Sunday, January 25, 2026

మనస్సులో ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది || ఆత్మలో ఉన్నవాడికి ఆనందం ఉంటుంది

మనస్సులో ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది || ఆత్మలో ఉన్నవాడికి ఆనందం ఉంటుంది

https://youtu.be/3soM1q2fO4s?si=j5GPsX-xCNTcp2CQ


https://www.youtube.com/watch?v=3soM1q2fO4s

Transcript:
(00:02) అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం మనసులో ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది. ఆత్మలో ఉన్న వాడికి ఆనందం ఉంటుంది. టైటిల్ ఇంకోసారి వినండి మనసులో ఉన్నవాడికి దుఃఖం ఉంటుంది. ఆత్మలో ఉన్నవాడికి ఆనందం ఉంటుంది. సో మనం విషయంలోకి వెళితే మనసుతో ఉన్నది ఎవరు? మరి ఆత్మలో ఉన్నది ఎవరు అనే విషయానికి మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం మిత్రులారా మిత్రులారా మనం ఈ యొక్క ఈ ప్రపంచంలో ఉన్న సగటు మనుషులను తీసుకోండి వారంతా మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్య మమ్మల్ని బాధిస్తుంది నా దగ్గర డబ్బు లేదు లేదంటే నా దగ్గర అందం లేదు
(00:57) సమస్యలు అనేక రకాల సమస్యలు సమస్యలు ఉంటాయి. కొన్ని వేల రకాల కారణాలు ఉంటాయి. ఇట్ డజంట్ మేటర్ సమస్యలు ఏది ఏది అన్నది ఇట్ డజంట్ మేటర్ కారణం ఏమిటి అన్నది డజంట్ మేటర్ కానీ ఈ సగటు మనుషులను తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ. ఈ బాధ లేని మనిషి అన్న అనేవాడు ఈ యొక్క సగటి మనుషులలో తీసుకుంటే నీకు ఎక్కడా కనిపించడు.
(01:28) వాడికి డబ్బు ఉందా అన్నది డసంట్ మేటర్ పేరు ప్రతిష్టలు ఉన్నాయా లేదంటే ఈ దేశంలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా డసంట్ మేటర్ వాడికి ఏదో ఒక సమస్య ఏదో ఒక బాధ అనేది ఉంటుంది నేను చెప్పేది సగటు మనుషుల గురించి కారణం ఏమిటి వాడు కేవలం మనసులో ఉన్నాడు మానసిక క్షేత్రంలో ఉన్నాడు మానసిక క్షేత్రంలో మనసు అనే ఆ యొక్క కేంద్రంలో ఉన్నంతవరకు నీకు దుఃఖం తప్పదు అది ఏ కారణం కారణమైనా కావచ్చు చాలా స్వల్పమైన తేలికైన చిన్న కారణం కూడా నిన్ను విపరీతమైన బాధకు గురి చేయవచ్చు కారణం నువ్వు మనసు అనే స్థాయిలో ఉన్నావు బాధ అన్నది కేవలం మానసిక క్షేత్రంలోనే ఉంటుంది. మనసు స్థాయిలో మనసుతో నిండి
(02:14) ఉన్నవాడు ఎన్నటికీ దుఃఖం నుండి విముక్తి కాలేడు. బాధ నుండి విముక్తి కాలేడు. ఒక బుద్ధుని తీసుకోండి. మిగతా జనాలకు సగటు మనుషులకు ఉన్న జనాలకు ఉన్నటువంటి సమస్యలే బుద్ధుడికి ఉంటాయి కానీ బుద్ధుడు చిరునవ్వుతో ఆనందంతో సంపూర్ణమైన ఆ యొక్క స్థిరత్వంతో ఉంటాడు కారణం బుద్ధుడు ఉన్న ఆ యొక్క స్థితి వేరు అతడు ఆత్మ స్థితిలో ఉన్నాడు అతడు ఆత్మలో ఉన్నాడు ఆత్మలో స్థిరపడిపోయాడు కానీ మిగతా సగటు మనుషులంతా కేవలం మానసిక క్షేత్రంలో మనసులో ఉన్నారు.
(02:48) మనసు అనే మాయలో ఉన్నారు. సో మానసిక క్షేత్రంలో ఉన్నంత కాలం నీకు దుఃఖం తప్పదు నువ్వు నీ యొక్క కారణాలకు అంటే దుఃఖానికి సంబంధించిన కారణాలకు పరిష్కారాలను నువ్వు కనుక్కున్నప్పటికీ ఉదాహరణకు ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుక్కుంటావు అక్కడితో నీ దుఃఖం అంతమవుతుందా అంతం కాదు ఇంకో కొత్త సమస్య ఉంటుంది. అలాగే మళ్ళీ కొత్త పరిష్కారం వెతుకుతావు.
(03:19) ఆ పరిష్కారం దొరికిన తర్వాత మళ్ళీ బాధ అన్నది తొలగిపోతుందా తొలగదు సో కొన్ని లక్షల సమస్యలకు కొన్ని లక్షల పరిష్కారాలు చూపినప్పటికీ నీలో దుఃఖం అన్నది అంతం కాదు కారణం నువ్వు మానసిక క్షేత్రంలో ఉన్నావు మనసు అనే స్థాయిలో ఉన్నావు దుఃఖానికి అంతం ఏమిటి ఒక బాధ కలిగినప్పుడు దానికి నివారణ అంటే ఒక సమస్య కలిగినప్పుడు దానికి పరిష్కారం చూపడంతోనే ఆ దుఃఖాన్ని ఆ దుఃఖం నుండి నువ్వు విముక్తి చెందావని నువ్వు భావించావంటే నీకంటే అజ్ఞాని ఇంకొకడు ఉండడు.
(03:53) కొన్ని వందల సమస్యలు ఉంటాయి కొన్ని వేల సమస్యలు ఉంటాయి వాటన్నిటికీ నువ్వు పరిష్కారాలు చూసుకుంటూ పోతే వాటికి అంతమన్నది ఉండదు. సమస్యలకు అంతం ఉండదు పరిష్కారాలకు అంతం ఉండదు ఈ విధంగా నువ్వు సమస్యలు పరిష్కారము సమస్యలు పరిష్కారం అనే ఆ యొక్క ఆటలోనే కొనసాగుతూ ఉంటావు నీ యొక్క జీవితాంతం. నువ్వు పరిష్కారాన్ని చూపినప్పుడు మళ్ళీ కొత్తది ఉద్భవిస్తుంది సమస్య మళ్ల దానికి కొత్త పరిష్కారం మళ్ళీ ఇంకొకటి సమస్య ఈ విధంగా వీటికి అంతం ఉండదు కారణం నువ్వు మానసిక క్షేత్రంలో ఉన్నావు మనసు అనే స్థాయిలో ఉన్నంత కాలం నీకు దుఃఖము తప్పదు.
(04:30) దుఃఖం అన్నది సమస్యలలో లేదు. నువ్వు ఉంటున్న స్థితిలో ఉంది. ఎటువంటి సమస్యనైనా ఎటువంటి సమస్య అయినా అది ఎక్కడి వరకు చేరుకుంటుంది? నువ్వు మానసిక క్షేత్రంలో ఉంటే అది మనసులో చేరుకుంటుంది. అన్ని సమస్యలు అన్ని దుఃఖాలు కేవలం మనసు అనే స్థాయి వరకే చేరుకుంటాయి ఆత్మ స్థితికి చేరుకోలేవు. దుఃఖం అన్నది కేవలం మనసులోనే ఉంది మిత్రులారా మీరు ఆత్మ స్థితిలో నెలకొని ఉంటే ఎటువంటి సమస్య అన్నది ఆత్మ స్థితి వరకు చేరదు.
(05:06) దుఃఖం అన్నది కేవలం మనసులోనే ఉన్నది. నువ్వు మనసును తుడిచివేయగలిగితే ఇక దుఃఖం అన్నది ఉండదు సమస్య ఉదయించదు అంటే సమస్యలు పుట్టవని కాదు నువ్వు ఎటువంటి సమస్యలు పుట్టిన నువ్వు ఆ సమస్యల యొక్క ప్రభావం అన్నది నీపై పడదు కారణం నువ్వు ఆత్మ స్థితిలో ఉంటావు కాబట్టి మానసిక క్షేత్రంలో ఉంటే కచ్చితంగా ఆ యొక్క దుఃఖం ఆ యొక్క సమస్యల తాలూకు దుఃఖం ఆ ప్రభావం నీ పై పడుతుంది కారణం నువ్వు మానసిక క్షేత్రంలో ఉన్నావు కాబట్టి కానీ ఆత్మ స్థితిలో ఉన్నవాడు ఒక బుద్ధుడు ఒక రమణుడు ఇప్పుడు ఒక రామకృష్ణుడు ఉన్న స్థితిలో ఉన్నవానికి ఏ సమస్య అన్నది తన
(05:42) ఆత్మ స్థితి వరకు చేరుకోవు అందుకే మీరు చూడండి రమణ మహర్షుల వారికి క్యాన్సర్ వచ్చింది కదా శ్రీరామకృష్ణునికి వచ్చింది కదా కానీ వారు ఉంటున్నది ఆత్మ స్థితిలో ఉన్నారు మానసిక క్షేత్రంలో లేరు వారు మీరు సగటు మనిషికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి వాడు విలపిస్తాడు వేదన చెందుతాడు గుండెలు బాదుకుంటాడు కారణం వాడు మానసిక క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ దుఃఖం తాలుకు కు ప్రభావం వాడిపై పడుతుంది కానీ ఒక రమణుని చూడండి అతడికి అంత క్యాన్సర్ వచ్చినా కూడా అతడు అతడిలో సంపూర్ణమైన నిశ్చల స్థితి ఆనంద స్థితి అన్నది చెక్కు చెదరలేదు కారణం అతడు ఉంటున్న స్థితి వేరు అది ఆత్మ స్థితి
(06:24) అందుకే నేను దుఃఖానికి అంతం ఉందా అంటే నువ్వు మానసిక క్షేత్రంలో ఉన్నంతవరకు అది అంతం ఉండదు దానికి నువ్వు ఎన్ని పరిష్కారాలు వెతికినా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన ఇంకా ఎవరైనా మానసిక నిప్పుల దగ్గరికి వెళ్ళిన వారు కేవలం తాత్కాలిక ఉపశమ ఉపశమనాలు మాత్రమే నీకు ఇవ్వగలరు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపలేరు కారణం వారు కేవలం చెట్టు యొక్క కొమ్మలు మాత్రమే నరుకుతున్నారు ఒక కొమ్మ నరుకుతే ఇంకో కొమ్మ ఉద్భవిస్తుంది కానీ ఇక్కడ నువ్వు సాధన చేసి నువ్వు నీ యొక్క ఆత్మ స్థితిని నువ్వు చేరుకోగలిగితే ఆ స్థితిలో నువ్వు స్థిరపడగలిగితే మనసు యొక్క వేర్లను తెంచివేయవచ్చు
(07:05) మనసు అనేది నశి స్తుంది ఇక ఉద్భవించదు కానికి అంతం అంటే కేవలం నువ్వు ఆత్మస్థితిలో ఉండడం మాత్రమే దానికి మించిన పరిష్కారం ఇంకొకటి ఉండదు ఉదాహరణకు మానసిక క్షేత్రంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకోండి అలాగే ఒక బుద్ధత్వ స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకోండి వారిద్దరిని ఎవరో తిట్టారని ఊహించుకోండి అంటే వారిద్దరిని జనాలు తిట్టారు అవమానించారు వేదనకు గురి చేశారు ఇప్పుడు సగటు మనిషి అంటే మానసిక క్షేత్రంలో ఉన్న మనిషి ఖచ్చితంగా వేదన చెందుతాడు, బాధ పడతాడు.
(07:41) తీవ్రమైన దుఃఖానికి గురి అవుతాడు. కానీ అవే తిట్లు తిన్న బుద్ధత్వ స్థితిలో ఉన్నవాడు తనలో ఉన్న స్థిరత్వాన్ని కోల్పోలేడు. తనలో ఉన్న ఆనందాన్ని కోల్పోలేడు. కారణం తను ఉంటున్న స్థితి డిఫరెంట్ అది ఆత్మ స్థితి. అలాగే సగటు మనిషి ఉంటున్న స్థితి అది మానసిక స్థితి. అందుకే మిత్రులారా మనం ఏదైనా సమస్య వచ్చిందని మనం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడం మూర్ఖత్వం.
(08:14) కారణం సైకియాట్రిస్ట్ గాని ఎవరైనా సమస్యకు పరిష్కారం చూపేవారు గాని ఏమని చెబుతారు ఎవరైనా నిందించినప్పుడు నన్ను నన్ను వారు నిందించడం వలన నాకు తీవ్రమైన దుఃఖం కలిగింది. నా మనసులో ఆ బాధ ఉంది అని చెప్పడం జరుగుతుంది కదా. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ యొక్క పరిష్కారకుడు ఏమని చెబుతాడు మిమ్మల్ని వాటిని నువ్వు తీసుకోకు వాటిని నువ్వు మనసులోకి తీసుకోకు అని చెబుతాడు కానీ అది అసంభవం మానసిక క్షేత్రంలో ఉన్నవాడు కచ్చితంగా ఒక అవమానం గాని ఒక సమస్య గాని ఒక దుఃఖం గాని సంభవించినప్పుడు దాని తాలుకు చిహ్నాలు తాను దాని తాలుకు జ్ఞాపకాలు అవన్నీ ఆటోమేటిక్ గా అవి నీ అంతర్గతంగా ఏర్పడతాయి
(08:53) అంటే మనసులో ఏర్పడతాయి మనసు చాలా త్వరగా త్వరగా వాటిని చిత్రీకరించడం జరుగుతుంది తన అంతర్గతంగా నిక్షిప్తం చేసుకుంటుంది మనస్సు అంటే రికార్డు చేసుకుంటుంది అది పదిలంగా దాచుకుంటుంది ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకోండి కానీ బుద్ధత్వ స్థితిలో ఉన్న వాడికి మనసు అనేది ఉండదు కదా రికార్డు అనేది ఉండదు అతడు ఒక వ్యక్తి కాదు సో అక్కడ అహం లేదు అక్కడ చిత్రించుకునేది ఏదీ లేదు శూన్యంగా ఉన్నాడు శూన్యంలో ఎటువంటి అంటే ఎటువంటివి ఉద్భవించవు ఎటువంటివి వి ఏర్పడవు శూన్యాన్ని ఏది తాకలేదు అంటే అంటుకోలేదు ఇప్పుడు మనసును అంటుకోగలదు కానీ శూన్యాన్ని ఎలా అంటుకోగలవు అంటుకోలేవు
(09:37) సో మానసిక క్షేత్రంలో ఉన్నవాడు కచ్చితంగా ఒక అవమానానికి గాని ఒక సమస్యకు గాని ఒక దుఃఖానికి గాని ఏదైనా గురి అయినప్పుడు అవి వాటి ప్రభావం మనసులో ఖచ్చితంగా ఏర్పడుతుంది. మనసుతో నిండిన వాడు కచ్చితంగా దుఃఖించి తీరుతాడు కానీ బుద్ధత్వ స్థితిలో ఉన్నవాడు ఎన్నటికీ దుఃఖించలేడు కారణం అతడు అతీతంగా వెళ్ళిపోయాడు.
(10:01) దుఃఖం కంటే పై స్థితికి వెళ్ళిపోయాడు అంటే మానసిక క్షేత్రం దాటేసి వెళ్ళిపోయాడు. అతడు మనసుకు అతీతంగా ఆత్మ స్థితిలో స్థిరపడ్డాడు. సో అటువంటి వాడికి దుఃఖం అన్నది ఉండదు. కారణం ఇక్కడ సమస్యలు లేవని కాదు. సమస్యలు తనదాకా చేరుకోలేవు. వాటి తాలూకు ప్రభావాలు బుద్ధవ స్థితిలో పడవు ఎందుకంటే శూన్యాన్ని ఏది అంటుకోలేదు కాబట్టి కానీ మనసు అన్నది మనసు అనేది ఒక యంత్రం కచ్చితంగా దాన్ని అంటుకుంటుంది జ్ఞాపకాలు కానీ భావాలు కానీ ఊహలు కానీ ఇవన్నీ ఏర్పరిచేది మనసే సో మనసు అనేది ఒక వస్తువే అది సూక్ష్మమైన వస్తువే సో మిత్రులారా మానసిక క్షేత్రంలో ఉన్నవాడు కచ్చితంగా దుఃఖం అన్నది ఉండి తీరుతుంది.
(10:51) ఇట్ డజంట్ మేటర్ నువ్వు ఎవరన్నది అంటే నేను మహారాజు కొడుకుని లేదంటే నేను అమెరికాలో ఉంటున్నాను లేదంటే నాకు లక్షల కోట్లు ఉన్నాయి లేదంటే నాది ఈ పెద్ద కులం ఏదైనా కావచ్చు మానసిక క్షేత్రంలో ఉన్నవాడికి దుఃఖం తప్పదు. కానీ బుద్ధత్వ స్థితిలో ఉన్న వాడికి వాడు అమెరికాలో ఉన్న గుడిసెలో ఉన్నా ఎక్కడ ఉన్నా డబ్బు ఉన్నా లేకున్నా తన బాడీకి రోగం వచ్చిన ఎటువంటి సమస్యలు వచ్చిన అతడిలో ఆనందం అన్నది కోల్పోవడం అన్నది జరగదు కారణం అతడు ఆత్మ స్థితిలో ఉన్నాడు దేహంలో లేడు మానసిక క్షేత్రంలో లేడు ఆత్మ స్థితిలో ఉన్నాడు కింది మెట్లల్లో ఉన్నవాడికి దుఃఖం తప్పదు
(11:32) అంటే దేహము దేహస్థాయి మానసిక స్థాయి ఆ లెవెల్ లో ఉన్నవాడికి దుఃఖం అనేది తప్పదు కానీ వాటిని మించిన పై మెట్టుకు చేరుకున్నవాడు అంటే ఆత్మస్థితిలోకు ఆత్మస్థితిని చేరుకున్నవాడు అక్కడ స్థిరపడ్డవాడు ఇక దుఃఖం అన్నది అతడిపై ప్రభావం చూపదు. సో అందుకే పరిష్కారం ఏమిటి మా సమస్యలకు పరిష్కారం ఏమిటి అని ఎవరైనా జనాలు అడిగినప్పుడు నువ్వు మానసిక క్షేత్రంలో ఉంటూ పరిష్కారం అడగడం మూర్ఖత్వం పరిష్కారం బయట దొరకదు ఎవరో నీకు నీ యొక్క దుఃఖాన్ని తీసివేయలేరు.
(12:04) కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే వారు చూపగలరు కానీ శాశ్వతమైన పరిష్కారం చూపలేరు. కారణం శాశ్వత పరిష్కారం అనేది నీకు నువ్వుగానే చూపెట్టాలి అది నువ్వు మాత్రమే చేయగలవు. అది ఏ విధంగా పోతుంది నువ్వు సాధన చేసి నీ అంతర్గతంగా నీ యొక్క మానసిక క్షేత్రం నుండి ఆత్మస్థాయికి చేరుకున్నప్పుడు ఖచ్చితంగా నీలో దుఃఖం అన్నది అంతమవుతుంది.
(12:29) అది కేవలం నీకు నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే మీకు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఎవరో చూపిస్తారని ఒక దైవం చూపించలేడు ఒక గురువు చూపించలేడు నువ్వు నువ్వు పూజించే ఆ ప్రార్థన స్థలం నీకు చూపించలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దుఃఖం తప్పదు కానీ నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి నువ్వు ఆశ్రయం పొందాల్సింది ఎక్కడ ఆత్మ స్థితిలో నీ యొక్క అంతర్గతంగా నీ యొక్క నిజస్థితి దాన్ని ఎరుక పొందినప్పుడు దాన్ని నువ్వు గుర్తించినప్పుడు ప్పుడు ఇక నీకు దుఃఖం అన్నది మిగలదు.
(13:06) ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటి దుఃఖానికి బాధలకు సమస్యలకు అంతమన్నది ఉంది. అదేమిటి బుద్ధత్వ స్థితిని పొందడమే నేను మీకు తాత్కాలిక ఉపశమనాలు ఇవ్వడం లేదు. శాశ్వతమైన పరిష్కారాన్ని నేను మీకు తెలుపదలచాను. అది నేనేదో కొత్తగా చెప్తున్నాను అని కాదు. బుద్ధుడు చెప్పాడు, రమణ మహర్షి చెప్పాడు, రామకృష్ణుడు చెప్పాడు బుద్ధత్వ స్థితులను పొందిన వారిని మీరు చూడండి, గమనించండి.
(13:35) మరి వారు ఎంత ఆనంద స్థితిలో ఉంటారు. ఎంత నిశ్చల స్థితిలో ఉంటారు. బుద్ధుడి చుట్టూ కొన్ని వేల మంది జనాలు ఉంటారు. కారణం ఆ జనాలకు సమస్యలే ఉన్నాయి. మరి వారు బుద్ధుడు చుట్టూ ఎందుకు ఉంటున్నారు? బుద్ధుడికి ఎటువంటి సమస్య లేదు. సంపూర్ణమైన, ఆనంద స్థితిలో సంపూర్ణమైన నిశ్చల స్థితిలో ఉన్నాడు. అతడిలో సౌందర్యం.
(13:57) అతడిలో ఉన్న ఆకర్షణ అన్నది మిగతా మనుషులకు లేదు కారణం వారు దుఃఖంలో ఉన్నారు బుద్ధుడు అద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నాడు అదే ఆత్మ స్థితిలో ఉన్నాడు శాశ్వతమైన పరిష్కారం అది ఒక్కటే సో మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన ఎవరైనా సమస్యకు పరిష్కారాలను చూపెడదామని వారి దగ్గరికి వెళ్ళిన అది కేవలం తాత్కాలికమైన ఉపశమనాలు మాత్రమే సో నేను మీకు ఇచ్చే ఇది సలహా అనుకుంటారో మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇట్ డజంట్ మేటర్ కానీ చెప్పడం నా ధర్మం మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధన చేయండి.
(14:36) సాధన చేయగా చేయగా మీలో ఎరుక అన్నది జన్మిస్తుంది సాక్షిత్వం జన్మిస్తుంది. ఒకనాటికి మీరు బుద్ధత్వ స్థితిని గుర్తించడం జరుగుతుంది మీ యొక్క నిజ స్థితిని ఆ యొక్క ఆత్మ స్థితిలో మీరు స్థిరపడడం జరుగుతుంది అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతమైన తీలిక స్థితి, అద్భుతమైన ఆనంద స్థితి. అసలు దుఃఖం తాలూకు సమస్యల తాలూకు ప్రభావాలు అన్నవి ఆ యొక్క స్థితిలో పడవు అని మీరు గుర్తిస్తారు ఇది నేను రుచి చూసే చెబుతున్నాను ఏదో గాలిలో చెప్పడం లేదు సో సాధన అన్నది ఖచ్చితంగా అవసరం మిత్రులారా సాధన లేకుండా ఎరుక జన్మించదు సాక్షిత్వం జన్మించదు చాలామంది
(15:19) చెబుతుంటారు సాధన అవసరం లేదు ఊరికే ఎరుకలో ఉండు సాక్షి సాక్షిగా చూడు అని చెప్తుంటారు కానీ అది చాలా చాలా చాలా మిస్అండర్స్టాండింగ్ అసలు వారికి ఏమాత్రం అవగాహన లేదు సాధన లేకుండా నీలో సాక్షిత్వం జన్మించదు ఎరుక అన్నది పుట్టదు కారణం నువ్వు ఇప్పుడే ఆల్రెడీ మానసిక క్షేత్రంలో ఉన్నావు నీకు మనసు అనే కేంద్రం తయారై ఉంది అహం అనే కేంద్రం తయారై ఉంది నేను ఇది నేను అది నా యొక్క బలగం ఇది నా కుటుంబం నా ఆస్తి నా కులము నా దేశము ఇటువంటి ఇవన్నీ నా యొక్క గుర్తింపు ఇవన్నీ మీ యొక్క మనసు అనే కేంద్రం ఒకటి ఆల్రెడీ తయారయ్యి ఉంది అది ఉన్నంత కాలం మీలో సాక్షిత్వం ఎరుక అన్నది
(16:05) జన్మించదు సో దాన్ని చంపివేసినప్పుడే అంటే సాధన ద్వారా దాన్ని అంతం చేసినప్పుడే మీలో ఎరుక అన్నది ఉద్భవిస్తుంది సాక్షిత్వం అన్నది జన్మిస్తుంది తద్వారా మీరు మీ ఆత్మ స్థితిని మీరు ఎరుక పొందగలరు గుర్తించగలరు మీరు ఒక దైవ నామాన్ని తీసుకోవచ్చు ఒక గంట పాటు మీరు నిరంతరం ప్రతిరోజు గంటపాటు మీరు మీరు సాధన చేశారంటే కచ్చితంగా అది కొన్ని రోజులు కొన్ని నెలలు గాని ఒక సంవత్సరం గాని గడిచే కొద్దీ మీలో అద్భుతమైన మానసిక స్థిరత్వం ఒక నిశ్చల స్థితి ఏర్పడడం మీరే గమనిస్తారు.
(16:40) సో మీలోనే సంపూర్ణమైన శక్తి అన్నది ఉద్భవిస్తుంది. అప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా దాని తాలుకు దాని తాలూకు చిహ్నాలు మీపై పడవు. వాటిని ఎదుర్కొని మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అటువంటి స్థిరమైన ఆ యొక్క స్థితి కలుగుతుంది. అందుకే దుఃఖానికి పరిష్కారం కావాలంటే మీరు సాధన చేయాల్సిందే సాధన లేకుండా మీలో దుఃఖం అన్నది అంతం కాదు కారణం మీ మనసును జయించాలంటే సాధన అవసరం సాక్షి భావన ఎరుక అన్నది సాధన ద్వారానే కలుగుతుంది బుద్ధుడు ఆరు సంవత్సరాలు చేశాడు.
(17:19) రమణుడు సాధన చేశాడు ఆత్మశోధన తన అంతర్గతంగా విచారించాడు శ్రీరామకృష్ణులు అనేక సాధనాలు చేశాడు ప్రపంచంలో అనేక రకాల సాధనాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీరామకృష్ణుడు అతడు ఒక మార్గం ద్వారా కాదు అనేక మార్గాల ద్వారా బుద్ధత స్థితిని చేరుకున్నాడు శ్రీరామకృష్ణుడు లాంటి వారిని చూసి ఇటువంటి మహాత్ములను చూసాక కూడా కొందరు ఆధ్యాత్మిక వేత్తలమని చెప్పుకునే వారికి అవగాహన రాహిత్యమో మరి అటువంటి వారు ఏం చెప్తున్నారు సాధన అవసరం లేదా అంటున్నారు అది చాలా పొరపాటు ఇక ఆధ్యాత్మికతనే మొత్తం తప్పు సాధన అవసరం లేదు అనడం అంటేనే ఇక ఆధ్యాత్మికత అన్నది మొత్తం ఆధారపడి ఉన్నది సాధనాల మీదనే
(17:58) అంతర్గత శోధన మీదనే అవే అవసరం లేదనే వాడు ఎంత మూర్ఖత్వం. సో మిత్రులారా నేను మీకు చెప్పేది ఏమిటంటే సాధన కచ్చితంగా చేసి తీరవలసిందే ఒక గంట పాటు మీరు దైవ నామాన్ని నిరంతరం రోజు ఉచ్చరించి చూడండి. మీలో అద్భుతమైన నిశ్చలత కలగకపోతే నన్ను మీరు నా యొక్క వీడియో కామెంట్ రూపంలో నన్ను తిట్టినా పర్వాలేదు. నేను దాన్ని అనుభవించే చెబుతున్నాను మిత్రులారా దుఃఖానికి పరిష్కారం మీరు ఆత్మ స్థితిలో నెలకొని ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం అన్నది అంతమవుతుంది.
(18:34) సో ఇది మిత్రులారా నా యొక్క ఎక్స్ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు.

No comments:

Post a Comment