Monday, February 3, 2025

 *బంధాలపావురాల్లు,బ్రతికి బయట పడగలవా??*  
-.  ---.       ----.          ---.                 --
బంధానికి బాటలే ఆనాడు 
బంధానికి బీటలే ఈనాడు,,
బంధువుఆప్తుడు ఆనాడు,
బంధువు స్తబ్దుడు ఈనాడు,,
అనురాగం ఆప్యాయత 
బంధానికి లోగిళ్ళు ఆనాడు,,
ఆస్తులు, అంతస్తులు 
అప్డేట్ కల్చర్ వేగిళ్ళు ఈనాడు,,
ఇంట్లో పదిమంది వుండే 
సందడే సందడి ఆనాడు,,
చేతిలో సెల్లు, ఇంట్లో విదేశీ గాడ్జెట్స్, 
ఒంటరితనం తోడి ఉలుకు పలుకు లేని,,
సమయ సంహారకాలు ఈనాడు,,
కాయ కష్టం చేసి,,అలసట తీరా 
ఆరుబయట పట్టెమంచం లో 
కమ్మని కబుర్ల బంధం ఆనాడు,,
ఆకలి,సమయం తెలియని కష్టం,
ఇంట్లో వున్నవారిని విడచి, బంధం మరచి,,
ఒంటరిగా చేతిలో సెల్లు, లేదా ఇంకోటి,
మనిషి, మమతలు విసిరేసే ఈనాడు,,
చేతి వంటతో ఇల్లాలు 
కొసరి కొసరి ప్రేమ తో వడ్డిస్తూ
కమ్మని కబుర్లతో కడుపు నింపి ,,
నిండు చందమామల ఎదురొచ్చి 
భర్తను బయటకు పంపించు ఆనాడు,,
ఎవరో అపరిచితుడు చేసిన వంట 
చాటో, వాటో, పరోటో,ఏదో సాస్ పోసి ,,
భోజనం బల్లపై గిర్రున విసిరేస్తే,
తన ఇంట్లో, తన సంపాదన తో 
దిక్కులేని తిండి మొక్కుబడి గా,,
కనీస పలకరింపు లేకుండానే 
కనీసం తోడు లేకుండానే ముగించి,,
పైసలకోసం పరుగులు ఈనాడు.
అలసి ఇంటికొస్తే ఆప్యాయంగా 
ఆదరించే నాధుడు లేడు,,
ఆరోగ్యం చెడి చస్తే దహన
 సంస్కారం చేసే హితుడు లేడు,,
ఎంత సేపు డబ్బు డాబు,, డబ్బు డాబు,,
ఇవి తప్ప వేరే యావ లేదు,
మనిషి,మనసుకు వలపుల
 ఊయల లేదు, ఆ ఊసే లేదు,,
బంధానికి బలమైన 
అనురాగపు స్పర్శ అసలే లేదు,,
ఆప్యాయంగా పిలిచే పిలుపు లేదు,,
బంగారు బంధాల అనురాగపు మమత లేదు,,
విజ్ఞానం పెరిగి ,సంస్కృతి, సంస్కారంతరిగి,,
చదివిన వాడు, చదవని వాడు ఒకేతీరు,,
విశాలమైన భవనాల విలాపంలో,,
మనిషికి,, మనిషిగా నిలిచేందుకు 
మనసునిండా ఇరుకు గదులే,,
ఎవరికి వారు,, నీ నా అనే వారు లేక,,
 విసరేసిన విస్తర్లే ఈనాడు,,
బంధాలను జరుపుకుంటూ,, 
దూరాన్ని పెంచుకుంటూ ఒరిగిపోతున్న 
బంధాలు నిలపడం సాధ్యమేనా,,
అహంతో కట్టిన గోడలు,, 
రూపాయలతో వేసిన సీలింగ్,,
బిజీ స్టేటస్ కొన్న ఫర్నిచర్,,
ఇవి తప్ప మనిషి,మనసు,
 మనిషి దేహం కనిపించని,,
 అప్డేట్ అలంకారంల వలలో చిక్కి,,
చేతిలో సెల్లుతో బందీవిషయం మరచిన 
బంధాలపావురాలు బ్రతికి 
బయట పడగలవా??అనుమానమే సుమా!!
*రచన* 
*సావిత్రీ బాయి ఫూలే అవార్డు గ్రహీత* మరియు 
*తెలుగు కీర్తి జాతీయ పురస్కారగ్రహీత*,,
*శ్రీమతి బైరపోగు బెన్నెమ్మ వేణుగోపాల్*,
*కర్నూల్*.

🙏🙏

No comments:

Post a Comment