Tuesday, June 9, 2026

ఒకరికోసం ఎదురు చూడటం బలహీనతే Waiting for other's is a Weakness

ఒకరికోసం ఎదురు చూడటం బలహీనతే Waiting for other's is a Weakness

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=LGsWQmIfeWo



Transcript:
(00:01) చాలామంది కాలయాపం చేసేస్తూ ఉంటారు తెలియకుండా చేసేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారో అసలు వాళ్ళకే తెలియదు. ఈ కాలం గడిచిన తర్వాత అప్పుడు అయ్యో ఎన్నో అనుకున్నాం ఏం చేయలేకపోయామే అని బాధపడిపోతూ ఉంటారండి. ఇదొక విషయం అయితే ఇంకొక ప్రమాదకరమైన విషయం ఉంది అదేంటంటే అవసరం లేకపోయినా ఇతరుల కోసం ఆగిపోవడం ఇతరుల కోసం ఎదురు చూడటం అన్నమాట ఇది చూడడానికి చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ ఇంతకంటే ప్రమాదకరమైన విషయం లేదండి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి ఎంత ఘోరమైన తప్పు చేస్తున్నామో మనకు తెలిసిపోతుంది.
(00:44) దానికి బెస్ట్ ఉదాహరణ నేను ఎన్నుకున్నది ఏంటంటే మార్నింగ్ వాక్ అసలు మార్నింగ్ వాక్ రెగ్యులర్ గా ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ నీడివిలో అరగంట అంటే అరగంట గంట అంటే గంట చేయటం అనేది మనోధైర్యానికి ప్రతీక అండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి సెల్ఫ్ కంట్రోల్ కి ప్రతీక అన్నమాటనూటికినూ మంది పోనీ ఒక్కడిని వదిలేద్దాం లేండి 99 మంది రెగ్యులారిటీ మెయింటైన్ చేయరండి మెయింటైన్ చేయరు ఇక్కడే ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది అదేంటంటే నువ్వు ఇతరుల కోసం ఆగాలి అని అనుకుంటే వాళ్ళు వచ్చేదాకా ఆగాల్సిందే తప్పదు వెళ్లిపోవాలి అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళిపోగలవు అన్నమాట ఇప్పుడు నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే
(01:29) అసలు ఎందుకు ఆగాలి ఆగాల్సిన అవసరం లేకపోయినా దాని వల్ల నీ రెగ్యులారిటీ పంచువాలిటీ కూడా నువ్వు దెబ్బ తింటుందా లేదా మనక మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే ఒక విధంగా ఈ బద్ధత అనే అలవాటు అంటే ఇతరు కోసం ఎదురు చూడటం అనేది ఒక విధంగా బద్ధకానికి ఇంకొక కోణం అండి. ఈ అలవాటు నిన్ను నిజంగా కబలించి వేస్తున్నది కదా నీ జీవితం నీది చివరికి నష్టపోతే [గొంతు సవరించుకోవడం] ఎవరనా వచ్చి వాళ్ళ జీవితాన్ని కాసేపు ఆపేసుకొని మీకోసం ఆహారనిషలు పని చేస్తారు చెప్పండి చేయరు కదా నేను ఏమంటానంటే ముఖ్యంగా యువకులకు కూడాను ఈ సూక్ష్మం అర్థం చేసుకోకపోతే చివరికి
(02:12) నష్టపోయేది నువ్వే కదా సో దీని గురించి కాసేపు మాట్లాడుకుందాంఅండి. నా వీడియోలు అన్నీ కూడాను కొంచెం వివరంగా ఉంటాయి కాబట్టి కొంచం పెద్దవిగా వస్తాయండి ఎవరో ఒకళ్ళు చూసి కనీసం నిజమే కదా అనుకొని ఆచరణలోకి దిగుతారేమో అన్న ఆశ అంతకంటే ఏం లేదండి సో నేరుగా విషయానికి వస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఇతరుల కోసం ఆగటం అనేది ఓ మంచితనం అనుకుంటారు.
(02:39) స్నేహం అనుకుంటారు. మనం వాళ్ళకి మర్యాద ఇస్తున్నామ అని అనుకుంటారు. కానీ ఇవన్నీ పట్టించుకోరు చాలామంది వాళ్ళు రావాల్సిన టైం కి వస్తారు. అరే మీరు నా కోసం ఎదురు చూస్తున్నారండి సారీ అంటారు అయిపోతుంది ఈ సారీ చెప్పడం వాళ్ళ జీవితంలో ఒక అలవాటు అన్నమాట కానీ నేను ఏమంటానఅంటే చాలా సందర్భాల్లో అది మంచితనం కాదండి అది ఒక విధంగా చెప్పాలి అంటే అలవాటుగా మారిన డిపెండెన్సీ ఇంకా మోమాట లేకుండా చెప్పాలంటే అది ఒక బలహీనత ఇతరుల కోసం ఎదురు చూడటం అనేది బలహీనత అండి బలహీనత ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా గనుక సున్నితంగా ఆలోచించినట్లయితే మనిషి చాలాసార్లు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడానికి
(03:24) భయపడతాడుండి భయపడతాడు. ఆ భయాన్ని తప్పించుకోవడానికి ఇంకొకళ మీద ఆధారపడతాడండి నేను కొన్ని సందర్భాలు చెప్తాను మీరు కొంచెం అర్థం చేసుకోండి అతను వస్తేనే వాగింగ్కి వెళ్తాను నా స్నేహితుడు కూడాను ఒక కోర్సులో చేరుతున్నాడు ఆ కోర్సులో గనుక చేరితే నేను కూడా చేరుతాను. నాకు కంబైన్డ్ స్టడీ అంటే ఇష్టం అతను వస్తేనే చదువుతాను. అట్లాగే నాకు కూరలు తరిగి పెడితేనే వంట చేస్తాను లేకపోతే పచ్చ చేసుకొని తిని మంచి తగి పనుకుంటాను.
(04:03) ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలా మందిని గమనిస్తున్నాను చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడాను ఒకోసారి ఇతరులు మాట్లాడుతూ ఉంటే నేను అలా కాయితాల మీద రాసుకొని పెడతా ఎప్పటికైనా పనిక వస్తాయి ఏమని అట్లాగే మిత్రుడితో జిమ్ కి వెళ్దామని ఆగాను అతను రాలేదు నాకు కూడా నువ్వు వెళ్ళబుద్ది కాలేదు.
(04:26) ఓ కొత్త ఫంక్షన్ కి వెళ్ళాలి అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉండరేమో అయితే వద్దులే నేను రానులేండి అక్కడ ఎవరో కొత్తవాళ్ళు ఉంటారు అన్న ఆడవాళ్ళు చాలామంది ఉన్నారండి ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఇంకొకరి కోసమే మన విలువైన జీవితాన్ని అలా వ్యర్థం చేసుకుంటూ ఉంటాం నేను ఎక్కడో చదివాను వసంతం వచ్చింది గ్రీష్మం వచ్చేసింది చివరికి హేమ మంతము వెళ్ళిపోయింది కానీ నేను పాడాలనుకున్న పాట పాడనే లేదు.
(05:00) తీగలు సవరించుకోవడంలోనే నా జీవితం ముగిసిపోతున్నది మళ్ళీ జీవితం రాదు కదా ఒక అభాగ్యుడి ఆవేదన అండి దీనికి రిలేటివ్ గా ఇంకొక విషయం కూడా చెప్తాను అది కూడా నేను అక్కడ చదివిందే అక్షరం నేర్చుకోవడానికి ఐదేళ్ళు పట్టింది అంతే కదండీ బిడ్డ మెల్లగా పుట్టి భూమి మీదకి వచ్చిన తర్వాత పెరిగి పెద్దయి ఒక ఐదేళ్లకు ఏబి సిడిలో అలో రాస్తారు కదా అక్షరం నేర్చుకోడానికి ఐద ఏళ్ళు పట్టింది.
(05:30) అర్థం చేసుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. అంటే 60 ఏళ్ళ తర్వాత అసలు జీవితం అంటే ఏమిటి? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఆచరించడానికి సత్తువు లేదు. ఇలా జీవితం ముగిసిపోతుందేమో అని భయమేస్తున్నది. ఇది ఒక దురదృష్టవంతుడి దిగువులండి ఉన్నారు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇ సమస్య ఇతరులు కాదండి ఎట్టి పరిస్థితులో కూడా ఇతరులు కాదు నీ జీవితానికి నిజంగా నువ్వే డ్రైవర్వి కానీ ఇతరులని డ్రైవర్ గా పెట్టుకుంటున్నావు నీకు డ్రైవింగ్ వచ్చు కానీ ఇతరులని డ్రైవర్ గా పెట్టుకుంటున్నావ్ అదే సమస్య
(06:12) అసలు నీ జీవితం అనే స్టీరింగ్ వీలు నీ చేతిలో ఉండాలండి సో నేను ఇందాకటి ఉదాహరణ దగ్గరికి వస్తున్నాను మార్నింగ్ వాక్ [నిట్టూర్పులు] మనం వాకింగ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఒకటే ఒక ప్రశ్న వేసుకోవాలి. వాకింగ్ నీ ఆరోగ్యం కోసం చేస్తున్నావా లేకపోతే కేవలం స్నేహితులతో కాలక్షేపం కోసం చేస్తున్నావ్ నిజంగా గనుక ఆరోగ్యం కోసం అయితే అతను రాకపోయినా నువ్వు వెళ్ళాలి ఎందుకంటే నీ ఆరోగ్యం నీది రేపు పొద్దున నువ్వు నర్వస్ వీక్నెస్ వచ్చి లేకపోతే కండరాల వీక్నెస్ వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎవ్వరు నీకోసం హాస్పిటల్ కి వచ్చి డాక్టర్
(06:52) పక్కన కూర్చొని అతనితో మాట్లాడరండి మహస్త ఒకసారి వస్తారేమో ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళది కదా నిజంగా గనుక అది నీ ఆరోగ్యం కోసం అయితే అతను రాకపోయినా నువ్వు వెళ్లాల్సిందే ఎందుకంటే నీ గుండె నువ్వు ఊపిరితిత్తులు నీ శరీరం చివరికి నీ కీళ్లుు కూడాను అతను వచ్చిన తర్వాత మాత్రమే పని చేయవుగా నిరంతరం పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాడిని శ్రద్ధగా చూసుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది కదా ఒకటండి సమయం ఎవరి కోసం ఆగదు నువ్వు ఆగితే సమయం అసలు ఆగదు వచ్చే అవకాశాలు కూడా ఆగవు అలా నీ జీవితం కూడా ఆగదండి కుంటుకుంటునో దేక్కుంటునో
(07:37) లేకపోతే నడుస్తున్నాో మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది చివరికి నష్టపోయేది నువ్వే నీలో అద్భుతమైన శక్తి ఉంది అనేది నువ్వు గమనించట్లేదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించడానికి ఎవరి కోసం ఎదురు చూడడండి కదా నది ప్రవహించడానికి ఎవరిని అడగదు అట్లాగే పువ్వు కూడా వికసించడానికి ప్రేక్షకులని పిలవదండి ఇదిగో నేను వికసిస్తున్నాను చూడండి అని చెప్పేసి దాని పని తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం కూడాను తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటుంది ఒంటరిగానే నిర్వర్తిస్తూ ఉంటుంది.
(08:15) కానీ మనిషి మాత్రమే ఇతరులతో తన కార్యక్రమాలని ముడిపెట్టుకుంటాడు. చాలా మంది అదే చేస్తుంటారు. అలా వాళ్ళు ఏంటంటే జీవించడానికి వాయిదా వేస్తూ ఉంటారు ఇప్పుడు అన్ని కాలయాపనలో కల్లా ప్రమాదకరమైన కాలయాపన ఏంటంటే నా దృష్టిలో ఇతరుల కోసం ఎదురు చూడటమేనండి అంటే మనక ఒక ఇండివిడ్యువాలిటీ ఉండదు ఏమ ఉండదు అలా రోజులు గడిచిపోతాయి నెలలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి తీర ఎక్కడి లక్ష్యాలు అక్కడే ఉంటాయండి కదా ఒక్కటండి జీవిత రహస్యం ఏంటంటే నీ ఆరోగ్యం నీది నీ క్యర్ నీది నీ ఆధ్యాత్మిక ప్రగతి నీది వెరసి నీ సమయము నీ
