దేశ సేవ- కార్పోరేట్ సేవ-
దైవ సేవ
(మీరేమంటారు-3)
- అక్కి రాజు
**************
'సేవ'చేసేవాళ్ళు ఎక్కువైపో
యారు.రాజకీయాలు,విద్య వైద్యం, న్యాయం ...అన్నీ
సేవలే! ఖరీదైన సేవలు.లక్ష
ల సేవలు,కోట్లసేవలు,లక్షల
కోట్ల సేవలు.ఈసేవలకు ఏం
పేరు పెట్టాలో తెలియటం
లేదు.
ఖరీదైన సేవ అందామా?
పాలకసేవ అందామా? కార్పొరేట్ సేవ అందామా?
పాలకకార్పొరేట్ సేవ అందామా?
అదానీలు,అంబానీలు...28
మందిఉన్నారు.కార్పొరేట్లు! రాజకీయ పార్టీలకు కోట్లు కోట్లు దానాలు (డొనేషన్లు)
ఇచ్చి నెం.వన్ సేవకులైపో
యారు.అందుకు ప్రతి ఫలం
గా నాయకులు దేశాన్ని వా
ళ్ళకు తాకట్టు పెట్టటమో
లేక అమ్మేయటమోచేస్తారు
-అదివేరే విషయం!ఇదంతా
రాజకీయ సేవ,కార్పొరేట్
సేవ...ఒక్కమాటలోదేశసేవ
రెండవసేవ దైవసేవ!ఇదేమీ
చిన్నతరహా సేవకాదు! నిత్యాన్నదానాలతో, బ్రహ్మో
త్సవాలతో,ఘృత,పాల,తై
లాభిషేకాలతో...దేవుడు
వెలిగిపోతూ ఉంటాడు.ఇం
కా ఆదైవాన్ని ఎన్ని రకాల
సేవలతో అలరిస్తారో..తిరు
పతి దేవస్థానం ప్రధాన పూ
జారిని అడగండి.దైవసేవలె
న్ని రకాలో వారు బాగా
చెపుతారు.సేవాకైంకర్యాన్ని
ఎక్కడ దాస్తారోకూడా చెపు
తారు.
వీళ్ళంతా దేశానికి,దేవుళ్ళ
కి దానాలు చేసి తమ 'సేవ'
ను ఋజువు చేసుకున్నారు
ఈ దేశంలో సంపాదించటం
తెలిసిన ప్రతివాడుసేవకుడే
ఈమధ్యవాట్సాప్ లో.. సేవకి,ఉద్యోగానికితేడాచెపుతూరాజకీయ నాయకులు సేవకులా?ఉద్యోగస్తులా?అనిప్రశ్నించారు.
సేవకులైతే పైసా తీసుకోకుం డా చేసేదేసేవ!మరి వీళ్ళకి రాయలటీలు,పెన్షనులు ఎందుకోటెలిఫోను,కరెంటు .... లక్షలకోట్లసౌకర్యాలు ఫ్రీ! ఎందుకో!దీనిని 'సేవ' అం టారా?
పోనీ'ఉద్యోగం'అనుకుంటే..
ఈ రాజకీయ ఉద్యోగానికి
అర్హత లేంటి?ఏ డిగ్రీ పాస్
అవ్వాలి? పరీక్షలు ఎక్కడ
రాయాలి?వీళ్ళకు ఇలాంటి
వేవి అక్కర్లేదు.వాడిదగ్గర
డబ్బు,దబాయింపు,వెనకాల ఒక'ముఠా'ఉంటేచాలు.
ఏంటో ఈ లోకం!
అందరూ ఈదేశానికి- సేవ చేసేవాళ్ళే!ఒక్క 'దరి
ద్రుడు' తప్ప!
వీళ్ళు ఎంతసేవచేస్తున్నా
దేశంలో 'దరిద్రం' ఎప్పటికీ
పోదు.పోదూ..పోకూడదు.
ఏపార్టీవాడొచ్చినా..అందరూ ఇళ్ళు కట్టేవాళ్ళే! డెబ్భై
ఐదేళ్ళుగా వీళ్ళు కట్టిన ఇళ్ళు ఊరిచివర మూలుగు
తున్నాయి.
ఇంకా అభివృద్ధి సంక్షేమ
పథకాలు పెట్టేస్తారు.డబ్బు
లు పంచిపెట్టేస్తారు.ఎలక్షన్ల
ప్పుడు ఓట్లు ఎన్ని కోట్లైనా
కొనేస్తారు.అంతామహోన్న
త సేవ!
వీళ్ళ సేవల్నిచూసి విద్యా
సేవకులు,వైద్యసేవకులు..
వీళ్ళు వాళ్ళని లేదు..అబ్బో
...సాహితీ సేవకులు,ఆథ్యా
త్మిక సేవకులు...ఎందరో
సేవకులు అందరికీ వందనా
లు!
సేవచేసే 'ఛానల్'దొరకాలే
కాని ...లక్షలకోట్ల సేవ!మీకు
కూడా ఇలాంటి ఆలోచనలు
కలుగుతున్నాయా?మీలో
'సేవాభిలాష'ఉండాలేకాని
మీరూ 'పేద్ద'సేవకులు ఐపో వచ్చు! ఏమంటారు?
**********
-తమ్మినేని అక్కిరాజు
హైదరాబాద్
17-2-2023
No comments:
Post a Comment