Office లో affairs? ||@sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=E_QlRDA663U
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం జాబ్ చేసే మహిళలు గాని పురుషులు గాని చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ముఖ్యంగా ఆఫీసుల్లో అఫైర్స్ విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఈ విషయంపై ఈరోజు మనం చర్చించుకుందాం. అసలు ఆడవాళ్ళు బయటికి వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇదివరకు రోజులని మించుకుంటే ఆడవాళ్ళు చాలా అప్డేట్ అయ్యారు ఎంతో గొప్ప చదువులు చదువుతున్నారు ఇంకా మగవాడితో పోటీ పడుతున్నారు డబ్బు సంపాదన అంటే డబ్బు వేటలో పడుతున్నారు.
(00:32) ఎందుకు ఉద్యోగాలు అని అడిగితే ఈ రోజుల్లో బ్రతకాలంటే ఇల్లు గడవాలంటే కచ్చితంగా భార్యా భర్తలు ఇద్దరూ కష్టపడాలని చెప్తున్నారు. మరి ఇలా వెళ్లే క్రమంలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది వాళ్ళని వాళ్ళు ఎలాగ రక్షించుకుంటున్నారు అసలు ఎందుకు సంసారాలని కూల్చుకుంటున్నారు మరి జాబ్ చేస్తే సంసారాల మీద దృష్టి పెట్టరా భర్తని గాని పిల్లల్ని గాని ఇల్లు గాని పెద్దవాళ్ళు గాని ఇవేమి వాళ్ళకి పట్టవా ఇందులో అందరూ ఉంటారా చాలా శాతం మంది ఉన్నారు కాబట్టే ఆడవాళ్ళు ఈరోజు దీనిపై చర్చించుకోవడం జరుగుతుందన్నమాట అందరూ అలా ఉండరేండి అంటే నిజంగానే సంస్కారంతో
(01:12) మెలిగేవాళ్ళు కాపురాలు నిలబెట్టుకునే వాళ్ళు తక్కువ శాతం మంది ఉన్నారు ఇలా అఫైర్స్ పెట్ పెట్టుకునే వాళ్లే ఎక్కువ శాతం మంది ఉన్నారు ముఖ్యంగా జాబ్ చేసే చోట ఇవి విచ్చలి విడితనం ఎక్కువైపోయిందన్నమాట ఇందులో పురుషులు ఉండరా అంటే మరి పురుషులు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు ఇద్దరు సమానంగానే కాపురాలను నాశనం చేసుకుంటున్నారు అని చెప్పడం జరుగుతుంది.
(01:35) అసలు ఎఫైర్స్ పెట్టుకోవడానికి కారణం ఏమిటి? ఆడవాళ్ళ అయినా ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారు మగవాళ్ళు దాని అడ్వాంటేజ్ గా ఎందుకు తీసుకుంటున్నారు? అసలు భార్య పిల్లలు గుర్తుకు రావటం లేదా సంస్కారాలని మర్చిపోతున్నారా? ఉద్యోగాలు చేసే క్రమంలో ఆడవాళ్ళు ఎంత కష్టపడితే ఈ జాబ్ వరకు వస్తారు పెద్ద చదువులు చదువుకుంటున్నారు కొద్దో గొప్పో చదువుకున్నవాళ్ళు ఉంటున్నారు కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు.
(02:03) అలాగే గౌరవం సంపాదించుకుంటున్నారు కానీ జాబ్ చేసే చోటే చిన్న మైనస్ పాయింట్లతో వీక్నెస్లతో వాళ్ళ లైఫ్ ని నాశనం చేసుకుంటున్నారు. ఉదయం లేచి ఇల్లు చూసుకోవాలి వంట చేసుకోవాలి పిల్లలకి క్యారియర్లు పెట్టాలి అలాగే వీళ్లు సర్దుకొని వెళ్ళాలి భర్తకి మొత్తం వచ్చిన తర్వాత చాకిరి వెళ్ళే ముందు చాకిరి ఇదంతా చేసుకొని వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి చదువుకున్నారు జాబ్ చేస్తున్నారు కానీ చిన్న తప్పు అక్కడే జరుగుతుంది.
(02:36) దీన్నే లైఫ్ దొరలటం అంటారున్నమాట మన ప్రమేయం లేకుండా ఊబిలో కూరికిపోతాం అలాగే ఏం జరుగుతుందో క్షణ పాటు మనకి తెలియకుండానే తప్పు జరిగిపోతుంది అన్నమాట అందుకనే ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మగవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈరోజు మాట్లాడుకుందాం జాబ్ చేసేవాళ్ళు ఇంటి దగ్గరికన్నా ఆఫీసుల్లోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు.
(03:01) ఎప్పుడూ వర్క్ మోడ్ లో ఉంటూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటేనే అక్కడ మేనేజర్ గాని ఆ అధికారి గాని ఇచ్చే వర్క్ సక్సెస్ ఫుల్ గా చేయగలుగుతారన్నమాట. ఒకరికొకరు సంప్రదించుకోవాలి సహకరించుకోవాలి ఆడామగ కానీ ఆ లిమిట్స్ అన్నీ దాటిపోయి వచ్చేసినయి లివింగ్ రిలేషన్స్ వరకు వచ్చినయి అని అనుకున్నాం మనం ముందు డేటింగ్ ఇప్పుడు ఆఫీస్ లో అఫైర్స్ బాగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఆఫీస్లే కదా అది దేనికి సంబంధించిందయనా అవ్వచ్చు నుంచి సాయంత్రం వరకు ఒక్కొకసారి ఎనిమిది కూడా అవుతుదిన్నమాట ఇంటికి వెళ్ళే క్రమంలో వాళ్ళు విసుకుపోయి పని పక్కన పెడతారు పిల్లల్ని పక్కన పెడతారు వాళ్ళ
(03:38) బాధ్యతలను పక్కన పెడతారు భర్తలని పక్కన కనపడతారు ఆడవాళ్ళు అలాగే భర్తలు కూడా విసిగిపోయి మూడ్ ఆఫ్ తో ఉంటారు పనివత్తుల్లో ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే పక్కన వాళ్ళ లైఫ్ చూసి అసూయతో చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు మన దగ్గర లేనిది పక్కనోడి దగ్గర ఉంది అనుకుంటారున్నమాట అంటే పక్కోళ్ళ సంసారాల్లోకి తొంగి చూస్తారు. సమయాన్ని ఎక్కువ శాతం ఆఫీసల్లోనే గడుపుతారు.
(04:07) కాబట్టి అక్కడ కల్చర్ వేరేగా ఉంటుంది. వర్క్ ప్రాసెస్ లో మాటలవి పెరిగి ఇదివరకు కాలంలో ఒకలా ఉన్నా ఇప్పుడు వేరేలాగ ఉంది. ఆడవాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉదయాన్నే ఫ్రెష్ గా మేకప్ లు వేసుకొని ఆఫీసులకు వచ్చేస్తున్నారు. ఇంటి దగ్గర వాళ్ళ భార్యల్ని జిడ్డు మోకాలతో చూస్తున్నారు. ఉదయం లేచి మీకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, మీకు టిఫిన్లు పెట్టటం పిల్లల్ని స్కూల్ కి పంపటం ఈ కంగారులో ఆవిడ తన మీద శ్రద్ధే మర్చిపోద్ది అన్నమాట.
(04:36) కానీ మీకు ఇక్కడ చూస్తే ఆఫీస్ లో ఆడవాళ్ళు నచ్చుతారు. అలాగే మగవాళ్ళు కూడా అంతే ఇంటి దగ్గర మగవాళ్ళు ఎప్పుడు అంటే భర్తలు ఎప్పుడూ కోపంగా ఉండటం విసుక్కోవటం చిరాకులో ఉండటం భార్యకి మాట్లాడే టైం కూడా ఇవ్వకపోవటం ఇది మైనస్ పాయింట్ అన్నమాట వాళ్ళు అక్కడ ఏమనుకుంటారు ఆఫీసుల్లో ఆడవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు జాలీగా మాట్లాడటం జోక్స్ వేయటం సరదాగా టైం స్పెండ్ చేయడం వచ్చి కొద్దిగా ఓదారపు మాటలు మాట్లాడుతూ ఉంటే అబ్బా మా ఆయన కన్నా చాలా బెటర్ నన్ను అర్థం చేసుకుంటున్నాడు ఇటువంటి భర్త దొరకలేదు నా దురదుష్టం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళకి
(05:21) తెలియని విషయం ఏంటంటే నువ్వు ఎవరిని చేసుకున్నా కూడా లైఫ్ అలాగే ఉంటుంది అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అర్థం చేసుకోకపోవటాలు ఉంటాయి గొడవలు ఉంటాయి అన్న విషయం మర్చిపోతున్నారు. మరి భర్తలు ఏమనుకుంటారు ఆఫీసులో ఆడవాళ్ళు కొద్దిగా చనువు తీసుకొని మీద చెయేసి మాట్లాడి ఏ ఏమి లేదు వర్క్ టెన్షన్ తీసుకోకు అయిపోద్దులే అని ధైర్యం చెప్తూ ఉంటే నా పెల్ల ఇంటికి వచ్చినా ఎప్పుడు వర్క్ వర్క్ అనే అంటారు.
(05:48) అసలు అర్థం చేసుకోదు ఎప్పుడు జిడ్డు మొహం వేసుకొని ఉంటది ఎప్పుడు మాడ మొహం వేసుకొని ఉంటది ఎప్పుడు ఒక పని మనిషిలా ఉంటది ఒక అందంగా ముస్తాబు అవ్వదు రెడీ అవ్వదు మంచి చేరే కట్టుకోదు అని ఇవే చెప్తూ ఉంటారున్నమాట వాళ్ళు కూడా ఆఫీసుల్లో అమ్మాయిల్ని చూసి ఆడవాళ్ళని చూసి మేకప్పుల్ని చూసి మోసపోతూ ఉంటారున్నమాట మేకప్ వేసుకుంటే వాళ్ళ ఆవిడ కూడా ఈవిడలాగే ఉంటది అదే ఆవిడ కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే జిడ్డు మొఖం వేసుకొని ఒక నైట్ నైటీ వేసుకొని అలాగే ఉంటదని వాళ్ళు తెలుసుకోలేరు.
(06:22) దూరపు కొండలు నుపు అనుకుంటారు పక్కింటోడు బెల్లం బాగుంది అనుకుంటారు ఈర్షాద్వేషాలు కక్కుతారు అసూయతో చూస్తూ ఉంటారు నాకెందుకు ఇంత అందమైన పెల్లం దొరకలేదు అనుకుంటారు అలాగే ఆడవాళ్ళు కూడా అంతే పక్కింటి మగవాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వాడు అంత సంపాదించేసాడు కారు కొన్నాడు పెల్లానికి నగలు చేయించాడు పట్టుచీర కొన్నాడు ఎంత బాగా చూసుకుంటున్నాడు అని బ్రమలో బతుకుతారు వాళ్ళు కూడా ఆఫీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇంట్లో పని వత్తుడు మీద వెళ్లి ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం టైం ఇచ్చుకోకపోవటం వల్ల ఇక్కడ అఫైర్స్ పెరుగుతున్నాయి అన్నమాట దీని వలన భారతదేశ
(06:57) సంస్కృతి దెబ్బతింటుంది అలాగే మనం ఎక్కడి వరకు వెచ్చలు విడిగా వెళ్ళిపోతున్నాం అనేది తెలుసుకోవట్లేదు రేవు పార్టీలు కానుంచి ఇప్పుడు ఆఫీస్ అఫైర్స్ వరకు వచ్చారన్నమాట ఆఫీస్ హస్బెండ్ అంట ఆఫీస్ వైఫ్ల అంట ఇదొక కొత్త పేరు కూడా పెట్టారండోయ్ హైదరాబాద్ లో ఇదే జరుగుతుందంట ఒక్కొక్కసారి మన అంచనాల్లో కూడా చాలా పొరపాటు జరగవచ్చని మీరు గమనించారా ఎక్కువ డబ్బు కావాలి ఎక్కువ ఆస్తిపాస్తులు డబ్బుఉన్న భర్త కావాలని ఆశించే ఆడవాళ్ళకి సుఖం ఉండదు సమయం తీరుకు ఉండదు అంటే భార్యా భర్తలు మాట్లాడుకునే అంత తీరుకు కూడా ఉండదు ఆయన ఎప్పుడూ డబ్బు సంపాదనతోనే ఉంటాడు ఇది కూడా ఒక లోటే కదా
(07:36) అలాగే ఎక్కువ సమయం ఉన్న భర్తకి డబ్బు ఉండదున్నమాట దాని ద్వారా భార్య విసిగిపోద్ది ఎప్పుడు ఇంట్లో నా ముందే కూర్చుంటాడు పని బాట ఉండదు డబ్బు సంపాదించడం నాకు కావలసినవన్నీ కొనడం ఇల్లు చూసుకోవడం అని చెప్పి విసుకుపోతూ ఉంటుంది. ఏదున్నా ఇక్కడ ప్రాబ్లమే అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. కొంతమంది భర్తలు చాలా రేర్ గా ఉంటారండి వాళ్ళు జెన్యూన్ గా ఉంటారు ఏదైనా సరే భార్యతోనే పంచుకుంటారు భార్యకు అన్ని చెప్తారు కానీ ఇది కూడా భార్యలకు నచ్చదు వాళ్ళని లోకువుగా తీసుకుంటారు వాళ్ళని ఎంతసేపు ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ రిలేషన్ లో గౌరవాలు ఇవ్వరు
(08:13) అన్నమాట. వాళ్ళు వాళ్ళ కాపురాన్ని ఇలా కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది చెంగు చెంగుని ఎగురుతూ ఉంటారు. జోక్స్ వేస్తారు. మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు చాలా జాలీగా ఉంటారు. అలాంటి వాళ్ళు అందరితోనూ అలాగే ఉంటారు. అంటే నీ ఒక్కదాని దగ్గరే జెన్యూన్ గా ఉంటారు. నీ ఒక్కదానితోనే లేకపోతే నీ ఒక్కడితోనే సరదాగా మాట్లాడతారు మనసువిప్పి మాట్లాడతారు గెంతుతారు ఇవన్నీ అనుకోన అవసరంలే అది ఎవరితో రిలేషన్ లో అన్నా వాళ్ళు అలాగే ఉంటారు ఆ రిలేషన్ వల్ల మీకు ముప్పు రావచ్చు అంటే అందులో మీరు ఒక్కరే భాగం కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట మన భారతదేశానికి
(08:49) గొప్ప సంస్కృతి ఉందండి అందులో భారతీయులందరూ భార్యా భర్తల బంధాన్ని విపరీతంగా గౌరవిస్తూ ఉంటారు ఈ రోజున అది లేదు ఒకదాన్ని ఒకటి దాటుకుంటూ లిమిట్స్ దాటుతూ విచ్చలవిడిగా అఫైర్స్ పెట్టుకోవడం విచ్చలవిడి శృంగారాలు పెట్టుకోవడం చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి అన్నమాట టెక్నాలజీని నమ్ముకొని టెక్నాలజీతోనే జీవితాలు గడుపుతూ ఫోన్లతోనే జీవితాలు గడుపుతూ మనిషి ఒంటరివాడైపోతూ కనీసం బంధాలు బాధ్యతలకి విలువనివ్వకుండా కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోనకుండా భార్యా భర్తలని ఒకరినొకరు గౌరవించుకోకుండా అవమానించుకుంటూ మనకు అవసరం లేని రిలేషన్ల వెంటపడుతూ
(09:27) సమాజంలో లో ఒక నీచమైన ముద్ర వేసుకుంటున్నారని మీరు గమనించట్లేదు దయచేసి ఎవరూ కూడా అడ్డదారిలో వెళ్లొద్దు ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ అనేది మండేటరీ ఆ జాబ్ లేకపోతే మేము బతకలేం కుటుంబ పోషణ అంటున్నారు కాబట్టి చెప్తున్నా మీరు జాబ్ చేస్తూ కూడా మీ విలువలని మీరు కాపాడుకోవచ్చు మీ బంధాలని మీరు అర్థం చేసుకోవచ్చు మీ కుటుంబ గౌరవాన్ని 100 రెట్లు పెంచొచ్చు పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చున్నమాట దయచేసి మాయలో పడకండి మగవాళ్ళు కూడా పెద్ద పెద్ద వయసులు కూడా చాలా ఎక్కువగా మాట్లాడటం జాలీగా ఉండటం ఆడవాళ్ళని బుట్టలో వేయటం చేస్తూ ఉంటున్నారు ఆఫీసుల్లో అలాగే ఆడవాళ్ళు కూడా
(10:08) ఏం తక్కువ కాదు మగవాళ్ళని ఓదాస్తున్నట్టుగా నాటకం ఆడటం మేకప్లు వేసుకోవడం లిప్స్టిక్లు వేసుకోవటం మంచి మంచి సారీస్ కొట్టుకోవడం మెసేజ్లు చేసుకోవడం చాటింగలు చేసుకోవడం ఆఫీస్ కి రాగానే ఒక ముసలోడు ఉన్నాడనుకోండి లేకపోతే ఒక అతను ఉన్నాడనుకోండి మేడం మీ సారీ చాలా బాగుంది ఈ రోజు ఏంటి ఏంటి ఇంత అందంగా ఉన్నారు అని కామెంట్ చేయటం మీరు పడిపోవటం ఇదంతా మీ జీవితాలు నాశనం అవుతాయని మీరు అర్థం చేసుకోండి.
(10:35) ఆధునికత పేరుతో మనం మన కల్చర్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి వెస్టర్న్ కల్చర్ మన జీవితంలోకి రానే వద్దు మనమే పాడైపోతే మన పిల్లలు ఎంతవరకు వెళ్ళిపోతారో ఆలోచించండి జీవితం ఒక బంగారు గని లాంటిది దాన్ని కాపాడుకోవాలి గానీ ఆ గని బద్దలైపోయేటట్టు మీ జీవితాల్లో సమస్యలు తెచ్చుకోకూడదు అన్నమాట ఆధునికత పేరు చెప్పి ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి అని మాత్రం అనుకోవద్దు దయచేసి ఇదివరకు రోజుల్ని ఫాలో అవ్వండి ఉమ్మడు కుటుంబాలని ఫాలో అవ్వండి పెద్దవాళ్ళని దగ్గర పెట్టుకోండి పిల్లల్ని తద్వారా క్రమశిక్షణగా పెంచండి మీరు ఎంత పెద్ద పదవుల్లో పెద్ద ఉద్యోగంలో ఉన్నా మీ
(11:13) సంస్కృతి సంప్రదాయాలని గౌరవించండి అలాగే కల్చర్ పాడవ్వకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలి మీ పని మీరు చేసుకొని రావటం వలన మీ కాపురాలు చల్లగా ఉంటాయి. అలాగే ఎటువంటి మచ్చా లేకుండా నూరేళ్ల సంసారం సాగుతుందని ఈరోజు వీడియో ముగిస్తున్నాను. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment