ఆర్జీవీ బర్త్ డే!*
--------------------------------------
ఆ వర్మ అర్థం కాని
ఓ మర్మం..
తన రాతను 
తనే మార్చుకున్న 
ఓ ఖర్మం..
తాను చెప్పేదే ధర్మం
అనుకుని వివాదమై 
జనం పట్టించుకోకపోయినా 
అలా సినిమాలు తీస్తుండడమే 
అతగాడి ఆపద్ధర్మం!

శివ..ఈ సినిమా చూసి
అబ్బో.. ఓ దర్శకుడు పుట్టాడని అనుకునేలోగానే
వరసగా హిట్టు మీద హిట్టు..
ఏ క్షణంలో 
మొదలైందో ఏమో తిక్క 
క్షణక్షణం తీక్షణం అవుతూ..
నిప్పుకణం లాంటోడు 
తనని తానే 
ఆర్పేసుకునేందుకు
కట్టేసుకుంటే కంకణం..
ఇదిగో..ఇప్పుడిలా డీలా..
హిట్ల కోసం లంకణం!

చిన్నప్పుడు నచ్చిన షోలే..
ఎ ఫిలిం బై సిప్పీ..
మెచ్చేసి ఈ కార్డు
చెరిపేద్దామని ఆ రికార్డు..
వెర్రితలలు వేసి మేధస్సు..
కెరీర్లోనే అది పెద్ద తుస్సు..
రివర్స్ కొట్టేసింది అప్పటివరకు పోగుచేసిన
వర్మ  యశస్సు..
భగ్నమైపాయె 
హిట్టు సినిమాల తపస్సు!!

ఇంటర్వ్యూలు..
ఇన్నర్ వ్యూలు..
జనాల చెవిలో పూలు..
ఒకనాటికి బెడిసికొట్టి
ఏప్రిల్ ఫూలు!
సినిమాలు
పట్టేసి పక్కత్రోవే..
వెంకన్న చేతి మీద 
దొంగల కాలు..
దెబ్బకి ఆ సినిమా
గోవిందా..గోవిందా..
జాము రాతిరి జాబిలమ్మ..
హిట్లు..జాగు చేయకే ఇలా!
యదో బుద్ధిహి..
స్థదో గతిః..
అతగాడి బొమ్మలు కొన్ని
అధో గతిః..!

                *_ఈఎస్కే_*

No comments:

Post a Comment