Monday, January 5, 2026

పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life | Sadhguru Telugu

పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life | Sadhguru Telugu

 https://m.youtube.com/watch?v=acGDLVaimqM&pp=QAFIAQ%3D%3D


https://www.youtube.com/watch?v=acGDLVaimqM

Transcript:
(00:00) [సంగీతం] మీ అమ్మని మీ అక్కచెల్లెళ్లను మీరు వాళ్ళని వస్తువులుగా మార్చేస్తున్నారు మీరు దీన్ని ప్రతిఘటించాలి నేను వందలాది మందిని కలిసాను వాళ్ళు ఎంత వక్రంగా మారిపోయారు ఇది నైతిక సమస్య కాదు ఇదొక మానసిక రుగ్మత ఇప్పుడు ఏమనటం మొదలు పెట్టారంటే ఆడవాళ్ళు కూడా వాటిని చూడాలంటున్నారు మీరు అతి మూర్ఖమైన పని చేస్తున్నారు అక్కడ ఉన్న ఆ మహిళపై మీ తల్లి ముఖం పెట్టండి అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది నమస్కారం సద్గురు పోర్న్ చూడకుండా ఉండడం ఎలా అన్నది ఇంటర్నెట్ లో ఎక్కువగా అడిగిన ప్రశ్నల్లో ఒకటిలా అనిపిస్తోంది నా గత క్లాస్మేట్స్ కొందరు దీనికి బాగా ఎడిక్ట్
(00:47) అయ్యారు వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయింది మనుషులు దీనికి అసలు ఎందుకు ఎడిక్ట్ అవుతారు వాళ్ళు దీని నుంచి సులభంగా బయట పడటం ఎలా చూడండి మీరు ఇది అర్థం చేసుకోవాలి పోర్నోగ్రఫీ అనేది లైంగికత కాదు అది మీరు ఏర్పరచుకుంటున్న ఒక రకమైన జబ్బు జబ్బు అన్నప్పుడు లైంగికత జబ్బు కాదు మన పుట్టుకలో అదొక భాగం మనం ఇక్కడ ఉన్నది దాని వల్లే కానీ మనం ఉండేది దాని కోసం కాదు దాని వల్లనే ఇక్కడ ఉన్నాం దాని నుంచే పుట్టాం కాబట్టి ఇది తప్పప్పులకు సంబంధించింది కాదు విషయం ఏమిటంటే ప్రతి జీవికి ప్రకృతి వాటి లైంగికతను నియంత్రించింది ఎందుకంటే వాటి లైంగికత
(01:37) ఒకానొక సమయంలోనే ఉంటుంది మిగతా సమయం అంతా వాటికి అసలు ఏది మొగదో ఏది ఆడదో కూడా తెలియదు హలో అంటే ప్రకృతి వాటిని నియంత్రించింది అయితే ప్రకృతి మిమ్మల్ని ఎందుకు నియంత్రించడం లేదు ఎందుకంటే మీకు కొంచెం బుర్ర ఉందని అది నమ్మింది కానీ మీకు అది లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు అవును చిన్న వయసులోనే ఇలాంటివి చూడటం మొదలు పెడితే ఇక మీ బుర్రలో ఇంకేదీ జరగదు కాబట్టి ఈ ప్రక్రియలో వీటిని ఆపే బాధ్యత ఇంకా అవసరం స్త్రీలకు చాలా ఎక్కువ ఉందని చెప్తాను ఎందుకంటే ఎవరు దీని గురించి మాట్లాడటం లేదు ఇంకా ఇప్పుడు ఏమనటం మొదలు పెట్టారంటే ఆడవాళ్ళు కూడా
(02:26) వాటిని చూడాలంటున్నారు కొందరేమో దీన్ని సెక్స్ ఎడ్యుకేషన్ అంటున్నారు లేదు లేదు ఇది అలాంటిది ఏం కాదు గతంలో జరిగిన కొద్దిపాటి పోరాటాల వల్లనో లేదా స్త్రీలు ఎదుర్కొన్న కష్టాల వల్లనో మీకు కొద్దిపాటి భౌతిక స్వేచ్ఛ దొరికింది దాన్ని మీరు పోర్నోగ్రఫీ పేరుతో వదిలేసుకుంటున్నారు దాని అర్థం ఎటు వచ్చి మీరు ఒక వస్తువే అంటున్నట్టు సరేనా మీరు ఒక జీవంగా ఉండాలంటే మీరు దీన్ని ప్రతిఘటించాలి వీధుల్లో కాదు మీరు దాన్ని ఎక్కడ చూస్తే అక్కడికక్కడే ఆపేయాలి మీరు ఇది అర్థం చేసుకోవాలి ఇది మరొకరి ఆనందమో మరొకరి ఆస్వాదనమో మరొకరి సుఖమో కాదు ఇది
(03:05) స్త్రీని కించపరచడం గురించి మిమ్మల్ని ఒక వస్తువుగా మార్చేస్తున్నారు ఆడవాళ్ళు దీన్ని చేపట్టకపోతే ఆ మాత్రం బుద్ధి మగవాడికి ఇంకా రాలేదు వాళ్ళు పరిణితి చెందితే తప్ప అన్లెస్ దే ఎవాల్వ్ ఎస్ ఇంకా ముఖ్యంగా నేను వందలాది మందిని కలిసాను చిన్న వయసులోనే వాళ్ళు వీటిల్లో చిక్కుకొని పోయారు ఎంతో బాధను అనుభవిస్తున్నారు రేపు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో అర్థవంతమైన సంబంధాలను కలిగి ఉండాలంటే అది చాలా కష్టం వాళ్ళు ఎంతగానో దిగజారిపోయారు నేను మీ ముందు ఇలాంటివి చెప్పాలనుకోవట్లేదు కూడా వాళ్ళు నాకు చెప్పిన విషయాలను చూస్తే చాలా చిన్నతనంలోనే వాళ్ళు వీటికి బానిస కావడం
(03:51) వల్ల ఎంత బాధను అనుభవిస్తున్నారో అయితే దీన్ని వదిలించుకోవడం ఎలా అంటే మీరు ఇది అర్థం చేసుకోవాలి నేను మీకు చెప్పినట్లుగా ప్రకృతి మీకు ఒక విధమైన బంధనం నుంచి విముక్తి కల్పించింది మీరు ఎరుక గల జీవి అనుకుంది మీరు ప్రతిదీ ఎరుకతో చేస్తారు అనుకుంది అలా అని మీరు అన్ని వేళలా అదే చేస్తూ ఉండాలని కాదు పునరుత్పత్తి చర్యలు చేస్తూ ఉండాలని కాదు కాబట్టి ఇది సుఖం గురించి కాదు ఆనందం గురించి కాదు ప్రేమ గురించి కాదు ఇది కేవలం నిర్బంధ నిర్బంధత అనేది బానిసత్వం అని మీకు అర్థం కాకపోతే ఇక మీతో ఏం చేయగలవు హలో నిర్బంధత అనేది బానిసత్వం అని మీకు అర్థం
(04:39) అవ్వట్లేదా ఎరుక మాత్రమే మనకున్న ఏకైక స్వేచ్ఛ కాబట్టి దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు దాని వైపు వెళ్లకుండా ఉంటే చాలు వదులుకోవాల్సిన పని ఏముంది అది ఏమైనా ఇక్కడ ఉందా లేదు అది నా బుర్రలో తిరుగుతోంది చూడండి మీ బుర్ర ఎలాంటిది అంటే దాంట్లోకి ఏవైతే ఎక్కిస్తారో అదే తిరుగుతుంది మీ మైండ్ స్వభావం ఇదే మీరు ఇది అర్థం చేసుకోవాలి ప్రతి సాంకేతికతను మీకు వచ్చే ప్రతి సౌలభ్యాన్ని మీరు మీ స్వయం వినాశనానికి ఉపయోగించాలి అనుకుంటున్నారు ఓ హాని ఏమిటి సద్గురు హాని ఇదే మీ అమ్మని మీ అక్కచెల్లెళ్లను ఇంకా మీ చుట్టూ ఉన్న ప్రతి మహిళను మీరు వాళ్ళని వస్తువులుగా
(05:22) మార్చేస్తున్నారు నేనేమి మిమ్మల్ని మీరంతా బ్రహ్మచారులుగా మారి ఎక్కడో చోటికి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు అది కొంత మాత్రమే అందుకు తగిన సామర్థ్యం ఉండాలి కానీ మీరు మీ జీవితాన్ని హుందాగా నిర్వహించుకోగలగాలి ఇందులో హుందాతనం ఎక్కడుంది పోర్నోగ్రఫీలో స్త్రీకి హుందాతనం ఎక్కడుంది హలో హుందాతనం ఎక్కడుంది అంటే భూమి మీద ఉన్న సగం ప్రజానికానికి హుందాతనం ఇవ్వకుండా ఉండటం అనేది మీకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటున్నారా అసహ్యం కాబట్టి ఇది నైతిక సమస్య కాదు ఇది మానసిక రుగ్మత అర్థమైందా ఇట్స్ ఏ మెంటల్ హెల్త్ ఇష్యూ ఇది నైతికత గురించి కాదు మీరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని
(06:13) మీరు వికారమైన దాన్ని చూసి స్నేహితుల మధ్య హి హి హి హి హి అనుకోవడంలో మీరు ఏదో గొప్ప పని చేస్తున్నారని అనుకోకండి మీరు అతి మూర్ఖమైన పని చేస్తున్నారు నేను చెప్పేది మీకు అర్థం కానట్లయితే అక్కడ జరుగుతున్న అశ్లీలత ఏదైనా సరే అక్కడ ఉన్న ఆ మహిళపై మీ మీ తల్లి ముఖం పెట్టండి అప్పుడు మీకు విషయం అర్థమవుతుంది [సంగీతం]

No comments:

Post a Comment