_*మనసుకు ముందే తెలుసు*_
✍️ శ్రీ V.V.S. కామేశ్వరరావు
🙏🥀🌹🌻🪷✳️🌻🪷🥀🌹🙏
🪷 ఆధ్యాత్మిక జీవనం ఎంత 'ఆనందకరమో అంతక్లిష్టం♪. అడుగడుగునా సందేహాలు ఎదురవుతూ ఉంటాయి♪. ఒక గురువు ఉపదేశంతో నడచినా, సనాతన వాఙ్మయంలోని ధర్మసూక్ష్మాలను అనుసరించినా... సంసార గమనంలో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు♪. అధ్యయనం, సాధన పెరిగే కొద్దీ ధర్మవిచక్షణ విశ్లేషణాత్మకంగా మారుతుంది♪. తమకు తాము అనుసరించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శకంగా నిలబడవలసి ఉంటుంది♪. ఈ పరిక్రమలో సద్గురువులు, సద్గ్రంథాలు అవశ్యంగా కావాలి♪.
✳️ _*వివేకవంతుడయ్యే మార్గం*_ 💐
🪷 నిత్యం సంఘర్షణ తప్పదు. ప్రతి మనిషి ఆశతోనే జీవిస్తాడు♪. ఆశ వెనుక స్వార్థం నిలబడి ఉంటుంది♪. త్రిగుణాలు ఆక్రమించుకోవడానికి నిలిచి ఉంటాయి♪. స్వార్థపు ఆలోచనలు భౌతిక, మానసిక శక్తిని హరించివేస్తాయి♪. కోరికల పడగ ఎల్లవేళలా బుసకొడుతూ ఉంటుంది♪. అరిషడ్వర్గాలు లొంగ దీసుకోవడానికి పొంచి ఉంటాయి♪. కుటుంబంలోని వారి ఆశలు, అభిప్రాయాలు యజమానిని నియంత్రిస్తాయి♪. వీటన్నిటినీ అతిక్రమించి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడ వలసిన బాధ్యత... ఆధ్యాత్మిక జీవనాపరులకు ఒక ఆభరణం♪.
🪷 గంభీరమైన జీవిత గమనం ఒక్కొక్కసారి భయంకర నిశ్శబ్దంతో నిండిపోతుంది♪. మరొకసారి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది♪. ఏకాంతం కోరుకున్నా, మనసనే పదార్ధం గందరగోళ పరుస్తుంది♪. అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా చురుకుగా తన బుద్ధిని పనిచేయించ గలిగేవాడు... ఎడారి నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని సద్వినియోగ పరుస్తాడు♪. అహంకార చిత్తాలను లొంగదీసుకొని ఆత్మనిగ్రహంతో నిలబడతాడు♪. అటువంటివాడే ఆదర్శవంతుడు, వివేకవంతుడు అవుతాడు♪.
✳️ _*సత్యం బోధపడుతుంది*_ 💐
🪷 అపాత్రదానం, దుష్టులకు శరణాగతిని ఇవ్వడం, స్నేహాన్ని వంచనల వలయంలోకి నెట్టడం మొదలైన విషయాల వల్ల పుణ్యం కంటే పాపమే చేరువ అవుతుంది♪. కాబట్టి, జాగరూకులై మెలగాలి♪. ప్రతి మనిషిలోనూ జ్ఞానం అంతర్గతంగా పనిచేస్తూ ఉంటుంది♪. అయితే, రజోగుణ, తమోగుణ ప్రభావం వల్ల మనసును మాయ ఆవరిస్తుంది♪. జ్ఞానాన్ని మరుగున పడేస్తుంది♪.
🪷 విశ్వంలో భూమి ఉనికిని తెలుసుకున్న తరువాతే జీవి ఈ ప్రకృతిలో ప్రవేశిస్తుంది♪. మనసుకు విశ్వరహస్యం ముందే తెలుసు♪. మనసు నుండే విజ్ఞానం పరిఢవిల్లింది♪. మంచి చెడుల విచక్షణా జ్ఞానం, మానవజన్మ గమ్యం మొదలైనవి మాత్రం... అనంత జ్ఞానకేంద్రం అయిన అంతరాత్మ మీద గల ఆచ్చాదనను తొలగించినపుడు మాత్రమే తెలుస్తుంది♪. అపుడే అసలైన విషయం తెలుసుకున్నాడు అనవచ్చు♪.
🪷 గొప్ప రహస్యం ఏమిటంటే... నిత్యముక్తులైన ఆత్మ స్వరూపుల ఉనికి వల్లనే మానవజాతి ఆధ్యాత్మిక - అభివృద్ధి ఆధారపడి ఉంటుంది♪. వీరు మాత్రమే అలౌకిక దృశ్యాలను ఆవిష్కరించగలిగే శక్తిని కలిగి ఉంటారు♪. అటువంటి వారు పుట్టుకతోనే జీవన్ముక్తులై ఉంటారు♪. కానీ సాధారణ మానవుల వలె కనిపిస్తారు♪. అటువంటి వారి సాంగత్యంలో జ్ఞానం దీపంవలె ప్రకాశిస్తుంది. సత్యం బోధపడుతుంది♪.
🪷 అయితే, అన్నింటికీ దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి♪. ఎవరైతే మనోవాక్కాయాలలో పవిత్రతను కలిగియుంటారో, పరమాత్మ మీద తీవ్రభక్తి కలిగి ఉంటారో... నవవిధ భక్తి మార్గాలను పరిపూర్ణం చేసుకుంటారో... . శుద్ధ జపధ్యానాదులు సాధన చేస్తారో... అటువంటి వారి మీద భగవంతుని అనుగ్రహం కురుస్తుంది♪. వారు ధర్మాధర్మ విచక్షణా శక్తిని కలిగి ఉంటారు♪. జగన్మాయలో పడకుండా నిలబడతారు♪. ఆత్మానుభూతిని పొందుతారు♪.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు*
🚩 హిందువుగా జీవించు
సేకరణ:
🙏🥀🌹🌻🪷✳️🌻🪷🥀🌹🙏
No comments:
Post a Comment