Friday, June 28, 2024

 🔔 *సత్సంగం* 🔔

*“తాతా రోజూ నువ్వు కుళాయి నీళ్లతో స్నానం చేస్తున్నావ్ కదా! మరి అలా చేస్తున్నప్పుడు ‘ఓం గంగైచ యమునై చైవ - కృష్ణా గోదావరీ సరస్వతి  నర్మదా సింధు కావేరీ -* *జలేస్మిన్ సన్నిధిం కురు’*
*అని ఎందుకు చదువుతావు ?*
*నువ్వేమి గంగ నీటి తోనో గోదావరి నీటి తోనో స్నానం చెయ్యడం లేదు కదా?” అని అడిగాడో గడుగ్గాయి తన తాతని.🕉️🙏*

*🕉️🙏“మంచి ప్రశ్న వేశావు. సరే జవాబు విను.” అంటూ తాత ఇలా చెప్పుకొచ్చారు….🕉️🙏*

*🕉️మన పూర్వీకులు ఏ పని చేసినా ఒక ఆశావహ దృక్పధం అంటే పాజిటివ్ ఆలోచనతో చేస్తే ఆ పని ఫలితం కూడా పాజిటివ్ గా వుండే అవకాశం* *మెరుగుపడుతుంది అని తెలుసుకొని  మన రోజూ వారీ జీవనవిధానంలో కూడా అలా పాజిటివ్ గా ఆలోచించే విధంగా కార్యక్రమాలులో  లేదా* *అలవాట్లులో  చొప్పించారు.* 
*మీ మామ్మ చూడు..*
*“బియ్యం అయిపోయాయి” అని చెప్పదు. “నిండుకున్నాయి” అని అంటుంది. అలాగే “దీపం ఆరిపోయింది” అనదు, “ఘనం అయింది” అనో, “దీపం* *కొండెక్కింది” అనో అంటుంది.*
*నల్ల పూసల గొలుసు లేదా మంగళ సూత్రం  తెగితే..* *“గొలుసు పెరిగింది” అంటుంది. కానీ “తెగింది” అని అనదు. ఇలా ప్రతీదీ పాజిటివ్ గానే చెపుతుంది తప్ప నెగటివ్ గా చెప్పదు.🕉️🙏*

*🕉️🙏ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న తీసుకుంటే.. మనకి గంగ యమునా గోదావరి వంటి నదులను పవిత్రంగా భావిస్తాం వాటిని దైవాలుగా కూడా కొలుస్తాం వాటి నీరు వాడుక కూడా ఆరోగ్యంగా భావిస్తాం. కానీ అన్ని ప్రదేశాల్లో ఆ పవిత్ర నదులు ఉండవు కదా! అందుకే అసలు నీటికే గంగమ్మ అని పేరు పెట్టేసుకున్నాం. అలాగే నీటితో జీవితాలు పెనవేసుకున్న బెస్తవారిని గంగపుత్రులు అంటాం. అంటే గంగ వంటి పవిత్ర నదులు మన జీవితాల్లో ఎంతగా పెనవేసుకున్నాయో చూశావు కదా! 🕉️🙏*

*🕉️🙏నేను కుళాయి నీళ్లతోనో, చేరువులోనో, యేటి నీళ్ల తోనో స్నానం చేస్తున్నప్పుడు కూడా ఈ శ్లోకం పఠించో లేక ఒక దండం పెట్టో ఆ నీటిని పవిత్ర గంగజాలంగా భావించి స్నానం చేస్తున్నాను అన్న మాట. అలా భావించడం వల్ల మనం మానసికంగా ఒక పాజిటివ్ థాట్ని శరీరానికి ఇస్తున్నాం. అంటే ఈ నీరు పవిత్ర గంగాజలంతో సమానం. “నా ఆరోగ్యానికి హాని కలుగకుండు గాక” అని…!🕉️🙏*

*🕉️🙏అంటే అలా అనేసుకుంటే అవి నిజంగా గంగ, గోదావరి నీళ్ళు అయిపోతాయా తాతా అని నువ్వు అడగవచ్చు.. దీనికి నేను ఉదాహరణ చెపుతాను.🕉️🙏*

*🕉️🙏మా చిన్నప్పుడు రైల్లో వెళుతున్నప్పుడు తాగడానికి నీరు ఇలా మినరల్ వాటర్ బాటిల్స్ లో దొరికేది కాదు.. ప్లాట్ ఫామ్స్ మీద కుండలతో ఆ తరువాత కుళాయిలు ఆ తరువాత కూలర్స్ లో అందించేవారు. అదే నీరు భయపడకుండా తాగేవారం.  ఇప్పుడు (చేతిలో కాస్త డబ్బు ఉంటే) ఆ నీరు తాగడానికి భయపడుతున్నాం. అందుకని ₹20 పెట్టి ఒక లీటర్ నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం. మరి ఆ సీసాలో దొరికే నీళ్లు నువ్వు ప్రతీ సారీ టెస్ట్ చేసి తాగవు కదా! ఆ సీసా మూత సీల్ సరిగ్గా ఉంటే ఏ అనుమానం లేకుండా తాగేస్తున్నావ్. మరి ఆ కంపనీ వాడు ఆ సీసాల్లో ఏ బోర్ నీళ్ళో, చెరువు నీళ్ళో పోసి ఉండచ్చు కదా! అలాగే ఈ మధ్య వింటున్నాం ప్లేట్ ఫార్మ్ మీద దొరికే ఆ ఖాళీ బాటిల్స్ లో సాధారణ కుళాయి నీరు పోసి దొంగ సీల్ వేసి ట్రైన్స్ లో అమ్ముతున్నారు అని. అయినా మనం అనుమానం పడకుండా తాగుతున్నాం. అంటే దానికి కారణం ఆ సీసా మీద ఉన్న బ్రాండ్ పేరు. అంటే ఆ నీటికి కంపనీ వాడు ఒక బ్రాండింగ్ చేసాడు. నిజంగా టెస్ట్ చేయకపోయినా ఆ పేరు చూసే మనం ఆ నీటి క్వాలిటీ నమ్ముతున్నాం. అంటే మనసుకి ఒక ధైర్య వచనం చెపుతున్నాం. నేను తాగుతున్న నీరు ఫలానా కంపెనీ స్వచ్ఛమైన నీరు. ఈ నీరు తాగినా నాకు అనారోగ్యం రాదు అని. ఒక వేళ ప్రయాణంలో కానీ ప్రయాణం అయ్యాక గాని సుస్తీ చేసినా ఈ నీటి వల్ల అని అనుమానించం. అంటే అక్కడ నువ్వు ప్రతీసారీ టెస్ట్ చేయకపోయినా నమ్ముతున్నావ్. అంటే ఇక్కడ ఆ బ్రాండింగ్ నీకు ఒక పాజిటివ్ ఆలోచనని ఇస్తోంది అన్నమాట.🕉️🙏*

No comments:

Post a Comment