Monday, January 5, 2026

Reality of AI: గ్రోక్ ఎంత పని చేశావే..!? మీ బట్టలు విప్పి చూపిస్తుంది.. | Gundusoodhi - PINN

Reality of AI: గ్రోక్ ఎంత పని చేశావే..!? మీ బట్టలు విప్పి చూపిస్తుంది.. | Gundusoodhi - PINN

https://youtu.be/3cfyOqnp340?si=Yq4HPP-sKKhC1YXx


https://www.youtube.com/watch?v=3cfyOqnp340

Transcript:
(00:01) అందరికీ నమస్తే అండి. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి మన దేశాన్ని సోషల్ మీడియా ఏలుతుంది. సో సోషల్ మీడియా యూసర్స్ ఆ సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ కి ఇన్ఫ్లయెన్స్ అయి రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే బాగా మన మనుషుల మీద ముఖ్యంగా కొన్ని ఒక ఏజ్ గ్రూప్ మీద సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి గత సంవత్సరం సంవత్సరంన్నర నుంచి కొత్త పైత్యం ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ మంచిదే ఎందుకంటే ఏఐ ని మనం ఎంత బాగా వాడుకుంటే అంత మంచి ఇన్ఫర్మేషన్ వస్తది అంత మంచి కంటెంట్ వస్తది. ఏఐ లో రకరకాల
(00:41) టూల్స్ ఉన్నాయిగగు జెమినీ ఉందిఆపిల్ వాళ్ళది ఉంది అండ్ గ్రోక్ ఉంది అండ్ చాట్ జేపిటి ఉంది ఇలా రకరకాల ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏఐ టూల్స్ మనం ఏం కావాలన్నా సరే సమాచారం రాబెట్టుకోవచ్చు పాత కథనాలు రాబెట్టుకోవచ్చు సాధారణంగా గూగు లో మనం ఏమనా సెర్చ్ చేస్తేగగు ఏం చేస్తదిఅంటే మనకు లింక్స్ ప్రొవైడ్ చేస్తది.
(01:08) అదేఏఐ లో మనం సెర్చ్ చేస్తే మొత్తం ఆ లింక్స్ కాకుండా దానికి సంబంధించిన డేటా అంతా వచ్చేస్తది. ఇప్పుడు ఈ సోద అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ అందరికీ తెలిసిందే దీన్ని ఎంతగా మిస్ యూజ్ చేస్తున్నారో అనడానికి కొన్ని ఉదాహరణలు ఇప్పుడు దేశం మొత్తం మీద ఏదో పెద్ద గందరగోళం మీరు ఒకసారి స్క్రీన్ మీద ఫోటో చూస్తున్నారు కదా చూడండి ఒక అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి వీళ్ళని హాఫ్ లో చూపించమని లేదా బికినీతో చూపించమని గ్రోక్ ని అడుగుతుంటే గ్రోక్ అలాగే చూపిస్తుంది.
(01:36) నేను ఆ ఫోటో చూపించలేను దాని రిజల్ట్ ఫోటో అయితే నేను చూపించలేను. ఇప్పుడు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది దేశంలో ఈ చెత్త బ్యాచ్ కూడా ఎక్కువ కదా ఇప్పుడు మనం సాంకేతికతనం లేదంటే ఇటువంటి సోషల్ మీడియాని ఎంత మంచి కోసం వాడుకుంటారో అంతకన్న దరిద్రం కోసం వాడే వాళ్ళు కూడా ఉన్నారు.
(01:54) ఇప్పుడు జస్ట్ ఎక్స్ లోకి వెళ్లి గ్రోక్ ని ట్యాగ్ చేస్తూ ఫలానా హీరోయిన్ లేదా ఫలానా ఒక అమ్మాయి ఫోటోని పెట్టి ఈ అమ్మాయిని బికినీలో చూపించు లేదా హాఫ్ న్యూడ్ గా చూపించు అంటే వచ్చేస్తుంది ఫోటో ఇంకేముంది ప్రైవసీ ఎక్కడ ఉంది ఇంక దేశంలో అమ్మాయిలకు భద్రత ఎక్కడ ఉంటది ఫేస్ అదే ఉంటది ఫోటో ఏమో బిక్కినీతో ఉంటది ఇంకా అమ్మాయిలు ఇంకా బతకగలరా బయటికి రాగలరా సో అంటే అపరిచిత అమ్మాయి అయినా సరే రోడ్డు మీద నడుస్తున్న ఏ అపరిచిత అమ్మాయినైనా సరే ఎవరో ఒకళ ఫోటో తీసి లేదా సోషల్ మీడియాలో ఎవరో అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ఆ ఫోటోనఅయినా సరే ఆ ఫోటో పట్టుకొని గ్రోక్ కి ట్యాగ్ చేస్తూ మీరు ఈ ఫోటోని బికినీతో
(02:31) నాకు పంపించండి లేదా హాఫ్ న్యూడ్ గా పంపించండి లేదా శారీతో పంపించండి అని అడిగితే ఈజీగా పంపించేస్తుంది గ్రోక్ మరి ఇది ఆ దేశంలో మహిళల భద్రత ప్రశ్నార్థకమే కదా గత నాలుగు రోజుల నుంచి దాదాపుగా మిలియన్స్ ఆఫ్ యూసర్స్ గ్రోక్ ని ఇదే అడుగుతున్నారు. అమ్మాయిల ఫోటోలు పెట్టి సెలబ్రిటీలు ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెట్టి న్యూడ్ లో పంపించమని హాఫ్ న్యూడ్ లో పంపించమని బికినీలో పంపించమని అడుగుతున్నారు.
(02:56) గ్రో కూడా కొన్ని నిమిషాలు వ్యవధలో ఇచ్చేస్తుంది. సో ఇదన్నమాట ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన దేశంలో యువత వాడుకుంటున్న తీరు ఇది దీన్ని ఏమనాలి సో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు విన్నతలు రావడంతో కేంద్రం అలర్ట్ అయి ఇమ్మీడియట్ గాఎక్స్ వాళ్ళకి నోటీసులు పంపించింది. వాళ్ళక ఒక లేఖ మెయిల్ పంపించింది అన్నమాట.
(03:17) ఇదిగో ఇలా మా దేశంలో ఇలా మిస్యూస్ జరుగుతుంది. ఇది మహిళల భద్రతకు మహిళల ప్రైవసీకి విఘాతం కదా సో ఇది కరెక్ట్ కాదు ఇమ్మీడియట్ గా ఈ టూల్ ని తొలగించండి లేదా ఇది రాకుండా చేయండి లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటావ్ అని నోటీస్ వెళ్ళిందన్నమాట సో మేబీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రావాలి గ్రోక్ అంటే అది ఎవరిదిఎక్స్ వాళ్ళది ఆ టూల్ ఎక్స్ అంటే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సో వాళ్ళు రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి ఎందుకంటే అంటే ఇంకా మనం చెప్పుకోవడానికి లేదు పచ్చిగా ప్రతి ఒక్కరిది కూడా మనం ఏ అమ్మాయి మనకు నచ్చకపోతే ఆ అమ్మాయి ఫోటో పెట్టి దీన్ని బికినీలో చూపించండి
(03:55) చూపించేస్తది. ఇంకా మహిళలు బయటకి రాలేరు మహిళలు తలెత్తుకొని తిరగలేరు. మహిళల ప్రైవసీకి భంగమే కచ్చితంగా దేశంలో తిరుగుబాటు వస్తది మహిళలందరూ కూడా తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు కాబట్టి సంస్థ ఎక్స్ సంస్థ ఎలన్ మస్క్ సంస్థ ఏ విధంగా రెస్పాండ్ అవుద్ది దానికి కేంద్రం ఎలా ఎలా రెస్పాండ్ అవుద్ది మే బి దీనికి ప్రపంచ దేశాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది.
(04:21) ఇంత ధారుణంగా ఉంటాయి ఎలా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంత చండాలంగా చేస్తే ఎలా ఇలా వాడుకుంటారు ఏదైనా సరే మనకి పెరుగుటు వెరుగుటు కొరకే అంటారు కదా మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలా మంచి అయింది. కొత్త ఫ్రెండ్షిప్లు కొత్తగా చాటింగ్లు అది ఇది బాగుండేది. అది కాస్త అలా అలా వెళ్లి బ్లాక్ మెయిల్ వరకు బెదిరింపు వరకు బిజినెస్ వరకు చాలా చెత్త కల్చర్ వచ్చేసింది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు నచ్చినట్టు నచ్చిన వాడి మీద ఎడిటింగ్స్ మార్ఫింగ్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి అది కాస్త కొత్త పొంతలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇది ఇంకొంచెం ఎక్కువయింది. ఫోటోలు రకరకాల
(04:56) ఇప్పుడు ఈవెన్ మనం చాట్ జిపిటి లో కావచ్చు Google జెమినీ లో కావచ్చు ఫోటోలు పెట్టి దీన్ని ఒక ప్రాంప్ట్ కమాండ్ ఇస్తున్నాం దీన్నిఏఐ బనానా టూల్ గా మార్చి ఇవ్వండినో లేదంటే ఏదో ఒకటి ఇస్తాం మనం ఏమ అడిగితే మనం ఇచ్చే కమాండ్ ప్రాంప్ట్ కి తగ్గట్టు అటు నుంచి మనకి అవుట్పుట్ ఫోటో వస్తుంది. అలా వచ్చినప్పుడు దీన్ని చాలామంది వాళ్ళ పర్పస్ల కోసం వాడుకుంటారు చిన్న పిల్లల్ని కూడా ఇదిగో ఒక మీరు ఒక ఐదు సంవత్సరాల పాప ఫోటో పెట్టి ఈ పాప పెద్దయ్యకి ఎలా ఉంటది అని పెట్టి మీరు ఫోటో పెట్టొచ్చు వచ్చేస్తది ఈ పాపకి 20 ఏళ్ళ వచ్చినప్పుడు ఎలా ఉంటదో ఫోటో జనరేట్ చేసి పంపిస్తది. ఆ
(05:29) ఫోటోని మీరు అప్లోడ్ చేసి హాఫ్ న్యూడ్ గా పంపించండి లేదంటే బిగినీలో పంపించండి అని పంపిస్తది. మరి ఇది ధర్మమేనా ఇది కరెక్టేనా అసలు అమ్మాయిల చిన్న పిల్లలకు కూడా ప్రైవసీ లేనట్టేగా సో ఇది చాలా చెత్త టూల్ అన్నమాట చాలా చెత్త కల్చర్ దీన్ని కేంద్రం స్పీడ్ గానే రెస్పాండ్ అయింది. అటువైపు నుంచి ఆ రెస్పాన్స్ ఇంకా లేదు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం అయితే ఉంది.
(06:01) చూడాలి ఏం జరుగుద్ది దీనిి ఒక నాలుగైదు రోజుల్లో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం థాంక్యూ

No comments:

Post a Comment