2612a4;19d5;241f6;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀H2
సరస్వతీ కటాక్షం…
*సహనం!*
➖➖➖✍️
ఒక విద్వాంసుడి పరీక్ష !
```
భారత దేశంలో ప్రముఖ సంస్కృత కవి కాళిదాసు. ఆయన చరిత్రలోనే ఉత్తమ పండితుడిగా గౌరవించబడతారు.
పురాతన పవిత్రమైన గ్రంధాలు, భారత పౌరాణిక కథల పైన ఆధారపడిన ఆయన కవిత్వాలు ధార్మికమైన పుణ్య గ్రంధాల మధ్య చోటును దక్కించుకున్నాయి. ఆయన జీవితం ప్రేరణ కలిగించడంలో ఘనమైనది. విద్వత్తు కలిగిన తత్వవేత్తగా ప్రఖ్యాతి చెందిన ఆయనను చంద్రగుప్త మౌర్య ఆస్థానంలోని తొమ్మిదవ ఆణిముత్యంగా గౌరవించారు.
ఆయన కొన్ని లోకాతీతమైన అనుభవాలను కూడా ఎదుర్కున్నట్లుగా వృత్తాంతాలు ఉన్నాయి. ఒక మహిళతో ఆయన చేసిన సంభాషణ మన గురించి మనం ప్రశ్నించుకొని, మన అస్తిత్వం గురించి తిరిగి ఆలోచించుకొనే విధంగా ఉంటుంది. అది ఇక్కడ వివరించబడింది..
ఒకసారి కాళిదాసు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు. సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువ వుండి ఆయనకి దాహం వేస్తోంది.
దాహం భరించలేని స్థితిలో ఉన్న ఆయనకు నీళ్ళ కుండతో నడుస్తున్న ఒక స్త్రీ కనపడింది. ఆ మహిళ దగ్గరకు పరుగు పరుగున వెళ్లి, గట్టిగా ఇలా పిలిచాడు, “ఓ మాతా! సూర్యుడు నా మీద ఎంతో కఠినంగా వున్నాడు, ఈ ఓర్చుకోలేని దాహం నా గొంతుకను ముల్లుతో పొడుస్తున్నట్లుగా వుంది. దయతో నీ వద్ద ఉన్న నీళ్ళను నాతో పంచుకోమని అర్ధిస్తున్నాను.”
ఆ స్త్రీ, “పుత్రా, నీ పరిస్థితి నాకు అర్ధమవుతున్నది. ఈ నీళ్ళు తప్పకుండా నీ దహాన్ని తీరుస్తాయి. కాని నీవు ఎవరో తెలియకుండా నేను ఈ నీళ్ళను నీకు ఇవ్వలేను. దయచేసి నిన్ను నీవు పరిచయం చేసుకో”, అని అన్నది.
కాళిదాసుకు ఒక్క క్షణం కూడా వృధా చేయడం ఇష్టం లేదు. నోట్లోనుంచి వచ్చే ప్రతీ మాట ఆయన ఎండిపోయిన గొంతుకను హింసిస్తోంది, ఐనా ఆ వృద్ధ మహిళను నొప్పించకూడదని వెంటనే, “అయితే నేను ఒక సంచారిని అనుకో” అని అన్నాడు.
ఆ స్త్రీ సమాధానంగా ,“నువు సంచారి ఎలా అవుతావు పుత్రా? ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరు సంచారులు. ఎల్లప్పుడూ ఆగకుండా సంచరించేవి - ఒకరు సూర్యుడు, రెండోది చంద్రుడు. నీ నిజమైన గుర్తింపు చెప్పు” అని అన్నది.
ఆ సమాధానానికి కాళిదాసు ఆశ్చర్యపోయాడు. గొంతు సరిచేసుకొని, “నేనొప్పుకుంటున్నాను, సరే నువ్వు నన్ను ఒక అతిధిగా ఎందుకు అనుకోకూడదు?” అని అడిగాడు.
దానికి ఆ స్త్రీ “నీవు అతిథివి కాదు నాయనా. మన జీవితంలో ఇద్దరే అతిథులు ఒకటి సంపద, రెండు యవ్వనం. ఇవి ఖచ్చితంగా వస్తాయి, వచ్చి వెళ్లిపోతాయి, నువ్వు ఎంత బతిమాలినా ఉండవు! ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరో” అని అన్నది.
అంతటి సూక్ష్మ జ్ఞానాన్ని చూసి కాళిదాసుకి మాటలు రాలేదు. ఐనా ఆ స్త్రీ తర్కం ఆయనను ఉత్తేజపరిచింది. సమాధానంగా “ఓ మాతా నేను ఒక సహనాన్ని” అని అన్నాడు.
ఆ స్త్రీ వెంటనే ఆయన చెప్పిన దానికి ఒప్పుకోకుండా, “నేను అలా అనుకోవట్లేదు. సహనం కలిగినవి రెండే జీవులు మొదటిది భూమాత, మన అందరి పాపాలభారాన్ని మౌనంగా సహిస్తోంది. రెండోది మన చుట్టూ వున్న వృక్షాలు, అవి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రతిఒక్కరికీ, వాటికి నష్టం కలిగించే వాళ్ళకి కూడా ఉదారంగా ఉంటాయి. నీకు అంత సహనం లేదు.” అని అంది.
కాళిదాసుకి ఈ మాటల యుద్ధంలో తాను ఓడిపోతున్నానేమో అన్న చిరాకు ఎక్కువ అవుతోంది. దాహం మరింత పెరిగి, ఆయన నిగ్రహన్ని హరించివేస్తోంది, దానితో ఆయన, “అయితే నేను ఒక మొండివాడ్ని అయి వుండాలి” అని అన్నాడు.
దానికి సమాధానంగా ఆ స్త్రీ, “ఓ పుత్రా! నువ్వు మొండి వాడివి కానే కాదు. గోళ్ళు, జుట్టు ఇవి రెండే మొండివి, మనం ఎన్నిసార్లు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి", అని అన్నది.
కాళిదాసు సహనాన్ని కోల్పోయాడు. గుక్కెడు నీళ్ల కోసం ఇంత చర్చా! అప్పుడాయన పెద్దగా, “అయితే నేనొక మూర్ఖుణ్ణి” అని అరిచాడు.
ఆ స్త్రీ, “అది నిజమైతే ఎంత బాగుండేది! ఈ భూమి మీద తిరిగే మూర్ఖులు ఇద్దరే. నువ్వు వారిలో ఒకడివి కావు. మొదటి వాడు తగినంత జ్ఞానం లేకుండా పరిపాలించే రాజు. రెండవవారు ఆ రాజుగారిని సంతోషపెట్టి, ఆయన దృష్టిలో మంచిని పెంపొందించుకోవడానికి అతని నిర్ణయాలను కూడా తప్పుద్రోవ పట్టించే ప్రజలు” అని అన్నది.
ఆ స్త్రీ యొక్క జ్ఞానాన్ని చూసి కాళిదాసు సంభ్రమంతో అవాక్కయిపోయాడు. భవిష్య ప్రపంచంలో కూడా ఎవరూ చూడని గొప్ప ప్రఖ్యాతి పొందిన ఒక సంస్కృత కవి, బహుశా చదవడం కూడా రాని ఒక మహిళ ముందు తల ఎత్తుకొని నిలబడలేకపోయాడు.
ఆయన ఓటమిని అంగీకరిస్తూ ఆ స్త్రీ కాళ్ళమీద పడి, “ఓ మాతా! నా గురించి నాకు తెలుసనుకున్న నేను ఎంత మూర్ఖుడినో తెలుసుకున్నాను. మన ఈ కలయిక నా ఆలోచనా విధానాన్నే మార్చివేసింది, నేను సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. నా అమాయకత్వాన్ని క్షమించి, నామీద దయ చూపించి గుక్కెడు నీళ్ళను ప్రసాదించమని యాచిస్తున్నాను.”
