*(ఆధ్యాత్మిక కుటుంబ స్పెషల్ ఫీచర్)* *ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...*
*ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి...*
*ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...*
*తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది... అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..*
*' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చిం*ది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు...*
*దాన్ని వదిలేయి"* *అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...*
👉*ఇందులోని నీతి ఏంటంటే...*
*నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.*
👉*అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.*
*ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు...*
*👉నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..!🍁. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment