🌹🌹🌹
॥తత్త్వజిజ్ఞాస ॥
ఆత్మ విచారం (అనుభవపర్యంతంతం
🙏*మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి, చదవాలి, తెలుసుకోవాలి....అదంతే....నా వాడు చెప్పలేదు అనుకోవడం... ఖచ్చితంగా మన మూర్ఖత్వమే సుమా*
*ఎదుటి వారికి చెప్పడం కాదు...కానీ మొదటి మన మాటలో, చేతలో, ప్రవర్తన లో మంచి మార్పు వచ్చినప్పుడే మరొకరికి చెప్పే అర్హత వచ్చినట్టు* ఇదే నిజం.
ఆత్మ విచారము అనేది కేవలం మేధోపరమైన చర్చ కాదు; అది తన నిజ స్వరూపాన్ని ప్రత్యక్షముగా అనుభవించే వరకు సాగే ఒక నిరంతర ప్రక్రియ. బ్రహ్మ జిజ్ఞాస లేదా విచారము అనేది అనుభవమే అంతిమ ఫలముగా కలిగినది, అనగా అజ్ఞానము తొలగి ఆత్మ సాక్షాత్కారము కలిగే వరకు ఈ విచారము కొనసాగాలి.
ఆత్మ విచారము అనేది శ్రవణవణము, మననము మరియు నిదిధ్యాసనము అనే ప్రక్రియల ద్వారా సాగుతుంది. ఇది కేవలం బాహ్య విషయాల గురించి తెలుసుకోవడం కాదు, బుద్ధికి సాక్షిగా ఉన్న తనలోని సాక్షి చైతన్యాన్ని గుర్తించడం.
ఈ విచారము యొక్క ఉద్దేశ్యము కొత్తగా ఏదో సిద్ధ్ధాంతాన్ని నిర్మించడం కాదు, అనాత్మ పదార్ధాలైన దేహేంద్రియ మనోబుద్ధులపై ఉన్న అధ్యాసను తొలగించుకోవడం. చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడినట్లు, అజ్ఞానము వల్ల ఆత్మను అనాత్మగా భావిస్తున్నాము; ఆ భ్రమ తొలగడమే విచారము యొక్క లక్ష్యము.
అనుభవపర్యంతంతం అనగా శృతి వాక్యాల ద్వారా కలిగే జ్ఞానము కేవలం పరోక్షముగా కాకుండా, అపరోక్ష అనుభూతిగా మారే వరకు విచారము చేయాలి. ఆత్మ అనేది ఎప్పుడూ సిద్ధమై ఉన్న వస్తువు కాబట్టి, విచారము ద్వారా అజ్ఞానము తొలగడమే అనుభవముగా చెప్పబడింది.
🌹🙏🙏🙏
No comments:
Post a Comment