చదివిన చదువుకు జాబ్ కష్టమండోయ్...మరేం చెయ్యాలి? Qualification = Not a job. What nest?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=s_OwfDUY3K0
Transcript:
(00:00) ఈ మధ్య యువత నుంచి ఫోన్లు బాగా వస్తున్నాయండి. అంకుల్ బిటెక్ చేశాను లేకపోతే సార్ నేను ఎంటెక్ కూడా చేశాను జాబ్ రావట్లేదు సార్ అని కొంతమంది అంటే మరి కొంతమంది ఏమంటున్నారంటే కరోనా టైంలో బీటెక్ పూర్తి చేసాం సార్ సబ్జెక్ట్ మీద కూడాను పెద్ద కమాండ్ లేదు. అసలు ఇప్పుడు ఎక్కడ అప్లై చేసినా కూడాను నా మార్కులు చూసి నా సర్టిఫికెట్లు చూసి అసలు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు ఒకోసారి ఇంటర్వ్యూ దాకా వెళ్తున్నాం కానీ ఇంటర్వ్యూలో కూడా ఫెయిల్ అయిపోతున్నాం.
(00:42) ఏం అర్థం కావట్లేదండి అన్నది వాళ్ళ అంతరంగం అండి ఏదేమైనా ఒక్కటి నిజమండి దేశం మొత్తం మీద యువత నిరాశలో ఉంది. వాళ్ళు చదివిన చదువుకి సరిైన ఉద్యోగాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. సో ఈ విషయం చెప్పే ముందు రెండు అద్భుతమైన వాక్యాలు చెప్తానండి అంటే ముఖ్యంగా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నువ్వు సెటిల్ గాని యువతకి అన్నమాట ఒకటి ఏంటంటే ఒక ఇష్టమైన పనిని చేస్తూ చేయవలసిన పనిని చేయకపోవడమే బద్ధకం ఇది బద్ధకని కొత్త నిర్వచనం అండి ఉదాహరణ ఏంటంటే రేపు ఎగ్జామ్ పెట్టుకొని చదవకుండా ఫ్రెండ్ వస్తే కబురులతో కాలక్షేపం చేయడం లేదా టీవీ లో క్రికెట్ మె
(01:28) చూడటం అనేది బద్ధకం అన్నమాట ఇప్పుడు సరదాగా చెప్తున్నాను [గొంతు సవరించుకోవడం] మలబద్ధకానికి ఏదైతే టాబ్లెట్ ఉంది కానీ ఈ బద్ధకానికి మటుకు స్మార్ట్ గా పని చేయడం [నవ్వు] తప్ప వేరే మార్గం లేదండి రెండో సెంటెన్స్ ఏంటంటే అసలు విశ్రాంతి అంటే తనకి ఇష్టమైన పని చేయటంట విశ్రాంతి అంటే తనకి ఇష్టమైన పని చేయటంట నార్మల్ గా మనం ఏమంటాం విశ్రాంతి అనంగానే అలా ఏ పని లేకుండా హాయిగా రెస్ట్ తీసుకోవడం అని అనుకుంటాం కదా తప్పండి అది [నవ్వు] నీకు నచ్చిన పని గనుక చేసుకుంటూ పోతే అసలు నీకు టైమే తెలవదు అన్నది దీని గూడా అర్థం అన్నమాట ఇక్కడే స్వామి
(02:09) వివేకానంద కొటేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది ఏంటంటే నీకు ఇష్టమైన ఉపాధిని ఎన్నుకో జీవితంలో ఒక్కరోజు కూడాను పని చేయవలసిన అవసరం రాదు అని చెప్పేసి దీని గురించి నేను కూడా కొంచం సీరియస్ గా ఆలోచించానండి ఏంటంటే ఉపాధి ఉపాధిని క్రియేట్ చేస్తుంది కానీ ఈ పని ఉంది చూసారా కేవలం పొట్ట పోషించుకోవడానికి పెళ్లి చేసుకొని భార్యా పిల్లలని పోషించుకోవడానికి మాత్రమే పనికొస్తుందండి ప్రస్తుత పరిస్థితుల్లో అలాగే ఒకటి కింద పని చేయడానికి కూడాను పనికొస్తుంది కేవలం ఈ పని సీరియస్ గా ఆలోచిస్తే నాకు ఏమనిపించిందంటే ఈ పైన చెప్పిన ఈ రెండు వాక్యాలు కొన్ని
(02:48) కొటేషన్స్ అనుకోండి అవి యువతని దిశా నిర్దేశం చేసే వాక్యాలుగా నాకు అనిపించాయండి. సో ఇప్పుడు అసలు విషయం గురించి కాస్త మాట్లాడుకుందాంండి. ఇప్పుడున్న వాస్తవం ఏంటంటే చాలా చోట్ల యువత కేవలం సర్టిఫికెట్స్ సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉంది. వాళ్ళని చూస్తే ఒక విధంగా జాలేస్తున్నది కూడా ఎందుకంటే పరిస్థితులు చకచక మారిపోతున్నాయి.
(03:15) సర్టిఫికెట్ సంపాదించుకునే పరుగులో ఉన్నారు తప్ప నైపుణ్యాన్ని ఏమాత్రం కూడాను వాళ్ళు పట్టించుకోవట్లేదు. చదువుకు దగ్గగా జాబ్ వచ్చే అవకాశాలు ఎప్పటి నుంచో ఇవ్వండి అంటే విషయం మీద పరిశీలన చేస్తున్నాను కాబట్టి దాదాపు 10 15 ఏళ్ళ బట్టి కూడాను చదువు కేవలం చదువుగానే మిగిలిపోయింది కానీ సమాజం దాన్ని ఉపయోగించుకునే స్థితిలో లేదండి ఉపయోగించుకునే స్థితిలో లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ సివిల్ చేసిన కుర్రాళ్ళు ఒక పెద్ద బిల్డరు ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఫ్లోర్ లీడర్స్ గా నెలకి 10 15 వేలకు పని చేస్తున్నారండి అంటే ఆయనకి కూడా జాలిసి
(03:56) ఉంటుంది పాపం వీళ్ళేదో సివిల్ ఇంజనీరింగ్ చదివారు పెద్ద గొప్ప బేసిక్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రకంగా ఉద్యోగం ఇద్దాంలే అని చెప్పి ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట నేను ప్రత్యక్షంగా చూశాను మీరు కూడా చూసే ఉంటారండి. కాబట్టి చదువుకి తగ్గ జాబ్స్ వచ్చే అవకాశాలు ఎప్పటి నుంచో లేవు. మీరు ఎన్ని వేల మందినైనా అడగండి. నీ చదువుకొని నువ్వు చేస్తున్న జాబ్ కి ఏమన్నా సంబంధం ఉందా అని దాదాపు 90% చెప్తారండి లేదండి అని చెప్పేసి అంటే [గొంతు సవరించుకోవడం] ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయట్లేదు ఇప్పుడిప్పుడే స్కిల్స్ ని ప్రోత్సహించే
(04:35) దిశగా ఆలోచిస్తున్నాయి అన్నమాట అది కూడా ఈ మధ్యనే కొంతమంది తండ్రులు చూశాను నేను ఈ తెలివైన తండ్రి ఏం చేస్తున్నాడఅంటే కొడుకుని గాన కూతుర్ని గాన ఇంటర్మీడియట్ తర్వాత ఏదో ఒక స్కిల్ ని నేర్పించే దిశగా ఆలోచిస్తున్నాడు అలాగే ఏదో ఒక జాబ్లో పెడుతున్నాడండి కారణం ఒకటే పిల్లలకు అనుభవం వస్తుందని అంటే 16 17 ఏళ్ళ కనుక వాళ్ళని ఏదో ఒక జాబ్ లో పెడితే మెల్లమెల్లగా వాళ్ళ అనుభవాన్ని గడిస్తారు ఒక ఏడుఎదఏళ్ళు పోనీ కనీసం ఆరేళ్ళు పెడితే వాళ్ళకి దాని మీద అవగాహన వస్తుంది అన్నది ఆ తండ్రి అభిప్రాయం నిజంగా అది చక్కటి అభిప్రాయం అంటే యువతల చాలా మంది చేతుల్లో
(05:14) క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు క్వాలిఫైడ్ కావటం లేదు ఎందుకంటే నైపుణ్యాలు ఇవ్వండి. ఈ నేటి యువతల సమస్య ఏంటంటే తమలోని సామర్థ్యాన్ని వాళ్ళు గుర్తించడంలో విఫలం అవుతున్నారుండి జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మీకు అందుకనే నేను ఇందాక అన్నది ఏంటంటే ఒక ఇష్టమైన పనిని మాత్రమే చేస్తూ చేయవలసిన పనిని చేయకపోవడమే బద్ధకము అని చెప్పేసి చేయవలసిన పని అంటే ఏం లేదండి స్కిల్ నైపుణ్యంతో కూడిన పని అన్నమాట ఈ వాక్యము యువతకి సీరియస్ గా చెప్పాలి అంటే ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నది.
(05:56) యువత గమనించాలి దీని ముందు ఇప్పుడు విశ్రాంతి అనేది తనకు ఇష్టమైన పనిని చేయడం లాంటిది అని ఇందాక నేను అన్నాను కదా అంటే పనిని ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు శిక్షగా కాకుండా ఆనందంగా చూడాలి. అని అర్థం [గొంతు సవరించుకోవడం] అండి. అంటే ఇవన్నీ ఒకవైపు అన్నిటికంటే ముఖ్యంగా యువత పాజిటివ్ ఆటిట్యూడ్ తో ఉండాలండి ఇక నా జీవితం ఇంతే నాకు భవిష్యత్తులో ఉద్యోగం రాదు నేనేం చేయలేను నేను ఎందుకు పనికిరాని మండి అని అనుకోకూడదండి.
(06:26) ఎప్పుడైతే నిరాశ ఆవరిస్తుందో ఆలోచన కూడాను మృగం అయిపోతుంది. ఇంకో కోణంలో చెప్తానండి ప్రస్తుత డిగ్రీ ఉంది చూసారా అది భవిష్యత్తుని నిర్ణయించదండి మరి ఏం నిర్ణయిస్తుంది నీ యొక్క నైపుణ్యమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అసలు మా రోజుల్లో అయితే డిగ్రీ అంటే ఒక అరుదైన అనుభవం అండి అరుదైన సర్టిఫికెట్ అన్నమాట. కానీ ఇప్పుడు కల మారిపోయింది కదా ఆలోచన మారిపోయి స్పీడ్ పెరిగింది కాబట్టి క్వాలిఫికేషన్ ఇస్ జస్ట్ ఏ క్వాలిఫికేషన్ దట్స్ ఆల్ అంతే నేను చాలా సీరియస్ గా యువతని గమనిస్తున్నాను నేను ఎక్కడికి పోయినా కుర్రవాడు ఉత్సాహంగా పని చేస్తుంటే అతని
(07:11) వివరాలు అడుగుతాను ఒక బిఏ చేసిన వ్యక్తి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నెలకి 50,000 సంపాదిస్తున్నాడు అది కూడా ఉత్సాహంగా సంపాదిస్తున్నాడు. ఏమ పెళ్లి చేసుకోవా అన్నాను ఆ 26 27 ఏళ్ళ కుర్రాడిని లేదండి ఇప్పుడప్పుడే కాదు కనీసం 30 40 లక్షలు అన్నా వెనక వేసుకొని అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అన్నాడండి నిజంగా నాకు ఎంత ముచ్చట వస్తుంది ఆ కురాని చూసి అట్లాగే బీటెక్ చేసిన వ్యక్తి నైపుణ్యం గనుక లేకపోతే జాబ్ కోసం సంవత్సరాలు తిరగవలసి వస్తుందండి ఇప్పుడు మా అపార్ట్మెంట్లో ఒక కుర్రాడు ఉన్నాడు జస్ట్ 10త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్ కూడా పాస్
(07:47) కాలేదు మా దగ్గర 129 ఫ్లాట్స్ ఇప్పుడు కూడాను అతను పని చేస్తున్నాడు. ఈ మధ్యన అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి ఊరికి సరదాగా ఒక డెసిగ్నేషన్ ఇచ్చాను. అతను అపార్ట్మెంట్ అవసరాలు చూస్తూనే ప్లంబింగ్ నేర్చుకున్నాడండి. ఎలక్ట్రికల్ వరకు కూడా నేర్చుకున్నాడు. ఆ విధంగా అతను మేము ఇచ్చే చిన్నపాటి విజేతంతో పాటు దానికి ఈక్వల్ గా కూడా కొంచెం అటు ఇటుగా సంపాదించుకుంటున్నాడండి.
(08:14) మరి రోజు బిజీగా ఉంటాడు అతను 129 ఫ్లాట్స్ ఉంటే చూడండి కనీసం రోజుక 10 అవసరాలు ఉన్నా 10 అవసరాలు కదా అటెండ్ అయినా కూడా నాలుగు డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు బయట వాళ్ళకి ఇవ్వాలంటే 1000 ఇవ్వాలనుకోండి పాపం ఇతని చేతిలో 500 పెట్టొచ్చు 600 పెట్టొచ్చు కదా ఇతను కూడా సంతోషం చేస్తాడు ఇది నా జీవితంలో నేను రెగ్యులర్ గా చూస్తున్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అండి కాబట్టి సమస్య డిగ్రీలో లేదండి నైపుణ్యంలో నైపుణ్యం లేకపోవడంలో ఉందన్నమాట నేను ఇంకొక మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఉదాహరణలు చెప్ చెబితేనే యువత సీరియస్ గా ఆలోచిస్తుంది
(08:45) అన్నది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఒక రైతు దగ్గర అద్భుతమైన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. దానికి సంబంధించిన పట్ట కూడా ఉంది. పట్ట అంటే మనం ఈ ప్రస్తుత కాంటెక్స్ట్ లో ఒక సర్టిఫికెట్ అన్నమాట అంతే కదా కానీ అతనికి సాగు చేయడం రాదు. మరో రైతు దగ్గర చిన్న భూమి ఉంది కానీ వ్యవసాయ నైపుణ్యం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు బతిలాడుకున్నాడు కొంచెం భూసార పరీక్షలు చేయండి అన్నాడు భూసార పరీక్షలు చేసిన తర్వాత ఆయన చెప్పాడు ఈ పంట వేస్తే నీకు మంచి రాబడు వస్తుందని ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడండి.
(09:15) సో ఇప్పుడు నిజంగా ఎవరు ఎక్కువ పండిస్తారో చెప్పండి సహజంగా నైపుణ్యం ఉన్న రైతే కదా ఈ సర్టిఫికెట్ అనేది భూమి పట్ట లాంటిదండి. ఈ స్కిల్ అనేది సాగు చేయగలిగిన సామర్థ్యం కదా ఫలితం ఏమఇస్తుంది రెండో విషయం కదా ఫలితం ఇచ్చేది సో ఒక్కటండి ప్రపంచం నీకు జాబ్ ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు గనుక ఒక అవసరమైన నైపుణ్యాన్ని గనుక నేర్చుకుంటే ప్రపంచమే నిన్ను వెతుక్కుంటూ అవసరమైతే నీ గుమ్మం బయట నిలబడి నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి మీరు గతాన్ని తిరగవేయండి చరిత్రను తిరగవేయండి ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి ఒక స్థాయికి ఎదిగిన మేధావులు అందరూ కూడాను
(10:00) ఏదో ఒక రకంగా కష్టపడి ఒక నైపుణ్యాన్ని సంతరించుకున్న వాళ్లే ఇంకో ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ప్రముఖ శిల్పి రాయిని చూసిన తర్వాత విగ్రహాన్ని ఊహిస్తాడు. కానీ సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు అతనికి అది కేవలం రాయిలాగే కనిపిస్తుంది. తేడా రాయిలో లేదండి [నవ్వు] ఆలోచనలో ఉంది నైపుణ్యంలో ఉంది. అంటే [గొంతు సవరించుకోవడం] చాలామంది యువత సమస్యను చూస్తున్నదండి కానీ అతి తక్కువగా కొంతమంది ఆ సమస్యలో అవకాశాన్ని చూస్తున్నారు.
(10:38) నైపుణ్యాన్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దిస్ [గొంతు సవరించుకోవడం] ఇస్ నథింగ్ బట్ ఆటిట్యూడినల్ డిఫరెన్స్ అండి అంతే ఇప్పుడు మరి ఏం చేయాలి కిరణ గారు మరి ఏం చేయాలి మీరు అన్నీ చాలా చక్కగా చెప్తున్నారు నిజంగా మాలో కూడా ఒక విధమైన ఒక ప్రేరణ కలుగుతున్నది కానీ ప్రాక్టికల్ గా మేమ ఏం చేస్తే బాగుంటుంది అని మీరు చెప్పగలిగితే సంతోషం అండి అని అందనుకోండి నేను చెప్తానండి అసలు ఆ విషయం చెప్పకుండా నేను ఈ వీడియోని ఎలా ముగిస్తాను చెప్పండి నేను ఏమంటానంటే యువత ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు ప్రశ్నలు వేసుకో ండి చాలా జాగ్రత్తగా గమనించండి నేను చాలా
(11:12) మెల్లగా చెప్తున్నాను. ఇలా వేసుకుంటేనే ఫ్యూచర్ మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే నిజంగా నాకు ఏ పని చేయడం ఇష్టం రెండు ఆ పనికి మార్కెట్ లో డిమాండ్ ఉందా మూడు నైపుణ్యానికి అంటే నైపుణ్యం సంపాదించడానికి నేను చాలినంత సమయం కేటాయించగలనా ఎందుకంటే ఈ నిరాశ నిస్పృహంలో కూడా అసలు చాలా టైం వేస్ట్ చేస్తుంటారు కదా కాబట్టి ఒక విషయానికి కనెక్ట్ అయిన తర్వాత మరి సఫిషయంట్ టైం కేటాయించ కదా కాబట్టి నేను దానింత టైం కేటాయించగలను నాలుగు ఆ నైపుణ్యంతో నేను కనీసం ఆరు నెలల్లో ఏ స్థాయికి చేరుకోగలను అంటే ఒక్కొక్క నైపుణానికి కొంత టైం పడుతుంది అనుకోండి కానీ ఒక ఆరు నెలలు గనక మనం ఒక టార్గెట్
(11:58) పెట్టుకుంటే నిజంగా ఏ స్థాయికి చేరుకోగలను ఇది వేసుకోవలసిన నాలుగో ప్రశ్న అండి ఐదో ప్రశ్న ఏంటంటే నేర్చుకున్నదానికి ప్రపంచాన్ని నేర్చుకున్నదాన్ని ఈ ప్రపంచానికి ఎలా చూపించగలను ఈ ఐదు ప్రశ్నలకి గనుక సమాధానం దొరికితే జీవితానికి దిశ దొరికినట్టేనండి ఒక్కటండి జాబును వెతుక్కునే వ్యక్తిగా కాకుండా సమస్యని పరిష్కరించుకునే వ్యక్తిగా మారవలసిన అవసరం ఉంది మారాలి కూడాను ఈ ప్రపంచం కూడా ఎప్పుడు సమస్యలను పరిష్కరించే వారికే పట్టం కడుతుందండి వారికే పారితోషకం ఇస్తుంది.
(12:38) మీరు నిరాశతో ఉంటే అంతటితో అయిపోయింది అనుకోకూడదండి అదే రోడ్ క్లోజర్ అని అనుకోకూడదు. ఏమనుకోవాలంటే ఓహో ఓల్డ్ మెథడ్స్ పని చేయడం లేదు ఇది ఒక అలర్ట్ మాత్రమే ఇదిఒక అలారం మాత్రమే నాకు కాబట్టి ఐ హావ్ టు టైటన్ ది వేస్ట్ బెల్ట్ అండ్ ఐ హావ్ టు స్వింగ్ ఇంటు ద యాక్షన్ అని అనుకోవాలండి. నేను చాలా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఒక మంచి కొటేషన్ నాకు నచ్చిన కొటేషన్ అది ఏంటంటే మనిషి సర్వం కోలిపోయినా ఒకటి మిగిలి ఉంటుంది.
(13:14) అదే జీవితం ఆ మాటక వస్తే జీవితాన్ని ఎక్కడి నుంచైనా ఏ దశ నుంచిఅయినా ఏ పరిస్థితుల నుంచయనా ప్రారంభించవచ్చు కావాల్సింది ఉత్సాహం నైపుణ్యం ఎందుకంటేనండి ఈ అద్భుతమైన [గొంతు సవరించుకోవడం] భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుందండి. భవిష్యత్తు లేని వ్యక్తి అంటూ ఉంటాడా చెప్పండి కదా గతం ఎలా ఉందో వర్తమానం ఎలా ఉందో భవిష్యత్తు కూడాను అలాగే ఉంటుందండి దాన్ని అద్భుతంగా మార్చుకోవడంలో మనం ఏం చేయాలి అన్నదే మనం ఆలోచించవలసిన విషయం.
(13:46) సిన్సియర్ గా ఆలోచించి మీరు సిన్సియర్ గా గనక కష్టపడితే మీ శ్రమని మీ నైపుణ్యాన్ని ఆమోదించే వ్యక్తులు తప్పకుండా మీకు తారసపడతారు. క్వశ్చనే లేదండి చాలా మంది మేధావుల జీవితాల్లో ఇదే జరిగింది మేధావులందరూ ఒకప్పుడు సామాన్యులే ఆశే జీవితం అండి జీవితమే ఆశ అంతే నేను మటకు ఒక్కటి చెప్తున్నానండి నేను మటకు ఒక్కటి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి మీలో సామర్థ్యానికి కొరవ లేదు సమాచారానికి కూడాను కొరవలేదు మీరు వెతికి చూడాలి గానీ ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందండి.
(14:22) ప్రపంచం కూడాను అవకాశాలతో నిండి ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడాను నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు వెనక పడిపోలేదు ఇంకా దారిని కనుక్కునే ప్రయాణంలోనే ఉన్నారు. మీకు మీరు తీర్పు ఇచ్చేసుకొని ఇదే అంతిమం అని అనుకోవడానికి వీలు లేదండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మహా అయితే మీ వయసు ఎంత ఉంటది చెప్పండి 30 35 ఉంటుంది కదా 40 అయితే రాలేదు కదా మీకు తప్పులు చేయడానికి వాటిని మళ్ళీ ఒప్పులు చేసుకోవడానికి మళ్ళీ లేవడానికి ఉన్న వయసులోనే ఉన్నారు మీరు ఇది నా ప్రగాఢమైన విశ్వాసం అండి దీన్ని యువతగా మీరు నమ్మాల్సిందే ఇప్పుడు కొంచెం స్పిరిచువల్ టచ్ సాక్షి ఇవ్వాలంటే
(15:05) ఒక విషయం చెప్తానండి భగవంతుడు ఈ భూమి మీదకి పంపే ముందు మీలో నాటిన విత్తనం ఉంది చూసారా ఆ విత్తనం ఇప్పుడే మొలకెత్తడానికి సిద్ధంగా ఉంది. ఇది చీకటి తర్వాత వచ్చే వెలుగుకి సంకేతం అండి అంతకంటే ఏం లేదు నేను చెప్పాను కదా ఒక స్థాయికి జరిగిన మేధావులందరూ ఒకప్పుడు అయోమయంలో నిరాశలో ఇన్సెక్యూరిటీలో ఉన్నవాళ్లే మరి పని ఉపాధి నైపుణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి భగవద్గీతను పక్కన పెట్టడానికి వీలు లేదండి కర్మన్యాయం అధికారస్తే ప్రయత్నం నీ చేతిలో ఉంది.
(15:42) కావలసింది ఏంటంటే పట్టుదల ప్రయత్న లోపం లేకుండా పని చేయడం ఫలితం అంటారా మీరు అనుకున్న దానికంటే ఒక్కోసారి ఎక్కువ రావచ్చు లేకపోతే అనుకున్న ఫలితం రావచ్చు లేదు మీరు అనుకున్న దానికంటే ఇంకో డిఫరెంట్ రూట్ లో మీకు దిశా నిర్దేశం జరిగి మీరు అద్భుతమైన జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉందండి కాబట్టి ఒక్కటేనండి నేను చెప్పేది ప్రపంచం అనేక అవకాశాలతో నిండి ఉంది మీరు దేనో దేనికో ఒకదానికి తప్పకుండా కనెక్ట్ అవుతారు ఆలోచించండి ఈ వీడియోని కంటిన్యూస్ గా రెండు సార్లు వినండి.
(16:16) తెలియని సీరియస్నెస్ మీలో వచ్చేస్తుందండి అసలు విన్న తర్వాత ఒక 24 గంటలో 45 గంటలో మీరు ఎవరితో మాట్లాడరు అసలు మీ గురించి మీరు సీరియస్ గా ఆలోచించడం మొదలు పెడతారు. మీకున్న క్వాలిఫికేషన్ గురించి ఆలోచించారు అసలు దాని వైపు కూడా చూడరు. అంతే కాబట్టి వినండి ఉత్సాహంగా ఉండండి కార్యాచరణలోకి దూకండి అంతేనండి [నవ్వు] ఇదేనండి వీడియోలైన విషయం మీనందుకు కృతజ్ఞతలు మీకు నచ్చితే చాలా మంది యువతకి చరమేయండి దీన్ని అసలు వైరల్ చేయండి.
(16:50) చేస్తే చాలా మంది ఆలోచిస్తారండి సీరియస్ గా నిరుత్సాహాన్ని కోల్పోరు ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నా కూడాను ఎక్కడ లేని ఉత్సాహాన్ని వాళ్ళు పుంచుకుంటారు. అలాగే ఛానల్ కి మటుకు సబ్స్క్రైబ్ చేయండి. ఇది 826వ వీడియోనండి ఇటువంటి విషయాల మీద మానవ సంబంధాల మీద పెళ్లిల మీద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ల మీద చాలా వీడియోలు చేశనండి ఆధ్యాత్మికంగా కూడాను నేను చాలా వీడియోలు చేశను ఇవన్నీ మీకు చూసే అవకాశం ఉంటుంది.
(17:14) మీరు అలా స్క్రోల్ చేస్తూ మీకు నచ్చిన టాపిక్ ని వినండి వినండి మీలో ఏది కదలాలిలో అది కదులుతుందండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా చూసిన తర్వాత మీ మనసు చెబుతుంది కదా ఏటో నొక్కమని నొక్కేస్తారు. ఇంతకంటే ముఖ్యమైన విషయం ఒకటి ఉందండి అదేంటంటే నా మీద అభిమానంతో మీరు మంచి మెసేజ్ని పెట్టండి మంచి మెసేజ్ పెట్టండి అసలు మీరు ఇచ్చిన మెసేజ్ నన్ను 826 వీడియోలు చేయడానికి పురి కలిపింది అన్నమాట కాబట్టి మంచి మెసేజ్ని పెట్టండి లేదు ఇంకొక గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తున్నాను నేను మీకు అదేంటంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే హాయిగా
(17:49) మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 మీరు YouTube లోకి వెళ్లి చాలా వీడియోలో ప్రతి వీడియోలో కూడా నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను నేను మీరు YouTube లోకి వెళ్లిఎంఏ ఆర్ యుటహెచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ ఏఎన్ అని గనక టైప్ చేస్తే పి ఓ ఆర్ యు ఆర్ఐ అని నా పేరుతో నా YouTube ఛానల్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా నా YouTube ఛానల్ కూడా మీరు చూడొచ్చుండి అంటే నా పేరే నా YouTube ఛానల్ మారుతి కిరణ గౌరవ సో ఇదండి వీడియోలో సంగతి థాంక్యూ వెరీ మచ్ నమస్కారం ఆ
No comments:
Post a Comment