ఏకాగ్రత
మనసును వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనసు కోరికలతో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడోచోట కట్టేసి ఉంచవచ్చు. కానీ మనసు పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టే యడానికి తాళ్లు ఉంటాయా అంటే- దైవ ప్రార్ధన, భజన, జపం, ధ్యానం ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్లు చూపారు.
ధ్యానం చేయడం, మనసును ఒక విషయం మీద కేంద్రీకరించడం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టిన ప్పుడే ఫలితం ఉంటుంది. పూజ దగ్గర నుంచి, ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పోసే వరకు ఏ పనిలోనైనా నిమగ్నం కావడం ముఖ్యం. పుస్తకం చదువుతున్న ప్పుడు మనసు ఆ కథలోనే లీనమవ్వాలి. వంట చేస్తున్నప్పుడు వంటింట్లో ఉండ కుండా మరెక్కడో ఉంటే కూరలో ఉప్పు బదులు పంచదార పడుతుంది. వంట చెడుతుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. 'శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం'- అని భగవద్గీతలో చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. మన సును అదుపులో ఉంచుకోవడం అలవాటుగా మారాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి. ఒక పట్టణంలో పేరుపొం దిన లాయరు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు. ఒక రోజు ఆయన పూజగదిలో ఉండగా, అర్జెంటు కేసు తీసు కుని ఒక వ్యక్తి వచ్చాడు. 'అమ్మా! లాయరుగారు ఉన్నారా?' అని అక్కడున్న కోడలిని అడిగాడు. మామగారు పూజగదికి వెళ్లేముందు ఆమెకు ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో 'మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు' అని గట్టిగా చెప్పింది. ७ మాటలు విని బయటికి వచ్చాడు. 'ఏంటమ్మా! ఏమిటా మాటలు, నేను పంచాక్షరి జపిస్తుంటే ఇంకెక్కడో ఉన్నానని చెబుతావేంటి? నీకేమైనా మతిపోయిందా?' అని గట్టిగా అడిగాడు. ఆమె శాంతంగా 'మామగారూ! మీరు ఎన్నిసార్లు, పంచాక్షరిని జపిస్తూ 'అమ్మా! అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా' అని అడగలేదు? ఒకసారైతే 'చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజు లైంది. ఇంకా తీసుకురాలేదు. రానీ, వాడి వీపు పగలగొడుతాను' అన్నారు. మీరు నిజంగా పంచాక్షరిని జపిస్తున్నారా! మీ చెప్పులను తలచుకుంటూ ఉన్నారా? చెప్పండి' అంది. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నాడు. లాయరు
దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలనూ రానీయకూడదు. ధ్యాసంతా భగవంతుడి మీద ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం అవసరం. వృత్తి జీవితంలోనూ అంతే. మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరు తుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఫలవంతం అవుతుంది.
శ్రీకృష్ణప్రియ
No comments:
Post a Comment