Eyesight | కంటి నరాలు బలపడాలంటే ఈ యోగా ఆసనాలు చేయండి! | Dr Manthena Satyanarayana Raju | GOOD HEALTH
Author Name:Good Health
Youtube Channel Url:https://www.youtube.com/@GoodHealthh
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2i9dyGAjENc
Transcript:
(00:00) అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్ మాసం లాగా జూన్ మాసాన్ని యోగామాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి నిజ జీవితంలో యోగాన్ని ఒక భాగంగా చేసుకొని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగాచారాలని సంకల్పించారు.
(00:30) ఇందులో భాగంగా ఇంటింటికి యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా కంటి చూపును మెరుగు చేయటానికి ఉపయోగపడే కంటి వ్యాయామాలు అందరి కొరకు చూపించబోతున్నాం. వయసుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు అందరికీ ఈ రోజుల్లో వస్తున్నాయి. చిన్న చిన్న అక్షరాలని స్క్రీన్స్ ని రకరకాలుగా కలర్స్ ని ఇట్లా ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేటట్టు కంటితో మనం చూడటం వల్ల వయసు రాకుండానే కన్ను స్ట్రెయిన్ గురై చూపు తగ్గిపోతూ ఉన్నది.
(01:04) మరి అట్లా కంటి చూపుకి బ్లడ్ సప్లైని బాగా పెంచి కంటిలో నీటి శాతాన్ని బాగా ఉత్పత్తి అయ్యేటట్టు చేసి కంటికి లూబ్రికేషన్ బాగా జరిగేటట్టు చేసి కంటికి బాగా అద్భుతంగా ఉపయోగపడే ఐదారు కంటి వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. షార్ట్ సైట్ ఉన్న లాంగ్ సైట్ ఉన్న చూపును మెరుగు చేయటానికి ఆరోగ్యకరంగా ఉన్నవారికి చూపు భవిష్యత్తులో దెబ్బతినకుండా ఉండటానికి ఉపయోగపడే వ్యాయామాల్లో ముందుగా మనం నడుము లైన్ గా పెట్టి కూర్చుని చేతులు అట్లా స్ట్రైట్ గా పెట్టేస్తాం మెడ కూడా అట్లా స్ట్రెయిట్ గా పెట్టి కళ్ళును తెరిచి రెండు కళ్ళను కన్ను గుడ్డు చూడండి కింద నుంచి పైకి స్ట్రెయిట్
(01:42) గా మనం ఏదన్నా ఒక గోడ చూసినా కానీ ఒక స్పాట్ చూసినా కానీ దాన్ని కింద నుంచి పైకి కి పై నుంచి కిందకి అట్లా ఏడుఎనిమిది సార్లు కంటిన్యూస్ గా మనం 10 సార్లుయనా చేయవలసి ఉంటుంది అన్నమాట స్ట్రెయిట్ గా ఉండాలి చూపు కింద నుంచి పైకి పై నుంచి కిందకి ఇక కళ్ళు ఆర్పకూడదు గుడ్డు కూడా స్ట్రెయిట్ గా అట్లా కింద నుంచి పైకి పై నుంచి కిందకి మాత్రమే కదపాల్సి ఉంటుంది.
(02:08) రెండవ కంటి వ్యాయామం కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి మనకి కంటికి సమాంతరంగా ఉండే లెవెల్ లోనే మనం కనుగుడ్డుని అట్లా తిప్పవలసి ఉంటుంది ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఈ మూలకి అట్లా కనుగుడ్డుని స్ట్రెయిట్ గా మనం కార్నర్ నుంచి ఈ కార్నర్ కి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఐదారు సార్లు ఎనిమిది సార్లు 10 సార్లు అయినా చేయడం చాలా మంచిది కళ్ళు మాత్రం ఇట్లా చేసేటప్పుడు అస్సలు ఆర్పకూడదు ఏకాగ్రత మాత్రం ఎటూ వెళ్ళకుండా కనుగుడ్డు మీదే మనం అట్లా పెట్టి చేసినప్పుడు చక్కటి ఫలితం వస్తుందన్నమాట ఇక మూడవ వ్యాయామం
(02:49) కనుగుడ్డుని అటు చూడండి కుడి వైపు మూల భాగం పై నుంచి ఎడమ వైపు కింద భాగానికి చూపు అట్లా క్రాస్ గా కనుగుడ్డుని అట్లా క్రాస్ గా పై నుంచి కిందకి అట్లా క్రాస్ గా చూడటం జరుగుతుంది. కనుగుడ్డు చూడండి అదే మాదిరిగా ఇక ఎక్కడ మన చూపు మారకుండా ఆ యాంగిల్ లోనే తిప్పినప్పుడు కంటిలో ఉండే అన్ని భాగాలు కండరాలు నరాలు రక్తనాళాలు అన్ని యాక్షన్ లోకి వస్తాయి అన్నమాట ఇలా ఏడు సార్లు చేసిన తర్వాత ఎడమ వైపు అప్ పై భాగానికి చూస్తాం కుడి వైపు డౌన్ కి కార్నర్ గా అట్లా చూపు కనుగుడ్డుని అట్లా తిప్పాల్సి ఉంటుందన్నమాట ఇట్లా ఏడుఎనిది సార్లు 10 సార్లు మనం చేసిన తర్వాత ఈసారి
(03:36) కనుగుడ్డు మొత్తాన్ని సున్నా చుట్టినట్లుగా గడియార ముల్లు తిరిగినట్లుగా క్లాక్ వైస్్ అట్లా గుండ్రంగా తిప్పవలసి ఉంటుంది. ఇంకా కొద్దిగా స్లోగా కూడా చేస్తే ఫలితం బాగా వస్తుందన్నమాట. అంటే పూర్తిగా సున్నా చుట్టినట్టుగా మనం గుడ్డుని గుండ్రంగా తిప్పాలి. ఇట్లా ఒక ఏడు ఎనిమిది సార్లు 10 సార్లు చేసిన తర్వాత మరోసారి రివర్స్ లో చేయవలసి ఉంటుంది.
(04:02) క్లాక్ వైస్్ అయింది కదా యాంటీ క్లాక్ వైస్్ కానుకూడ్ని మళ్ళీ సున్నా చుట్టినట్టు గుండ్రంగా పైనుంచి కిందకి అట్లా గుండ్రంగా తిప్పాలి. ఈ రకంగా ఏడు సార్లు 10 సార్లు చేస్తే కళ్ళకు చాలా మంచిది ఆ తర్వాత చేతుల్ని అట్లా రప్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఒక నిమిషం అట్లా మూసేస్తే హాయిగా అనిపిస్తుందన్నమాట. పిల్లలకి కంటి చూపు దెబ్బ తినకుండా ఉండాలంటే అన్ని భాగాలకి వ్యాయామాలు చేసినట్లుగానే కంటికి కూడా ఈ రకమైన వ్యాయామాలు చేస్తే చాలా మంచిదిఅన్నమాట ఇలాంటి కంటి వ్యాయామాలతో పాటు కంటి ఆరోగ్యాన్ని మీరు మెరుగు చేసి కళ్ళ మంటలు కళ్ళు ఎరుపెక్కటం కళ్ళు ఎక్కువసారి ఆరపటం లాంటి సమస్యల
(04:43) నుంచి మీరు బయట పడాలి అంటే రోజుక ఒక మూడు సార్లు అన్నా సరే జేబు గుడ్డని చల్లటి నీళ్ళల్లో వేసి తడిపేసి ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళలో అట్లాంటి వాటి లో తడిపేసి ఆ చల్లటి గుడ్డలు రెండిటిని కంటి మీద పెట్టుకొని ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు అట్లా ఉంచుకోండి మధ్యలో ఒకసారి తిరగేసేసుకోండి నాలుగు నిమిషాల తర్వాత తిరగేసేయండి.
(05:04) అట్లా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఖాళీగా ఉన్నప్పుడు లేకోతే మూడు నాలుగు సార్లు గనుక కంటి మీద అట్లా పెట్టుకొని కుర్చీలో కూర్చుంటారు ఆఫీసుల్లో కాస్త మెడని వెనక్కి వాల్చేసి లంచ్ బ్రేకులను కళ్ళ మీద రెండు జేబు గొడ్డలు అట్లా తడిపేసి పెట్టుకోండి. వెంటనే మీకు కంటికి రక్త సర్ఫరా బాగా పెరుగుతుంది కంటి మజిల్స్ బాగా రిలాక్స్ అవుతాయి.
(05:24) ఆ కోల్డ్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఐ ప్ాక్స్ ఇది చాలా చాలా మంచి టెక్నిక్ కంటి చూపుని కాపాడుకోవడానికి అటు ఐ వ్యాయామాలు ఇటాటి హై ప్యాక్స్ ని కూడా మనం ఉపయోగించుకుంటే మంచిది. దీనితో పాటు విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ బాగా తినాలి. అన్నిటికంటే విటమిన్ ఏ రిచ్ మునగాకు నెంబర్ టూ కరివేపాకు కొత్తిమీర లాంటివి అందుకని ఇలాంటివి వెజిటేబుల్ జ్యూసుల్లో వేసుకోవటం వండేటప్పుడు మునగాకు లాంటిది కాస్త ఫ్రై వాటిలో ఎక్కువగా వేసుకోవటం మునగాకు పౌడర్ ని పులకాల్లో వేసుకోవటం ఇలా కొత్తిమీర లాంటివి కరివేపాకు లాంటి వెజిటేబుల్ జ్యూస్ లో ఉపయోగించుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా చేయగలిగితే కండుచు
(06:02) బాగా మెరుగవుతుందని విజ్ఞప్ చేస్తూ నమస్కారం
No comments:
Post a Comment