Friday, September 4, 2026

 🌺 దేవతలు పూజించిన లింగాలు 🌺

విష్ణువు ఇంద్రనీలమణి లింగాన్ని

ఇంద్రుడు పద్మరాగమణి లింగాన్ని

కుబేరుడు బంగార లింగాన్ని

విశ్వేదేవతలు వెండి లింగాన్ని

వసువులు చంద్రకాంత శిల లింగాల్ని

వాయువు ఇత్తడి లింగం

అశ్వనీదేవతలు మృణ్మయ(మట్టి) లింగాల్ని 

వరుణదేవుడు స్ఫటిక లింగాన్ని

ఆదిత్యులు రాగి లింగం

చంద్రుడు  ముత్యాల లింగం

అనంతుడు పగడంతో చేసిన లింగాల్ని

దానవులు, రాక్షసులు ఇనుప లింగాల్ని

గుహ్యకులు మూడు లోహాలు కలిసిన లింగాల్ని

గణాలు అన్ని లోహాలు కలిపిన లింగాల్ని

చాముండాదేవి, మాతలు సైకత(ఇసుక) లింగాన్ని

నైరృతి దారు(కొయ్య) లింగాన్ని

యముడు మరకత లింగాన్ని

నీలుడు మొదలైన రుద్రులు భస్మ లింగాల్ని

లక్ష్మీదేవి లక్ష్మీవృక్షమయ లింగాన్ని (బిల్వవృక్షం) 

గుహుడు గోమయ(ఆవు పేడ) లింగాన్ని

మునులు కుశాగ్రాలతో(దర్భ) నిర్మించిన లింగాల్ని

వామదేవాదులు పుష్ప లింగాల్ని

మనోన్మని గంధ లింగాన్ని

సరస్వతీదేవి రత్న లింగాన్నిగాని 
రుద్రజలంతో నిర్మించిన లింగాన్ని

దుర్గాదేవి సువర్ణ(బంగార) లింగాన్ని

ఉగ్రులు పిండితో చేసిన లింగాల్ని

మంత్రాలు నేతి లింగాల్ని

వేదాలు దధి(పెరుగు)నిర్మిత లింగాల్ని

పిశాచాలు సీసంతో నిర్మించిన లింగాల్ని పూజించారు.

No comments:

Post a Comment