ఏకాదశ రుద్రులు ( Ekadasa rudrulu )
ఏకాదశ రుద్రులు అంటే శివుని పదకొండు రూపాలు లేదా అవతారాలు, వీరు హిందూ పురాణాల ప్రకారం వివిధ పేర్లతో ప్రస్తావించబడతారు, మత్స్య పురాణం ప్రకారం కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ అనేవి వారి పేర్లు, వీరికి శివాలయాల్లో, ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఇవి శివునిలోని శక్తిని, ఉగ్ర రూపాన్ని సూచిస్తాయి.
మత్స్య పురాణం ప్రకారం: కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ.
విష్ణు పురాణం ప్రకారం (మగ రూపాలు): మన్యు, మను, మహమస, మహాన్, శివ, ఋతుధ్వజ, ఉగ్రరేత, భవ, కామ, వామదేవ, ధృతవ్రత
మహాభారతం ప్రకారం: మృగవ్యాధ, సర్ప, నిరృతి, అజైకపాద్, అభివర్ధన, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భర్గ.
వాల్మీకి రామాయణం ప్రకారం: అజ, ఏకపాద, అభీర్బుధ్యా, హర, శంభూ, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన, త్వష్ట, రుద్ర.
ప్రభల తీర్థానికి 476 ఏళ్ల చరిత్ర - ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండగ హోదా కల్పించిన ప్రభుత్వం - కనుమ రోజు సంప్రదాయంగా ప్రభల తీర్థం వేడుక. కోనసీమ అందాలు ఇంద్రదనసుల్లా కొలువు తీరే ప్రభల తీర్ధం కన్నుల పండుగలా కనుమనాడు జరుగుతుంది.
మారుతున్న కాలంలో నాటికీ నేటికి సాంస్కృతిక సంప్రదాయాలకు ఆదరణ తగ్గలేదనటానికి ఈ ప్రభల ఉత్సవాలే ఉదాహరణ. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 50 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11ప్రభలు) దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.
దర్శనీయ ప్రణాళిక
అమలాపురం నుంచి రావులపాలెం పోవు బస్సులో ముక్కామల చేరుకోవాలి. ముక్కామల ఆటో స్టాండ్ నుంచి ఒక ఆటో ఏర్పాట్టు చేసుకోవాలి.
1) ముందుగా ముక్కామల శివాలయ దర్శనం
(కాలాగ్నిరుద్రాయ).
2) ముక్కామల నుంచి నేదునూరుకు ప్రయాణం. నేదునూరు శివాలయ దర్శనం (త్రికాగ్నికాలయ) తర్వాత వక్కలంక ప్రయాణం.
3) వక్కలంక శివాలయ దర్శనం (త్రిపురాంతకాయ) పిమ్మట ఇరుసుమండకు ప్రయాణం (వయా) ముక్కామల.
4) ఇరుసుమండ శివాలయ దర్శనం (త్ర్యంబకాయ) పిమ్మట పులేటికుర్రుకు ప్రయాణం.
5) పులేటికుర్రు శివాలయ దర్శనం (శ్రీ మన్మహాదేవాయ) పిమ్మట వ్యాఘ్రేశ్వరంకు ప్రయాణం.
6) వ్యాఘ్రేశ్వరం శివాలయ దర్శనం (విశ్వేశ్వరాయ) పిమ్మట కె. పెదపూడికు ప్రయాణం.
7) కె. పెదపూడి శివాలయ దర్శనం (మహాదేవాయ) పిమ్మట గంగలకుర్రుకు ప్రయాణం.
8) గంగలకుర్రు శివాలయ దర్శనం (సదాశివాయ) పిమ్మట గంగలకుర్రు అగ్రహారంకు ప్రయాణం.
9) గంగలకుర్రుక అగ్రహారం శివాలయ దర్శనం (సర్వేశ్వరాయ) పిమ్మట పాలగుమ్మి కు ప్రయాణం.
10. పాలగుమ్మి శివాలయ దర్శనం (మృత్యుంజయాయ) పిమ్మట మొసలపల్లి కు ప్రయాణం.
11. మొసలపల్లి శివాలయ దర్శనం (నీలకంఠాయ) పిమ్మట ముక్కామలకు తిరుగు ప్రయాణం. ముక్కామల నుంచి ఇంటికి ప్రయాణం.
ఏకాదశ రుద్రులును ఏక కాలములో సందర్శించుట పుణ్య దాయకం. వాటిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తద్వారా సకల పాపాల నుండి విముక్తులవుతారు. వ్యాధులు నుంచి విముక్తి పొందగలరు అని భక్తుల ఘాడ విశ్వాసం.
స్వంత వాహనములు కలిగిన వారు అమలాపురం నుంచి మొసలపల్లి చేరుకుంటారు. చివరి క్షేత్రంగా నేదునూరు చేరుకుంటారు. నేదునూరు నుంచి అయినవిల్లికి బయులుదేరుతారు.
No comments:
Post a Comment