*భ్రష్టస్య కావా గతి*
*రాజులు జూద ప్రియులు. భోజరాజు జూదమాడేవాడు. అదొక వ్యసనంగా మారింది. ఆయన భార్య లీలావతి యిక భరించలేక ఆయనచేత యెలాగైనా ఈ వ్యసనం మాన్పించమని కాళిదాసును కోరింది.*
*కాళిదాసు భిక్షువు వేషం వేసుకొని దండ కమండలాలు ధరించి భోజుడు జూదశాల కు పోయే మార్గములో ఒక మాంసపు అంగడి దగ్గర మాంసము బేరమాడు తున్నాడు.*
*భోజుడది చూసి ఆశ్చర్యముతో అతనిని సమీపించి…*
*”భిక్షో మాంస నిషేవణం కిముచితం”*
*”ఓ సన్యాసీ!! యోగులకు మాంసము నిషేధము కదా! యిదేమి మీరు మాంసమును బేరమాడుచున్నారు, యిది తగునా...”*
*భిక్షు:- “కిం నేనా మద్యం వినా...”*
*“మాంసమేనా దీనితో పాటు మద్యము కూడా వుండవలెను కదా!”*
*భోజ:- “మద్యం చాతీవ ప్రియం”*
*”మద్యము కూడా త్రాగుతారా...”*
*భిక్షు:-“ప్రియమహో వారాంగనా భీస్సః”*
*”వారకాంతలతో కలిసి త్రాగుట నాకు చాలా యిష్టము.”*
*భోజ:-“వారస్త్రీ రతయే కుతః తవ దనం”*
*”భోగ స్త్రీలకిచ్చుటకు నీకు ధనమేక్కడిది”*
*భి:- “చౌర్యేణ ద్యూతేనవా”*
*”దొంగతనముచేతను, ,జూదము చేతను సంపాదించెదను.”*
*భోజ:- “చౌర్య ద్యూత పరిశ్ర యౌస్తి భవతాం...”*
*”మీరు దొంగతనము చేస్తారా, జూదము కూడా ఆడుతారా,” అని అడిగాడు ఆశ్చర్యంగా.*
*భి:- “భ్రష్టస్య కావా గతి?”*
*”చెడిపోయిన వాడికి వేరు గతి ఏమున్నది?”*
*శ్లోకం పూర్తయింది, అనిపించింది రాజుకు*
*భిక్షో మాంస నిషేవణం కిముచితం?*
*కిం తేన మద్యం వినా*
*మద్యం చాపి తవ ప్రియం?*
*ప్రియమహో వారాంగనాభి స్సహ!*
*వారస్త్రీ రతయే కుతః తవ దనం?*
*ద్యూతేన చోరేణవా*
*చౌర్య,ద్యూత పరిశ్రమాపి భవతాం?*
*భ్రష్టస్య కావా గతిః*
*భోజరాజు కాళిదాసును గుర్తించాడు. కాళిదాసు భోజరాజుకు.. “మీకిది తగదు మహారాజా!” అని నచ్చ చెప్పాడు. రాజు సిగ్గుపడ్డాడు. అతని మనో భావం గ్రహించాడు. “యిప్పటి నుండీ జూదము ఆడన”ని ప్రమాణం చేశాడు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment