*ఇదేం బాలేదు వెంకన్న...*
తిరుమల వెంకన్న
నువ్వెంత గొప్పోడివయ్యా
నగలు పోయినా మాట్లాడవు...
తిరుమల వెంకన్న
నువ్వెంత సహనవంతుడివయ్యా
నీ హుండీ సొమ్ము ఊడ్చినా ఊరుకున్నావు...
తిరుమల వెంకన్న
నువ్వెంత శాంతుడివయ్యా
లడ్డులో మాంసకృతులు కలిపిన మౌనంగా ఉన్నావు...
తిరుమల వెంకన్న
నువ్వెంత నిగ్రహపరుడివయ్యా
అపచారాలు అధికమైన ఆగ్రహం రాకుండా చూస్తున్నావు...
ఈ కలియుగ మనుషులను చూసి చూసి
వారి చేతకాని తనం
ధర్మం గురించి పట్టనితనం
నిలువెత్తు నిర్లక్ష్యం
మనిషి మోసపూరిత వాసన గుణం నీకు కూడా సోకిందా ఏమిటి వేంకటేశా...
మాకు మాత్రం ఈ వార్త చెవులలో జీర్ణం కాకున్నది
నోటిలో మాటను చంపేచింది
కళ్ళలో నీళ్ళను నింపేచింది
కడుపులో దేవినట్టుంది
మనసుని పిండేసినట్టుంది
అయ్యా వెంకన్న నువ్వు ఎట్టా భరిస్తున్నావో కానీ
నిన్నే నమ్ముకున్న నీ నిజాయితీ భక్తులం భరించలేకపోతున్నాం...
*ఆపదమొక్కుల వెంకన్నా....*
ఎందుకీ మౌనం...
కలియుమని జాలిచూపా
కల్తీ మనుషులు
కల్తీ భక్తులు
కల్తీ మొక్కలు కనుక
కల్తీ లడ్డులు అని సర్దుబాటా...
*ఏమోనయ్యా నీ లీలా...*
*మా మనసులు మాత్రం చింతాక్రాంత మాల...*
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment