Sunday, January 25, 2026

మగ మహాశయులకు విజ్ఞప్తి🚨 Wake Up Mens-You Are In Danger..?🚨 | SMP

మగ మహాశయులకు విజ్ఞప్తి🚨 Wake Up Mens-You Are In Danger..?🚨 | SMP

https://youtu.be/i-r5yUWUFMU?si=tKlscdRFWYBM1Obf


https://www.youtube.com/watch?v=i-r5yUWUFMU


Transcript:

(00:00) నన్ను ఒక అమ్మాయి హెరాస్ చేస్తుంది అని ఏ అబ్బాయి అయినా చెబితే అందరూ నవ్వుతారు. ఆ అమ్మాయి వల్ల ఆ అబ్బాయి ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్న సరే పట్టించుకోరు పైగా చేతకాని వాడిలా చూస్తారు. అదే ఒక అమ్మాయి నా వంక ఆ అబ్బాయి అదోలా చూస్తున్నాడని ఒక్క మాట చెప్పిందా ఇక అంతే అందరూ ఏకమవుతారు. ఆ అబ్బాయిని చితకబాదే వరకు వదలరు.

(00:28) అసలు ఆ అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా అన్నది ఎవ్వడికీ అవసరం లేదు. వాడు మగాడు ఖచ్చితంగా ఎదవే వాడు చేసే ఉంటాడు అన్న గట్టి నమ్మకం అమ్మాయి సచ్చ హరిశ్చంద్రురాలు అమ్మాయి అంటేనే నమ్మకం అన్నట్టు చూస్తారు. ఒక్క ఇండియా అనే కాదు ప్రపంచం మొత్తం మీద అమ్మాయిల మీద ఉండే సాఫ్ట్ కార్నర్ ఇది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కేరళాలోని కోజీకోడ్ బస్ ఇన్స్టెంట్ జనవరి 16న కోజీకోడ్లో ఒక ప్రైవేట్ బస్సు రద్దీగా ఉంది.

(01:00) అస్సలు ఖాళీ లేదు. సీట్లు దొరికిన వాళ్ళు కూర్చున్నారు. లేని వారు నిలబడి ప్రయాణం చేస్తున్నారు. అదే బస్సులో దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. టెక్స్టైల్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పని చేసే ఒక సాధారణ ఉద్యోగి. అదే బస్సులో షింజితా ముస్తఫా కూడా ప్రయాణిస్తోంది. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ కూడా బస్సు అంత రద్దీగా ఉండటంతో స్పేస్ లేకుండా అందరూ ఒకరికొకరు దగ్గరగానే నిలబడ్డారు.

(01:28) కుదుపల కారణంగా బస్సులోని వారు ఒకరినొకరు తోసుకుంటున్నట్టు పరిస్థితి ఉంది. సరిగ్గా అప్పుడే శింజిత తన ఫోన్లో వీడియో రికార్డు చేసింది. తన దగ్గరగా ఉన్న దీపక్ తనను అసభ్యంగా తాకాడని మహిళలకు భద్రత లేదని వీడియోలో చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియోని పోస్ట్ చేసింది. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయిపోయింది. కామెంట్లు వర్షంలా వచ్చి పడ్డాయి.

(01:54) అసలు ఆ వీడియోలో ఉన్నది ఎంతవరకు నిజం? అది ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా బస్సులో కుదుపుల వల్ల అలా జరిగిందా అన్నది ఎవరూ ఆలోచించలేదు. అక్కడున్నది మగాడు కాబట్టి ఖచ్చితంగా తప్పు చేశాడన్న నిర్ణయానికి వచ్చేశారు అందరుూ ఇక దీపక్ను అరెస్ట్ చేయాలని కొందరు కఠినంగా శిక్షించాలని ఇంకొందరు పట్టపగలు బస్సులో కామాంధుడు అంటూ మరికొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

(02:22) ఆ 18 సెకండ్ల వీడియోతో దీపక్ క్యారెక్టర్ ని డిసైడ్ చేసేశారు. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వీడియో వైరల్ అయిన ఆ రోజు దీపక్ బర్త్డే. సాధారణంగా పుట్టిన రోజునాడు వీలైనంతవరకు సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తారు అందరూ కానీ దీపక్కి మాత్రం జీవితంలో మర్చిపోలేని షాకింగ్ డేగా మారిపోయింది. ఆఫీసలో కాలనీలో ఇంటి చుట్టుపక్కల ప్రజలు చూసే విచిత్రమైన చూపులకు మనిషిగా సగం చచ్చిపోయాడు దీపక్ ఇక ఇంటికి వెళ్ళగానే తన తల్లి దగ్గర బిగ్గరగా ఏడ్చాడు.

(02:58) నేను అలాంటి వాడిని కాదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పాడు. కుటుంబం మొత్తానికి దీపక్ ఎలాంటివాడో అందరికీ తెలుసు అందుకే నిజం త్వరలోనే తెలుస్తుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు బాధపడకు అని ఫ్యామిలీ సపోర్ట్ గా నిలిచింది. కానీ ప్రపంచం మొత్తం అతని మాటలు వినలేదు. ఆ కొన్ని సెకండ్ల వీడియోతోనే అతను అని డిసైడ్ చేసి నిందలు వేయటం మొదలు పెట్టింది.

(03:23) ఒక్కసారి సొసైటీలో పేరు చెడిపోయాక మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో దీపక్ కి బాగా తెలుసు. ఇంకా ఆ ఒత్తిడే అతడికి నిద్రను కూడా దూరం చేసింది. మనశశాంతి లేకుండా పోయింది. రెండు రోజులుగా కనీసం భోజనం చేయకుండా తన గదిలో నుంచి బయటకు రాకుండా ఉండిపోయాడు. తల్లి పిలిస్తే పలికేవాడు అంతే నెమ్మదిగా అన్ని సర్దుకుంటాయని ఫ్యామిలీ అనుకుంది. కానీ జనవరి 18 న దీపక్ ను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. డోర్ కొట్టినా తీయలేదు.

(03:53) దీంతో తలుపులను బద్దలు కొట్టి చూసేసరికి దీపక్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీపక్ మనోవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవ్వగానే అప్పుడు అందరికీ అర్థమయింది. ఆ వీడియో ఒక చిన్న వివాదానికి సంబంధించింది కాదు. ఒక మనిషి జీవితానికి సంబంధించింది అని అప్పటివరకు దీపక్ను తిట్టిన వాళ్లే మాట మార్చేశారు.

(04:18) అతను అమాయకుడు అయి ఉండొచ్చు అని కామెంట్స్ మొదలు పెట్టారు. ఆ క్షణం నుంచి ఆ వీడియోని మరొకసారి చూశారు. అందులో అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఏమీ కనిపించలేదు. ఇక ఇప్పుడు తప్పు అతడిది కాదని ఆమెదేనంటూ కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఈ ఘటన ఇప్పుడు కేరళాను కుదిపేస్తోంది. ఎందుకంటే 35 ఏళ్ల శింజిత ముస్తఫా సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ మలపురం జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ స్టాండర్డ్ కమిటీలో పని చేసింది.

(04:48) ఆ తర్వాత కొన్నాళ్ళు గల్ఫ్ కు వెళ్ళిపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్ గా అవతారం ఇత్తింది. మళ్ళీ కేరళాకు వచ్చేసింది. బస్సులో దీపక్ తనను తాకాడని ఆరోపిస్తూ వీడియో తీసి పోస్ట్ చేసింది. అది బాగా వైరల్ కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు కానీ అది దీపక్ జీవితాన్ని నాశనం చేస్తుందని కనీసం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఎన్నిసార్లు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే ఏం లాభం? ప్రాణం పోయిన తర్వాత నిజం తెలిస్తే ఏం ప్రయోజనం అంటూ మరో వాదన మొదలైంది సోషల్ మీడియాలో.

(05:21) ఇక శిజితా చేసిన తప్పుడు ఆరోపణల వల్లే దీపక్ చనిపోయాడని పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో సోషల్ మీడియా నుంచి షింసిదా ఆ వీడియోని డిలీట్ చేసింది. ఆ తర్వాత తనను సపోర్ట్ చేసుకుంటూ మరో సెల్ఫీ వీడియో చేసింది. కానీ అన్ని నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఆ వీడియోని ప్రైవేట్ లో పెట్టేసింది. ఇక ప్రస్తుతం శింజిత పోలీసుల కస్టడీలో ఉంది. అయితే నిజంగా ఆ వీడియోలో దీపకది తప్పు ఉంటే ఆ వీడియోని ఆమె ఎందుకు డిలీట్ చేస్తుంది అన్న ప్రశ్న అందరిలో మొదలైంది.

(05:51) పైగా ఎవరైనా ప్రైవేట్ పార్ట్స్ ని తాకితే షాక్ అవుతారు. కానీ అతని చెయ్యి తాకగానే షాక్ అవ్వాల్సిన ఆమె మిషన్ సక్సెస్ అన్నట్టుగా నవ్వు ముఖం పెట్టింది. అదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది. బస్సులో పురుషులు తాకితే వెంటనే అక్కడికక్కడే నిలదీయాలి కానీ ఇలా నవ్వు ముఖం పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆమె కావాలనే అతని చేతికి తగులుకొని వీడియోలు తీసుకుందని రక్షణ కేవలం మహిళలకేనా మగాలకు లేదా అంటూ మండిపడుతున్నారు.

(06:21) ఇది ఇప్పుడు కేరళాలో ఉద్యమంలా మారింది. ఈ ఘటన తర్వాత కేరళాలో పరిస్థితులు మారిపోయాయి. రీల్స్ షాట్స్ ఎక్కడ చూసినా దీని గురించే వీడియోలు బస్సుల్లో అబ్బాయిలు అమ్మాయిలు తమని తాకకుండా కాటుబోటులు పెట్టుకున్నట్టు ముళ్ళ చొక్కాలు కంచలు వేసుకుంటున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఒక సీరియస్ విషయం ఫన్నీగానే కాదు ఆలోచింపచేసే విధంగా మారిపోయింది.

(06:46) మగాళ్ళ రక్షణకు కూడా చట్టాలు ఉండాలనే డిమాండ్ తో ఇలా సోషల్ మీడియాలో చిన్న సైజు ఉద్యమమే సాగుతోంది. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో చూసిన ప్రతి వీడియోని నిజమని నమ్మేసి అప్పటికప్పుడే తీర్పులు ఇచ్చేసే మైండ్ సెట్ మారుతుందో లేదో చూడాలి. ముఖ్యంగా అబ్బాయిలు అంటేనే తప్పు చేస్తారన్న అభిప్రాయం నుంచి బయటకు వస్తారో లేదో వేచి చూడాల్సిందే.


No comments:

Post a Comment