,పరధ్యానం అంటే?
👉నిత్యం, "నేను" ఉన్నాను అనే నా స్వయం స్పృహాను మరచి, ఇతరుల గురించి ఆలోచించడం.
ప్రపంచం యొక్క బాధ్యత ఏంటి?
👉ఈ ప్రపంచం ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి రూపొందించబడలేదు.
👉ఈ ప్రపంచం, "నేను" ఉన్నాను అనే ఒక మంచి స్పృహా కలిగి ఉండే జీవితాన్ని నిర్మించుకోకుండా పరధ్యానంలో పెట్టడానికే ఇది రూపొందించబడింది.
కాబట్టి,
👉"నేను" ఉన్నాను అనే స్పృహాలో ఉండవలసిన బాధ్యత తీసుకుంటాను. 👉ఇది విశ్వ చైతన్యానికి అనుసంధానం అవుతుందనే విశ్వాసంతో ఉంటాను.
👉ఇది నా సంపూర్ణ శరణాగతికి సహాయ పడుతుంది.
ఒక భక్తుడు :
భగవాన్! ఆత్మ బోధ గురించి ఎన్నోమారులో విన్నాను. అయినా ఈ బోధ నాకు ఆచరణ సాధ్యం కావడం లేదు. దీనికి నా మనోదౌర్బల్యమే(బలహీనమైన మనసు) కారణమా!
మహర్షి :
తీవ్ర ఆలోచన మనోదారుఢ్య(బలమైన మనసు) లక్షణము అని సాధారణంగా అనేకులు నమ్ముతారు. కాని ఆత్మ సాధనలో ఆలోచనలు ఎంత తగ్గితే మనసు అంత దృఢమైనదిగా లెక్కిస్తారు. అంతే.
ఒక్కసారి ఎవరన్నా ఇక్కడకు వచ్చారంటే తరువాత ఎక్కడకు వెళ్ళినా, ఎన్ని దర్శించినా, ఇక్కడకు వచ్చారంటే తరువాత ఎక్కడికి పోయినా చివరికి ఇక్కడికి చేరుకోవలసిందే. ఈ ద్వారం(జ్ఞాన మార్గం)లో నుండి తప్ప మోక్షానికి ప్రవేశార్హత లేదు.
No comments:
Post a Comment