Thursday, April 9, 2026

ఇంట్లోనే యోగిలా జీవించడం ఎలా | Secret to Balance Life | Satyagrahi

ఇంట్లోనే యోగిలా జీవించడం ఎలా | Secret to Balance Life | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RswO846rgws



Transcript:
(00:00) మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ మనసులో ఎక్కడో ఒక అసంతృప్తి ఉందని అర్థం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని బాధ్యత టెన్షన్ అలాగే జీవితం గడిచిపోతుందా అసలు ప్రశాంతత అనేది కేవలం హిమాలయంలో ఉండే సాధులకు మాత్రమే సొంతమా మనలాంటి సామాన్యులకే అది దొరకదు కదా ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మనం మాట్లాడుకోబోయే లాహిరి మహాశయుల జీవిత పాఠం మీ ఇంట్లోనే ఉంటూ మీ బాధ్యతలు నెరవేరుస్తూ ఒక యోగిలా ఎలా జీవించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఎప్పుడైనా గమని గమనించారా మనలో చాలా మంది ఒక వింతైన భ్రమలో బతుకుతాం. ఇప్పుడు నాకు చాలా పనులు
(00:35) ఉన్నాయి. ఈ బాధ్యతలన్నీ తీరిపోయాక అప్పుడు నేను ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాను లేదా నా గురించి నేను ఆలోచించుకుంటాను అని చెప్పేసి వాయిదా వేస్తుంటాం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. మీరు గమనిస్తే బాధ్యతలు అనేవి ఎప్పుడూ తీరిపోవు. ఒకటైపోగానే మరొకటి సిద్ధంగా ఉంటాయి. మనం ఆధ్యాత్మికతను లేదా మనశశాంతిని ఒక లగ్జరీగా చూస్తున్నాం.
(00:56) అంటే అన్ని ఉన్నప్పుడు మాత్రమే అటువైపు వెళ్ళాలి అనుకుంటాం. కానీ నిజానికి ఈ గందరగోల ప్రపంచంలో బ్రతకడానికి మనకు కావాల్సిన ప్రాథమిక అవసరం అది. మీరు ఆఫీసుల్లో ఫైల్లతో కుస్తీ పడుతున్న ఇంట్లో వంట చేస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్నా మీ లోపల ఏదో తెలియని వెలితి ఎంత సంపాదిస్తున్నా ఎన్ని వస్తువులు కొంటున్నా ఆ లోపల ఉండే ఖాళీని ఏది భర్తీ చేయలేకపోతుంది.
(01:18) మనం బాహ్య ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నిస్తున్నాం. మన అంతర్గత ప్రపంచాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాం. నేను బిజీ అనే మాటని ఒక కవచంలో వాడుతున్నాం. మన ఆత్మకు కావలసిన ఆహారాన్ని అందించడం మర్చిపోతున్నాం. ఈ సమస్యకు ప్రధాన కారణం మన ఆలోచన విధానం. మనం జీవితాన్ని రెండు ముక్కలు చేశం. ఒకటి లౌకిక జీవితం అంటే ఉద్యోగం, ఇల్లు, పిల్లలు, డబ్బు రెండోది ఆధ్యాత్మిక జీవితం అంటే దేవుడు, ధ్యానం, ప్రశాంతత.
(01:44) ఈ రెండు వేరు వేరు అని మనం బలంగా నమ్ముతాం. అందుకే సంసారంలో ఉంటే సన్యాసం తీసుకోలేమని ధ్యానం చేయాలంటే అడవులకు వెళ్ళాలనుకుంటాం. రెండవ కారణం మన మనసు ఎప్పుడు ఫలితం మీద ఉంటుంది కానీ ప్రక్రియ మీద ఉండదు. మీరు పని చేస్తున్నప్పుడు మీ మనసు జీతం మీద ఉంటుంది. లేదా ఆ పని ఎప్పుడు పూర్తఅవుతుందా అని ఆలోచిస్తుంటుంది. ఇలా చేయడం వల్ల మీరు చేసే పని మీకు ఒక భారంగా మారుతుంది.
(02:08) ఆ భారం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మళ్ళీ ఏదో ఒక వినోదం కోసం వెతుకుతాం. ఇది ఒక విషవాలయంలా మారిపోతుంది. మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనల్ని కేవలం ఒక మిషన్ లానే చూస్తుంది. మీరు ఎంత ప్రొడక్టివ్ గా ఉన్నారు అనేది ముఖ్యం తప్ప, మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అనేది ఎవరికీ అవసరం లేదు. ఈ ప్రభావం వల్ల మీరు కూడా మిమ్మల్ని ఒక యంత్రం లానే చూసుకోవడం మొదలుపెట్టారు.
(02:30) అందుకే మీకు సెల్ఫ్ కేర్ అంటే ఒక నేరంలా అనిపిస్తుంది. ఇక్కడే లాహరి మహాశయులు జీవితం మనకి ఒక అద్భుతమైన దారి చూపిస్తుంది. ఆయన ఒక సాధారణ అకౌంటెంట్. ఆయనకు భార్యా పిల్లలు ఉన్నారు. ఆయన రోజు ఆఫీస్ కి వెళ్ళేవారు. బాధ్యతలు నిర్వహించేవారు. కానీ ఆయనను అందరూ యోగీరాజు అని పిలిచేవారు. ఆయన చెప్పిన రహస్యం ఒకటే సంసారంలోనే సన్యాసం. దీని అర్థం ఏంటంటే మీరు మీ బాధ్యతల నుండి పారిపోవాల్సిన అవసరం లేదు.
(02:54) మీరు చేసే ప్రతి పనిని ఒక ధ్యానంలా మార్చుకోవాలి. మీరు ఆఫీస్ లో ఒక రిపోర్ట్ రాస్తున్నారు. అది దైవ కార్యమే అనుకొని పూర్తి చిత్తశుద్ధితో చేయండి. మీరు ఆఫీస్ లోనే కాదు మీరు ప్రపంచంలో ఏ పని చేస్తున్నా అది ఒక దైవ కార్యం అని చెప్పేసి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఆ పని చేయండి. అక్కడ ఫలితం మీద ఆశ కంటే ఆ పనిని ఎంత అద్భుతంగా చేస్తున్నాం అనే దానిపై దృష్టి పెట్టండి.
(03:16) లాహిరీ మహసేయులు నేర్పిన క్రియా యోగం అంటే మన ప్రాణశక్తి క్రమబద్ధీకరించడం మీరు శ్వాస తీసుకునే విధానం మీరు ఆలోచించే విధానం మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఆటోమేటిక్ గా మారుతుంది. బాహ్యంగా మీరు లౌకిక ప్రపంచంలో ఉన్న అంతర్గతంగా మీరు నిశ్చలంగా ఉండటం నేర్చుకోవాలి. ఇది ప్రాక్టీస్ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి రోజు ఒక గంట లేదా అరగంట మీ కోసం మీరు కేటాయించుకోండి.
(03:41) ఆ సమయంలో ప్రపంచాన్ని మర్చిపోయి మీ లోపల మీరు ప్రయాణం చేయండి. మిత్రులారా మార్పు అనేది రేపు రాదు. ఇది ఇప్పుడే రావాలి. మీరు మీ జీవితాన్ని మార్చుకోవడానికి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. మీ గదిలోనే ఒక యోగిలా జీవించవచ్చు. దానికి మీరు చేయాల్సింది మొదటిగా మీ దృక్పదాన్ని మార్చుకోవడం పనిని పూజగా భావించండి. మీరు చేసే వృత్తి ఏదైనా కావచ్చు ఎంత చిన్నదైనా కావచ్చు అది సమాజానికి మీరు అందించే సేవ అందులో దైవత్వాన్ని వెతకండి.
(04:08) అటాచ్డ్ బట్ డిటాచ్డ్ అనే ఆ ఫిలాసఫీని ఫాలో అవ్వండి. బాధ్యతలని ప్రేమతో నెరవేర్చండి. కానీ వాటి వల్ల కలిగే సుఖ దుఖాలకి అతిగా లొంగిపోకండి. ఎందుకంటే మీరు మీ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో మీరు మీ కుటుంబ సభ్యులకి శత్రువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, బయట వాడికి మంచోడు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళకి చెడ్డోడు అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీరు మీ బాధ్యతలను నెరవేర్చాలి.
(04:31) నెరవేర్చే క్రమంలో వాటికి అటాచ్ అయి ఉన్నారు అనుకోండి, అవతలి వాళ్ళు మిమ్మల్ని విమర్శించిన, అవతలి వాళ్ళు మిమ్మల్ని సరిగా చూసుకోకపోయినా, మీరు బాధపడతారు. కాబట్టి వాటికి అటాచ్ అవ్వండి. వేటికి అటాచ్ అవ్వాలి? బాధ్యతలకు అటాచ్ అవ్వాలి బట్ ఆ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో మనం నిర్వర్తించాక దానికి డిటాచ్ అవ్వండి ఎవరు ఏమనుకున్నా సరే మన బాధ్యతలు మనం నెరవేర్చాలి.
(04:52) అది మాత్రం కామన్ ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళకి నాన్ సింక్ ఉంటుందన్నమాట అయినా సరే పిల్లల బాధ్యత ఏంటంటే పాపం పిల్లల్ని తల్లిదండ్రులు పెంచి పోషించారు కదా అలాగే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ పిల్లలే వాళ్ళని చూసుకోవాలి కదా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మధ్యలో డబ్బు రావచ్చు ఏమైనా జరగొచ్చు కానీ మన బాధ్యత అనేది మనం నిర్వర్తించాలి.
(05:13) అలా నిర్వర్తించినప్పుడు వాళ్ళు మనల్ని చిన్నప్పుడు చూసిన దానికి ఉపయోగం ఉండదు కదా సో కాబట్టి నేను ఏమంటానంటే దేనికైనా అటాచ్ అవ్వండి కానీ కొన్ని విషయాలకి డిటాచ్డ్ గా ఉండండి. ఇంకా ముఖ్యంగా నిశ్శబ్దాన్ని ప్రేమించండి. రోజులో కొంత సమయం ఫోన్లు, సోషల్ మీడియా మనుషులు వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ఆ నిశ్శబ్దంలోనే మీకు అసలైన సమాధానాలు దొరుకుతాయి. ఇక క్రమశిక్షణగా ఉండండి.
(05:37) ఆధ్యాత్మిక అంటే ఏదో మూఢ నమ్మకం కాదు. అది ఒక క్రమశిక్షణ మీ ఆహారం మీ నిద్ర మీ ఆలోచనలు వీటిపై మీకు నియంత్రణ ఉండాలి. గుర్తుంచుకోండి మీరు కేవలం ఈ శరీరం కాదు మీరు అనంతమైన శక్తి స్వరూపులు లాహిరి మహాశయులు నిరూపించినట్లు ఒక చేత్తో సంసారాన్ని మరో చేతితో దైవాన్ని పట్టుకోవడం సాధ్యమే. ఆ బ్యాలెన్స్ సాధించిన రోజే మీ జీవితం పరిపూర్ణమవుతుంది.
(06:03) ఈ క్షణం నుంచి పనులను భారంగా కాకుండా ఒక యోగి చేసే సాధనలా భావించి మొదలు పెట్టండి. ఎందుకంటే మనం పనిని ఇష్టంగా చేయకపోతే ఆ పని కేవలం డబ్బు కోసం చేస్తున్నామ అనే ఫీలింగ్ మనలోకి వస్తే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం పాడైపోతుంది. మీకు తెలియకుండానే మీ జీవితం మీద మీకు విరక్తి వచ్చేస్తుంది. మీకు తెలియకుండానే వర్క్ లో ఉన్న కోపాలు తాపాలు మొత్తం మీరు అయిన వాళ్ళ మీద చూపిస్తారు.
(06:26) కుటుంబ సభ్యుల మీద వాటిని రిఫ్లెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఏమనుకుంటారంటే వీడేంట్రా బాబు టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. సో దాని వల్ల మీరు మీ కుటుంబానికి శత్రువులు అయిపోతారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు అవసరం కానీ మీరు పని చేసే ప్రదేశంలో ప్రశాంతత కూడా మీకు చాలా అవసరం కాబట్టి దాన్ని ఒక దైవ కార్యంగాలా చేయండి అలా అనుకోవడం వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పనిని ప్రశాంతంగా పూర్తి చేస్తారు ఆ తర్వాత మీ ఆరోగ్యానికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు.
(06:54) అందులోనూ మీ జీవితానికి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. మీరు కూడా ఒక యోగిలా బ్రతుకుతారు అది ఏ పని చేస్తున్న ఎంత చిన్న పనైనా సరే ఎంత తక్కువ డబ్బులు సంపాదించినా సరే ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే భూమి మీద మనశశాంతి చాలా అవసరం అది కేవలం ఆధ్యాత్మికంగా ఉండటం వల్లే సాధ్యమవుతుంది. భగవంతుడికి దగ్గరగా ఉండటం, ధ్యానం చేసుకోవటం, నిశశబ్దంగా ఉండటం, ప్రతిదాన్ని గమనించటం అంతేకాకుండా సరిపడా నిద్ర తీసుకోవటం, మంచి ఆహారం తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్లే మనకి ప్రశాంతత అనేది దొరుకుతుంది.
(07:26) వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా సరిగా నిద్రపోకపోయినా సోషల్ మీడియాకి ఎక్కువగా అడిక్ట్ అయిపోయినా కేవలం డబ్బు కోసమే కొన్ని ఉద్యోగాలు చేసినా సరే మనకి ఉన్న మనశశాంతి పోతుంది. పోనీ మీరు కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసి మానేస్తారంటే అది కూడా కాదు. ఎందుకంటే మీకంటూ చాలా కమిట్మెంట్లు వచ్చేస్తాయి. ఈ అమ్మాయిలని అది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి మీరు ఒక బానిస లాగా పని చేస్తూ ఉంటారు.
(07:48) డబ్బు మన అవసరానికి సంపాదించుకోవాలి లేకపోతే మనకి ఇష్టమైన పని చేసి మరి సంపాదించుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఏదో ఒక పనిలో చేరడం అనేది అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాదు. కానీ నేను చెప్పవచ్చేది ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ప్రశాంతంగా ఒక యోగిలాగా హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి మీరు నేను చెప్పిన ఆ పనిని పూజగా భావించే సూత్రం అయితే ఉందో అందులోనూ బాధ్యతలను ప్రేమతో నెరవేర్చడం ఏదైతే ఉందో ప్రతిరోజు మనం కొన్ని గంటలు ఈ ప్రపంచానికి దూరమైపోయి ప్రశాంతంగా నిశశబ్దంగా కూర్చోవడం అవ్వచ్చు.
(08:18) ఇంకా ముఖ్యంగా క్రమశిక్షణ ఆధ్యాత్మిక క్రమశిక్షణ వీటన్నిటిని మీరు పాటిస్తే హ్యాపీగా ఒక యోగి లాగా ఓ పక్క సంసార సాగరంలోనే ఉంటూనే మీ బాధ్యతలు నెరవేరుస్తూనే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. అంతేనండి అంతకుమించి ఏమీ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి బాయ్.

No comments:

Post a Comment