దేవుడే నువ్వేసే ఎరకి పడిపోతున్నప్పుడు, మనిషి పడకుండా ఉంటాడా? | Anukula Vedam || Telugu Podcast
Author Name:Anukula Vedam
Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iNFCMiJs-9s
Transcript:
(00:00) ఒక వీధి కుక్కనే ఎప్పుడైనా చాలా నిశ్చితంగా గమనించారా దానికి ఒక్క మాంసం ముక్క ఎరగే వేయండి అది ఎంత ఆనందంగా తన సర్వస్వం మీకే అర్పించినట్టుగా తోక ఊపుకుంటూ మీ దగ్గరికి వస్తది. ఆ క్షణంలో ఆ కుక్క కళ్ళల్లో కేవలం ఆ మాంసం ముక్క మాత్రమే కనిపిస్తది. ఇప్పుడు అద్దం ముందుకు వెళ్లి ఒక్కసారి మిమ్మల్ని మీరు చూసుకోండి.
(00:25) మీకు ఆ కుక్కకి ఏమన్నా తేడా ఉందా? ఏంటి మీ అహంకారం దెబ్బ తినేస్తుందా? వీడేంటి నన్ను కుక్కతో పోలుస్తున్నాడు అని మీలో కోపం వస్తుందా రానియండి కానీ లాజికల్ గా ఆలోచించండి మనిషికి కూడా వాడి స్వార్థానికి సరిపోయే ఒక ఎర వేస్తే చాలు వాడు కూడా సరిగ్గా ఆ కుక్కలాగే తోక ఒప్పుకుంటూ వస్తాడు. వాడిలో నిద్రపోతున్న జంతు లక్షణం వెంటనే బయటపడతది. మీరు వేసుకున్న ముసుగులు మీరు చదువుకున్న పుస్తకాలు మీ సభ్యత అన్ని ఆ ఎర్ర ముందు పనికి రాకుండా పోతాయి.
(00:53) సరే దీన్నొక అద్భుతమైన ప్రాక్టికల్ ఉదాహరణతో విశ్లేషిద్దాం. ఫెడరల్ ఎక్స్ప్రెస్ అనే ఒక అతి పెద్ద గ్లోబల్ కొరియర్ కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటది. వాళ్ళ బిజినెస్ మోడల్ అంతా సమయం మీద ఆధారపడి నడుస్తది. రాత్రికి రాత్రి ప్యాకేజెస్ అన్ని ఒక ఊరు నుండి ఇంకో ఊరికి ఫ్లైట్ లో వెళ్ళాలి. సో రాత్రిపూట పని చేసే పని వాళ్ళ ప్రధాన బాధ్యత ఏంటంటే ఆ ప్యాకేజెస్ ని తీసుకెళ్లి విమానాల్లో ట్రక్కుల్లో లోడ్ చేయడం కానీ అక్కడే ఒక విచిత్రమైన సమస్య వచ్చింది.
(01:20) ఆ పనివాళ్ళు ఆ పనిని చాలా నెమ్మదిగా విపరేతమైన బద్ధకంగా చేసేవాళ్ళు. ఎంతగా అంటే కంపెనీకి రోజు రోజుకి కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. విమానాలు ఎప్పుడూ టైం కి బయలుదేరేవి కావు. అప్పుడు ఆ కంపెనీలో ఉన్న మేనేజర్లు సూటు బూటు వేసుకున్న కార్పొరేట్ మేధావులు ఏం చేశారో తెలుసా పనివాళ్ళలో నిద్రపోతున్న నీతిని నిజాయితిని మేలుకొలపడానికి తేగ ప్రయత్నించారు.
(01:41) ఎన్నో నీతులు చెప్పారు పెద్ద పెద్ద మీటింగలు పెట్టారు మోటివేషనల్ క్లాసులు ఇప్పించారు. మీరు కంపెనీకి విధేయులుగా ఉండాలి కష్టపడి పని చేయాలి ఈ సంస్థ మనది పని దైవంతో సమానం అని ఎన్నెన్నో ఉపన్యాసాలు దంచి కొట్టారు. కానీ ఫలితం సున్నా అసలు ఏ లాభం లేదు. పనివాళ్ళు ఆ మోటివేషన్ క్లాసులో గంగిరెద్దులాగా తలలుైతే ఊపుతున్నారు కానీ పని మాత్రం మళ్ళీ నత్త నటకగానే సాగుతుంది.
(02:04) కానీ ఎందుకు అక్కడ మోటివేషన్ అనేది ఎందుకు పని చేయలేదు ఎందుకంటే మనిషి బుద్ధి ఎప్పుడూ మాటల మీద పని చేయదు లాభం మీద మాత్రమే పనిచేస్తది. ఆ కంపెనీ బేసిక్ సిస్టం లోనే ఒక ప్రాథమికమైన తప్పు ఉంది. వాళ్ళు తమ పని వాళ్ళకి గంట లెక్కను చేతే ఇస్తున్నారు అంటే అవర్లీ విజ్ ఇప్పుడు మనిషి మెదడు వాడి స్వార్థం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుందో చూడండి.