ఆయన కళ్ళ నిండా నీళ్లతో ఆ స్త్రీ ని చూడడానికి తల ఎత్తగానే కనిపించిన దృశ్యం, దాహంతో సొమ్మసిల్లిపోయానా, లేక కల కంటున్నానా అన్న అనుమానాన్ని కలుగజేసింది.
ఆ స్త్రీమూర్తి ప్రదేశంలో చంద్రుని లాగా కాంతిని ప్రసరిస్తున్న అద్భుతమైన ఆకారం నిలబడి వుంది. ఆవిడ కాళిదాసును కటాక్షించిన సరస్వతి మాతే తప్ప వేరెవ్వరో కాదు.
ఈ మండుటెండలో చల్లని నీటి కన్నా అతిసున్నితమైన స్వరంలో ఆవిడ మాట్లాడింది..
ఆమె చిరునవ్వుతో, “కాళిదాసా! లేచి నిలబడు నాయనా. నువ్వు నిజంగా గొప్ప పండితుడివి. నీ మాటలకు జీవితాలను బాగు చేసి, వాటిని మార్చగలిగిన శక్తిని కలిగి ఉన్న విషయం వాస్తవమే కానీ, నీ సామర్ధ్యాలను చూసుకొని నీ అహం, నువ్వు సాధించిన వాటిని కించపరుస్తున్నది. నీవు విద్యావంతుడవే కాని దానికి తోడుగా నీ హృదయంలో అహంకారానికి కూడా చోటు ఇచ్చావు. నీకు సరైన మార్గదర్శనం చేయడానికే నేను వచ్చాను.”
“నిజమైన పండితుడికి గుర్తు అతని జ్ఞానం కాదు అతని వినయం. నీలోని అహంకారాన్ని పోషించే విద్య నిరుపయోగమైనది. దానితో జీవితమంతా వృధా అవుతుంది. తాను సాధించిన వాటిని ఏ విధంగా పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని నీవంటి జ్ఞానవంతుడైన వ్యక్తి అర్ధం చేసుకొని ఇతరులకు బోధించాలి అంతే గాని వాటిని చూసుకుని గర్వపడకూడదు. అతడు చేయవలసినదల్లా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే ఎందుకంటే జ్ఞానం అనంతమైనది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ విద్యార్థిగానే ఉండాలి నాయనా," అని అన్నది.
కాళిదాసు వెంటనే లేచి నిలబడి ఆవిడకు నమస్కరించాడు. తనలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేసినందుకు సరస్వతిదేవికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తప్పును తానే తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ తనకు అందించిన ఈ శాశ్వతమైన విజ్ఞాన ముత్యాలను ఎల్లప్పటికీ పోగొట్టుకోకూడదని అనుకున్నాడు.
సరస్వతి దేవి చిరునవ్వుతో చివరికి నీటిపాత్రను కాళిదాసుకు అందించింది.
ఆయన కృతజ్ఞతతో ఆ పాత్రను మెరుస్తున్న కళ్ళతో స్వీకరించి తేనె కన్నామధురంగా ఉన్న ఆ నీటిని త్రాగాడు. ఆయన నీటి దప్పికనే కాక ఆయన విజ్ఞాన దాహం కూడా ఆ నీటితో తీరిపోయింది.
ఈ కథ ఇక్కడితో ముగిసింది కాని ఒక అనంతమైన సందేశాన్ని అందిస్తోంది. అది ఏమిటంటే, భగవంతుడు మనకు ప్రసాదించిన లక్షణాలు ఇతరులకు ఉపయోగపడనంత వరకు అవి అర్ధరహితమే.
“వినమ్రత, నిరాడంబరత అనే లక్షణాలు ఉంటే నీకు కావలసినవన్నీ నీ వద్ద ఉన్నట్లే అనుకోవచ్చు.”✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment