*HOW TO HELP OTHERS? | EXCERPTS FROM DIVINE DISCOURSE | DATE 17-02-1996 .*
*ప్రేమ స్వరూపులారా!!!*
*సహాయం అంటే ఏమిటి? ఒక చిన్న ఉదాహరణం. మీరందరు కూడను బస్సుల్లో వస్తుంటారు, ట్రైనుల్లో వస్తుంటారు, ఇంకేవిధమైనటువంటి వాహనాల్లో వస్తుంటారు. అయితే ఆ ట్రైన్ లో వచ్చే సమయంలోనో, బస్సులో వచ్చే సమయంలోనో, ఏ విధంగా హెల్ప్ చేయడం? ఏ విధమైన సహాయం చేయడం? ఆ బస్సులో వృధ్ధులో లేక స్త్రీలో సీటు చిక్కక నిలుచుకోని ఉంటారు. అలాంటి సమయంలో నీవు సీటులోంచి లే, వాళ్ళకు ఆ సీటు ఇచ్చేయి.*
*చిన్న పిల్లలు ఉంటుంటారు, వాళ్ళు కూడా కూర్చోడానికి స్థలం ఉండదు, వాళ్ళకా సీటు ఇచ్చేయి, నువ్వు లేచి నిలుచుకో. ఇలాంటి సహాయాలు ఎన్నైనా చేయొచ్చు మన జీవితంలో. ఈనాడు, ముఖ్యంగా యువకులు చేయవలసినటువంటి సేవ ఇది.*
*బస్సులో కూర్చొంటారు, ఇంకా రెండు సీట్లను ఆక్రమిచుకుంటారు, స్త్రీలో, వృధ్ధులో ఎవరైనా వస్తే, వారు నిలుచుని బాధపడుతుంటే వీళ్ళు చూచి నవ్వుతుంటారు. ఈ నాటి మానవుని యొక్క గుణములంతా ఈ విధముగా ఉంటున్నాయి.*
*సినిమాలో కష్టపడేటువంటి వారిని చూస్తే, కంటి నీరు కార్చిపోతారు. సినిమా పిక్చరులో ఉండేటువంటిదాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. ప్రత్యక్షంగా బాధపడుతున్నటువంటి వారిని చూసి వెక్కిరిస్తారు. ఇదా మానవుల యొక్క లక్షణం?*
*ఇది కాదు, ఎక్కడైనా దయ దయనే! అందరి యందు మనం COMPASSION చూపాలి. *ఈ COMPASSION చూచుకోకుండా పోవడం చేతనే, ఇప్పుడు COMPASSION లేకుండా పోవడం ఒక FASHION అయిపోయింది! మనకు FASHION కాదు COMPASSION కావాలి.* ఈ విధమైనటువంటి KIND అంటాము, MAN KIND అంటాము. MAN ఉన్నాడు కానీ KINDNESS లేదు. MAN అంటే ఎవరు? KINDNESS ఉన్నటువంటివాడే MAN. అందువలనే "MANKIND" అన్నారు.*
*ఈనాడు KINDNESS లేదు. కనుక, ఆ కరుణను ఈ నాడు మనము అభివృధ్ధి పరుచుకోవాలి. ఆ దయను ఈనాడు పెంచుకోవాలి. ఇదియే మన జీవితానికి మంగళకరమైనటువంటినది. ఎక్కడకు పోయినప్పటికిని విద్యార్ధులు ఉంటుంటారు, ఎక్కడైనా ఎవరో కొంచెం అశాంతిగా, కొంచెం బాధలు పడుతుంటారు. కానీ, అట్టివారికి తగిన సహాయం మనము చేయాలి.*
No comments:
Post a Comment