(02:26) పనిని ఎంత ఆలస్యం చేస్తే వాళ్ళు ఆ గోడంలో అంత ఎక్కువ సమయం ఉండొచ్చు. అంటే అర్థం ఏంటి? ఇన్ని ఎక్కువ గంటలు అక్కడ ఉంటే వాళ్ళకి అంత ఎక్కువ డబ్బు వస్తది. అంటే అర్థం ఏంటి? నెమ్మదిగా పని చేయడానికి కంపెనీయే స్వయంగా వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ ఇస్తుంది. ఒకవైపేమో నెమ్మదిగా పని చేస్తే డబ్బులు ఇస్తూ ఇంకోవైపుేమో త్వరగా పని చేయమని మోటివేషన్ క్లాసులు ఇస్తే ఎవడైనా వింటాడా ఎవ్వడు వినడు మనిషికి మోటివేషన్ అక్కర్లేదు మనీ కావాలి.
(02:54) వాడికి నీతులు అవసరం లేదు వాడి జేబు నిండితే చాలు. మీరు ఎంత మోటివేట్ చేసినా వాడి లాజిక్ చాలా సింపుల్. నేను వేగంగా పని చేస్తే నా జీతం తగ్గిపోద్ది. మరి నేనుఎందుకు నా నష్టం కోరుకోవాలి. స ఇక్కడ పనివాళ్ళది తప్పు కాదు మనిషి లోపల ఉండే సహజమైన తత్వానికి విరుద్ధంగా డిజైన్ చేసిన ఆ సిస్టం ది తప్పు అయితే చివరికి ఆ కంపెనీలోకి ఒక తెలివైన మేనేజర్ వచ్చాడు.
(03:15) అతనికి పనికిమాలిన కార్పొరేట్ జార్గన్లు మోటివేషన్ మీటింగ్లు ఏమీ అక్కర్లేదు. అతను మనిషి నైజాన్ని వాడిలో ఉండే స్వార్థాన్ని చాలా స్పష్టంగా నిర్దాక్షణయంగా అర్థం చేసుకున్నవాడు. వాడు పని వాళ్ళకి ఎలాంటి నీతులు చెప్పలేదు. మోటివేషన్ ఇవ్వలేదు. కాకపోతే సిస్టం లో ఉన్న ఒక నియమాన్ని మార్చాడు. ఆ కంపెనీలో పని చేస్తున్న వర్కర్ల అందరినీ పిలిచి ఇలా చెప్పాడు.
(03:36) మై డియర్ కొలీగ్స్ ఈ రోజు నుండి మన కంపెనీలో ఒక కొత్త పద్ధతి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అదేంటంటే ఈరోజు మీరు లోడ్ చేయాల్సిన ప్యాకెట్లు ఇవి. ఇవి లోడ్ చేయడం పూర్తి అవ్వగానే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. పైగా మీకు మీఎనిమిది గంటల యొక్క పూర్తి చేతం వస్తది. మీరు దీన్నిఎనిమిది గంటలు చేస్తారా నాలుగు గంటల్లో చేస్తారా రెండు గంటల్లో చేస్తారా అనేది మీ ఇష్టం అని చాలా స్పష్టంగా చెప్పాడు.
(04:01) అంతే రాత్రికి రాత్రి అద్భుతం జరిగింది. నిన్నటివరకు బద్ధకంగా నత్తల్లా కదిలిన ఆ పని వాళ్ళు ఈరోజు యంత్రాల పని చేయడం మొదలుపెట్టారు. ఆకలితో ఉన్న కుక్క ముందు మాంసం ముక్క వేస్తే అది ఎంత వేగంగా దూకుతుందో అంత వేగంగా పని పూర్తి చేశారు. పని స్పీడ్ అమాంతంగా పెరిగిపోయింది. విమానాలు టైం కంటే ముందే బయలుదేరడం మొదలెపెట్టాయి. ఇప్పుడు చెప్పండి వాళ్ళలో రాత్రికి రాత్రి ఏమైనా నిజాయితి పుట్టుకొచ్చిందా పడుకునే ముందు రామాయణ మహాభారతాలు ఏమైనా చదివారా వాళ్ళకి మేనేజ్మెంట్ మీద కంపెనీ మీద ఉన్నపాళంగా ప్రేమ ఏమైనా పుట్టుకొచ్చేసిందా లేదు అస్సలు లేదు వాళ్ళకి కేవలం ఒక కొత్త ఎర
(04:34) కనిపించింది. త్వరగా పని పూర్తి చేస్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకోవచ్చు పైగా జోబులో పూర్తి డబ్బు పడతది. ఇది వాళ్ళ స్వార్థానికి కరెక్ట్ గా సరిపోయే ఎర ఎప్పుడైతే వాళ్ళ స్వార్థానికి కంపెనీ అవసరానికి ఒక దారి కుదిరిందో అప్పుడు వాళ్ళు తమ విశ్వరూపం చూపించారు. స మనిషిలో సహజంగా నీతి నిజాయితి అంటూ ఏమీ లేవు అవన్నీ కేవలం భ్రమలు స మనిషి అనేవాడు ప్రాథమికంగా బయోలాజికల్ గా ఒక స్వార్ధపరుడు వాడికి ఎక్కడ ఏ లాభం ఉందో దాన్ని బట్టే వాడి బుద్ధి పనిచేస్తది.
(05:07) నేను చేసే పనికి సరైన రిటర్న్ వస్తది అనే ఎరగని వేస్తే మనిషి అనేవాడు దేనికైనా దిగజారుతాడు లేదా ఎంతటి అద్భుతాన్నయనా సృష్టిస్తాడు. మీరు దీన్ని తప్పని పాపం అని అనొద్దు దయచేసి మోరల్ జడ్జిమెంట్స్ పాస్ చేయకండి. ఇది తప్పప్పుల వ్యవహారం కాదు ఇది కేవలం ఒక వాస్తవం. అంతెందుకు మీరు మీ జీవితాన్నే తీసుకోండి మీరు ఉదయం లేచి ఒక ఆఫీస్ లో ఎందుకు పని చేస్తున్నారు? సమాజ సేవ కోసమా దేశాన్ని ఉద్ధరించడానిక కాదు కచ్చితంగా కాదు నెలాకరణ మీ బ్యాంక్ అకౌంట్ లో పడే ఆ జీతం కోసం మీకు ఆ జీతం అనే ఎర లేకపోతే ఒక్క రోజైనా ఆఫీస్ మొహం చూస్తారా చూస్తారా
(05:48) కచ్చితంగా చూడరు మీ పై అధికారి మిమ్మల్ని ప్రతిరోజు అవమానించిన తిట్టిన పిచ్చి పిచ్చి పనులు చేయిస్తున్న ఎందుకు పడి ఉంటున్నారు మీకు ఆత్మాభిమానం లేదా ఖచ్చితంగా ఉంది. కానీ ఆ జీతం అనే ఎర ముందు ఆ ఆత్మాభిమానం రోజుకొకసారి చచ్చిపోతూ ఉంటది. ఒక చిన్న ఎర కోసం మీరు మీ ఆత్మగౌరవాన్ని సైతం అమ్ముకోవడానికి సిద్దపడ్డారు.
(06:14) ఇది మనిషి తాలూకా అసలు స్వరూపం. ఈ సమాజం మిమ్మల్ని నియంత్రించడానికి ఎప్పుడు ఈ ఇన్సెంటివ్స్ నే ఉపయోగిస్తది. మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు హోం వర్క్ చేస్తే చాక్లెట్ ఇస్తాను అంటారు. ఫస్ట్ టైం కి వస్తే సైకిల్ కొనిస్తాను అంటారు. అక్కడ మొదలవుతుంది మీ కండిషనింగ్ అక్కడ మొదలవుతుంది మీ బానిసత్వం మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆనందంతో చదవడం లేదు కేవలం ఆ చాక్లెట్ కోసం చదువుతున్నారు.
(06:37) ఆ తర్వాత మార్కుల కోసం ర్యాంకుల కోసం క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం ఉద్యోగం కోసం జీతం కోసం ప్రమోషన్ కోసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇలా పుట్టినప్పటి నుంచి చచ్చేంతవరకు మీ ముందు ఎవడో ఒకడు ఒక ఎర వేస్తూనే ఉంటాడు మీరు ఒక వేట కుక్కల ఆ ఎర కోసం పరిగెడుతూనే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆగి నేను అసలు దేనికోసం పరిగెడుతున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? లేదు ఎందుకంటే పరిగెట్టడంలో ఉన్న మత్తులో మీరు ఆ ప్రశ్న వేసుకోవడం పూర్తిగా మర్చిపోయారు.
(07:07) మనం దేవుడి దగ్గరికి వెళ్లి కూడా చేసేది వ్యాపారమే స్వామి నాకు ఈ పని చేసి పెట్టు నీకు 10 కొబ్బరికాయలు కొట్టేస్తా గుండు కొట్టించేస్తా కుండీలోప వేలు వేసేస్తా అని అంటాం అంటే ఏంటి దాని అర్థం ఈ అనంతమైన విశ్వాన్ని నడిపించే ఆ దేవుడికి కూడా మనం ఒక ఎర వేస్తున్నాం అన్నమాట దేవుడే మన ఎరక పడతాడని మన లంచానికి ఆశపడుతున్నాడని మనం అంత బలంగా ఆశిస్తున్నప్పుడు కేవలం ఒక మామూలు సాటి మనిషి పడకుండా ఎలా ఉంటాడు మీరు మీ జీవితాన్ని ఎప్పుడూ సొంతంగా జీవించలేదు మీరు కేవలం ఆ ఎరని వెంబడిస్తున్నారు.
(07:38) ఆ పరుగు పందంలో మీ అసలు స్వభావం ఏంటో పూర్తిగా మర్చిపోయారు. మీరొక ఆటోమేటిక్ యంత్రంలా మారిపోయారు. మీరు ఎప్పుడూ కూడా మీకు మీరే స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఏ పని చేయలేదు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ అసలైన స్వేచ్ఛ ఎక్కడఉంది? అసలైన నీతి ఎక్కడఉంది? ఎక్కడైతే స్వార్థం ఉంటదో ఎక్కడైతే లాభాపేక్ష ఉంటదో అక్కడ నిజాయితీకి చోటు లేదు.
(08:02) అక్కడ ఉండేది కేవలం లెక్కలు మాత్రమే మనిషి మెదరు ఒక అద్భుతమైన క్యాలిక్యులేటర్ అది ఎప్పుడు ప్రతి క్షణం లాభ నష్టాల్ని బేరీజ్ వేసుకుంటూ ఉంటది. ఇది చేస్తే నాకేంటి లాభం ఇది చేయకపోతే నాకేంటి నష్టం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మనిషి జీవితం తిరుగుతూ ఉంటది. ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే వాడి కబుర్లు వెనకండి వాడి ఆదర్శాలు వెనకండి వాడు వేసుకున్న ముసుగుల్ని చూడకండి.
(08:27) మరేం చూడాలి వాడికి ఆ పని చేయడం వల్ల ఏం ఇన్సెంటివ్ ఉందో చూడండి. ఆ ఇన్సెంటివ్ ఎటువైపు ఉంటే వాడి బుద్ధి అటువైపే ప్రయాణిస్తది. ఇదే నిజం దీన్ని అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ ఎవరి చేతిలోనూ మోసపోడు. ప్రపంచం ఎలా నడుస్తుందో వాడికి స్పష్టంగా తెలుస్తది. అసలు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకు మిమ్మల్ని నిరుత్సాహ పరచడానిక కాదు నేను నిరాశవాదం ప్రచారం చేయడం లేదు.
(08:50) మీ కళ్ళకున్న భ్రమల పొరలు తొలగించడానికి మాత్రమే ఈ ప్రయత్నం. మీరు ఎప్పుడైతే నేను ఒక జంతువుని నేను ఒక స్వార్ధపరుడిని ఒక ఎరకు ఆశపడే బానిసని అని బయటకి కాదు మీ లోపల నుంచే పూర్తిగా ఎటువంటి శరతులు లేకుండా అంగీకరిస్తారో అప్పుడు కేవలం అప్పుడు మాత్రమే మీలో నిజమైన మార్పు మొదలవుతుంది. ఇప్పుడు ఒక రోగి తనకి రోగం ఉందని తాను అనారోగ్యంతో ఉన్నానని ఒప్పుకున్నప్పుడే కదా సరైన ట్రీట్మెంట్ తీసుకుంటాడు.
(09:18) అలా కాకుండా నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పుడు ఒక భ్రమలో బ్రతికే వాడిని ఏ డాక్టరు బాగు చేయలేడు. మీ లోపల ఆకలితో ఉన్న ఆ జంతువుని స్పృహతో గమనించండి. ఈ సమాజం, మీ బాసు, మీ రాజకీయ నాయకులు మీ ముందు వేస్తున్న ఎరల్ని స్పష్టంగా గుర్తించడం నేర్చుకోండి. ఎప్పుడైతే ఆ ఎర వెనుక ఉన్న ఉద్దేశాన్ని మీరు చూడగలుగుతారో, అప్పుడు మాత్రమే మీరు ఏ ఎరకి బానిస అవ్వరు.
(09:43) ఆ క్షణం నుండి మీరు దేనికోసం పని చేయకుండా మీ ఉనికి కోసమే జీవిస్తారు. కానీ అప్పటివరకు మీరు మేల్కొనే వరకు వాస్తవాన్ని అంగీకరించే వరకు మీరు కేవలం ఒక మాంసం ముక్క కోసం తోకూపే జంతువు మాత్రమే ఇది మీకు వినడానికి చేదుగా అనిపించొచ్చు కానీ వ్యాధి నుండి విముక్తి కలిగించే మందు ఎప్పుడు చేదుగానే ఉంటది. అవునా కాదా
No comments:
Post a Comment