*👉తెలుగు ప్రథమాలు👈*
*👉తెలుగు తొలిప్రొద్దు వెలుగులు లేక తెలుగు ప్రపంచంలో ప్రథమాలు👈*
👉శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు
👉తొలి పూర్తి తెలుగు శాసనం - రేనాటి చోడులది
👉తొలి తెలుగు కవి - నన్నయ
👉తొలి తెలుగు కావ్యం - ఆంధ్రమహాభారతం
👉తొలి తెలుగు నిర్వచన కావ్యం - నిర్వచనోత్తర రామాయణము
👉తొలి తెలుగు ప్రబంధము - మనుచరిత్రము
👉తొలి తెలుగు నవల - రాజశేఖర చరిత్రము
👉తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క
👉తొలి తెలుగు వ్యాకరణము -
ఆంధ్రభాషాభూషణము
👉తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము
👉తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము
👉తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము
👉తొలి తెలుగు నాటకము - మంజరీ మధుకీయము
👉తొలి తెలుగు శృంగారకవయిత్రి -
ముద్దుపళని
👉తొలి తెలుగు కథానిక - దిద్దుబాటు
👉తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము
👉తొలి తెలుగు రామాయణము - రంగనాథ రామాయణము
👉తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము
👉తొలి తెలుగు జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన
👉తొలి తెలుగు పురాణానువాదము -మార్కండేయ పురాణము
👉తొలి తెలుగు ఉదాహరణకావ్యము -
బసవోదాహరణము
👉తొలి తెలుగు పత్రిక - సత్యదూత
👉తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము
👉తొలి తెలుగు సాంఘిక నాటకము -
నందకరాజ్యం
👉తొలి తెలుగు వాగ్గేయకారుడు - అన్నమయ్య
👉తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన
👉తొలి తెలుగు పద్యం (శాసనాలలో) - తరువోజ
👉తొలి తెలుగు పద్యశాసనము - అద్దంకి శాసనము
👉తొలి తెలుగు ధర్మశాస్త్రము -
విజ్ఙానేశ్వరీయము
👉తొలి తెలుగు పరిశోధనా వాఙ్మయ గ్రంథము -
సకల నీతి సమ్మతము
👉తొలి తెలుగు వ్యావహారిక నాటకము -
కన్యాశుల్కం
👉తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి -
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
👉తొలి తెలుగు ఖురాన్ చిలుకూరి నారాయణరావు
👉తొలి తెలుగు వ్యావహారికభాషా వచన గ్రంధం
హితసూచని (1853) - స్వామినేని ముద్దునరసింహంనాయుడు (1792-1856).
👉తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు -
ఐ.కొండలరావు 1938
*👉తెలుగు ప్రముఖులు👈*
👉ఢిల్లీ దర్బారు (ఫిరొజ్ షా తుగ్లక్) లో తొలి వజీరు (ప్రధానమంత్రి)-- మాలిక్ మక్బూల్ / యుగంధర్ లేక దాది (సాగి) గన్నమ నాయకుడు.
👉ప్రధాన మంత్రి అయిన తొలి తెలుగు వ్యక్తి--
పి.వి.నరసింహారావు
👉రాష్ట్రపతి అయిన తొలి తెలుగు వ్యక్తి--
వి.వి.గిరి
👉అంటార్కిటికా కు వెళ్ళిన తొలి తెలుగు వ్యక్తి--
దాట్ల రామదాసు
👉ఒలంపిక్ క్రీడలలో పతకం సాధించిన తొలి తెలుగు వ్యక్తి-- కరణం మల్లేశ్వరి.
No comments:
Post a Comment