(09:04) జీవితము నీదే అనండి ఇప్పుడు రేపు అనారోగ్యానికి గురయ్యావు లేకపోతే విఫలమయ్యావు నేను రాలేదు కాబట్టి నువ్వు నష్టపోయావు అని మన మీద జాలి చూపెడుతూ పోనీ ప్రేమ చూపెడుతూ ఎవరు మనకోసం త్యాగం చేయరు కదండీ ఎవరు బాధ్యత తీసుకోరు కదా తీసుకున్నా కూడా ఒకసారి తీసుకుంటారు అంతే తప్ప వాళ్ళ జీవితాన్ని వదిలిపెట్టి ఇది మన జీవితంలో జీవించారు కదా ఎందుకంటే వాళ్ళకి ఒక జీవితం ఉంది కదా ప్రపంచం ఒక మాట చెబుతుందండి అదేంటంటే నీ నిర్ణయాలే నీ జీవితం అని నీ నిర్ణయాలే నీ జీవితం అంటే చాలామంది ఏంటంటే ఇతరుల కోసం ఆగటం అనేది నేనేదో వాళ్ళని ప్రేమిస్తున్నాను నా
(09:47) ప్రేమని వాళ్ళకి చూపెడుతున్నాను అని అనుకుంటారండి నేను ఏమంటానఅంటే ఇతరులని ప్రేమించడం తప్పు లేదు ఇతరిని గౌరవించడంలో కూడాను తప్పులేదు. కదా అయితే తెలియకుండా మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఇవన్నీ మన భయాన్ని దాచుకోవడానికి చేస్తున్నాం. ఇతరులకు సహకరించండి ఎందుకంటే నువ్వు సహకరిస్తే తప్ప ఇంకోళ్ళు మనకు సహకరించరు కాబట్టి ఇతరులకు సహకరించండి కానీ మీ జీవితాన్ని వారి రాకపోకలకి కట్టిపడేయద్దండి నువ్వు గనుక నీ లక్ష్యం కోసం మెల్లమెల్లగా నడవడం మొదలు పెడితే ప్రతిరోజు అదిఒక కార్యక్రమంగా భావించుకొని చేసుకుంటూ ముందుకు వెళితే ఒకరోజు నిన్ను
(10:31) అందుకోవడానికి వాళ్ళే పరిగెడతారండి ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళలో ప్రేరణ కలిగి మీలాగా ఉండటానికి వాళ్ళు పరిగెత్తే ప్రయత్నం చేస్తారు. మనలో ఒక తెలియని అంతర్లీనంగా ఉండే ఒక బలహీనత ఉందండి అదేంటంటే గుంపులో ఉంటేనే సురక్షితంగా ఉంటాము. అది ఒకప్పటి ప్రాచీన భావన అండి ఎందుకంటే మనుషులు మానవ పరిణామ క్రమంలో అంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం గుంపులు గుంపులుగా జీవించేవాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు కదా జంతువుల భారి నుంచి తప్పించుకోవడానికి బల్లాలు బరిషలు అవన్నీ పట్టుకొని వాళ్ళు గుంపులు గుంపులుగా జీవించారండి అలాగే
(11:13) ఒంటరిగా ఉంటే వాళ్ళకి ప్రమాదం కదా అంటే అలా గుంపుల్లో ఉండడం అనేది వాళ్ళు సంరక్షణగా భావించారు అది ఒక విధంగా నిజమే ఒకప్పుడు అయితే అయితే ఈ మానవ పరిణామ క్రమంలో ఏమైతున్నది అంటే ఇప్పటికీ మన మెథడు ఆ అదే ప్రోగ్రాం తో పనిచేస్తుంది. [నవ్వు] పనిచేస్తూనే ఉంది. ఎందుకంటే నాగరికత ఎంత పెరిగినా ఎన్ని ఆవిష్కరణలు జరుగుతున్నా కూడాను మనం వీలైనంత వరకు సేఫ్ జోన్ లోనో కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాం.
(11:43) ఇంకొకరు ఉంటే బాగుండు ఇంకొకరు ఉంటే బాగుండు అని మన మనసు పదే పదే సబ్కాన్షియస్ మైండ్ లో ఒక రిజిస్టర్ అయిన ఫీలింగ్ ని రిపీట్ చేస్తూ ఉంటుందండి. కానీ వాస్తవం ఏంటంటే నేటి పోటీ ప్రపంచంలో ప్రతి పనికి ఇంకొకళ్ళు ఉండాలి అనే భావన తప్పండి మీరు వీలైనంత వరకు ఇండివిడ్యువల్ గా ఎదగగలిగితేనే పోటీలో నిలబడగలరు పోటీలో నెగ్గలరు. అయితే ఒక స్థాయి వరకే మనం ఎదురు చూడాలండి ఒక స్థాయి వరకే ఇత్తుల సహాయం తీసుకోవాలి తర్వాత మనం సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళగలిగితేనే ఈ కొత్త ఆవిష్కరణలు సాధ్యమైతాయండి మరి అందరూ ఆవిష్కరణలు చేస్తూ పోతే ఎలాగ
(12:25) చేయలేరు కదా కొంతమంది వాటిని ముందుకు తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు క్రియేటర్స్ ఇన్వెంటర్స్ కొత్త విషయాలని కనిపెడతారండి అది మనవాళ్ళకి అందించిన తర్వాత మళ్ళీ కొత్త విషయాలు ఎంబడిపడుతూ ఉంటారు కానీ అచీవర్స్ ఏం చేస్తారంటే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి కనీసం నువ్వు క్రియేటర్ గా లేకపోయినా అచీవర్ గానా ఉండాలి కదా అద్భుతమైన విషయాలని ముందుకు తీసుకెళ్లి నీ జీవితాన్ని పునీతం చేసుకుంటూ సమాజాన్ని కూడాను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి కదండి.
(12:58) ఒకటండి ఇక్కడ ఏంటంటే మిత్రుడు నీతో మాత్రమే నడవగలడు కానీ నీ కళ్ళతో నడవలేడుగా నీ కళ్ళతో నువ్వే నడవాలిగా అలాగే నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇతరులు ఎప్పుడు కోపాసంజర్స్ మాత్రమే అసలు వాళ్ళందరినీ లీడ్ చేస్తూ డ్రైవర్ గా ఉండటమే చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం అంటే మన [గొంతు సవరించుకోవడం] లక్ష్యాలు గాన మన గమ్యం గానీ ఇతరుల యొక్క రాకపోయి ఎట్టి పరిస్థితులో కూడాను ఆధారపడకూడదండి.
(13:35) నేను ఇడ్లీ వడ ఆకాశం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని చదివానండి. ఇప్పటికి మూడు సార్లు చదివాను చదివినప్పుడల్లా కొత్తదతనం గుర్తుకొస్తుంది నాకు నన్నమూరి వీరేంద్రనాథ్ గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు విటల్ వెంకటేష్ కామతి ఇప్పుడు కామర్స్ ఓటర్స్ గ్రూప్ ఉంది కదా ఆయన ఎదిగిన స్థాయి చాలా గొప్పదండి ఎదిగిన విధానం చాలా గొప్పది.
(13:59) ఆ పుస్తకాన్ని చదివిన తర్వాతనే నేను చెప్తున్నాను. అదేంటంటే అవసరమైనప్పుడు ఎంగిరి కంచాలు ఎత్తాలి టేబుల్స్ క్లీన్ చేయాలి ప్లేట్స్ కడగాలి అప్పుడే నువ్వు హోటల్ ఓనర్వ అయతావు అని ఇది ఇది నా సొంత భావన అండి అంటే ఇతరులు రాకపోతే నీ ప్రయాణం ఆగిపోవాలా లేదా అన్నది ఇట్స్ ప్యూర్లీ యువర్ ఛాయిస్ దట్స్ ఆల్ అంతేనండి అక్కడ ఏ విధమైన కాంప్రమైజ్ లేదున్నమాట అంటే నేను ఇంకొకరి కోసం ఎదురు చూడటం అనేది అది మనల్ని మనం మోసం చేసుకోవడమే ఆలోచించండి ఇం ఇంకొకళ కోసం ఎదురు చూడాలి ఎదురు చూసి వాళ్ళతోనే కలిసి వెళ్ళాలి అని అనుకోవడం
(14:43) అనేది నిజంగా మనల్ని మనం మోసం చేసుకోవడమే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు తెలియదండి జీవిత చరమాంకంలో గతం గుర్తుకొచ్చి తెలియకుండా మనసులో ఉండి మన కనుకోలకల నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటే అబ్బా ఎంత ఘోరమైన పని చేశనురా మనసు పదే పదే చెప్తూ ఉంది నువ్వు చేయగలవు ఈ పనిని చేస్తూ పో అని కానీ నేను ఎందుకో ఇతరుల కోసం ఆగిపోయాను అని బాధపడతాడండి ప్రతివాడు కూడాను జీవిత చర్మాంకంలో చేసిన తప్పుల గురించి బాధపడుతూ ఉంటాడు.
(15:14) అచీవ్మెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మీకు తెలుసో లేదో ఒక్కసారి గతంలోకి మీరు తిరిగి చూడండి జీవితంలో ఎన్నో అవకాశాలు అలవాట్లు విజయాలు చివరికి ఆధ్యాత్మిక పురోగతి కూడాను ఈ ఎదురుచూపుల వల్లే ఈ వాయుదాల వల్లే చేజారిపోయిందండి అతి సామాన్యులుగా మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నాం అన్నమాట అసలు వీటిని తడుచుకుంటూ ఉంటే చాలా బాధగా ఉంటుందండి కదా వయసు ఉన్నప్పుడు ఆ డబ్బు ఉన్నప్పుడు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనం ఎంత కాలయాపన చేశము ఎంతగా ఇతరుల మీద ఆధారపడ్డాము చివరికి తెలుస్తూ ఉంటాయండి ఒక్కటండి
(16:00) మనక మనమే ఒక పరీక్ష పెట్టుకుందాం అది ఏంటంటే మీరు మీ జీవితంలో అనుకున్నది చేయలేకపోవడానికి సాధించలేకపోవడానికి కారణం ఏంటి నెంబర్ వన్ అసమర్థత లేకపోతే ఇంకోళ కోసం ఎదురు చూడటమా లేకపోతే భయమా ఈ మూడిట్లో మూడు అవ్వచ్చు ఏ రెండైనా అవ్వచ్చు ఏ ఒకటైనా అవ్వచ్చుండి కాకపోతే ప్రశాంతంగా కూర్చొని మనకి మనంగా వేసుకోవాల్సిన ప్రశ్న అన్నమాట అంటే ఏది అన్నది మనమే నిర్ణయించుకోవాలి.
(16:27) ఒకటండి కాలం ఆగదు సూర్యుడు ఆగదు ప్రకృతి కూడా నువ్వు నిశశబ్దంగా దాని పని చేసుకోపోతూ ఉంటుంది కానీ నేను ఇందాక అన్నట్టుగా మనిషి మాత్రమే ఎవరో ఒకరి కోసం అప్పుడప్పుడు ఆగిపోతూ తర్వాత విలపిస్తూ ఉంటాడండి ఇప్పుడు తోడు గనుక దొరికింది అనుకోండి సంతోషంగా నడవండి తోడు లేకపోతే ధైర్యంగా నడవండి అంతేనండి తోడు ఉంటే సంతోషంగా నడవండి తోడు లేకపోతే పోతే అదే మీ ధైర్యం బాయిగా ఒంటరిగానైనా సరే ధైర్యంగా నడవండి.
(17:03) ఈ రెండు కూడాను మన చేతిలో ఉన్న విషయాలేనండి ఒక విధంగా చెప్పాలి అంటే ఇన్నర్ ఇండిపెండెన్స్ అంటే ఇదే అంతర్గత స్వాతంత్రం అంటారు. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తానండి నువ్వు అనుకున్నది సాధించలేదు అంటే అది నీ ఆలోచనలో అడ్డంకి తప్ప మరేమి కాదు. ఇంకొకళ్ళ కోసం గనుక ఆగిపోవడం జరిగితే అది కూడాను నీ ఆలోచనలో అపస్ృతే కాబట్టి మన ప్రయాణాన్ని మనం వీలైనంతగా ఒంటరిగానే కొనసాగిద్దాంండి తప్పనిసరి అయితే ఇతరుల సహాయం తీసుకోవచ్చు తప్పేమ లేదు కానీ ఇతరుల కోసం మన జీవితం ఆగిపోకూడదు.
(17:43) [నవ్వు] ఇదండి ఈ వీడియోలోని సంగతి వినంద కృతజ్ఞతలు ఈ వీడియో గనుక నచ్చితే చాలా మందికి షేర్ చేయండి ముఖ్యంగా యువతకి షేర్ చేయండి. హాయిగా వింటారు ఇంకా లాభం లేదు అనుకొని కార్యచరణలోకి దిగిపోతారండి వాళ్ళ జీవితం మారొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత నేనేం గొప్పగా చెప్పట్లేదు అనుకోండి కానీ ఒక్కడు మారితే మీకు సంతోషం నాకు సంతోషమే కదా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బెల్ ఐకాన్ లైక్ బటన్స్ అనేవి మీ ఇష్టం అండి.
(18:11) మీ ఇష్టం కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఒక అద్భుతమైన మెసేజ్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఆ మెసేజ్లు చూసి నిజంగా నేను మర్చిపోతానండి. కొంతమంది మెసేజ్లలో నేను నేర్చుకున్నది కూడా చాలా ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన అభ్యర్థన ఏంటంటే అభ్యర్థ కాదులేండి ఒక అవకాశం నాతో ఎవరనా మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడొచ్చుండి. నా ఫోన్ నెంబర్ 9491063089 మీరు YouTube లోకి కూడా వెళ్లిఎంఏ ఆర్ యుటహెచ్ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యు ఆర్ ఐ పోరూరి అని మా ఇంటి పేరు వస్తుందండి అదే నా YouTubeూ్ ఛానల్ ఉంటానండి నమస్కారం

No comments:

Post a Comment