గుడ్ మార్నింగ్ 🌹మనము పూర్తిగా, సంపూర్ణముగా మనకు తెలుసు. మనము చేసే ప్రతి ఆలోచన, పని అన్నీ మనకు తెలుసు. ఇది తప్పు - ఇది ఒప్పు అనే విషయము, విచక్షణ కూడా తెలుసు.ఇలా మనకు మనము తెలిసేలా సృష్టి మనిషిగా మనకు మాత్రమే అవకాశము ఇచ్చింది. దీనికి కారణం నిన్ను నువ్వు తెలుసుకుంటూ అంటే గమనించుకుంటూ జీవించమని.తనను తాను తెలుసుకుంటూ అదే గమనించుకుంటూ జీవించేవారు తప్పులు చెయ్యరు. కోరుకుంటూ జీవించేవారు తప్పులు మాత్రమే చేస్తారు. కోరుకోవటం తప్పుకాదు. తప్పు - ఒప్పు తెలుసుకుంటూ కోరుకోవటం - తనను తాను తెలుసుకోవటం అదే గమనించుకోవటం. ఈ గమనిక మనలో జ్ఞాన అంశ.
కోరిక జ్ఞానము లేని కేవల శరీర భావనతో ఈ జ్ఞానాన్ని ఉపయోగించని వారికి తమలో జ్ఞాన వికాసము జరగదు. అదే అజ్ఞానము. అంటే అన్నీ అనర్ధ కృత్యాలే. జ్ఞాన వినియోగము వలన నిరంతరము బుద్ది వికాసము జరుగుతూ, జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. జ్ఞానముతో కలసిన కోరికలు, జీవితమే ఆధ్యాత్మికము. మనము మనకు తెలియటమే జ్ఞానము. దానిని వాడటమే సాధన. దానిని వాడక పొవటమే అజ్ఞానము. జంతు దశ - జంతు ప్రవృత్తి. జంతు జాతిలోనే పుట్టిన మనిషిని ఆ జంతు జాతి నుండి వేరుచేసి - మనిషిగా, మహాత్ముడుగా నిలబెట్టేది కేవలము తనలోనే ఉన్న జ్ఞానము. ఈ విషయాన్నే అనేక రకాలుగా మనిషికి తెలియచేసే ప్రయత్నము ఆధ్యాత్మికత చేస్తున్నది... జ్ఞానము మీరే... ఉపయోగించండి... 🌹god bless you
No comments:
Post a Comment