🤩🥳 🎉 SPECIAL PODCAST - RAW TALKS | Ft. Chandra Bose Garu | Telugu Podcast
https://m.youtube.com/watch?v=pK-yGAs3bMI
https://www.youtube.com/watch?v=pK-yGAs3bMI
Transcript:
(00:00) ఫస్ట్ ఆల్ అంటే కంగ్్రాచులేట్ చేయలేను కానీ థాంక్యూ వెరీ మచ్ ఫర్ గెట్టింగ్ ది ప్రైడస్ట్ మూమెంట్ ఫర్ [సంగీతం] త్రిభాషా నిఖం పుస్తకం వచ్చింది కొత్తగా తలతలాడుతుంది పుస్తకం తీసాను తీసి ఇది ఇక్కడ ఉండాల్సింది ఆ పుస్తకం అని చెప్పేసి లోపల పెట్టారు పక్కే దూకి గోడ దొకకి పుస్తకం మన దగ్గరికి వచ్చేసింది ఓకే దాని ఖరీదు ఎంతో తెలుసా 50 40 లక్షలు ఓ బుక్కు ఖరీదు గుండెల్లో భూకంపాలే [సంగీతం] సృష్టించావే నీవు కళ్ళల్లో భూచక్రాలే తిప్పావే నీవు అని రాశరు మన సినిమాలో హీరో శోభన్ బాబు గారు అనుకుంటున్నారు కాదు మన కళ్యాణ్ బాబు గారు కొంచెం ఈ ట్రెండ్ తగినట్టుగా రాయండి
(00:40) అనగానే ఇక మనసులో ఇదే బాని తానానా తానానా నేను అలా అబ్బించి ఏం కావాలండి అన్నా పెట్రోలింగ్ అనగానే ఇలా చూసాను అమ్మాయి ఉంది పైకి చూసాను ఆకాశం అమ్మాయి ఆకాశం ఆకాశం అమ్మాయి ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది అంటే ఎలా తీయాలి ఇప్పుడు చిన్నగా చిన్నగా ఒక పాట ఉంటుంది ఆ పాటలో కొంచెం డీప్ మీనింగ్ ఉంటది.
(01:02) గుండు సూది అన పాటతో డాక్టర్ గారు ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రత్యేక గీతలు ఉన్నవి అప్పడాలు లాంటివి కూరలు ఎన్ని ఉన్నాయి అప్పడం వడియాలు ఉంటేన పదరాలు కలిసేవి ఏంటి ప బ్రహ్మాస్త్రాలో ఒక పాట రాసాను చింగారియా నా గుండెల్లో కేజో మేరేహి దీపాలే సీనేమే నీ వైపే హై దఫన్ చూపగా దేకే హవా నిన్నే చేరి బంజాము పెను జ్వాల లై మారగా అర్థం భావం భాష నీకు విషయం చెప్తాను దమత నిమిషం మాకు పార్తోషకాలు అంటుంటే మీరు ఎప్పుడు అడగలే ప్రశ్న [నవ్వు] మాకు పార్తోషకాలు బానే ఉంటాయి దీంతో పాటు మాకు రాయల్టీ ఇస్తాయి చిరు చిరు చినుక పాటకి దాదాపు ఒక 10 లక్షలు సం మా ఊరికి టేప్ రికార్డర్ వచ్చింది టేప్
(01:52) రికార్డర్ మా ఊరిలో తెలియదు మొదట్లో విన్న పాట సిరివెల పాట ఇంకా పాటలన్నీ వింటున్నా వేటి గారి పాటలు శాస్త్రి గారి పాటలు నాతే గారి పాటలు వింటూ వింటూ వింటూ ఉంటాం కానీ వరకు వచ్చేసరికి పిచ్చికపోయింది నాకు ఇలా పాట రాయొచ్చా వారేవా ఏమి ఫేస్ భద్రం కేర్ఫుల్ నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులు పడి చిలక కొయ్యకురి పెట్టుకుందిరయ్యా అందరిలో దుఃఖం పొంగింది అందరూ నిజంగా ఇవ్వడం మొదలుపెట్టారంట దేవి గారు వాళ్ళ నాన్నగారు తన మా అమ్మ కూడా చనిపోయి అప్పటికి ఒక రెండేళ్ళ కుమార్ గారు వాళ్ళ నాన్నగారు పోయారు అప్పుడే ఆ మధ్యలో అంద గుర్తొచ్చింది మీరు నమ్మరు ఇట్లా ముగ్గురం
(02:30) ఇట్లా ఇలా తల ఇలా కలుసుకొని అందరం ఆ పాట నేను పాడుతూ అందరం ఏడవడమే ఊరయ్యో మాయ్యా ఊరయ్యో కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది వంశి ఆడా సర్ నమస్కారం నమస్తే అన్నిటికంటే ముందు ఫస్ట్ అఫ్ ఆల్ అంటే కంగ్రాచులేట్ చేయలేను కానీ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గెట్టింగ్ ది ప్రైడస్ట్ మూమెంట్ ఫర్ తెలుగు ఆస్ అంటే చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకున్న స్కోప్ దొరకలేదు నాకు కలిసి ఉంటే అప్పుడే చెప్పేవాడిని బట్ ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నాను థాంక్యూ వెరీ మచ్ సర్ ఫర్ దట్ థాంక్యూ వంశి గారు మీ మీ నుండి అంటే మీ
(03:21) ద్వారా తెలుగు ప్రేక్షకుల అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఆ పురస్కారం వచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ళు అవుతుంది అవును సార్ ఇప్పుడు మళ్ళీ మార్చ్లో రాబోతుంది మూడో సంవత్సరం రాబోతుంది అది 95 96 97 98 రాబోతుంది అయినా కూడా ఇంకా తాజాగానే ఉంది ఆ విజయం తాలూకు అనుభూతి విజయం తాలూకు ఆనందం ఇంకా తాజాగానే ఉంది నేను ఎక్కడైనా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోనే ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంటే కొత్త వాళ్ళు నన్ను కలవని వాళ్ళు కలిసినప్పుడల్లా మళ్ళీ కంగ్రాచు చెప్తుంటే నేను అంటుంటే ఏంటి ఇంకా మనకు ఆ విజయోత్సవ విజయానందం ఇంకా తగ్గలేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రతిష్టాత్మ
(03:56) కమైన అంత గొప్ప విజయం మన తెలుగు వాళ్ళకి మన పాటకి అందులో నాకు రావడం నేను నిజంగా నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కొన్నాళ్ళు అది రావడం అన్నది అది అదృష్టం ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఎంతో మంది మేధావులు ఎంతో గొప్ప గొప్ప కళాకారులు మన తెలుగులో ఉన్నారు మన దక్షిణ భారతదేశంలో మన భారతదేశంలో ఉన్నారు. అలాంటిది సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ భారతీయులకు వచ్చింది.
(04:25) కానీ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ అది మనకు రావడం అన్నది నిజంగా మన అదృష్టం రాజమహల్లి గారి ముందుచూపు అండ్ అంటే మీరు ఎక్కడో మాట్లాడుతున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 15 సార్లు అక్కడ నామినేట్ అయినా కూడా చాలా మందికి దక్కలేదు అవార్డు. అలాంటిది మనకి ఈ మూవీకి ఫస్ట్ అటెంప్ట్ లో ఇమ్మీడియట్ గా రావడం అనేది అదృష్టం అనే మాట ఎందుకోసం ఉపయోగించాను ఎందుకంటే 15 సార్లు నామినేట్ అయిన డోయన్ వారిన ఆవిడకి 15 సార్లు నామినేట్ అయింది.
(04:52) 15వ సారి మనతో పాటు నామినేట్ అయింది. అయిన తర్వాత కూడా ఆవిడక అప్పుడు మళల ఆవిడ నన్ను స్విమ్మింగ్ పూల్ దగ్గర కలిసి ఆవిడ నన్ను అభినందించింది ఏంటంటే ముందే ఏముందంటే అంటే నెల ముందే నేను వెళ్ళామ అన్నమాట ఒక లంచ్ కి పిలిస్తే వెళ్ళినప్పుడు అప్పుడు డోయన్ వారం కలిసి నన్ను స్విమ్మింగ్ పూల్ దగ్గర నేను ఉంటే వచ్చి పలకరించింది.
(05:10) నన్ను గుర్తుపట్టింది ఎందుకంటే నన్ను ఎందుకు మమ్మల్ని ఎందుకు గుర్తుపడతారు అంటే మన ఆర్ఆర్ ఆర్ఆర్ మొహాలు కదా చూడగానే గుర్త ఆర్ఆర్ఆర్ కదా మన ఇండియన్ ఫేస్ కాబట్టి వాళ్ళకి గుర్తు వచ్చి ఆవిడ అభినందనలు తెలుపు కంగ్రాాట్స్ ముందే చెప్తున్నాను మీకు మీరు మీకు వస్తుంది రాబోతుంది యు గైస్ ఆర్టింగ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ అవార్డ్ అంది అనగానే నాకు అర్థం కాలేదు నేను అయోమయంగా చూశను ఎందుకంటే నాకు నమ్మకం ఉంది మీ మీద ఈ పాట ఖచ్చితంగా వస్తుందని అనుకున్న చెప్పింది అంటే అప్పుడు 15వ సారి ఆవిడది దాని తర్వాత తవాత మళ్ళీ తర్వాత బార్బీకి వచ్చింది కదా బార్బీకి వచ్చిన ఆ సంవత్సరం
(05:42) కూడా ఆవిడ నామినేషన్స్ లో ఉంది అప్పుడు ఫైర్ ఇన్సైడ్ అనే పాటకు గాను ఆవిడ నామినేట్ చేయబడింది 16వ సార్ 16 టైం అంటే 16 సార్లు ఆ అకాడమీ వేడుకకు వచ్చింది నామినీస్ కూర్చునే కుర్చిలలో కూర్చుంది ఆ అలాగ ఆ పోటీలో ఆ పిలుపు వరకు ఎదురు చూసింది కానీ రాకుండా వెనక్కి తిరిగి ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. 16వ సారి వచ్చినందుకు 16 సార్లు నామినేట్ అయినందుకు ఆవిడకు ప్రత్యేకంగా ఒక ఆస్కారం ఇచ్చారు.
(06:10) ఓ ప్రత్యేక నామినేట్ ఆ నామినేట్ ఇన్ని సార్లు ఎక్కువ సార్లు నామినేట్ అయినందుకు గాను ఒక గౌరవార్థం ఆవిడకి ప్రత్యేకంగా ఒక ఆస్కారం ఇచ్చారు కానీ పాట ఇంతవరకు రాలేదు. అలాంటిది మొదటిసారి మన పాట నామినేట్ అవ్వడం మొదటిసారి నామినేట్ అయినప్పుడే మొదటిసారే మనం అవార్డు కొట్టడం అన్నది నిజంగా ఇది అది ఎలా నిర్వచించాలో నాకే తెలియలేదు.
(06:29) నేను ఒక మాటతో దాన్ని నిర్వచించడానికి ప్రయత్నించాను ఏంటంటే స్వప్నంలో కూడా స్వప్నించని స్వప్నం అది [నవ్వు] ప్రాడస్ట్ మూమెంట్ సార్ అండ్ సార్ మీ పాటల్లో 3800 ప్లస్ పాటలు ఆల్మోస్ట్ 850 ప్లస్ మూవీస్ లో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. ఈ సాంగ్స్ అన్నిటిలో కొన్ని సాంగ్స్ అయితే ఇది కూడా సరే రాసారా ఇది కూడా ఇనే రాసారా ఇది కూడా ఇనే రాసారా అన్న మూమెంట్స్ చాలా ఉన్నాయి నాకు అందులో నేను బాగా ఆ ఒక్కొక్క సాంగ్ ని ఒక్కొక్కలాగా ప్రయాణం చేస్తాను దాంతో పాటు మనం కొంతమందికి ట్రావెల్ సాంగ్ సిస్టం ఉంటాయి కొంతమందికి మోటివేషన్ సాంగ్స్ సిస్టం ఉంటాయి. అందులో నాకు ఒక్క సాంగ్
(07:00) చాలా ఇష్టం అండ్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాను ఆ పాట గురించి మాట్లాడి ఈ నాగార్జున గారిది నేనున్నాను అనే ఒక మూవీ ఉంది. అవును నేనున్నాను అందులో ఒక చీకటితో వెలికే చెప్పాను అనే ఒక పాట అవును సో అందులో తగిలే రాలు అనే స్పెషల్ ఆ లైన్స్ అయితే చాలా చాలా గట్టిగా నాకు బాగా క్లోజ్ గా అనిపిస్తాయి ఆ పాటలు ఆ లైన్స్ విన్న ప్రతిసారి నేను జర్నీ గుర్తు తెచ్చుకోవడమో లేకపోతే కొంచెం అరే మోటివేట్ అవ్వడమో అలాంటిది అవుతా ఉంటది.
(07:25) ఒక్కసారి ఆ పాటతో ఒకసారి మీరు పాడితే బాగుంటది అనిపించింది సర్ తప్పకుండా అది నాకు రెండవ నంది తీసుకొచ్చిన పాట మొదటి మొదటి పాట నంది వచ్చిన మొదటి పాట నీ నవ్వుల తెల్లదనాన్ని తర్వాత రెండో పాట చీకటితో వెలిగి చెప్పిన పాట ఇది ఆదిత్య గారు సందర్భం చెప్పిన తర్వాత నేను ట్రైన్ లో నేను కేరవాణ గారు ప్రయాణం చేస్తూ చెన్నై వెళ్తున్నాను ట్రైన్ లో వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు నేను ఉన్నాను అనే ఆ శీర్షిక టైటిల్ చెప్పారు.
(07:49) చెప్పిన తర్వాత ఆ సందర్భం చెప్పిన తర్వాత ట్రైన్ లోనే కొన్ని ఆలోచనలు వచ్చాయి వెళ్ళిన తర్వాత చెన్నైలో కూర్చొని ఒక రాత్రి అంతా కూర్చొని పాట రాశను రాసినదానికి కేరవాన్ గారు స్వరాలు సమకూర్చారు రాసిన తర్వాత బాని కూర్చబడిన పాట అది అంటే రాసిన తర్వాత బాని కూరిస్తే వచ్చే అందం వేరు పాట ఆ శోభ ఆ కళ అది వేరు ఉంటుంది అన్నమాట ముందు అంటే మామూలుగా రాసుకుంటూ వెళ్ళాను ఆ వాక్యాలు చూసేసి హార్మోనియం పెట్ట మీద అలా కూర్చ అలా ఇలా ఇలా అనుకుంటూ వాక్యాలు చదువుకుంటూ నవ్వుకుంటూ లోపల లోపల మనసులో అనుకుంటూ ఒక్కసారిగా బయటికి వెలువలాగా వచ్చింది బాని ఆ మాట
(08:23) గారికి వచ్చినప్పుడు చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఊటమితో గెలుపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని తగిలేరాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని కాల్చే చేనిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతూ గమ్యం చెప్పెను
(09:31) నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని గ్రేట్ లైన్స్ అసలు అసలు ఎన్నిసార్లు విన్నా ఆ అంటే దాని మీద ఆ మనసు పోదు అంటే తనివి తీరదు అనిపిస్తది. ప్రతిసారి డౌన్ ఉన్నప్పుడల్లా వింటా ఉంటా ఆ పాట నేనైతే తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని మీకుఎంత అమితంగా నచ్చిన వాక్యం అయితే అందులో నాకు అమితంగా నచ్చిన వాక్యం కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని చాలా కవితాత్మకమైన లోతైన అర్థం ఉన్న వాక్యం ఎందుకంటే కన్నుల్లో నీరు ఉంటుంది కన్నీరు ఉంటుంది బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు మనం బెంబెలెత్తిపోయి కన్నీరు కారుస్తాం నేను ఏమన్నాను అంటే కన్నుల నీరు
(10:15) కన్నీరును వృధాగా కార్చొద్దు కన్నుల్లో నీరున్నట్టే కన్నుల్లో కలలు కూడా ఉంటాయి ఆ కలల పంటను సాగు చేయడానికి నీరు ఏంటి ఒక పంట సాగు చేయడానికి నీరు కావాలి కదా ఆ కలల పంటను సాగు చేయడానికి నీరు కన్నీరే దానికోసం వినియోగించు దానికోసం అది ఉపయోగించాలి ఆ నీరును అని చెప్పే మాట నాకు బాగా నచ్చిన మాట మామూలుగా మనకు ఇప్పుడు మీకు మీరు అలా ఒక్కొక్కసారి మనం ఎత్తు పల్లాలు ఉంటాయి మనం కింద ఉన్నప్పుడు గానీ మనం మన నిరాశతో కృంగిపోతున్నప్పుడు గాని నిస్పృహలో ఉన్నప్పుడు గాని ఆ ఇలాంటి పాటలు మీకు చేయుతని ఇస్తాయి ఒక చెయ్యి పట్టుకొని నడిపిస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి భుజం
(10:55) తడతాయి వెన్ను తడతాయి ఇప్పుడు నాకు కూడా నిజం చెప్పాలంటే నాకు కూడా ఇలాంటి సందర్భం నాకు వస్తుంది ఇప్పుడు మీకు ఎలాగైతే ఎత్తు పల్లాలు ఉంటాయో నాకు అలాగే అలాంటి సమస్యల స్థితిలో నేను ఉంటాను నాకు వచ్చినప్పుడు కూడా నేను నా పాటలే పాడుకుంటాను మీ పాటలు నా పాటలే పాడుకుంటాను నా పాటలే గుర్తు చేసుకుంటాను ఆ పాటలు రాసిన సందర్భం గుర్తు చేసుకుంటాను అది పొందిన విజయాన్ని గుర్తు చేసుకుంటాను అది అది ఇచ్చిన ఆనందాన్ని గుర్తు చేసుకుంటాను.
(11:22) ఆ గుర్తు రావడం వల్ల నాకు నేను ఆ సమస్యలో నుంచి ఆ స్థితిలో నుంచి బయటిక వచ్చి మళ్ళీ కొత్త పనికి సమాయత్తం అవుతుంటాను. అండ్ అంటే అప్పట్లో నాకు బాగా గుర్తు సార్ చిన్నప్పుడు మా మదర్ దగ్గర ఒక వాక్మన్ ఉండేది. ఆ వాక్మన్ లో అంటే ఇప్పటిలో చాలా మంది తెలియకపోవచ్చు కూడా వాక్మన్ అంటే ఏంటో అప్పట్లో ఆ వాక్మన్ లో క్యాసెట్స్ వచ్చేవారు మా ఫాదర్. ఉ సో ఫలానా సినిమా గురించి తెలిసినప్పుడు ఈ మూవీది క్యాసెట్ తీసుకొని రా అని చెప్పేవారు ఆ మూవీ గురించి తెలవడమే చాలా రేర్ అంటే మూవీస్ లో సాంగ్స్ ఎట్లా ఉన్నాయో తెలివా ఫస్ట్ మూవీ చూడకుండా ఎట్లా తెలుస్తది అవును క్యాసెట్ ద్వారానే తెలుసు
(11:48) సో అట్లా అప్పట్లో వ్యూవర్ ఆస్పెక్ట్ లో ఆడియన్స్ ఆస్పెక్ట్ లో ఇలా తెలిచేదేమో కానీ మీ దగ్గర అంటే ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు లేకపోతే రాసిన వాళ్ళకి మీకు ఆ క్లారిటీ రావడానికి ఈ సాంగ్ హిట్ అయింది ప్రజల్లోకి వెళ్ళింది బాగా ఆదరణ పొందుతుంది అని తెలియడానికి మీకు ఆ మెట్రిక్స్ ఇప్పుడంటే YouTube వ్యూస్ అవ్వని ఉండేవి.
(12:04) అవును అప్పట్లో మీకు ఎలా తెలుసా అసలు ఒక సాంగ్ వెళ్తుంది ప్రమాణం ఏంటి కొలమానం ఏంటి అప్పుడు ఎలా ఎలా కొలుస్తాం ఎలా తూకం వేస్తాం ఇప్పుడు వ్యూస్ ని బట్టి మనం చూసి ఇప్పుడు యూట్యూబర్ రాగానే 5 మిలియన్ టెలిమెంట్ చూసి మనం చూసి ఓ పాట హిట్ అయిందా కాదా అని చెప్తాం అప్పుడు ఏంటంటే జనాల నోళ్ళలోనే ఆ ఎంత నానింది వాళ్ళకి ఆ పాట ఎంతో చేరి ఉంది అనేది వాళ్ళ మాటల ద్వారా తెలిసేది నేను నేను కొత్తలో స్టూడెంట్ నెంబర్ వన్ పాటలు రిలీజ్ అయిన కొత్తలో నేను మొత్తం పాటలు రాసాను మ్ మొత్తం పాటలు రాసినప్పుడు నాకేంటంటే అప్పుడు అన్ని క్యాసెట్లే రైట్ అన్ని క్యాసెట్లు నేను కొత్తగా మన
(12:36) స్టూడెంట్ నెంబర్ కంపెనీ వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక 50 క్యాసెట్ తీసుకున్నాను నేను వాళ్ళు నాకు 50 క్యాసెట్లు ఇస్తే నేను కార్లో బ్యాగ్ లో వేసుకొని ప్రతి నాకు తెలిసిన వాళ్ళందరికి వెళ్లి ఇచ్చాను సినిమా వాళ్ళకు నా స్నేహితులకు మిత్రులకి తెలిసిన వాళ్ళందరికీ పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఇదిగో నేను అన్ని పాటలు రాసాను అని చెప్పేసి వాళ్ళకి వెళ్లి వాళ్ళ క్యాసెట్ ఇచ్చాను.
(12:55) అంటే అలా అలా ఇచ్చి నా సంతోషం కొద్ది నేను ఇలా మంచి పాటలు రాసాను ఎక్కడో పుట్టి పాట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి పడ్డా అన్ని వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు లేదంటే నేను రోడ్డు మీద కలిసినప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేదంటే ఎక్కడైనా ఎదురైనప్పుడు నాకు ఆ పాటల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎందుకంటే పాటల గురించి వినడానికి పాటల గురించి సంభాషించడానికి ఎక్కువ సమయం ఉండేది ఎక్కువ సమయం ఉండేది ఎక్కువ వ్యవధి ఉండేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాం కదా అప్పుడు నెలకి ఒక నాలుగు సినిమాలు విడుదలఅయ్యేవి అందులో నేను రెండు
(13:24) సినిమాలు రాసేవాడిని ఇప్పుడు వారానికి ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే నెలకు దాదాపు ఒక 25 30 సినిమాలు విడుదల అవుతున్నాయి రోజు ఒక పాట విడుదల అవుతుంది అంటే 30 పాటలు విడుదల అవుతున్నాయి అంటే పాటలు ఎక్కువైపోయాయి ఇప్పుడు వేగం పెరిగింది బాగా ఆలోచన దృక్పదాలు మారాయి కానీ పాటల నాణ్యత ఇప్పటికీ బాగుంది 30 పాటలు వచ్చినా కూడా అందులో మంచివి వింటున్నారు దానికి సంబంధించిన వీక్షణలు వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి.
(13:49) రైట్ అప్పుడు ఏంటంటే కేవలం కొలమానం ఏంటంటే మనుషులు కలిసినప్పుడు మాట్లాడటం ఫోన్ చేయడం మాత్రమే కొలమానం అది ఒక్కటి ఎందుకంటే పాట బాగుందంటే ఎలాగైనా సరే పట్టుకొని చెప్పేసి నేను క్యాసెట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా రెండు మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ నేను జూబ్లీ హిల్స్ లో నా కార్లో వెళ్తుంటే కార్లో నుంచి కూడా వాళ్ళు చూసి చాలా బాగుంది ఆ పాట చాలా బాగుంది ఆ పాట నాకు గుర్తుంది ఇప్పటికీ ఆ ఆ కార్లో వెళ్తున్న మా మిత్రుడు ఒకాయన ఆయన అన్నారు సింగారం అనే దారంతో చేసింది చీర ఆనందమనే రంగులనే అద్దింది చీర మమకారం అనే మగ్గంపై నేసింది చీర మమకారం అనే మగ్గంపై నేసింది
(14:25) చీర అనే మాటను కార్లో నుంచి వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళారు నాకు ఆయన అప్పుడు అలా ఉండేది అభినందన ఆ రూపంలో ఉండేది అంటే నిజమైన అభినందన మనసు లోతుల్లో నుంచి వస్తే గనుక అది గుర్తుపెట్టుకొని ఆ మనిషి ఎదురైనప్పుడు కచ్చితంగా చెప్పాలన్న ఒక బలమైన ఆలోచనతో చెప్పేవాళ్ళు ఇప్పటికీ నాకు అభినందన గుర్తుంది ఒక మిత్రుడు ఇచ్చిన అభినందన ప్రశంస అది అంత బలంగా ఉండేది అప్పుడు అంటే ఇప్పుడు మీరు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ లోనే ఈ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరికి అనే పాట ఇప్పటికి ప్రతి కాలేజ్ స్కూల్లలో ఫెయర్ వెల్స్ కి వింటా ఉంటాం ఆ పాట మా స్కూల్ లో
(14:54) కూడా అయింది అది మా కాలేజ్ లో కూడా అంటే అందులో కొన్ని సన్నివేషాలు గురించి ఉంటాయి కదా సార్ బాటనీ మాస్టర్ అనే పేరు తీసుకొచ్చి లేకపోతే టైపిస్ట్ కస్తూరి అని తీసుకొచ్చి కోకటి అని చెప్పి నాతో పాటు పడ్డానండి ప్రేమలో మరి అది ఎంత ఈజీగా పాడుకునే ఒక పాటలాగా అయిపోయింది. నేను బాగా అప్పట్లో పెళ్లిలో బాగా ఉండేటిది ఈ పాటలని సో అంత కాన్వర్సేషనల్ సాంగ్స్ లాగా చూస్తుంది మాట్లాడుకుంటుంటే ఒక ట్యూన్ యాడ్ అయిందిరా అన్నట్టు ఉంది.
(15:15) సో అంటే మీ మీ స్టైలి మీ స్టైల్ ఇలా ఉండడానికి రీసన్స్ ఏమన్నా ఉన్నాయా అసలు అంటే ఎవరిదన్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక స్టైల్ ఉంటది అన్నట్టు మీకు ఈ స్టైల్ రావడానికి ఇఫ్ వ కెన్ టాక్ అబౌట్ ఉంది కారణం ఉంది ఏంటంటే ఇలాంటి శైలి ఇలాంటి బాని నేను ఏర్పరచుకోవడానికి ఒక కారణం ఏంటంటే మా అమ్మ ఓకే ఎందుకంటే మా అమ్మకు చదువు రాదు. నిరక్షరాసురాలు చదురాక చాలా లోక జ్ఞానం ఉంది చాలా తెలివి తేటలు ఉన్నాయి మా అమ్మకి మీరు వరంగల్ నుంచి కదా మాది వరంగల్ చల్లగరిగనే గ్రామం మాది మేము నలుగురం పిల్లలం నేను చిన్నవాడిని మా అమ్మ కి చదువు రాదు కాకపోతే లోకజ్ఞానం లోక పరిజ్ఞానం చాలు
(15:50) ఉందన్నమాట తను ఏంటంటే చదువు రాకపోయినా కూడా ఊరికి సరదాగా బతుకం పాటలు ఆ పాటలు పాట పాడుతుండేది ఇంటి రోజు పొలం పనులకి పోయి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని పాడుతుండేది నేను వినేవాడిని చాలా తేలిగ్గా చాలా సరళంగా చాలా సులభంగా ఉండేవి ఆ మాటలు అలా అలా అలా అమ్మ ద్వారా పక్కనే ఉన్న గుడిలో పక్కనే ఉన్న గ్రంధాలంలో అలా చదువుకొని నేర్చుకొని వీని నేర్చుకొని అలా నాలో పాట మీద మొక్కవ పాట మీద ఇష్టం ఏర్పడిపోయింది.
(16:14) సినిమాల్లోకి వచ్చిన తర్వాత పాట రాసేప్పుడు నాకు ఏకైక నాకున్న ఏకైక లక్ష్యం ఏకైక ధ్యేయం ఏంటంటే నేను రాసే ప్రతి పాట అమ్మ పాడిన పాట అంత సులభంగా ఉండాలి అమ్మకు అర్థం అవ్వాలి. చదువు లేని చదువు రాని అమ్మకు కూడా అర్థమైతే అఖిల లోకానికి అర్థం అవుతుందన్న సృద్దేశంతో ప్రతి పాట అంతే సులభంగా రాస్తూ వచ్చాను. తర్వాత నాకు గీత రచ చేతుల్లో ప్రాణము దైవము గురువుతో సమానమైన ఆచార్య ఆత్రేయ గారు కూడా చాలా సులభమైన మాటలు రాసేవారు మొత్తం ఆత్రేయ గారి పాటలుఅన్నీ కూడా 1200 1300 పాటలు ఉన్నాయి అన్నిట్ిలో దాదాపు 200 మాటలు ఉపయోగించారు ఆయన 200 300 మధ్యలో మాటలు ఉపయోగించారు. అన్ని
(16:59) తక్కువ మాటలతో ప్రతి మాటలో మొత్తం కలిపి ఆయన రాసిన మొత్తం 1300 పాటల్లో మొత్తం మాటల సంఖ్య రెండు నుంచి 3 300 మధ్యలో ఉంటాయి అంతే అదే మాట అదే మనసు అదే మమత అదే మనిషి అదే బ్రతుకు అదే వలపు అదే ప్రేమ కాకపోతే మాటల్ని రకరకాల కూర్పులో గొప్ప గొప్ప భావాలు సృజించారు ఆయన ఎందుకంటే ఇక్కడ మాటలు మాటలు మాటలు గొప్ప కాదు మాటల పొందికలో ఏర్పడిన ఆలోచన వచ్చిన భావం వచ్చిన అర్థం గొప్ప విషయం అట్లాగ అంత తేలిగగా ఉండాలన్నది ఆచార్య ఆత్రేయ గారిని చూసి నేర్చుకున్న తర్వాత మా అమ్మకు అర్థం అవ్వాలన్న లక్ష్యంతో ఇలా తేలిగగా రాయడం మొదలుపెట్టాను.
(17:37) మా గురువుగారు అమ్మ ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఇలా సులభంగా రాయడం మొదలుపెట్టాను. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఒక రచయితగా నేను మాట్లాడుతున్నా ఒక రచయితగా పాట రూపంలో మాట్లాడుతున్నా అంటే పాట గేయ రూపంలో నేను సంభాషిస్తున్నా నా సంభాషణను నా మాటను నేరుగా నేను శ్రోతతో సంభాషించాలి. వినేవాళ్ళతో నేరుగా నేను ప్రేక్షకుడితో సంభాషించాలి శ్రోతతో సంభాషా మా ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తి ఉండకూడదు నేను నేరుగా మాట్లాడాలి నేను మాట్లాడితే శ్రోతకు అర్థం కాకపోతే అది నా వైఫల్యం రైట్ నేనేదో కొత్త కొత్త మాటలు కొత్త కొత్త భాషలు క్లిష్టమైన సమాసాలు పదాలు ఆ గొప్ప
(18:18) అర్థం కాని స్థాయిలో మాట్లాడి అతన్ని బెదరగొట్టడం దరగొట్టడం నేను చేయకూడని పని నాకు 20 సన్నివేశాల్లో చెప్పలేని భావాన్ని అందించలేని భావాన్ని ఒక ఐదు నిమిషాల పాటలో చెప్పాలని దర్శకుడు నాకు పని అప్పగించాడు. ఆ పనిని నేను ఎప్పుడు సవ్యంగా చేస్తాను అంటే ఈ నేను రాసిన ప్రతి మాట అర్థమయి ఆ భావానికి స్పందిస్తే గనుక ఆ పని నేను సక్రమంగా చేసినట్టు లేదంటే నేను సక్రమంగా చేయనట్టు నేను మోసం చేస్తున్నట్టు అబ్సల్యూట్లీ అది అండ్ అంటే నేను శ్రీ గారు అన్నట్టు మీరు మీరు కూడా ఒక దగ్గర ప్రస్తావించారు కఠినంగా రాయడం సులభం సులభంగా రాయడం కఠినం అని
(18:53) ఇలా ఎందుకంటే ఎందుకంటే భాష అనేది ఊపిరి లాంటిది భాష అనేది ఊపిరి లాంటిది అంటే అది చిరుగాలిలాగా ఉండాలి ఆ చెరుగాలి అయినప్పుడే అది ఊపిరిస్తుంది. సుడిగాలి అయినప్పుడు ఏం చేస్తుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాబట్టి ఎప్పుడు భాష ఊపిరి చెరుగాలలాగా ఉండి ఊపిరి అంది ఇవ్వాలని నా ఉద్దేశం. అలాగే రాసిన ప్రతి పాటలోన ప్రతి మాట కూడా అర్థమయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాను.
(19:19) ఏదనా కఠినమైన పదం వస్తే ఏదో ఒక సందర్భం ఏదో ఒక అవసరం ఏర్పడి ఉంటేనే ఒక కఠినమైన శబ్దానికి అక్కడ స్థానం ఏర్పడుతుంది తప్ప లేదంటే నన్ను నాకోసం నన్ను వదిలేస్తే గనుక నేను అన్ని సులభంగా చక్కగా అందుకోసం ఇప్పుడు మీరు రాసి మీరు మీరు ప్రస్తావించిన స్టోరీ నెంబర్ పాటలు కూడా మా అమ్మక ఎన్నిసార్లు పాడుకుందో ఆ పాట బోటని మాస్టర్ బోడిగుండు పైన బోలెడు జోకులు రాగిని మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టర్ స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్ట్ కస్తూరి కాతోలు తాగిన కోకుటిన్లు బాత్్రూముల్లో ఉన్న భావి కవితలు క్లాసు రూముల్లో ఉన్న కుప్పి గంతులు మరపురాని తిరిగిరాని
(19:53) గురుతులన్నీ గురుతులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి అంటే మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి మేమ మీ మిస్ సాల్వ్ ద ఫన్ అన్ని తెలిసిన మాటలే తెలిసిన పదాలే కానీ తెలిసిన మాటల్లోనుంచి తెలియని భావాలు సృష్టించాలి కవి గొప్పతనం అదే సృష్టికర్త కవి అంటే పోయెటిస్ అనే ఒక గ్రీక్ గ్రీక్ పదం ఉంది పోయటిస్ పోయెట్స్ అనే గ్రీక్ పదం అర్థం ఏంటంటే సృష్టికర్త అని అర్థం దాంట్లో నుంచి పోయెట్ అనేది వచ్చింది రైట్ అది కొత్త కొత్త భావాలని కొత్త కొత్త ఆలోచనలని సృష్టించే వాళ్ళం కాబట్టి పోయట్ అనే పదం అండ్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏమ
(20:29) వచ్చిందంటే సర్ ఈ కాన్వర్సేషన్ సాంగ్స్ రాసేటప్పుడు అది కూడా ఇంత క్వాంటిటీలో రాసేటప్పుడు అంటే ఆల్మోస్ట్ 4000 పాటలు 3800 అంటే దగ్గర దగ్గర 4000 పాటలు ఇన్ని పాటల్లో ఎన్ని లైన్స్ ఉండి ఉంటాయి లక్షల్లో లైన్స్ ఉండిఉంటాయి అంటే వేలల్లో లైన్స్ ఉంటాయి 100% ఈ లైన్స్ లో రిపిటేషన్ రాదా అసలు ఎన్ని గుర్తుపెట్టుకుంటారు మీరు ఆర్ కొన్నిసార్లు అనిపిస్తది కదా ట్యూన్ మళ్ళీ రిపీట్ అయిందేమో అన్న ఫీలింగ్ వస్తది.
(20:50) అట్లా ఒక ఒక లైనే మళ్ళీ రిపీట్ అవ్వదా కొంచెం సిమిలారిటీస్ ఉండవా అనే ఒక డౌట్ వచ్చింది అన్నమాట నాకు ఆ మంచి ప్రశ్నే ఎందుకంటే నేను ఏంటంటే పాట రాసినప్పుడు నేను నా ఒక పాట మీకు ఒక పాటే అవును ఆ ఒక పాట మీకు ఒక పాటే నేను 300 3800 పాటలు రాస్తాను మీకు అది 300 పాటలే కానీ ఈ 3800 పాటలు రాయడానికి నేను ఎంత సాధన చేశాను ఎంత కృషి చేస్తాను అంటే ఒక పాట రాయడానికి దాదాపు ఒక ఒక నాలుగు రోజులు సమయం తీసుకుంటే గనుక ఆ ఒక పాటను నేను ఒకేసారి పాడను దాదాపు ఒక 100 సార్లు పాడుకుంటాను.
(21:24) ఆ ఒకే బాణిలో పొందుపరచబడిన మాటల్ని పాటగా మలిచే ముందు 100 సార్లు పాడుకుంటాను కాబట్టి నాకు 3000 నా ఆ బానికే పాడుకుంటాను 3800* 100 నాకు అంటే అన్ని సార్లు ఆ పాటలు పాడుకున్నాను నేను అంటే అంత గుర్తుంటుంది కాబట్టి రాసిన వాక్యం మళ్ళీ కచ్చితంగా రాదు రాబోదు ఏదో ఒకటి రెండు సార్లు కావాలని దర్శకుడు అడిగితే తప్ప ఎందుకంటే నేను అన్ని వేల సార్లు నేను పాటలు పాడుకున్నాను అన్ని వేల పాటలు నా మస్తిష్కంలో ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పునరావృతం అయ్యే అవకాశం నాకు ఖచ్చితంగా ఉండొచ్చు.
(21:58) ఎందుక మీరు లెక్క చెప్తుంటే నాకు ఇంకో లెక్క ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు 3800 పాటలు రావడానికి కొన్ని పాటలు ఫస్ట్ అటెంప్ట్ అయిపోయి ఉంటాయి అప్రూవ్ కూడా అయిపోయి ఉంటాయి. కొన్ని పాటలు మీకు నచ్చకో దశకుడు నచ్చకో లేకపోతే ఏదో రీజన్ వల్ల మళ్ళీ రాయాల్సి వచ్చేది. సో ఒక్కోదానికి రెండు వర్షన్లు ఉన్నా కూడా అప్రాక్సిమేట్లీ 5000 పాటలు రాసి ఉంటాయి ఉంటాయ ఉంటాయి.
(22:15) ఇప్పుడు ఉదాహరణకి ఒకే బాణ ఉంటుంది. ఆ దానికి ముందు మేము రాసిన మాటలు ముందు రాసిన పదాలు వేరే ఉంటాయి. ఓకే భావాలు వేరే ఉంటాయి తెలుగింటి తులసి మొక్క నీలా ఉంటుంది నీలా ఉంటుంది కోవెల్లో కొబ్బరి మొక్క నీలా ఉంటుంది నీలా ఉంటుంది ఇది ఫస్ట్ పాట ఏంటిది ఆకాశం అమ్మాయి అయితే దానికి ముందు రాసిన మాట ఇది ఓహో గుండెల్లో భూకంపాలే సృష్టించింది సృష్టించావే నీవు కళ్ళల్లో భూచక్రాలే తిప్పావే నీవు అని రాసాను రాసిన తర్వాత గుండెల్లో భూకంపాలే వచ్చింది వచ్చింది నీ వాళ్ళే అని రాస్తే బాగుంది అన్నారు కానీ ఇది కొంచెం డబ్బింగ్ సాంగ్ లాగా ఉందని హరిశంకర్ గారు అన్న గుండెల్లో భూకంపాలు
(23:00) కళ్ళల్లో భూచక్రాలు కొంచెం డబ్బింగ్ సాంగ్ లాగా ఉందన్న తెలుగులో రాయండి మీకు తెలుగు అంటే అభిమానం నాకు తెలుగంట అభిమానం అనగానే వెంటనే తెలుగింటి తులసి మొక్కనేలా ఉంటుందని రాశను ఆయనకు నచ్చింది కానీ దేవి గారు ఏమన్నారంటే తెలుగింటి తులసి మొక్క కోవెల్లో కొబ్బరి మొక్క బాగుందండి కాకపోతే మన సినిమాలో హీరో ఇప్పుడు శోభన్ బాబు గారు అనుకుంటున్నారు మీరు కాదు మన కళ్యాణ బాబు గారు గారు కొంచెం ఈ ట్రెండ్ తగినట్టుగా రాయండి అనగానే ఇంకా ఇదే ఆలోచనతో ఇదే మనసులో ఇదే మొత్తం అలా మెదులుతూ ఉంటే కార్లో నేను డ్రైవ్ చేసుకుంటూ మా ఇంటికి వెళ్తున్నాను మనక కొండకి వెళ్తున్నాను
(23:32) ఆఫీస్ నుంచి ఇక మనసులో ఇదే బాని తానానా తానానా ఏం చేయాలి ఏం చేయాలి ఏ మాట రాయాలి అని ఆలోచిస్తూ ఉంటే రాయదుర్గంలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగాను ఆగిన తర్వాత పెట్రోల్ కొట్టిద్దాం అని ఆగేసరికి అక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు. ఓకే అక్కడందరూ అమ్మాయిలే పెట్రోల్ వేసేవాళ్ళు డబ్బులు తీసుకున్నవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు లేరు ఓకే అద్దాని ప్రత్యేకత బంక్ ప్రత్యేకత నేను అలా అద్దం దించి ఏం కావాలండి అనగా పెట్రోల్ వేయండి అన్నా అనగానే ఇలా చూసాను అమ్మాయి ఉంది పైకి చూసాను ఆకాశం అమ్మాయి ఆకాశం ఆకాశం అమ్మాయి ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది ఆనందం చిందులు
(24:06) వేస్తే నా అల్లరి చేస్తే నాలా ఉంటుంది నాలా ఉంటుంది పెట్రోల్ బంక్ లో భగ్గుమంటూ వచ్చింది వెంటనే దేవి గారికి ఫోన్ చేశ దేవి గారు ఒక పాట వచ్చింది పల్లవి వచ్చింది అనగానే చెప్పండి చెప్పండి ఆకాశం అమ్మాయి అయితే ఆనందం సూపర్ అండి ఇది కదా మాకు కావాల్సింది అనగానే మరి ఇప్పుడు ఏం చేస్తారు ారు ఆకాశం అమ్మాయి అయితే నేలా ఉంటుంది ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది మరి తర్వాత ఏం చెప్తారు ఆలోచించి అదే బాణలో వానల్లే నువ్వు జారితే నేలల్లే నేను మారితే వాగల్లే నువ్వు నేను కూడితే అది వరదై పొంగి సాగరమవుతుందే ఒక ముడి వేసాను వానల్లే నువ్వు జారితే నేలల్లే నేను
(24:43) మారితే వాగల్లే నువ్వు నేను కూడితే అది వరదై పొంగి సాగరం అవుతుంది హోలా హోలా హోలా అని ఒక ముడి వేసాను వెంటనే అది నచ్చిందన్నమాట అంటే ఒక పాట రాయడానికి ముందు రకరకాలుగా రాస్తాం రకరకాలుగా మనం అనుకుంటాం కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు ఒకేసారి నచ్చుత కొన్ని కొన్ని సార్లు రకరకాలుగా రాయాల్సి వస్తుంది అన్నమాట అట్లాగే మీకు బాగా చిరపరిచితమైన పాట ఇంకొకటి ఉంది ఏంటంటే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ దానికి ముందు రాసిన పాట ఏంటంటే ముందు రాజ రాజమయ గారు చెప్పిన సందర్భాన్ని బట్టి అమ్మాయి చెయ్యి అబ్బాయి ముట్టుకోవడానికి
(25:23) వెళ్తున్నప్పుడు అమ్మాయి దూరంగా వెళ్తుంది దూరంగా జరుగుతుంది బాధిస్తోంది వేధిస్తోంది హింసిస్తోంది అన్నారు. ఇది సందర్భం అనగానే బాధిస్తోంది వేధిస్తోంది హింసిస్తుంది అక్కడ మనసాగింది. ఏదో బానే ఉందని చెప్పేసి బాణి కీరవాణ గారు ఇచ్చారు. అందమైన హంస హంస ఎందుకీ హింసా హింస అంట నీవే హంసా హంస ఆపుని హింస హింస తెలుపన తీయని ఆశ నేర్పన తనువుల భాష తీరనిది ఘోష వాటిస్తే వన్నెలు కరిగిపోవు తెలుసా పెనవేస్తే ప్రేమలు పెరుగునంట తెలుసా అని రాశను అంతా అయ్యాక వెళ్తే గనుక రాజమ గారు అన్నారు బాగుంది ఉంది కానీ ఏదో హంసా హింసా అని చెప్పేసి పై పైన సర్దారండి ఉపరితలం మీద కానీ
(26:15) లోతుల్లోకి వెళ్తే ఇంకా బాగుంటుంది. ప్రేమికుడి తాలకు ఆ వేదన ప్రేమికుడు అనుభవించే ఆ క్షోభ అంతా ఆ యాతన అంతా కావాలనగానే అప్పుడు ఆలోచించి పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చింతకే రావద్దంటే ఏమవుతానమ్మ నేను పొందేటందుకే పుట్టానే గొమ్మ నువ్వు అందకపోతే వృద్ధా ఈ జన్మ అని మళ్ళీ ఆ పలవిల రాయడంతో నచ్చింది ఒక్క వర్డ్ రిపీట్ అవ్వకుండా అది దానికి దీనికి అసలు సంబంధం సంబంధం లేదు సంబంధం లేకుండా రాసే సంబంధం లేకుండా రాస సందర్భం అది రాసిన తర్వాత నచ్చింది. ఈ పాట రాయడానికి దాదాపు
(26:51) నాకు ఒక ఒక ఐదు రోజులు పట్టింది నాకు మ్ అంటే ముందు రాసిన దాని తర్వాత మళ్ళీ మళ్ళీ మార్చి మార్చడానికి ఐదు రోజులు పట్టింది. ఆ సంవత్సరం ఈ పాట విడుదలైన సంవత్సరం నాకు అక్షరాల ఈ పాటకు ఐదు పురస్కారాలు వచ్చాయి. ఈ ఒక్క పాటకి ఈ ఒక్క పాటకి రకరకాలుగా మనకు ఇచ్చేవాళ్ళ పురస్కారాలన్నీ ఐదు పురస్కారాలు ఈ పాటకి గాన వచ్చాయి. అంటే ఐదు రోజులు కష్టపడ్డాను ఐదు పురస్కారాలు వచ్చాయి అన్నమాట అంటే ఎంత సాధన చేస్తే సాధనమ ఉన్న పనులు సమకూరు ధరలోన అంటాం కదా సాధన చేస్తే కచ్చితంగా మనకు ఫలితం గుర్తింపు వస్తూనే ఉంటుంది.
(27:24) ఒక రోజు కాకపోతే ఒక రోజు గుర్తింపు వస్తుంది. ఎలా అంటే 20 సంవత్సరాల క్రింద రాసిన పాట ఇప్పుడు గుర్తింపు వచ్చింది. నమ్ముతా మీరు రాసిన పాట ఎవరికీ తెలియలేదు ఆ పాట తెలియలేదు ఆ సినిమా తెలియలేదు కానీ 20 ఏళ్ల తర్వాత నేను ఒక కార్యక్రమంలో ఆ పాట పాడాను పాడిన తర్వాత అప్పుడు దాని గుర్తింపు వచ్చింది. ఏ పాట సార్ ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్లే బడిలోన పలక నువ్వే బలపన్ నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్ని నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి
(28:11) ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఇది నేను ఒక స్టేజ్ మీద పాడుతున్నా ఆ వీడియో చూసాను నేను అక్కడ పాడిన తర్వాత అక్కడ వాళ్ళు షూట్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర మిత్రులకు పంపించుకోవడం కోసం షూట్ చేసి పంపిస్తే అది అలా అలా అలా బయటికవచ్చి బయటికవచ్చి మొత్తం ప్రజానికానికి తెలిసిపోయి ఈ పాట నాకు ఎనలేని గుర్తింపుని తీసుకొచ్చింది.
(28:39) మీరు అన్నారయ్యా అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయ్యాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారవు లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే అమేజింగ్ సార్ నేను చూసాను యాక్చువల్లీ ఈ వీడియో ఆ YouTube లో ఒక వీడియో వీడియో వచ్చింది మధ్యలో వైరల్ అయిపోయింది ఆ వీడియో చాలా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ మీటింగ్ లో
(29:42) పాడాను అన్నమాట వాళ్ళ సభలో పాడాను వాళ్ళందరూ ఈ పాటను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాట ద్వారా ఉత్తేజం పొంది ఈ పాట ద్వారా ప్రేరణ పొంది వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని వాళ్ళ అలా బిజినెస్ కోసం వెళ్తున్నప్పుడు రకరకాల అవమానాలు రకరకాల హీళలను ఎదురైనా కూడా వెన్నుతిరకుండా వెనకడుగు వేయకుండా కృషి చేసి పోరాడి దాదాపు 150 కోట్ల బిజినెస్ చేశారు.
(30:06) దాని తర్వాత ఇదే పాట అలా అలా అలా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వెళ్ళిపోయి దాదాపు 1400 కోట్ల వ్యాపారం చేశారని మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి చెప్పాడు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫోన్ చేసి ఇలా జరిగింది ఖమ్మం నుంచి ఫోన్ చేసి చెప్పారు క్రేజీ అసలు సర్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఇంకొంచెం ఎక్కువే అనుకుంటా అదే టైం లో కొంచెం మెల్లిగా నేను మ్యూజిక్ కంపోసర్స్ కి లేకపోతే సింగర్స్ కి బాగా అభిమానం పెంచుకుంటున్నా అన్నమాట ఆ టైం లో స్వరాభిషేకం అనే ఒక ప్రోగ్రాం్ బాగా రెగ్యులర్ చూసేవాడిని అందులో బాలు గారి కార్యక్రమం యా అందులో ఎస్పిబి గారు ఆ ఒక పాట పాడుతూ ఆ
(30:36) పాట పాడిన తర్వాత మీ గురించి మాట్లాడారు మీరు కిందే ఉన్నారు యక్చువల్గా అక్కడ క్రౌడ్ లో ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అది రచయితల ప్రత్యేక సంచికలో నా పాటలు అన్నీ పాడారు అసలు చాలా స్పెషల్ అనిపించింది అన్నమాట అందులో స్టోరీ నెంబర్ వన్ అనుకుంటా కాస్త నిన్ను నన్ను కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకమంట రేగుతుంటా మంట చుట్టుముట్టి కన్నకొంపలు అంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జీవో పుడుతుంది పెదాల్లో నవ్వు పువ్వు కెవ్వై పూస్తుందిని దాన్ని యాక్చువల్ గా కొంచెం డీకోడ్ చేస్తూ అంటారఅన్నమాట శృంగారం ఎక్కడ లేదు ప్రతి చోటా ఉంది కానీ
(31:07) ఇలా ఉండాలి శృంగారం అంటే కచ్చి కచ్చిగా ఉండకూడదు అని చెప్పి హి వాస్ టాకింగ్ టు యు అండ్ సుమ గారు కూడా స్టేజ్ మీద ఉన్నారు ఆయన మాట్లాడుతున్నప్పుడు దట్ ఇస్ వెన్ నేను మీ పాటల లిస్ట్ అంతా చూడడం ఎలాంటి పాటలు రాశారు బానికి పాట రాయడం పాటకి బాని కొట్టడం అని అప్పుడప్పుడు తెలిసే నాకు నేను ఏమనుకునేవాడిని అంటే ముందు మొత్తం ట్యూన్స్ అంతా వచ్చేస్తాయి తర్వాత రాస్తుంటారు లేదా రెండిట్లో ఏదో అంటే నాకు అంతా క్లారిటీ లేకపోయేది.
(31:28) ఉ ఇలాంటి డైనమిక్ గా ఉంటది ఇండస్ట్రీ అనే డైనమిక్ గా ఉంటదని తెలియదు అప్పటివరకు నాకు అండ్ తర్వాత కొన్ని వేరే వేరే పాటలు వింటూ మేము కూడా సరదాగా ఫ్రెండ్స్ అందరం కూర్చినప్పుడు కొన్ని పాటలు డీకోడ్ చేస్తా ఉంటాం అన్నమాట దీంట్లో జనరల్ అర్థాల కంటే వేరే అర్థాలు కూడా ఉంటాయి. అన్న అంటే ఎలా తీయాలి ఇప్పుడు చిన్నగా చిన్నగా అని ఒక పాట ఉంటది.
(31:44) ఆ పాటలో కొంచెం డీప్ మీనింగ్ ఉంటది. అవును తర్వాత ఇందాక మావాళ్ళు మాట్లాడుతూ గుండు సూది అనే ఒక పాట టాపిక్ తీసుకొచ్చారు. తర్వాత జూమ్ జుమారే అని ఒక పాట జూమ్ జుమారే జూమ జుమారే పాట అమలమ్మాయి అది ఒక కైండ్ ఆఫ్ మాస్ సాంగ్ లో ఒక మోటివేషన్ కూడా తీసుకొచ్చా తప్పని చెప్పాం అంటే ఒక చిన్న అంటే ఆలోచన ధోరణ ఎలా ఉండాలి యువకుల్లో అని చెప్పేసి అది ఒకసారి దాని గురించి వాడదాం అసలు ఎట్లా బ్లెండ్ చేశారు దాంట్లో అంటే అంటే ఇప్పుడు మామూలుగా మనం ఐటెం సాంగ్ అని అంటున్నాం కదా అది ప్రత్యేక గీతం అనుకుందాం ఐటం సాంగ్ స్పెషల్ సాంగ్ ఎందుకంటే ఐటం అంటే మళ్ళీ
(32:17) చాలా మంది పడతారు ఒక ప్రత్యేక గీతం శృంగార గీతం శృంగార గీతాలు అనేది మన సాంప్రదాయంలో ఉన్నాయి. శృంగారం అనేది మన కావ్యాల్లోనూ అన్నిటిలోన ప్రబంధాల్లోన ప్రధానంగా ఉండేది శృంగారం దాని చుట్టే కథలు అల్లుకున్నాయి. అయితే శృంగారం అనేది మన సినిమా పాటల్లో కూడా ఉంటుంది ఎందుకంటే జనాలు ఇప్పుడు మనం మన వేటూరు గారు ఒక మాట చెప్పారు ఏంటంటే మనకు ఈ ఐటమ్స్ ఈ ప్రత్యేక గీతలు అన్నవి అప్పడాలు లాంటివి మనకు ఆహారం ఎంతున్నా కూరలు ఎన్నిఉన్నా పదార్థాలు ఎన్నిఉన్నా మనకు అప్పడం వడియాలు ఉంటేనే అదఒక ఆనందం [నవ్వు] కచ్చితంగా అది ఎన్నిఉన్నా అంటే దాని అంటే దాంట్లో ఉండే
(32:53) రుచి ఎలా ఉన్నా కూడా అది పంటి కింద కరకర నములుతుంటే దాని తృప్తి వేరు ఉంటుంది. అది శక్తి బలాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఒక తెలియని ఆనందాన్ని మాత్రం ఇస్తుంది అని చెప్పేసి వేటర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. అట్లాగే సినిమాల్లో ఈ ప్రత్యేకతాలు ఖచ్చితంగా ఉండడం వల్ల అది జనాకర్షణకు పనికొస్తుంది. కథా గమనానికి భంగం కలగకుండా ఇబ్బంది కలగకుండా పెట్టినంత కాలం కచ్చితంగా ఆ పాటలు జనాలని ఉర్రుతలుస్తాయి.
(33:18) సినిమా వ్యాపారాన్ని ఖచ్చితంగా పెంచుతాయి. ఉదాహరణకి పుష్ప సినిమాలో ఎంత గొప్ప కథ ఉంది ఎంత గొప్ప విషయం ఉంది ఎంత గొప్ప లోతు ఉన్నా కూడా పాట వరకు వచ్చేసరికి ఉ అంటే ఆ పాటక వచ్చిన గుర్తింపు వేరు ఊ అంటే పాటక వచ్చిన ఆ అది ఇచ్చిన అసలు సింగిల్ డేలో అది పేలిపోయింది అయితే జనాన్ని రెండోసారి మూడోసారి తీసుకొచ్చేది సినిమాలోని గొప్ప గొప్ప అంశలతో పాటు పాటలు కూడా ప్రధానంగా రెండోసారి మూడోసారి జనాన్ని తీసుకొస్తాయి అట్లాగా శృంగార ఇప్పుడు ఈ ప్రత్యేక గీతాలు గనుక ఒక్కసారి గనక జనాలకు ఎక్కితే గనుక ఎన్ని సార్లుయనా సరే వాళ్ళని థియేటర్ కి తీసుకొచ్చే
(33:50) శక్తి సామర్థ్యం ఈ పాటలో ఉంటుంది అందువల్ల ఆ పాటలని ఎవరు వదులుకోవడానికి ఇబ్బంది పడరు సందర్భం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినప్పుడల్లా అలాంటి సందర్భాలు సృష్టిస్తూనే ఉంటారు మాకు పని కల్పిస్తూనే ఉంటారు. మేము కొత్త కొత్త రీతుల్లో పాటలు రాస్తూనే ఉంటాం. ఉదాహరణకి ఈ ప్రత్యేక గీతాలు తీసుకుంటే గనుక మీరు అమ్మ నాన్న తమిళ అమ్మాయిని నిజంగా మర్చిపోయాను ఎక్కువ గుర్తు పెట్టుకుంటాను కానీ మర్చిపోయాను.
(34:14) అందులో కొన్ని మంచి మంచి అంశాలు ఉన్నాయి ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు పోగేసిన డబ్బుతో నువ్వు ఏం చేస్తావరా నువ్వు నీలో ఒంట్లో శక్తి ఉండాలి నీలో ఒంట్లో చైతన్యం ఉండాలి నువ్వు దూకాల రంగంలోకి అని చెప్పేసి తెలియకుండానే అమ్మాయి శృంగారం గురించి సరసం గురించి మాట్లాడుతుందేమో అనుకున్నంతలోనే మళ్ళీ జీవితంలో పైకివచ్చే అంశాల గురించి మాట్లాడుతుంది ఒక ఉద్బోధ చేస్తుంది అనేది కూడా ఆ ఉద్దేశం కూడా ఆ పాటలో ఉంటుంది ఇప్పుడు నేను చూసిన నాకు అర్థం అవుతుంది వేరే రకంగా దాన్ని తీసుకోవచ్చు కానీ లేదు జీవితంలో నువ్వు పైకి నిలబడాలి లేవాలి నడవాలి ఎత్తుక ఎదగాలన్న అంశం కూడా ఒక
(34:44) స్పురణకి వచ్చేలాంటి వాక్యాలు రాసాం. అట్లాగే అప్పుడు అది అది అది ఎలా రాసానో ఎందుకు రాసానో నిజంగా నాకు తెలియదు జరిగింది అది చాలా స్ట్రాంగ్ గా అమ్మ బాబు పోగేసిన డబ్బులు అనుకుంటాను రాసాను కాకపోతే అది తెలియకుండా రాసానా తెలిసి రాసానో తెలియదు కానీ తర్వాత తర్వాత తర్వాత మాత్రం ఒక పరిణామం వచ్చింది. ఈ ప్రత్యేక గీతాలు రాసే క్రమంలో ఒక పరిణామం ఒక ఎవల్యూషన్ వచ్చింది.
(35:08) ఓకే ఎలా అంటే ఇప్పుడు సుకుమార్ గారికి మేము రాసిన పాటలు మొదటి నుండి తీసుకుంటే నేను ఆయన మొదటి సినిమా ఆర్య నుంచి తీసుకుంటే ఆర్యలో మినహాయి నుంచి మిగతా పాటలన్నీ నేనే రాశను ఈ శృంగార గీతాలు ప్రతిజ్ఞతలున్నీ కూడా రింగ రింగా నుంచి మొదలుకొని డియ్యాలో నుంచి మొదలుకొని లండన్ బాబు మొదలుకొని జిగేలు రాణి ఊ అంటావా మొన్న వచ్చిన కిసక్ కిసిక్ దెబ్బలు పడితే రాజా అలా పాటల్లో మార్పులు వస్తూనే వస్తూనే ఉన్నాయి.
(35:34) మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా మెల్లిగా మెల్లిమెల్లిగా అంటే ఒక ఒక వస్తువాశ్రయ పద్ధతిని తీసు దాని నుండి ఒక ఆత్మాశ్రయ పద్ధతి వచ్చింది. ఓకే అంటే ఒక అమ్మాయిని వస్తువుగా అంటే అంటే శృంగార గీతాల ఉద్దేశమే అది కానీ అక్కడి నుండి ఆ చూపులో మేమే కొన్ని మార్పులు కొన్ని మలుపులు తీసుకొచ్చి తీసుకొచ్చి మెల్లి మెల్లిగా దానిలో ఉన్నతమైన విషయాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం.
(35:57) ఉమ్ ఊ అంటావా రెండు పొరలు ఉన్నాయి చూస్తుంటే గన ఒక పొరలో పాట ఒక అంటే ఆ పాట ప్రలోభ పెట్టడానికి పాట ఆకర్షించడానికి గురి చేస్తున్నామ అనే అంశం కనబడుతుంటుంది కానీ లోపలి పొరలు మాత్రం అంటే మనుషుల సహజమైన మనుషుల స్వభావ సిద్ధమైన వాళ్ళ గుణగణాలు ఏంటి అనే ఒక లోతైన చర్చ కూడా చేశాను మగవాళ్ళ చీకటి అంటే రహస్య జీవితంలో ఆ చీకటి కోణం ఎలా ఉంటుంది ఎలాగ వాళ్ళ అమ్మాయిలని లైంగికంగా వేధించడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు ప్రతి సందర్భాన్ని ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగిస్తారో తెలియకుండా తెలియకుండా తెలియకుండా కార్యక్షేత్రాల్లో వాహనాల్లో ప్రయాణాల్లో
(36:33) ప్రతి చోట వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది గురిచేస్తారు అన్నది చెప్పి చెప్పకుండా అలా ఇంకొక పొరలో చెప్పడం జరిగింది. అందువల్ల చాలా మంది ఆ పాట విడుదలైన గంటలో నాకు వచ్చిన దాదాపు ఒక 20 30 ఫోన్ కాల్స్ లో ఒక 15 ఫోన్ కాల్స్ అమ్మాయిలే చేశారు. జర్నలిస్టులు చేశారు ముఖ్యంగా చేసి ఏవండీ మీరు ఎలా రాశారు మా మనసులోని భావాలు మేము ఎదుర్కున్న సమస్యలు మీకు ఎలా తెలిసినవి మీరెలా మా షూస్ నుంచి అంటే మా కోణంలో ఆలోచించి రాశరు అని చెప్పేసి ఆ వాళ్ళు మహిళా జర్నలిస్టులు చేసి నాకు అభినందించడం అనేది నేను అంటే ఒక ఒక ప్రత్యేక గీతం రాయడంలో ఇంత ఆనంద అంత ఆనందాన్ని ఎప్పుడూ
(37:10) నేను పొందలేదు. ఉమ్ తర్వాత వచ్చాక ఇంకా కిసికి పూర్తిగా అంటే అబ్బాయిలు చేసే కామెంట్లు కావచ్చు వాళ్ళు పెట్టే వాళ్ళు వాళ్ళు గుచ్చే విషయాలు కావచ్చు నొప్పించే ప్రకారం అన్నీ పూర్తిగా ఇంకా అది ఏకపక్షంలో రాశారు. రెండో పొర అన్నదే లేదు రెండో అంచ లేదు ఏకపక్షంగా ప్రధానంగా ఆ విషయం మీద గురిపెట్టి రాయడం జరిగింది.
(37:31) దానికి కూడా ఎక్కువ అభినందనలు వచ్చాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తించిన పాట మాత్రం ఊ అంటా ఊ అంటావా మా ఊ అంటాం ఆ పాట అండ్ ఇందాక మీరు ఒక పాట పాడుతూ ఆ పాత సినిమా పాట 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇప్పుడు అది ఎత్తునప్పుడు ఈ అవమానాల గురించి ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు సార్ మీరు మాట్లాడిన దానిలోనే ఒకటి బాగా నాకు బాగా కనెక్ట్ అయింది.
(37:51) ఈ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఒక 100 అవమానాల వరకు పర్లేదు ఆ తర్వాత ఆలోచిద్దాంలే ఇండస్ట్రీ కి వచ్చినప్పుడు అని ఒక మాట అన్నారు. ఒకసారి అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు అలా ఆలోచించారో అలా ఆలోచించారు ఎందుకంటే ఆ నేను చదువుకుంది ఇంజనీరింగ్ ట్పుల్ చేశాను జేఎన్టీ లో ట్పల్ఈ లో నేను యూనివర్సిటీ థర్డ్ వచ్చాను. ఉమ్ పాలిటెక్నిక్ చేసి ఇంజనీరింగ్ చేసి యూనివర్సిటీ థర్డ్ వచ్చాను క్యాంపస్ లో అంత ఉన్నత విద్య చదివిన తర్వాత చదువుతూ నేను సినిమాల్లో ప్రయత్నించిన పాటలు వేయడాని కోసం ఫోర్త్ ఇయర్ లో అయితే ఇక్కడ నేను చాలా చాలా చాలా మంచి మార్కులు
(38:23) తెచ్చుకునేవాడిని మంచి ఉత్తమ శ్రేణిలో పాస్ అయ్యేవాడిని సినిమా రంగంలో పాటలు రాయాలని ప్రతి ఆఫీస్ కి వెళ్లి చిన్న చిన్న తిరస్కారాలు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న అవమానాలు ఎదురవుతా ఉంటే బాధపడేవాడిని రూమ్ కి వచ్చి బాధపడేవాడిని ఏంటి మనం చదువుతున్న చదివి ఏంటి మనం పొందుతున్న మార్ ఏంటి మనకు వస్తున్న ఇలాంటి విషయాలు ఏంటి మనకు వస్తున్న ఒక మాటలు ఏంటి సూటిపోటు మాటలు ఏంటని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాధపడుతూ ఉండేవాడిని కానీ కానీ మనం ఎంచుకున్న లక్ష్యం చాలా పెద్దది చాలా ఉన్నతమైన లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాం ఇలాంటి చిన్న చిన్న
(38:53) వాటిన్నీ పట్టించుకుని రోజు బాధపడతాం అంటే మనం లక్ష్యాన్ని చేరుకోలేను మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి ఎవరు చెప్తారు మనకు మనల్ని ఎవరు ప్రోత్సహిస్తారు అప్పుడు నేనే ఆలోచించుకున్నా నిన్ను ఎవడరా ఈ లక్షాన్ని ఎంచుకోమన్నది ఎవడరా ఇక్కడ పొమ్మన్నది వెళ్ళావు వెళ్ళినప్పుడు నువ్వు ఎదురైన అవమానాలని నువ్వు భరించాలి నువ్వు పంటి బిగున దాచుకొని నువ్వు పోరాడాలి కదా అని నాకు నేనే సమాధానం చెప్పుకొని అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటంటే ఇలా కాదు అలా కాదు 100 అవమానాలు రోజు రాసుకుంటా ఒక బుక్ పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు అని రోజు రాసుకుంటా 100 అవమానాలు
(39:24) ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు సినిమా రంగం వద్దు ఈ పాటలు వద్దు ఈ ప్రయత్నాలు వద్దు వచ్చేద్దాం హాయిగా నేను నా ఉద్యోగం చేసుకుంటాను. 100 అవమానాల లోపు ప్రయత్నిద్దాం అని చెప్పేసి రాసుకోరోజు పుస్తకం వెళ్ళడం రావడం ఏదనా చిన్న ఇబ్బంది మనసు బాధక ఒకటో బాధ రెండో బాధ మూడో అవమానం నాలుగో తిరస్కారం 21 దగ్గర అవమానాలు ఆగిపోయాయి 21 దగ్గర ఆ అవమానాలు ఆగిపోయి అక్కడి నుండి సన్మానాలు బహుమానాలు మొదలయ్యాయి అంటే ఏదైనా సరే మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఇంకొకటి ఏంటంటే జీవితంలో ఎవరైనా సరే మీర ఎరైనా సరే నేనైనా సరే ఇంకఎవరైనా సరే ఒక ఒక కూడల
(40:05) దగ్గర ఒక పాయింట్ దగ్గర ఒక కేంద్ర ఒక బిందువు దగ్గర మనం తీసుకునే నిర్ణయమే ఒక బిందువు దగ్గర మనం తీసుకునే నిర్ణయమే మన జీవితాన్ని నిర్వచిస్తుంది. రైట్ అదే మన జీవితాన్ని నిర్వచించే విషయం అవుతుంది అలాగ నేను సినిమా రంగంలోకి రావాలా వద్దా ఇంజనీరింగ్ అయిపోయింది పట్ట వచ్చింది పాట కూడా అయిపోయింది తాజ్మహల్లో మంచుకొండలో చంద్రమ పాట రాసాను పాట అయిపోయింది పట్ట అయిపోయింది పట్ట పాట పాట పట్ట ఏ బాట పట్టాలి ఆలోచించాను ఇక్కడ బిందు ఈ కోడల దగ్గర ఉన్నాను లేదు పాట బాట పట్టాలి వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళపోవాలి ఎందుకంటే చిన్నప్పటి నుండి చిన్నప్పటి
(40:46) నుండి సినిమా అని శ్వాసగా పాటను ఒక ఊపెరిగా మలుచుకొని పెరిగాను ఎదిగాను ఆ మక్కవతో ఆ కృషితో అలాగ ఆ క్రమశిక్షణతో పెరిగాను. ఇప్పుడు అవకాశం వచ్చింది పాట రాశను. సరే పట్టా కూడా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి లేదు చిన్నప్పటి నుండి మనం కలలు కన్నది నిజమైంది అలా పండు మన చేతికి వచ్చింది. దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి మళ్ళీ ఉద్యోగ సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఒక సంవత్సరం పాటు ఇంతకుముందు 100 అవమానాలు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నారో సంవత్సరం పాటు ఈ రంగంలో కృషి చేద్దాము ఈ సముద్రంలో దూకుదాము ఈత కొడదాం తీరం కనిపిస్తుందా లేదా చూద్దాం అసలు ఏం
(41:17) చేద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి దిగాను ఈ వన్ సంవత్సరం గడువు పెట్టుకున్నాను సంవత్సరంలో ఏదో ఒకటి అయిపోవాలి అనే గడువు పెట్టుకొని తాజ్మహల్ తర్వాత పెళ్లి సందర్ వచ్చింది తర్వాత ధర్మచక్రం వచ్చింది తర్వాత బొంబాయ్ ప్రియుడు వచ్చింది తర్వాత పరదేశి వచ్చింది ఇలా సంవత్సరాలు తిరిగే సరికల్ల దాదాపు ఒక 15 సినిమాలు రాశను ఏ నిర్ణయం తీసుకున్నామో మనం మనం ఎప్పుడు వెనక్కి వద్దాం అనుకున్నామో ఏమ ఏ తేదీ రోజు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుందామ అన్న ఆలోచన కూడా మనసులోకి రావడం పని ఒత్తుల్లో పడిపోయారు నమ్మండి ఒక సందర్భం చెప్పిన తర్వాత
(41:49) దర్శకుడు ఆ సందర్భంలో తన ఆప్తుల్ని కోల్పోతాడు. తనకు అత్యంత ఆప్తుల్ని కోల్పోతాడు. కోల్పోయినప్పుడు రచయిత రచయితకు ఎలాంటి రచయిత ఎలాంటి స్థితిని అధిగమించాలి ఎలాంటి స్థితిలో ఉంటాడు ఎలాంటి స్థితిని అధిగమించాలో చెప్తున్నాను ఏంటంటే అలాంటి సన్నివేశం మనకు ఎదురైంది మన మనం ఆ సందర్భంలో మనం ఉన్నాము నా ఆప్తులను నేను కోల్పోతే నేను ఎలా ఉంటాను అన్నది నేను గుర్తు చేసుకోవాలి. ప్రియురాలు దూరమైంది.
(42:20) నా ప్రియురాలు దూరమైతే నేను నా పరిస్థితి ఏంటి? నా ఆప్తులు చనిపోయారు నా నిజంగా నా ఆప్తు చంపేతే నేను ఎలా ఉంటాను నాకు ఇంకొక ఒక ఒక అందాన్ని చూస్తే ఒక స్పందన కలిగింది అనే పాట కావాలంటే నిజంగా ఒక అందమైన అమ్మాయిని చూస్తే నాలో ఎలా స్పందన కలుగుతుంది అనేది ఆ స్థితిలో నేను ఉండాలి అంటే ఇన్ని రకాల పాత్రల్ని మనం అనుభవించాలి.
(42:42) అందుకే రచయిత అన్నవాడు ఒక్క మనిషి కాదు అనేక మనుషుల సంకలనం రైట్ అనేక మనుషుల సంకలనం అనేక సన్నివేశాల సమాగం అనేక సందర్భాల సమూహం అయితేనే ఒక కవి అవుతాడు అట్లాగా ఆప్తుని కోల్పోతాడు కోల్పోతే ఎలా ఏడుస్తాడు ఎలా రోధిస్తాడు అంటే కొత్తగా రోధించాలి కొత్తగా బాధపడాలి కొత్తగా ఏడవాలి చూడండి బాధ కొత్తగా ఉండాలి దాంట్లో మనం సృజన చూపించాలి ఈసేతితో తోనే పాలు పట్టాను ఈ చేతితోనే బువ్వ పెట్టాను ఈ చేతితోనే కాళ్ళు విసికాను ఈ చేతితోనే తలకు పోసాను ఈ చేతితోనే పాడే మొయ్యాలా ఈ చేతితోనే కొరివి పెట్టాలా ఓరయ్యో నా అయ్యా ఓరయ్యో నాయ్య అయ్యా మా ఆవిడ వంట చేస్తూంది కిచెన్ లో వంట చేస్తూ ఉంటే అప్పుడే ఈ
(43:44) పల్లవి రాసి వచ్చాను వచ్చిన తర్వాత ఇలా అన్న చనిపోతాడు తమ్ముడు ఏడుస్తుంటాడు సందర్భం ఇది అని పాట వినిపించా అంటే తను కూడా తను కొరియోగ్రాఫర్ కదా తను కూడా ఒక కళాకారునే కదా తను కూడా సృజనకారినే కాబట్టి అంటే మన ఆప్తులని కోల్పోయాం కోల్పోతే ఎంత బాధపడతామో అలాగ ఇద్దరం ఆ పాట వింటూ ఇద్దరం నేను పాట పాడుతూ ఏడ్చాను మా ఆవిడ పాట వింటూ ఏడ్చింది అంటే రచయిత రచయిత యొక్క స్థితి చెప్తున్నాను ప్రతి సందర్భానికి తనదిగా భావిస్తాడు.
(44:17) తనదైన స్పందన అందిస్తాడు అందుకోసం రచయితకు కావల్సింది పాండిత్యము రచయితకు కావల్సింది భాష మీద విపరీతమైన సాధికారతో ప్రభుత్వం అలా శాస్త్రం బాగా తెలియాలని కాదు రచయిత కావలసిన మూడే మూడు అంశాలు మనకున్న జ్ఞానం మనకున్న జ్ఞానం మనదైన అనుభవం మనలోని స్పందనం రైట్ ఈ మూడే రచయితను గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి గొప్ప భాషా పటిమ గొప్ప భాషా ప్రకర్ష ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఏం ఏం పెద్దగా దాని గురించి అవసరం లేదు స్పందించగలిగే లక్షణం నీలో ఎంతుంది ఒక సందర్భం చెప్పగానే ఒక సన్నివేశం చూడగానే నీలో ఎలాంటి స్పందనలు కలుగుతాయి నీదైన స్పందన ఎలా కలుగుతున్నాయి ఆ ఒక్క కోణమే నిన్ను గొప్పవాడిని చేస్తుంది రచయిత
(44:59) కూడా ప్రధాన లక్షణం అది అందశ్రీ గారు మా ఇంటికి వచ్చారు. మ్ నిప్పలవాకు పుస్తకం ఇచ్చారు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూర్చున్నాం ఉప్మా తిన్నారు కాఫీ తగర అంతా అయిన తర్వాత అన్న పుస్తకం ఇస్తూ ఫోటో తీసుకుంటున్నాం ఫోటో తీసుకుంటా ఉంటే అన్న మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చి నాకు పుస్తకం ఇస్తున్నారు దీని మీద తమ్ముడికి ప్రేమతోన రాసివ్వండి అన్న అన్నా మ్ మీ స్వహస్తాలతో తమ్ముడికి ప్రేమతో రాసివ్వండి అన్నా తప్ప తమ్ముడికి ప్రేమతో రాసి ఉన్నాడగానే ఆ నాకు రాదు తమ్ముడు అన్నాడు.
(45:34) ఏంటన్నా అంటే నువ్వే రాసుకో తమ్ముడు అన్నాడు అంటే మీరు మీ దస్తూరితో రాయండి నాకు రాత రాదు తమ్ముడు నాకు చదువు రాదు తమ్ముడు అన్నాడు. నాకు చదువు రాదు తమ్ముడు నిజమా అన్న నేను ఎవరో ఊరికి అనుకుంటాన్నా అంటే ఎక్కువ చదువుకోలేదని అనుకుంటే విన్నాను తప్ప అంటే అసలు అక్షరం రాయడం రాదు నా తమ్ముడు నాకు అన్నాడు. ఓరి నాయన ఇదేంటి అనుకున్నా అంటే ఇంత గొప్ప కవిత్వం రాస్తారు ఇంత గొప్ప సాహిత్యాన్ని ఫిలయించారు మీకు అక్షర జ్ఞానం లేదు లేదు తమ్ముడు నాకు రాదు నిజం నిజం తమ్ముడు నేను చెప్తున్నా కదా అన్నాడు అంటే కావాల్సింది ఏం కావాలి అమితమైన స్పందన కావాలి
(46:08) లోతైన జీవితానుభవాల కావాలి పాట గొంతులోనుంచి రాదు జీవితపు లోతులు అరిచినప్పుడు దానిలోనుంచి వస్తాయి ఆ పాట అన్నారు ఒకాయన అట్లాగా మందశ్రీ గారు అంత గొప్ప సాహిత్యం ఎలా రాశారు గొప్ప జీవితానుభవాలు ఉన్నాయి లోతైన స్పందన ఉంది అందుకోసమే కొమ్మ చెక్కితే బొమ్మర కొలిచి మొక్కితే అమ్మరా అన్నారు. దాని గొప్ప శాస్త్రం తెలియాల్సిన అవసరం లేదు చిన్న భాష తెలియాలి అట్లాగే గొప్ప స్పందన కలగాలి నాకు అంటే ఇవన్నీ చూస్తుంటే చూస్తుంటే నాకు నాకు నేను అదే అనుకున్నా కొంత జ్ఞానం ఉండాలి ఎంతో స్పందన ఉండాలి మనదైనా కొన్ని అనుభవాలు జీవిత అనుభవాలు ఉంటే దాంతో కవిగా
(46:46) రాటు తేలొచ్చు అంటే కవికి కావాల్సిన లక్షణాలు ఏంటని చెప్పి చెప్తుంటాను. బాగా నేను మళ్ళీ చదువుకుంది నేను ఇంజనీరింగ్ తెలుగు మీద చాలా మంది అంటారు తెలుగు మీద పట్ట ఎలా వచ్చింది తెలుగు మీద ఇంత బాగా మాట్లాడుతారు అంటే ఇష్టం అంతే ఇష్టం అందుకోసమే ఆసక్తి అనేది అగ్ని పర్వతం లాంటిది ఆసక్తి అనేది అగ్ని పర్వతం లాంటిది దాని మీద అనుమానం అనే మొక్క మొలకెత్తదు మనకు ఆసక్తి ఉంది వచ్చేస్తది వచ్చేస్తది లోపల నుంచి వచ్చేస్తది తరతరాల భాషా సంపదంత అలా పెల్లుబుకుతుంది నేను కూర్చొని పెద్ద పెద్ద చదవాల్సిన అవసరం లేదు ముందు మనకు ఆసక్తి ఉండాలి మనం
(47:22) చేసే పని పట్ల ఇష్టం ఉండాలి కుతూహలం ఉండాలి. చాలా మంది మా మిత్రులు సివిల్ చదివారు చదివి వెంటనే ఐటి రంగంలోకి వెళ్ళిపోయారు. అవసరం ఆవశ్యకత కుతూహలం ఆసక్తి చదివింది సివిల్ ఏంటి ఏం చేస్తున్నావ్ అంటే ఐటీ లో జాబ్ చేస్తున్నా అంటాడు. నువ్వు చదువు సివిల్ కాదురా అంటే వచ్చేసావా మామా అంటే అంటే ఇష్టం ఉండాలి చేస్తున్న పని పట్ల అమితమైన ఇష్టం అమితమైన ఆసక్తి ఉంటే గనుక ఏదైనా సాధ్యమే రైట్ అంటే ఇప్పుడు ప్రస్తావనం వచ్చింది కాబట్టి అంతశ్రీ గారి గురించి అప్పట్లో మా స్కూల్ కి వచ్చారు సార్ ఆ తర్వాత ఆయన ఆయన ఒక స్టేజ్ మీద ఎక్కడో పాడుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని
(47:57) అసలు అది అది విన్న తర్వాత నా స్కూల్ జూనియర్ వాళ్ళ ఫాదర్ అనుకుంటా ఆయన అది విన్న తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఆయన రాయలేరు ఆయనకి అలవాటు లేదు అసలు నేను విన్నాను తప్ప ప్రత్యక్షంగా నేను అదే ఆ రోజు నేను అనుభూతి చెందాను అంటే ఆయన ఎక్కువ చదువుకోలేదేమో అనుకున్నా తమ్ముడు ఆ అసలు అక్షరమే తెలియదు తమ్ముడు అనగానే ఆశ్చర్యపోయాను అంటే కావలసింది జీవితానికి కావాల్సింది ఏంటంటే గొప్ప ఆసక్తి కావాలి గొప్ప కుతూహలం కావాలి తనను తను నడిపించే ఒక చైతన్యం తనలో ఉండాలి అప్పుడు గాని ఏదైనా సాధించడానికి అర్హుడు అవుతాడు మనిషి అనేది ప్రత్యక్షంగా నేను ఆ
(48:30) రోజు తెలుసుకున్నా మళ్ళీ ఒకసారి అండ్ ఈ పాట సార్ ఊరయ్యో అనేది పాట ఈ పాట మీరు మీరు పాడతారని మీకు ముందు తెలియదు కదా సినిమాలో మీరు పాడబోతున్నారు అది ఏంటంటే ఇది రాసింది ఇక్కడ కాదు దుబాయ్లో రాసాం ఓకే సుకుమార్ గారు దుబాయ్కి అందరం వెళ్ళిన తర్వాత కథ చెప్పారు రంగస్థలం కథ చెప్పారు. సుకుమార్ గారు ఏంటంటే కథ చెప్పడం చాలా క్లుప్తంగా చెప్తారు.
(48:51) కొత్తవాళ్ళఅయితే ఇంకా అంతే బెదిరిపోతారు. ఏంటసలు ఇది అసలు కథనా నేను దేవి గారు కాబట్టి మేము కొంచెం జాగ్రత్తగా ఆయన మా మొహం చూడకుండా చెవి పెడతాడు [నవ్వు] ఏంటండి చ వినగానే అప్పుడు మెల్లమెల్లగా అర్థం అవుతుంటది మాకు అమ్మో దీంట్లో చాలా ముడులు ఉన్నాయిరా నాయన పై పైన చెప్తున్నాడు కానీ లోపల మాకు మెల్ అంటే ఈయన ఏదో చేస్తాడు మంత్రం ఏదో గారడ ఉంటుంది తెలుసు కానీ అలా జాగ్రత్తగా ఉంటా అమ్మమ్మో చాలా లోతు ఉందని అంతా అయిన తర్వాత ఆ సరే మనం కూర్చున్నాం అని అన్ని పాటల సందర్భాలు చెప్పేసి సరదాగా అలా వదిలేస్తారు మమ్మల్ని వదిలేసిన తర్వాత నేను దేవి గారు కూర్చున్నాం అలా
(49:28) కూర్చుంటున్నాం టిఫిన్ చేస్తున్నాం లంచ్ చేస్తున్నాం అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఒకరోజు చూసిన తర్వాత సుకుమార్ గారు లేరు లేరు అసలు అక్కడ దుబాయ్ లో లేరు ఏదో బ్యాక్ పెయిన్ వచ్చేసి హైదరాబాద్ వచ్చేసాడు మాకు చెప్పలే ఇంకో రెండు రోజులు మాకు హోటల్లో మాకు రూమ్స్ ఉన్నాయి. అప్పుడు దేవుని ఇంకొంచెం డైరెక్టర్ గారు అయితే వెళ్ళిపోయారు మనకు సందర్భాలు చెప్పి వెళ్ళిపోయారు.
(49:46) మనం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏమి చెప్పలేదు ఒక సందర్భాలు చెప్పారు తప్ప ఈ పాట ఇలా కావాలి అలా కావాలి ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. అంటే కేవలం మమ్మల్ని కథ చెప్పడం కోసమే పిలిచారు అనుకుంటాను. అయితే దేవి గారు మనం ఏం చేద్దాం అంటే మరి ఇంత దూరం వచ్చాం కదా ఏదో పాట రాసుకుందాం అని నేను అనుకుంటే మరి ఏం చేద్దాం బోస్ గారు అంటే ఆ చివర్లో అన్న చచ్చిపోయే పాట ఉంది కదా అది ఎందుకో నాకు అనిపిస్తుంది రాద్దాం అనిపిస్తుంది సరే రాయండి అన్నారు అనగానే సరే మనసులో ఒకటి అనుకున్నారు అనుకున్న తర్వాత మనసులోనే అనుకున్నాను ఆ పంక్తులని మనసులో అనుకున్నాను అనుకున్న తర్వాత దేవి గారికి చెప్పాను
(50:16) బాగుంది బాగుంది బోస్ గారు బోస్ గారు వెంటనే ఒకసారి అలా నాకు రాసిన అక్కడ హోటల్లో మనకు ఉంటాయి కదా టిష్యూ పేపర్లు కదా ఆ హోటల్ పేరుతో అలాగ ఆ హోటల్ ఆ దాని మీద రాసాను ఓరయ్యో నాయ్యో ఈశ్వతితోనే పాలు పడితేనే రాసి ఇవ్వగానే కూర్చున్నారు కూర్చొని సిస్టం ముందు కూర్చుని పిఆర్ ముందు కూర్చొని ఇద్దరు కూర్చున్నాను అలా అలా అనేసి వచ్చేసింది బాణ మ్ ఒకసారి మీరు అనండి అన్నాడు అనగానే నేను దాన్ని చూసుకొని ఆయన బాణిని నేను గుర్తుపెట్టుకొని నేను పాడాను పాడిన తర్వాత ఇంకొకసారి పాడన్నారు పాడాను బహుశా ఇది పాడతారా రికార్డ్ చేస్తాను అన్నారు. నేనఏం చేశనంటే అమ్మో ఇది
(50:52) రికార్డ్ చేస్తున్నారు అంటే అంటే డైరెక్టర్ గారికి వినిపిస్తారు. కాబట్టి మనం కొంచెం గట్టిగా పాడదాము ఎందుకంటే ఈ అసలు ఈ పాడే విధానానికి ఆయన పడిపోవాలి. [నవ్వు] ఆ సరే సాహిత్య సంగతి పక్కన పెడదాం కొంచెం అనేసి లోపల నుంచి చాలా భావోద్వేగంతో తీవ్రమైన బాధతో పాడాను పాడగానే దేవుగారు రికార్డ్ చేశారు ఇక్కడ అలా పక్కన పెట్టేసారు.
(51:16) పెట్టేసి హైదరాబాద్ వచ్చాము మళ్ళీ సందర్భాలు వేరే రకరకాలుగా పాండిచేరి వెళ్ళేసి లెపాండి అనే రిసార్ట్ లో నాలుగు రోజుల్లో నాలుగు పాటలు రాయా ఆ సినిమాకి మిగ నాలుగు పాటలు నాలుగు పాటలు అన్ని పాటలు చెప్పడం రాయడం కాదు అన్ని చెప్పడమే ఆ ముందు ఎంత చక్కగా ఉన్నావో ఒక సందర్భం చెప్పగానే వెళ్తాడు మనోడు చెట్టిబాబు పాము పాము మామూలుగా మనుషులని పగబడుతుంది కదా లేదు మనోడు పాముని పగపడతాడు.
(51:42) పాము ఎక్కడ కనిపిస్తోందో పాముని చెప్పద్దని వెళ్తుంటే పాము కోసం వెళ్తే భామ కనిపిస్తుంది. పాము కోసం అన్వేషిస్తుంటే భామ ఎదురవుతుంది అన్నమాట అంటే ఒకదాని కోసం వెళ్తే అంతకంటే గొప్పది ప్రత్యక్షమైనప్పుడు అంతకంటే గొప్పది తారస పడినప్పుడు ఇది అభివ్యక్తి అంటారు పాటకు ఉండే ఎక్స్ప్రెషన్ ఏది ఇది చెప్పండి అన్నాడు అనగానే అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టేబుల్ మీద అలా కూర్చొని ఆ ఒకటి వచ్చింది డైరెక్టర్ గారు అన్నా అని చెప్పండి అన్నారు అనగానే ఆ ఏరు శనగ కోసం మట్టిని అని మనసులో అనుకొని దానికి ఒక ట్యూన్ నేను అప్పుడే అన్నా ఏం చూ అన్నాను ఎప్పుడో పాత సినిమాలో వచ్చిన
(52:13) అత్తలేని కోడలుత్తమురాలు యమ్మ దాంట్లో ఊరికే అన్నాను ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నవి చెప్పండి చెప్పండి ఇంకోసారి చెప్పండి ఏరు శెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా బాగుంది బాగుంది బోస్ గారు దేవి గారు ఆ మీరు ఆ ఆ జస్ట్ అవే చెప్పండి అన్న చెప్పగానే నేను దీన్ని మారుస్తా అన్నాడు మార్చండి ఏరు శనగ కోసం మట్టినే తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందెలాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి చింత చెట్టు ఎక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామ లాగా ఎంత సక్కగున్నవి లక్ష్మి ఎంత సక్కగున్నవి
(53:04) మల్లెపూల మధ్య ముద్ద బంతి లాగా ఎంత సక్కగున్నవే ముత్తైదువా మెళ్ళు పసుపు కొమ్ము లాగా ఎంత సక్కగున్నవే సుక్కల చీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే అయిపోయింది. సుకుమార్ గారు నేను ఇద్దరం వాకింగ్ చేయడం మాకు అలవాటు. ఇది ఆయన కంపోజ్ చేస్తుంటే నేను సుక్కభయ్య వాకింగ్ చేస్తూ ఒక చరణం అనేసుకున్నాం అనేసి రికార్డ్ చేసి పంపించాం.
(53:32) ఉమ్ ఈ ఒక రౌండ్ లో రికార్డ్ చేయగానే మళ్ళ మళ్ళీ వెళ్లి దేవి గారి దగ్గర కూర్చోగానే మేము రికార్డ్ చేసి పంపిందని మళ్ళీ ట్యూన్ కట్టారు. మళ్ళీ ఇంకో రౌండ్ వాకింగ్ లో ఇంకో చరణం రాసాం. ఈ పాట మొత్తం పూర్తఅవ్వడానికి పట్టిన సమయం అక్షరాల 45 నిమిషాలు బాబా అట్లాగే ఆ సినిమాలోని పాటలన్నీ గంటలోపే రాసిన పాటలు రాసిన పాటలు కాదు చెప్పిన పాటలు అసలు రాయలేదు అక్షరం రాయలేదు కాగితం మీద కలం పెట్టి రాయలేదు పాటలన్నీ ఆరు పాటలు అయిన తర్వాత చివరికి పాటలు విడుదల అయిన తర్వాత twిitటter లో మైత్రి మూవీస్ నుంచి ఈ ఎంత సక్కగా ఉన్న పాటను మేము ఆ ఆ లిరిక్ షీట్
(54:10) పెట్టాలి మీరు రాసివ్వండి అంటే అంటే అప్పుడు రాశను అంతవరకు పాట పాటలు రాయలేదు ఏమి చెప్పండి చెప్పండి అని చెప్పండి అని చెప్పడం సుకుమార్ గారు సూపు తాగుతున్నారు కొంచెం ఆయనకి బ్యాక్ పిన్ వచ్చింది అలా కూర్చున్నారు వెనకాల ఒక పట్టి పెట్టుకొని కూర్చున్నారు కదలకుండా కూర్చున్నారు నేను పక్కన కూర్చున్నా మొదటి పాట ఏం చేద్దాం బోస్ గారు అంటే టైటిల్ ఏంటండి అన్నా రంగస్థలం అంటే కథ అంతా వచ్చేలాగా చెప్పాలంటే సూచన ప్రాయంగా చెప్పాలి సూత్ర ప్రాయంగా చెప్పాలి మీకు తెలిసిందే కదా మొత్తం మనం కథ ఎలా చెప్తాం అన్నా అనగానే పక్కనే కూర్చున్నా కూర్చుని రంగా రంగా
(54:43) రంగస్థలాన రంగు పూసుకోకున్న ఏశం వేసుకోకున్న ఆట బొమ్మలం అంతా మనమంతా తోలి బొమ్మలం అంట మొహం మాత్రమే తిప్పుతున్నాడు ఇక్కడ బాడీ ఇది బ్యాక్ పెయిన్ లాగా ఉంది కదా మళ్ళీ చెప్పండి అన్నాడు రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్న ఏషమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట వెళ్దామా దేవి గారి దగ్గరికి [నవ్వు] వెళ్దాం చర బండి తీయండి బండి తీసాం దగ్గర దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మీరు చూడండి మీరు ఆ చూడండి రంగా రంగా రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఏషమేసుకోకుండా ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఇది బాణ ఇవ్వలేరు బాణ ఇస్తే వచ్చింది కాదు ఇది
(55:28) రైట్ మీకు బాణ ఇలా ఉండదు ఇస్తే ఇలా బాణ ఉండదు మీకు తానానా తాననా తాననా ఇంత పొడుగ్గా గ ఇన్ని మలుపులతో ఉండదు బాని రాసిన తర్వాత చేసాం కాబట్టి ఇంత విచిత్రంగా వచ్చింది ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట వినబడని పాటకు సిందేస్తూ సిందాడేస్తున్న ఆట బొమ్మల మంట కనబడని చెయ్యేదో ఆడేస్తూ ఆడిస్తున్న తోలు బొమ్మల మంట ఇంత రాస్తే వచ్చిందన్నమాట అంటే అవన్నీ కూడా ఆ సందర్భాలు ఆ సందర్భాల్లోని బలం కావచ్చు దాని లోపల ఒక బలమైన ఒక ఉద్వేగాలు కావచ్చు ఆ కథలోని గట్టితనం కావచ్చు అన్ని పాటలు ఇలా అలవోకగా అలవోక అలవోకగా రాసే క్రమంలో క్రమంలో ఈ పాటలన్నీ ఫస్ట్ వద్దంట కదా ఈ పాట ఓరయో పాట
(56:24) ఆ ఓరయో పాటలు ఇంకొక ఇంకొక గమ్మత్తి అనే చరిత్ర ఉందండి పాటలన్నీ అయిపోయాయి బాగా వచ్చాయి ఆ ఈ ఒక్క పాట ఉంది ఒక పాట అయిన తర్వాత మేమ మళ్ళీ మేము ఆ లేపండి పాండిచేరి నుంచి చెన్నైకి వచ్చాం నాలుగు పాటలు అక్కడ రాసుకున్నాము వచ్చినా నాలుగు పాటలు రాసాను ఏది రంగమ్మ మంగమ్మ రాసాను ఆగట్టును ఉంటావా రాసాను జిగేలు రాణి రాసాను ఇంకొకటి రాసాను నాలుగు పాటలు రాసిన తర్వాత ఆ వచ్చారు సుకుమార్ గారు నా రూమ్ కి వచ్చారు వచ్చి ఇంకొకటే పాట ఉంది ఏది ఈ సాడ్స అన్న అన్న ఆల్రెడీ మేము పల్లవి రాసాం దాన్ని కొత్త పాట రాయించడం కోసం ప్రయత్నిస్తారు నాతో సుకుమార్ గారు
(57:03) నాలుగు పాటలు రాసాం వచ్చాం వచ్చిన తర్వాత సుకుమార్ గారు వచ్చి నా రూమ్ కి వచ్చేసి బోస్ గారు చెప్పండి అన్న నాలుగు పాటలు రాసాం కదా నాకు తన వైపు ఉంది మొత్తం ఆటంతా నా వైపు ఉంది చెప్పండి అన్న ఆ బ్రదర్ సాడ్సన్ కూడా రాద్దామా అన్నారు ఎన్ని పాటలు అయిపోయాయి ఇప్పటికి నాలుగు అయిపోయాయి మనక ఇంత స్పీడ్ అవసరమా దిష్టి తగులుతుంది వద్దు మనం ఒక్కొక పాట నెల రోజులు కూర్చుంటాం అదృష్టవశత్తు నాలుగు రోజులు నాలుగు పాటలు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ఐదో పాట అడుగుతున్నా వద్దు మనం ప్రశాంతంగా ఇంత స్పీడ్ ఎందుకు మనకు దిష్టి తగులుతూ వద్దున్న అసలు ఇంటికి వెళ్ళాక రాసుకుందాం ఇంటికి
(57:39) రాసాం ఓకే ఎంజాయ్ వచ్చేసాం వచ్చిన తర్వాత ఈ పాట ఒకటి ఉంది మ్ షూటింగ్ వచ్చింది మ్ ఈ పాటకి షూటింగ్ వచ్చే డైరెక్ట్ గారికి సుకుమార్ గారికి ఈ పాట ఎందుకో ఆయన మనసుక అంతగా నచ్చలేదు అంటే మీరు పాడింది ఈ పాట మేము చేసిన ఎవరో పాట నచ్చలేదు నచ్చలేదు అంటే ఇంకేదో ఇంకా వేరే రాయిద్దాం ఇంకో వేరే పాట చేద్దాం అని ఆయన మనసులో ఉంది మాకు చెప్పలేదు.
(57:59) మళ్ళీ మేము బాధపడతాం సందర్భం చెప్దాం అని అనుకున్నారు. ఈలోపు అనుకోకుండా షూటింగ్ వచ్చింది. అది మాంటేజస్గా షూటింగ్ అంతా కూడా లిప్ లేదు కదా రైట్ దాంతో షూటింగ్ చేద్దాం ఎట్లా చేద్దాం అని చెప్పేసి ఏదో తమిళ్ సాంగ్ పెట్టుక ఏదో తమిళ్లో కొంచెం అలాంటి ఒక ఆ దుఃఖ పడే పాట ఏదో పెట్టారు. పెట్టి తీస్తున్నారు తీస్తుంటే ఆ పాట వినేసి ఇంకా ఏడవండి అని ఓకే సరే కెమెరా ఏడవండి అంటే పాట పెట్టగానే ఎవరికీ ఏడుపు రావట్లేదు నవ్వ వస్తుందంట ఎవరు ఏడవట్లేదు.
(58:28) సరే ఏంటి ఏం చేద్దాం ఇంకేదైనా పాట ఉందా మలయాళం పాట ఆ పాట ఈ పాట రకరకాలుగా పాటలు పెట్టి చూస్తే ఎవ్వరు ఏడవట్లేదు చివరిలో చలనం లేదు కదలికలు అందరూ అలా కూర్చున్నారు నేరసంగా మరి ఏంటి ఏం చేద్దాం లోపు ఏ బోసి గారు పాడింది ఆ పాట మనం ఇంకా పెట్టాలా వద్దా అని మనం ఆలోచిస్తున్నాం కదా అది ఒకసారి పెట్టండి చూద్దాం ఎలా ఉంటదో రియాక్షన్ అని అది పెట్టారు ఓరయ్యో నాయ్య ఓరయ్యో నాయ్య ఈ చేతితోనే పాలు పట్టాను ఇక మనం డైరెక్టర్ గారిని పడేయడం కోసం పాడాం కదా ఈ సేతితోనే బువ్వ పెట్టాను ఈ సేతితోనే కాళ్ళు విసికాను ఈ సేతితోనే పాడే మొయ్యాలా ఈ సేతితోనే కొరివి పెట్టాల అనగానే అందులో
(59:14) దుఃఖం పొంగింది అందరు నిజంగా ఇవ్వడం మొదలుపెట్టారంట ఒరేయ్ ఇది కదా పాట ఇది కదా ఆ ఇది కదా ఇట్లాంటి భావాలు కదా అని చెప్పేసి అందరికి తెలియకుండా అందరి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు మనం సరదాగా నవ్వుకుంటూ చెప్తున్నాం కానీ ఆ సందర్భం పూర్తి విరుద్ధం అన్నమాట అక్కడ అక్కడ అందరూ ఏడవడం మొదలపెట్టిన తర్వాత అమ్మో ఇదేదో దీంట్లో ఏదో ఉంది ఆ పనికవచ్చే పాట అని చెప్పేసి సుకుమార్ గారు ఫోన్ చేసి ఏమండీ అన్ని పాటలు పెట్టాం ఎవరు ఎవడలేదు మన పాట పెట్టగానే మీ పాట పట్టగానే మీ గొంతు ఆ గొంతులోని ఆ విషాదం పలికిన విషాదం ఆ విధానం అందరికీ నచ్చింది దీనికి చరణాలు
(59:45) రాద్దాం అన్నారు. సరే రండి అన్న కుక్కుమార్ గారు నేను కూర్చొని తమ్ముడు నీకోసం తల్లడిల్లాడయ్యా సిల్లి గుండె నీకై సెరువైపోయిందయ్యా కంచంలో నీ మెతుకు నిన్నే ఎతికేనయ్యా నీ కళ్ళద్దాలు నీకై కలియ చూసేనయ్యా నువ్వు తొడిగిన సొక్క నువ్వు తొడిగిన సొక్క నీకై దిగులుపడి చిలక కొయ్యకురి బెట్టుకుందిరయ్యా రంగస్థలానా రంగస్థలానా నీ పాత్ర ముగిసేనా వల్లకాట్లో శూన్య పాత్ర మొదలయ్యేనా నీ నటనకు కన్నీటి సప్పట్లు కురిసేనా నువ్వు వెళ్ళ వెళ్ళొత్తానంటూ చెప్పే ఉంటావురా
(1:00:51) మా పాపపు సెవికది వినబడకుంటదిరా ఓరయ్యో మాయ్యా ఓరయ్యో మాయ్య అంటూ చరణాలు రాసాం రాసిన తర్వాత వినిపించడం కోసం నేను సుక్కుబయ్య దేవి గారి దగ్గరికి వెళ్ళాం స్టూడియోకి వెళ్ళాం అప్పటికే అందరం ఇలాగా ఏదో తెలియని ఒక బరువు ఉన్నాం అందరం తెలియకుండా ఇలా వనికిపోతున్నాం. ఇంక నేను పల్లవి పాడి చరణాలు పాడుతుంటే నేను ముందు చెప్తుంటే అందరిలోనూ దుఃఖమే ఎందుకంటే అప్పుడు దేవి గారు వాళ్ళ నాన్నగారు అది గుర్తవచ్చింది తర్వాత అంటే అందరి జీవితాల్లో ఉన్నాయి మా మా అమ్మ నేను ఎవరి కోసం అయితే ఈ పాటలు రాస్తున్నానో ఎవరిని అలరించాలని ఎవరికి అర్థం కావాలని
(1:01:45) రాస్తున్నా మా అమ్మ కూడా చనిపోయి అప్పటికి ఒక రెండు ఏళ్లో అవుతుంది. సుకుమార్ గారు వాళ్ళ నాన్నగారు పోయారు అప్పుడే ఆ మధ్యలోనే ఇట్లా అందరిలోనూ ఆ విషాద ఘటనలన్నీ అందరికీ గుర్తొచ్చాయి. అందరం గుర్తొచ్చి మీరు నమ్మరు ఇట్లా ముగ్గురం ఇట్లా ఇలా తల ఇలా కలుసుకొని తల ఇట్లా ఒకే చోట కలిసి అందరం ఆ పాట నేను పాడుకొని అందరం ఏడవడమే ఏడవడమే ఇంకా ఆ ఏడవడమే అంత అయిన తర్వాత దేవి గారు చిరనాలు మీరు పాడాలి అన్నారు అనగానే నేను పాడవ ఏంటి మంచి మంచి ఉన్నారు గాయకులు వాళ్ళతో పాడించండి ఇంకా ప్రాణం వస్తుందండి లేదు లేదు ఇంక మీరు ఇంకే మాట చెప్పద్దు మీరు పాడాలంటే నేను అటు ఇటు కుదరదు కుదరదు
(1:02:23) అన్నాను లేదు బోస్ గారు అంటే ఇది చాలా కష్టం కష్టమైన బాణ నేను పాడగలను లేదో స్థాయి కూడా నాకు అందుతుందో లేదో కొంచెం తార స్థాయిలో ఉంది రక్తస్థల దగ్గర నేను పాడతానో లేదో అంటే బాణ కోసం కాదు మీ గొంతు కోసం మాకు ఈ పాట కావాలి ఆ స్థాయి దాని గురించి కాదు నేను మాట్లాడేది మీ గొంతు కోసం నాకు ఈ పాట కావాలన్నాడు అమ్మో అని చెప్పేసి లేదు అంటే దేవి గారు అన్నారంటే దాంట్లో ఏదో నిజం ఉంటుంది అని చెప్పేసి 45 నిమిషాల్లో ఈ పాట పాడేసాను 4 ఫస్ట్ టైం ఒకసారి మీరు పాడాను పెళ్లి మన ప్రేమించుకుందాంలో పాడాను పెళ్లి ఫుల్ సాంగ్ పాడడం మొత్తం పాట పాడడం ఇదే మొదటి మొత్తం పాట
(1:03:03) దీని తర్వాత రాజు యాదవులు నాకు గద్దర అవార్డు వచ్చిన పాట లేదే లేదే ఈ ప్రేమ అసలే లేదని పాట కూడా నేనే పాడాను అది పాడిన ఒక ఐదారు పాటలు పాడాను కానీ మొత్తం పాడిన పాట మాత్రం ఇది 45 మినిట్స్ లో కంప్లీట్ చేశారు మొత్తం 40 నిమిషాల్లో అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది అన్నమాట ఒక ప్రొఫెషనల్ సింగర్ ఎలాగైతే పాడతారో అలా పాడారని దేవి గారు నన్ను పెట్ట కూడా సర్ అంటే అది బిగ్గెస్ట్ ప్లాట్ ఆఫ్ ది మూవీ కదా అంటే ఆది లాంటి యాక్టర్ చనిపోయే సీన్ అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటిది ఇంతమంది ఉండి అంత కలియకలు అంత ప్రాపర్ గా కూర్చుంది అంటే అంటే నిజానికి ఒక మంచి సాహిత్యం రావాలంటే
(1:03:37) గనుక మంచి కథ ఉండాలి మంచి కథాంశం ఉండాలి బలమైన పాత్రలు ఉండాలి పాత్రల్లోని పాత్రలకు ఔచిత్యం ఉండాలి ఇవన్నీ కలిసి సాహిత్యం అలవోకగా వస్తుంది బలవంతంగా రాదు అలా అలవోకగా అవలీలగా వస్తుంది. ఇంకోటి రంగస్థలం అనేది నిజంగా మా జీవితాల్లో జరిగిన సంభవించిన ఒక అద్భుతం సంభవించింది సంభవాలు ఎప్పుడు కూడా సంభవాల పుస్తకం ఎప్పుడ కూడా మధ్య పేజీ నుంచి మొదలవుతుంది ముందు మాట నుంచి మొదలవ్వదు అది మధ్య పేజిలో అకస్మాత్తుగా సంభవిస్తుంది మధ్య పేజి నుంచే మొదలవుతుంది సంభవాల పుస్తకం ఇప్పుడు అలాగే రంగస్థలం మా జీవితంలో సంభవించిన ఒక అద్భుతం అలాంటి మళ్ళీ మళ్ళీ సంభవించాలని
(1:04:16) కోరుకుంటున్నారు మా జీవితాల్లో చూద్దాం రైట్ సర్ ఇప్పుడు ఈ డబ్బింగ్ మూవీస్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు నాకు ఈ మధ్యలో కొన్ని సాంగ్స్ హిందీ మూవీస్ యాక్చువల్ గా అడ ప్రొడ్యూస్ అయింది హిందీలో అది యాక్టింగ్ అంతా అయింది. కానీ తెలుగు సాంగ్స్ అంతే అద్భుతంగా ఉన్నాయి. మీరు రాసిన వాటిలో కూడా కొన్ని సాంగ్స్ రాసుకున్నాను నేను.
(1:04:32) సో మీ ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు ఎందుకంటే జనరల్ గా పాటలు తెలుగులో కూడా షూట్ చేయడం అయితే ఇంపాసిబుల్ నాకు తెలిసినంత వరకయితే ఆ లిప్సింగ్ ఎట్లా మ్యాచ్ అవుతుంది లేకపోతే అతి దగ్గరలో ఎలా ఉంటుంది ఈ వర్డ్స్ తెలుగులో రాసినప్పుడు అనేది ఒక డౌట్ ఉండింది నాకు. అండ్ డెఫినెట్ గా రెగ్యులర్ గా రాసేదానికంటే కొంచెం అంటే ట్యూన్ అదే ఉంటది భావం అదే ఉంటది కానీ మాట మార్తం తెలుగులో రావాలి.
(1:04:53) సో అది ఎట్లా మారుతదో నాకు అర్థం కాలేదు. దీన్ని దీని నిర్వచనం గొప్పవాళ్ళు రెండు రకాలుగా చెప్పారు మ్ అంటే ఒక భాషలో రాయబడిన గీతాన్ని ఇంకో భాషలోకి తర్జుమా చేయడం మ్ అనువదించడం ఎలాంటి ప్రక్రియ అంటే ఒక చోటు ఉన్న సాలెగడిని మ్ చెదరకుండా ఇంకో చోటికి మార్చడం స్పైడర్ వెబ్ ని అక్కడికి తీసుకొచ్చి ఇంకో దగ్గర పెట్టడం పెట్టడం ఇంకొకటి ఏంటంటే ఒక సముద్రాన్ని తీసుకొచ్చి ఇంకో చోట ఇక్కడ పంపడం లేకపోతే చాలా వింత ఎందుకంటే అక్కడి భాష వేరు అక్కడ జాతీయాలు వేరు అక్కడ నేపథ్యం వేరు అక్కడ వ్యవహారిక ఆ మాటలు వ్యవహరికంలో ఉన్న మాటలు వేరు ఇక్కడి భాష వేరు ఇక్కడి మాటలు వేరు ఇక్కడి
(1:05:36) సంస్కృతి వేరు ఇక్కడి వేష అన్ని అవన్నీ వేరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావాలంటే ఇది అంటే ఆ భావాన్ని ఇక్కడ పొందుపరచాలి అంటే మొదటి కష్టం అది రెండవది అత్యంత క్లిష్టమైన విషయం మీరన్న లిప్ సింక్ అంటే పెదాల కదలిక ఆ పెదాల కదలికను సరిగ్గా అనుసరించాలి దాన్ని ఎవరో పెద్దాయన అన్నారు ఈ డబ్బింగ్ పాటల గురించి అంటే అధర చలనాధార గీతాలు అన్నారు.
(1:06:03) అధర చలనాధార గీతాలు అధరాల చలనం మీద ఆధారపడిన గీతాలు అధర చలనాధార గీతాలు డబ్బింగ్ సాంగ్స్ కి తెలుగు అన్నారు. ఇప్పుడు ఎంత కష్టమో చూడండి ఇప్పుడు అధరాలు కలిసేవి ఏంటి ప బ ఉమ్ ప బూడు చోట్లు ఈ మూడు అక్షరాలు అప్పుడే పెదాలు కాదు కలుస్తాయి అవును మిగతా అప్పుడు క గ న ద త డ కలవు రైట్ ప బ మ అప్పుడే కలుస్తాయి ఈ మూడు పద ఈ మూడు అక్షరాలే అధరాలు కలిసి లిప్స్ ఇన్కన్న లెటర్స్ ఈ మూడు అక్షరాలు మనం పాట చదువుతున్నప్పుడే మనకు అర్థమైపోతుంది ప ఎక్కడ వచ్చింది బా ఎక్కడ వచ్చింది మా ఎక్కడ వచ్చింది ఆ లాంగ్వేజ్ లో ఏ సారీ తమిళం పాట తీసుకున్నాం హిందీ పాట
(1:06:49) తీసుకున్నాం ఆ చూడగానే ఇక్కడ మా వచ్చింది అమ్మో జాగ్రత్త పడాలి [నవ్వు] ప వచ్చింది ఆ వచ్చింది డేంజర్ బెల్ మోయింది ఇక్కడ ఆ బా వచ్చింది ప వచ్చింది మా వచ్చింది వ కూడా జాగ్రత్తగా ఉండండి వ అనేది సగం ఉంది ఆల్మోస్ట్ కదిలినట్టుంది వ కదిలి కదలినట్టుగా ఉంటది వ దగ్గర కూడా అది కూడా చిన్న హెచ్చరికే ఇప్పుడు ఈ పలు అని గుర్తుపెట్టుకోండి ప మ రైట్ ఒకటి చెప్తున్నా బ్రహ్మాస్త్రాలో ఒక పాట రాసాను అందులో అన్నీ మీరే రాసారు ఆ మొత్తం నేను రాసాను అందులో కష్టమైన పాట ఈ పాధర చలనాధార గీతం ఏంటంటే చింగారియా ఏజో మేరే సీనేమే హై దఫన్ ఇన్కో జేరా దేకే హవా బన్ జావు మై
(1:07:38) అగన్ ఈ రెండు వాక్యాలు చూడండి చింగారియా లేదు చింగారియా కలవట్లే లిప్ లేదు ఏజో మేరే మూడో అక్షరం మ వచ్చింది సీనేమే మూడో అక్షరం మ వచ్చింది హే దఫన్ రెండో అక్షరం ఫ వచ్చింది అది కూడా ప రెండో పదంలో మూడో అక్షరం మూడో పదంలో మూడో అక్షరం నాలుగో పదంలో రెండో అక్షరం చూడండి చింగారియా ఏజోమేరే నా గుండెల్లో ఏజో మేరే ఈ దీపాలే సీనేమే నీ వైపే హై దఫన్ చూపగా ఇన్కోజరా నిన్నే చూసి దేకే హవా నిన్నే చేరి బంజాము పెను జ్వాలై మారగా మే అగన్ మారగా నా గుండెల్లో ఈ దీపాలే లే నీ వైపే చూపగా
(1:08:45) నిన్నే చూసి నిన్నే చేరి పెను జ్వాలై మారగా బాబ అర్థం భావం భాష అక్కడ సాలగ కూడా ఇక్కడ తీసుకొచ్చా అదే అక్కడ సముద్రాన్ని ఇక్కడ పంపా ఓ ఫార్ములా లాగా తీసుకొచ్చారు దీన్ని ఆ పైగా మనకు అర్థమయ్యే భాష గుండెలు దీపాలు చేరడం చూడ డం ఆ దీపంలోని జ్వాల కాస్త పెనుజ్వాల అయిపోవడం ఇవన్నీ కూడా భావం కూడా ప్రధానం భావం ప్రధానం భాష ప్రధానం తర్వాత పమాలు కూడా ప్రధానం ఈ పమ ఈ పదాలని ఏమంటారంటే ఓష్ట్యాలు అంటారు ఓష్ట్యము పామాను వ అనేది అర్ధోష్ట్యము రైట్ సగం ఓష్ట్యం ఈ పామాలు ఓష్ట్యాలు పామాలు కానివి నిరోష్ట్యాలు హ మన భాషలో తెలుగు ఓస్ట్యాలు నిరోస్ట్యాలు
(1:09:41) ఉంటాయి. ఎంత గొప్పది అంటే మన తెలుగు భాషలో ఓషట్యాలతో ఒక పద్యం చెప్పారు. మొత్తం పామాలే ఉంటాయి. కొన్ని కొన్ని కొన్ని కొన్ని పద్యాలు నిరోష్యాలతో ఉంటాయి పూర్తిగా పామాలు లేకుండా కలవు ఇంత గొప్ప సాహిత్యం మన సొంతం అలాంటివన్నీ కాస్తో కూస్తో అవగాహన పరిజ్ఞానం చదువుకోవడం ఉండడం వల్ల వాటి మీద ఒక చిన్న అవగాహన ఉంది నాకు అన్నమాట అట్లాగే ఇప్పుడు మీరు మీరు నమ్మండి అనువాదం అంటున్నాం కదా అనువాదం అంటే అప్పటికే ఉన్న వాదాన్ని మళ్ళీ మనం అంటున్నాం అనువాదం కాదు మనం కొన్ని కొన్ని పాట్లు అనుసృజన చేశం.
(1:10:18) అనుసృజన కూడా కాదు కొన్ని కొన్ని పాట్లు అధిసృజన చేశం. భూమి గగనంతో ఆడేను ఊసులు బ్రతుకు మరణంతో చేసేను బాసలు అన్నింటికిదే మూలం అనాది స్వరం మౌనం ఆనందం బురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం వింటున్నావ నేస్తం మౌన సంగీతం వింటున్నావ నేస్తం నా మౌన సంగీతం ఆశిస్తున్నా ఆ పాట పాటకి తెలుగులో నేను రాశనది
(1:11:21) ఎక్కడైనా అనువాదం లా సర్లే సర్లే ఎంత సరికొత్త భావాలు కొత్త తెలుగు పాటలు ఉన్నట్టు అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే అనువాద గీతానికి కావచ్చు అనుసృజన కావచ్చు అధి సృజన కావచ్చు ఇక్కడ మన పాటకు మనమే న్యాయ నిర్ణయితం ఆ దీన్ని ఎవరు ఇలా ఎందుకు అని ఎవరు అడగరు ప్రశ్నించరు ఎందుకంటే దర్శకుడు సన్నివేశంలో ఉండడు ఆయన రైట్ వేరే వాళ్ళకి ఇస్తారు మీరు రాయించండి మీరు చేసేయండి అంటారు కాబట్టి పూర్తి బాధ్యత మనదే రచయితే ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి పాటలు రాసే బాధ్యత మనకు ఉంటుంది మన భుజాల మీద ఉంటుంది కాబట్టి మనం ఆ బాధ్యతను సక్రమంగా ప్రతి రచయిత నెరవేర్చడానికి
(1:11:56) ప్రయత్నిస్తూనే ఉంటాడు కచ్చితంగా కానీ వ్యవర్ సైడ్ నుంచి కూడా చాలా రిస్కీ ఎలిమెంట్ కదా సర్ ఫన్న అయిపోతది లేకపోతే సరిగ్గా పండకపోతాయా ఇప్పుడు చిరు చిరు చిరు చినుకై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే ఈ పాట అనువాద గీతమే ఎంత చక్కగా ఉంటుంది అట్లాగే కమలహాసన్ గారి సినిమాలో ఒక పాట ఉంటుంది చెట్టును కదిల్చే చే తాళమే గాలి చెవులను కదిల్చే తాళమే పాట పాటలే చెవులలో తేనే వర్షం పాటలే కళ్ళలో నీటి సంద్రం పాటై భూమినే తాకుదాం ప్రాణం ఇలాంటి ఇలాంటి పాటలన్నీ అనువాద గీత దశవతారం సినిమాలో ఆ దశావతార సినిమా ఓ ఓసనం ఓ ఓసనం ఓ ఓ అనే పాట కూడా అనువాద గీత నేను రాసిన పాటే
(1:12:46) భలే ఉంటది తెలుగులో అయితే ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ మీ విషయం చెప్తాను గమ్మత్తన విషయం మాకు పారితోషకాలు ఎంత ఉంటే మీరు ఎప్పుడు అడగలేదు ప్రశ్న అడగట్లేదు [నవ్వు] అయితే మాకు పార్తోషకాలు బాగానే ఉంటాయి అంటే కష్టానికి తగిన ఫలితమే ఉంటుంది. కష్టానికి తగినంతగా మేమఏమ ఇవ్వరు మాకు తగినట్టుగానే ఇస్తారు చక్కగా మా కృషికి గుర్తింపు ఉంటుంది మంచి బాగానే ఇస్తారు.
(1:13:14) దీంతో పాటు పాట బాగా రాస్తే పాట బాగా బహుళ ప్రజాధరణ పొందితే మాకు ఐపిఆర్ఎస్ అనేది ఒకటి ఉంటుంది. ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ వాళ్ళ ద్వారా మాకు రాయల్టీలు వస్తాయి. పాటకి ప్రతి పాటకి పాట విజయాన్ని బట్టి పాట సాధించిన ఘనతను బట్టి పాట సృష్టించిన చరితను బట్టి మాకు డబ్బులు వస్తుంటాయి. అంటే ఎక్కువ మందికి చేరుకుంటే ఎక్కువ వేదికల్లో ఆ పాట మారు మ్రోగితే దానికి సంబంధించిన రాయల్టీ ఒక రూపాయి వచ్చింది అనుకోండి రాయల్టీ ఆ రూపాయిలో రచయితకు పావల సంగీత దర్శకుడికి పావల పబ్లిషింగ్ కంపెనీకి 50 పైసలు అచ్చ ఇట్లా రూపాయిని మూడు భాగాలు గురించి మాకు
(1:13:52) పావల వస్తది. అయితే ఇప్పుడు ఏంటంటే మీకు చెప్పొచ్చు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చెట్టును కదిల్చే తాలమే గాలి చెవులను కదిల్చిన తాళమే పాట చిరు చిరు చిరు చినుకే కురిసవి పాట బ్రహ్మస్త్రాల కుంకుమల నువ్వే ఆ బ్రహ్మే నేను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే నే కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువల నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్య వేడుకలాగా ఇది అనువాదం కాదు అనుశృతినే అనుకుందాం ఇప్పుడు ఏంటంటే ఈ పాటలన్నీ పార్తోషకం ఇస్తారు మాకు బాగానే ఇస్తారు ముందు
(1:14:50) అనుకున్నట్టుగా పార్తోషకం ఇస్తారు అయిపోతుంది ఈ పాటలు విజయం సాధించిన కొద్ది పాటలు మోగుతున్న కొద్ది పాటలు రకరకాల వేదికల మీద పాటలు అలా నిత్యం వినిపిస్తు వినిపిస్తున్న కొద్ది మాకు దాని ద్వారా వాళ్ళు పోగు చేసిన డబ్బుల నుంచి మాకు డబ్బులు ఇస్తుంటారు చెప్పాను కదా రావాల వాట అని చెప్పేసి ఇలాగ నాకు చిరు చిరు చినుకాయ కురిసా పాటకి అప్పుడు చాలా రోజుల క్రితం 25,000 ఇచ్చారు రాసినందుకు ఒక అనువాదగితమే కదా మనం అనుసృజన చేస్తామో మనం ఇంకేం చేస్తాం మన ఇష్టం కాదు మనకు సంబంధం లేదు.
(1:15:25) బాబు డబ్బింగ్ ఇది లెక్క ఇది నీది వ్యవహారం అని చెప్పేసి మనకు పాతికవర్లు ఇచ్చారు. మ్ మీరు నమ్మండి ఇప్పటికీ ఆ పాట దాదాపు ఒక 10 లక్షలు సంపాదించింది నాకు బా ఈ రాయల్టీ రూపంగా మ్ వస్తూనే ఉంటుంది ఒకసారి ఒకసారి 50,000 వస్తది ఒకసారి 30,000 వస్తది. ఒకసారి లక్ష ఈ ఒక్క పాటకే లక్ష వచ్చింది అన్ని చూస్తాంటే చిరు చిరు చిన్నగా గురించి ఇంత ధరణ ఉందా 10 లక్షలు సంపాదించింది అట్లాగే బ్రహ్మాస్త్ర పాటకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి డబ్బులు 70,000 80,000 అలా ఒక్కొక్కసారి అంటే చాలా పాటలు నాకు ఎన్నో పాటలు ఉంటాయి దానిలో నేను చూసుకుంటే ఈ పాటకి ఎంత వచ్చింది ఈ పాటకి ఎంత వచ్చింది
(1:15:57) అంటే ఈ పాట ఎంత దూరం వెళ్ళింది ఎంతమందికి చేరువ అయింది ఎంతమందికి దగ్గర అయింది అని చూసుకుంటా ఉంటే అంటే అంటే మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సక్రమంగా వినియోగించుకుంటే ప్రతి అవకాశం మనకు మెట్టే అవుతుంది అంతే కదా సార్ అట్లాగే అనువాద గీతాలు కూడా చక్కగా రాయడం వల్ల ఎక్కువ ప్రజాధన పొందడం వల్ల దాని ద్వారా కూడా నా ఒక రాయల్టీ వస్తుంది.
(1:16:18) ఇలాగ ఈ రాయల్టీ రావడం అనేది ఈ మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్ళు 15 ఏళ్లుగా రచయితలందరికీ వస్తుంది. రావడం ఎంత గొప్ప విషయం అంటే పాట రాసేస్తాం. పాట మేము రాస్తున్న పాట మాకు ఇస్తున్న పారితోషకం దేనికోసం ఆ లాంగ్వేజ్ కి సినిమా కోసం సినిమాకి ఆ సినిమా కోసం ఆ రెండున్నర గంటల సినిమాలో నాలుగు పాటలు ఉంటే నాలుగు పాటలు మేము రాస్తే ఆ సినిమా కోసం మేము డబ్బులు తీసుకొని పాట రాస్తున్నాం ఆ సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడు ఆ డబ్బులు పెట్టినప్పుడు 100 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు ఆ సినిమాలో అన్ని అంశాలతో పాటు ఈ పాటలు కూడా అందులో ఉంటాయి కాబట్టి ఆ పాటలు కూడా తన వందలో మాకో ఐ రూపాయలు 10
(1:16:57) రూపాయలు మాకు వస్తాయి మిగతా అంశాలతో పాటు ఇది ఆ సినిమా కోసమే పరిమితం మ్ కానీ పాట సినిమా నుంచి బయటిక వస్తుంది. సినిమాలో పుట్టిన పాట సినిమాలో పుట్టిన పాట సినిమాను మించి ఎదుగుతోంది. మ్ సినిమా థియేటర్ లో చూస్తాం లేదా టీవీ లో చూస్తాం సెల్ ఫోన్ లో వింటాం. ఇప్పుడు పాట థియేటర్లో చూస్తాం టీవీలో చూస్తాం సెల్ ఫోన్ లో వింటాం రేడియోలో వింటాం ఎయిర్పోర్ట్లో వింటాం హోటల్ లాంజుల్లో వింటాం రియాలిటీ షోల్లో వింటాం పబ్బుల్లో పార్టీల్లో వింటాం అక్కడ వింటాం ఇక్కడ వింటాం ఎన్ని చోట్ల విశ్వరు ఇలా వ్యాపించింది.
(1:17:36) ఉ విపరీతంగా వ్యాపించిపోయింది పాట ఇంతకుముందుకండి ఇప్పుడు ఇలా పాట పెరగడం వల్ల ఏమవుతుందంటే పాటకు ఉండే విస్తృతి చాలా చాలా చాలా చాలా పెరిగి పెద్దది సినిమా కంటే పెద్దది అయిపోయింది పాట ఇంతకుముందు చెప్పాను సినిమా 1ె000 కోట్లు 1500 కోట్లు సంపాదించింది. పాట ఒక్కటే 1500 కోట్లు సంపాదించింది. అట్లా పాటలకు ఉండే ప్రాచూర్యం పెరుగుతుంది పెరగడం వల్ల రచయితలందరికీ కూడా ఒక మంచి ఉపాధి మంచి అవకాశాలు రావడం వల్ల ఇంతకుముందు రచయితలు ఎంతో కష్టపడేవాళ్ళు.
(1:18:02) ఉమ్ చివరి దశలో ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను మంచి ఆవేశంతో ఉన్నాను కొరతరం కాదు కానీ కొంచెం ఆవేశంగానే ఉన్నాను ఇంకా దూసుకుపోతున్నాను పర్వాలేదు మనకు బాగానే ఉన్నాయి అవకాశాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి అంత బాగుంది హాయిగా ఉన్నాను ఎంత కాలం ఉంటుంది దూకుడు ఇంకో 10 ఏళ్ళు ఉండొచ్చు తర్వాత ఎలాగ తర్వాత కొత్తతనం వస్తుంది సరే ఏదైనా జరగొచ్చు అప్పుడు మాకు జీవనభృత్తి ఏంటి జాగ్రత్త పడితే ఇప్పుడు ముందు చూపుతో జాగ్రత్త పడితే మాకు వచ్చిన డబ్బును పొదుపు చేసుకోడమో పెట్టుబడి పెట్ట పెట్టి అప్పుడు బ్రతకడానికి పనికి వస్తుంది.
(1:18:34) లేదు అంటే మాకువచ్చి ఈ ఐపిఆర్ఎస్ నుంచి వచ్చే రాయల్టీ మమ్మల్ని మాకు పెన్షన్ లాగా మాకు పోషిస్తుంది. దీని గురించి మీరు కూడా ఫైట్ చేశారు కదా సర్ అప్పుడు నేను ఫైట్ చేయడం కంటే నేను నేను వెనకాల ఆ సైన్యంలో నిలబడ్డాను అంతే సెకండ్ పేరు మీదే ఉంది సార్ నేను చూస్తే ఎక్కువ ఎక్కువ పోరాడింది మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు పోరాడు అనారోగ్యంతో ఉన్న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చాలా చాలా కష్టాల్లో ఉండి అలా అడుగు తీసి అడుగేయని పరిస్థితిలో ఉన్నా కూడా ఆరు నెలలు ఈ ఐపిఆర్ఎస్ చట్టాన్ని పరిశోధించారు ఆయన మొత్తం చదివారు అధ్యయనం చేశారు ఆ చట్టాలు
(1:19:09) మొత్తం పుస్తకాలు చెప్పి చట్టాలను చదివి పోరాడి పబ్లిషర్స్ తోటి నిర్మాతలతో పోరాడి మాకు హక్కులను కాపాడడం కోసం ఆరు నెలల సమయం ఆవుతి చేసుకున్నారు ఆయన మా రచయితల అందరి తరపున ఆయనకు పాదాభివందనాలు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం కనీసం ఆ భా ఆ మొత్తం ఆ చదువుతున్నప్పుడు మొత్తం ఇంగ్లీషే మొత్తం ఒక లాయర్లు చదివే ఇంగ్లీష్ ఎంత కష్టం ఆ టెర్మినాలజీ ఆ పదజాలం ఎంత కఠినంగా ఉంటుంది వాటికి అన్ని అర్థాలు తెలుసుకొని లాయర్లతో కూర్చొని గ్రంధాలు పెద్ద పెద్ద గ్రంధాలు చదివి ఏంటి లుసువులు ఏంటి లోపాలు ఏంటి రచయితలకు అగ్రీమెంట్లో ఏ పదం పెడితే రచయితల హక్కులు
(1:19:46) భంగం అవుతున్నాయి ఏ పదం పెట్టాలి ఏ పదం పెట్టకూడదు అన్నీ అండ్ ఒక ఇఫ్ పెడితే మొత్తం మారిపోతుంది అదంతా మారిపోతుంది. మళ్ళీ ఇంకేదో పెడితే మొత్తం జీవితం తల కిందలు అయిపోతుంది ఇవన్నీ జాగ్రత్తగా చదివి చదివి చదివి చదివి పోరాడి మాకోసం ఈరోజు పళ్ళను మా చేతికి ఇచ్చి అని వెళ్ళిపోయారు. ఐపిఆర్ఎస్ అని కాకుండా పిఆర్ఎస్ అనేది వచ్చింది సాంగ్ ట్రస్ట్ అనేది వచ్చింది ఇలా రకరకాల మార్గాలు రకరకాలుగా మాకు ఎంతో కొంత మాకు వస్తుంది నేను రాసిన పాట చాలా వేదికల మీద మోగినప్పుడు దానిలోనుంచి మాకు ఫలితం వస్తుంటుంది అన్నమాట ఇది కొత్తవాళ్ళు ఎవరన్నా కూడా ఇప్పుడు ఈ
(1:20:20) పాడ్కాస్ట్ చూస్తున్నప్పుడు రచయితలు కావచ్చు గాయనీ గాక కావచ్చు గాయనీ గాక ఇసమ్ర అని ఒకటి ఉంది. ఆహ దాంట్లో కూడా వాళ్ళు ఇసంబ్రాలో సభ్యులు అవుతే గనుక వాళ్ళు పాడిన పాట కూడా వాళ్ళకి రాయల్టీ వాళ్ళు కూడా రాయల్టీ అంతా పోగు చేసుకుంటారు. వాళ్ళకి అక్కడ ఇస్తారు ఇసంబ్ర అనే ఒక సంస్థ ఉంది ఇసంబరా సంస్థలో సభ్యులు అవ్వాలి. ఉమ్ ఒక్కసారి ఏమైందంటే కరోనాలో మ్ కరోనాలో అందరూ పనులు లేవు కదా మ్ కరోనా అందరూ పనులు లేవు రాయల్టీ అయితే వచ్చింది.
(1:20:48) పాటలు వింటున్నారు రాయల్టీ వస్తుంది. ఇప్పుడు ఏం చేశారంటే పాటలు చొప్పున కాకుండా పాటల లెక్క ప్రకారం కాకుండా ప్రతి రచయితకు దాదాపు ఒక ఒక మూడు నెలలకు ఒకసారి 50,000 పంపించడం ఎన్ని పాటలు రాసావు నీ పాటలు విజయవంతం అయ్యాయా కాదా ఆ లెక్క కాదు నువ్వు రచయితవా నువ్వు ఒక 50,000 తీసుకో ఈ కష్టంలో నువ్వు కుటుంబాన్ని పోషించుకో అనేసి మాకు ఆ కష్టకాలంలో ఎంతో మాకు మమ్మల్ని కాపాడింది అంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకంటే నాకు రాసిన పాటలు నాకు కొంచెం బానే వస్తుంది ఎందుకంటే ఎక్కువ పాటలు రాస్తాను మంచి పాటలు రాసినవాడు తక్కువ పాటలు రాసినవాళ్ళు కొత్త వాళ్ళు రాయలేని వాళ్ళకందరికీ ఆ
(1:21:22) 50,000 ఎంతో ఉపక ఇట్లా ఐపి మమ్మల్ని కాపాడే ఒక గొప్ప సంస్థ మేము కూడా ఆ సంస్థను కాపాడాలంటే మంచి పాటలు రాయాలి ఎక్కువ పాటలు రాయాలి దాని సభ్యులు అవ్వాలి. ఇలాగ ఉంటే గనుక ఒకరికొకరం చేదోడు వాదోడుగా ఉంటుంది కాకపోతే ఈ ఐపిఆర్ఎస్ అనే మాట వచ్చినప్పుడల్లా శాస్త్రి గారు ఖచ్చితంగా అందరికీ గుర్తొస్తారు. ఇప్పుడు గురువుగారి టాపిక్ వచ్చింది కాబట్టి సార్ మీ అంటే మీ పాటల గురించి చాలా మాట్లాడడం ఆయన పాటలో మీకు ఆయన రాసిన కవిత్వాలలో మీకు బాగా నచ్చినవి మర్చిపోలేనివి లేకపోతే బాగా గుర్తు చేసుకునేవి అలాంటిది ఏమన్నా ఉంటే నాకు ఆయన రాసిన పాటల్లో చాలా పాటలు శివ
(1:21:59) సినిమాలో పాటలు బాగా నచ్చియి అయితే ముందు అసలు నిజం చెప్పాలి అంటే మామూలుగా శాస్త్రి గారు అనగానే అందరికీ గుర్తు సిరివెన్నల అంటారు తర్వాత స్వర్ణకమలం అంటారు ఇంకో స్వాతి మన స్వాతి కిరణం అంటారు రకరకాల పాటలు చెప్తారు అవన్నీ ఒకే అంటే నన్ను నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే నన్ను బాగా పురికొలిపినవి మాత్రం ఆ పాటలు గొప్పగా ఉంటాయి అందులో అందులో సందేహమే లేదు ఇక కాకపోతే నన్ను బాగా నన్ను తట్టి లేపిన పాటలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు మనీ సినిమా పాటలు ఓ మని సిరివెనల పాటలు సిరివెన్నల పాటలు నేను మొదటిసారి టేప్ రికార్డర్లో విన్న పాటలు సిరివెన్న పాటలు
(1:22:36) అచ్చ మా ఊరికి టేప్ రికార్డర్ వచ్చింది ఆ టేప్ రికార్డర్ మా ఊరిలో తెలియదు అసలు అప్పటి వరకు మైక్ల్లో గ్రామర్ రికార్డ్ లో పాటలు లేనవాళ్ళం టేప్ రికార్డర్ లో క్యాసెట్ ఉంటుంది క్యాసెట్ ఇలా పెట్టి ఇలా నొక్కగానే పాట వస్తుంది మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే ముందుకు వెళ్తుంది మళ్ళ వెనక్కి వస్తుంది ఇలా ఇలాంటివన్నీ మాకు తెలియదు ఈ విచిత్రాలు విన్యాసాలు మొదటిసారి అలా టేప్ రికార్డు మా వరికి తెచ్చినప్పుడు మొదటిసారి విన్న పాట సిరివెన్నెల పాట ఓకే ఆ ఆ అందులో పాటలను వేసి అమ్మ బాబోయ్ ఈ ఈ గాలి ఈనేల పాట పాట వేసి నేను అసలు పొంగిపోయాను పొంగిపోయాను అలా పాటలన్నీ
(1:23:04) వినేసి ఎవరు రాసారు ఈ పాట ఇంత అద్భుతమైన పాటలని అనుకుంటే శాస్త్రి గారు రాశారు. ఐ నో అని చెప్పేసి మనసులో దండం పెట్టుకున్నారు. తరువాత ఇంకా పాటలన్నీ వింటున్నా వేటర్ గారి పాటలు శాస్త్రి గారి పాటలు మాకు ఆత్రేయ గారి ప్రాణం నాకు ఆత్రేయ గారి పాటలు వింటూ వింటూ వింటూ ఉంటే మనీ వరకు వచ్చేసరికి పిచ్చిఎక్కిపోయింది నాకు ఇలా పాట రాయొచ్చా వారేవా ఏమి ఫేస్ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఇలాంటి అంటే ఇలా రాయొచ్చా అందమైన భావాలు ఇంత అంటే నాకు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి సరళత సరళత అనే పదాన్ని మీరు అదిఒక్కటి నాకు నచ్చిన అంశం నాకు నచ్చిన అంశం ఇది నా
(1:23:39) వ్యక్తిగతమైన అంశం చెప్తున్నా నాకు ఆ సరళత విపరీతంగా నచ్చింది. ఆత్రేయ గారిలో సరళత నచ్చింది మళ్ళీ తర్వాత సీతారామ గారి పాటలో కొన్ని పాటలు అయితే అంటే ఇలా రాయొచ్చా ఆ పాటలు అంతే అంత దగ్గరికి వచ్చేసాయి. ఎక్కడో తెర మీద ఉండే పార్ట్లు తెరమీద అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అలా సీట్లు దాటుకుంటూ దాటుకుంటూ మన ఇంటికి వచ్చేసి ఆ జేబులోకి వచ్చేసింది నాకు చూసినసరికి వారెవ్వా ఏమి ఫేస్ ఉంది అంటే అంత దగ్గరికి వచ్చింది చాలా ఆశ్చర్యం కలిగి ఎందుకంటే అంత సులభంగా రావడం చాలా కష్టం ఎందుకంటే అంత పాండిత్యం ఉన్న వ్యక్తి అంత పాండిత్యం ఉన్న వ్యక్తి
(1:24:12) అంత సులభంగా రాయడం చాలా కష్టం అది నాకు అది నచ్చింది నచ్చి నాకు అప్పుడు అమ్మో ఇందులో ఏదో ఒక మాయ ఉంది ఈ మాయను పట్టుకోవాలి నాకున్న పరిజ్ఞానం తో ఈ మాయ నాకు పనికవస్తుంది. కాకపోతే ఏంటంటే తమాష ఏంటంటే చాలామంది అంటారు ఏంటి మీరు ఇంజనీరింగ్ చేశారు కదా భాష మీద ఇన్ని పాటలు రాశారు 3000 పాటలు రాశారు 3000 పైగా రాశారు ఏంటి భాష భాష భాష అంటే ఒకసారి తరిచి చూసుకున్నాను అన్నాను నేను అవును కదా అవును కదా అవును కదా అంటే ఏం నేర్చుకున్నాను అంటే చిన్నప్పుడు పునాది మాత్రం చాలా పటిష్టమైన పునాది ఉంది.
(1:24:49) ఏం పునాది అంటే మా ఇంటి పక్క గ్రంధాలయంలో రోజు చదివేవాడిని నేను కొన్ని ఏళ్ళు నిరంతర నిరంతరం చదువుతూనే ఉన్నా అధ్యయనం చేస్తున్నా ఏం అధ్యయనం చేసేవాడిని బాల సాహిత్యం అధ్యయనం చేసేవాడిని ఏం బాల సాహిత్యం బొమ్మరిల్లు చందమామ బాలమిత్ర బుజ్జాయి చంపకు విస్డమ యోజన ప్రజ్ఞ ఇవన్నీ చదివేవాని పుస్తకాలు నేను బడి నుంచి రావడం సంచి పడేయడం లైబ్రరీ కి వచ్చడం కూర్చోవడం ఓ చదువుతూనే ఉండడు పుస్తకాలని అన్ని పుస్తకాలు కొరికేయడం నమిలేయడం జీర్ణం చేసుకోవడం పుక్కిలించడం [నవ్వు] ఇలా చేశాను అయితే తమాష ఏంటంటే అసలు అంటే ఆలోచిస్తుంటే ఏదో మనకు ఏదో ఒక శక్తి పైనుంచి అన్ని ఇవ్వదు కదా పరాలన్నీ
(1:25:37) కురిపిస్తుందా ఒక పాట రెండు పాటలు మూడు పాటలు 100 ఏంటి 1000 వేల పాటలు ఎలా వస్తున్నాయి ఎలా ఉద్భవిస్తున్నాయి అంటే ఒరేయ్ ఏదో ఏంటి ఏం చేసాం మనం కృషి అంటే ఆలోచించుకుంటే అక్కడ దొరికింది నా మూలం అక్కడ ఉంది బాల సాహిత్యం క్షుణంగా చదివాను మీరు నమ్మండి నమ్మకపోండి ఈ పాడ్కాస్ట్ చూసినవాళ్ళ అందరికీ చెప్తున్నా బాల సాహిత్యం చదవండి ఇంకేమి చదవకండి అవసరం లేదు కూడా చిన్న పిల్లల పుస్తకాలు చదవండి చాలు పెద్ద పెద్ద కావ్యాలు పెద్ద పెద్ద ప్రబంధాలు అవసరం చిన్న పిల్లల పుస్తకాలు చదవండి మొత్తం అంత మొత్తం సమగ్రమైన సాహిత్యం దాంట్లో ఉంటుంది.
(1:26:10) కాబట్టి ఆ నేను నేను నేను తరిచి చూసుకుంటే లోతుల్లోకి ఆ పునాది బలంగా ఉంది. ఆ పునాది మీద ఆ బాల సాహిత్యపు పునాది మీద ఇప్పుడు ఆ బాలగోపాలను అలరయించే ఒక సాహితీ సౌధాన నిర్మించుకోగలిగాను. క్రేజీ అసలు సర్ ఇంకా ఈ గ్రంధాలయం గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉండింది అన్నమాట చిన్నప్పుడు మీ రెండు మూడు స్టోరీస్ కూడా విన్నాను నేను బట్ మీ సైడ్ నుంచి మీకు బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు ఏమన్నా మీ చైల్డ్హుడ్ లో సామెతలు మీరు బాగానే వినిఉంటారా ఆ సార్ సామెతలు బానే సార్ విన్నా తెలంగాణ సామెతలతో తెలుగులో సామెతలు జాతీయాలు న్యాయాలు చాలా
(1:26:45) ఉంటాయి అవును సామెత ఒకటి ఉంది ఊరందరిది ఒక దారి ఉలిపిరి కట్టది ఒక దారి అని చెప్పేసి సామెత అంటే ఊరందరిది అంటే అందరూ గుంపులో వెళ్తున్నట్టుగా గా వెళ్ళకుండా మనం ప్రత్యేకమైన ఒక బాటలో వెళ్తే ఈ సామత వర్తిస్తుంది. రైట్ అట్లాగే చిన్నప్పుడు నేను పుస్తకాలన్నీ చదివేవాడిని కదా ఇప్పుడు నేను అన్ని రకరకాల పుస్తకాలు రకరకాల పత్రికలు చదువుతుండేవాడిని కథలు చదువుతుంటే చదువుతుంటూ కొన్నాళ్లకు నాకు బోర్ కొట్టింది.
(1:27:12) హమ్ ఏంటి ఈ పత్రికలు వాళ్ళు ఎవరో రాసిన పత్రిక మనం చదరం ఏంటి ఛా మనకి ఇది అవమానం ఓకే మనమే రాద్దాం అని చెప్పేసి [నవ్వు] పత్రికలు మనం రాద్దాం రోజు దినపత్రికలు వచ్చేది విషయాలు అందరూ వచ్చేది ఈనాడు వచ్చేది రకరకాలుగా వచ్చాయి. ఆ పత్రికలోని వార్తలు మనం చదవడం ఏంటి మనం మనకు లేదా అన్నట్టుగా అనిపించి ఒక చిత్రం చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది.
(1:27:37) వచ్చేసి మా అమ్మ రోజు పొలం పనులకి వెళ్లి వచ్చేది మా బాపు రోజు బడికి వెళ్లి వచ్చేది. మా బాబు స్కూల్ టీచర్ వచ్చిన తర్వాత వాళ్ళద్దరు పొలం నుంచి వచ్చాక మా బాబు స్కూల్ నుంచి ఇద్దరు కూర్చొని ఏదో పనులు చేసుకుంటే ఆమె వచ్చట ఈమె వచ్చిట ఆ మాట ఈ మాట మాట్లాడుకునే వాళ్ళు. ఉ మనం స్కూల్ నుంచి వచ్చి మన ఈ చెవి చేస్తాం కదా అన్ని మనకు ప్రేక్ష ఎక్కువే కదా వినేసి ఓ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు పొలంలో ఇది జరిగింది అన్నమాట మా బాబు స్కూల్ కి వెళ్తే ఆ ఊర్లో అది జరిగింది అన్నమాట ఇలా అన్నీ వినేవా కరెంట్ అఫైర్స్ ఆ వినేసి అని చెప్పేసి ఇంకా మెల్లిగా ఇక
(1:28:06) మెల్లి మొదలపెట్టా నా దగ్గర కొన్ని కొన్ని పేపర్స్ ఉన్నాయి ఏం చేద్దాం అని ఆలోచించి ఈ పత్రిక ఆ పత్రిక మనం ఎందుకు చదవాలి అని చెప్పేసి నేను ఒక పత్రిక ప్రారంభించా లిఖిత పత్రిక అది లిఖిత పత్రిక అంటే అది ప్రింట్ ప్రింట్ ప్రింటెడ్ ప్రచురించాడు దాన్ని నేను నా స్వహస్తాలతో రాస్తాను దాన్ని లిఖిత పత్రిక అంటారు.
(1:28:26) లిఖిత పత్రిక పెట్ట దాని ఆ పేరు ఏంటో తెలుసా మీరు నమ్మరు 40 ఏళ్ల క్రితం పెట్టిన పేరు ఏంటో తెలుసా వార్తావాహిని ఓ ఆ పత్రిక పేరు వార్త వార్తవాహిని సంపాదకుడు సుభాష్ చంద్ర బోస్ నా పూర్తి పేరు సుభాష్ చంద్ర అవును పెట్టి ఆ ఊరిలో జరిగిన వార్తలన్నీ రాసేది ఆ పత్రికలో రాసేవాడిని రాసి వేసేవాడినిలే గ్రంథాలలో వేసేవాడిని ఇంకా సాయంత్రం పూట సర్పంచు ఉప సర్పంచు పోలీస్ పటేలు అందరి పెద్ద పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఆ పత్రిక ఈ పత్రిక కాదు మనోడు రాసిన పత్రిక ఇదని చెప్పేసి చదివేవాళ్ళు చదివి సంపాదకుడినే కదా సూపర్ అనుకునే మనసులో అనుకున్నాడు అలా ఇలా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత
(1:29:10) మెల్లిగా వార్తలు రావడం తగ్గిపోయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు మనక ఏం తెలుసు స్కూల్ కి వెళ్ళవచ్చాక మనక ఏం తెలుస్తుంది ఏం తెలియట్లేదు వార్తలు ఏమి దొరకట్లే అప్పుడు ఏందంటే నా దగ్గర ఒక స్టాంప్ ఉంది అన్నమాట ఒక ఆవు దూడ ఆవు దూడ స్టాంప్ ఉంది ఎందుకో అది అప్పుడు ఆవు దూడ ఎన్నిక గుర్తు ఓకే ఆ గుర్తు మా స్టాంప్ నా దగ్గర ఉన్నది.
(1:29:27) సరే పేపర్ లో ఏం చేద్దాం ఒక వార్త రాద్దాం ఆవుపాలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్నట్టుగా ఒక హెడ్ లైన్ పెట్టి రాద్దాం అని స్టాంప్ కొట్టాను. కొట్టగానే ఎందుకో ఆ ముద్ర సరిగ్గా పడక ఆవు చాలా బక్క చిక్కిపోయి క్షీణించుకుపోయిఉంది అన్నమాట. ఆ స్టాంప్ స్టాంప్ లో పడలేదు సరిగ్గా పడలే ఓకే వార్త మార్చా కొంచెం మన టాలెంట్ చూపించాం క్రియేటివిటీ క్రియేటివిటీ చూపించి పశువుల వైద్యశాల ఉన్న బక్క చిక్కిన ఒక ఆవు దీనగాధ [నవ్వు] అని పెట్టా కోసం ఆ హెడ్డింగ్ పెట్టా వార్తను సృష్టించాం మనం ఆ ఉన్న వార్తను రాయడం వార్తలు సృష్టించి రాసి రాసి ఇలా జరుగుతుంది ఇలా ఊర్లో
(1:30:11) పశువులు వదిన ఉంది రాసాను రాసి వేసాను పేపర్ వెళ్ళిపోయింది ఇంకా పేపర్ వెళ్ళిపోయింది జనాల్లోకి వెళ్ళిపోయింది. పోలీస్ పార్టీలో సర్పంచ్ అందరూ చూశారు. పశువుల వైద్యశాల ఉన్న బక్క చిక్కిన ఒక ఆవు దీనగాధ అనగానే ఈలోపు పశువుల వైద్యాధికారి ఆ పశు వైద్యాధికారి వచ్చేసాడు ఆయన పేరు ఏదో ఉంది ఆయన వచ్చాడు. ఆ ఏంటి డ్యూటీలు చేయట్లేదా చూడు ఇక్కడ పేపర్లోకి ఎక్కావు చూడు ఇక్కడఏం డ్యూటీ చేయట్లేదా సరిగ్గా ఏదనా ఆవులను సరిగ్గా చూడట్లేదా మనోడు రాసాడు గన ఏంటి ఏం రాసి గన ఉంది ఇది ఎక్కడిదండి నేనే బానే చూస్తున్నా కదా అంత బానే జరుగుతుంది కదా ఈ పిల్లోడు ఎవరు చంద ఓకే మా బాపు వచ్చాడు మా
(1:30:45) బాపు రాగానే మా బాపు తగులుకున్నాడు ఆయన ఏం సార్ ఏంటి సార్ ఇట్లా ఇట్లా మీ వాడు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నట్టు తోచినట్టుగా ఉన్నవి లేను అని పుట్టించి రాస్తున్నాడుగానే మా బాపు నేను రాగానే నేను ఎక్కడో ఆడుకోడానికి వెళ్ళాను రాగానే నన్ను అందుకున్నాడు ఏంట్రా [నవ్వు] పని పాట లేదా స్కూల్ కి వెళ్లి చదువుకోరా అంటే పేపర్లు రాయడం పేపర్ ఆ పేపర్లో లేని పని వార్తలన్నీ కల్పించి రాయడం ఆ ఇవన్నీ రాయడం సొంత పత్రిక పెట్టడం కల్పించి వార్తలు రాయడం ఆయన వచ్చి మనఇద్దరం గవర్నమెంట్ సర్వెంట్లే కదా మనఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే కదా మీ మీ అబ్బాయి నా గురించి
(1:31:11) రాయడం సమంజసంగా ఉందని చెప్పి నన్ను తిడుతున్నాడు అని చెప్పి అప్ప నువ్వు పేపర్ మూయకపోతే నా కొడక మామూలుగా ఉండదు నీకు అన్నాడు అనగానే తెల్లారి అనివార్య కారణాల వల్ల పత్రిక మూసివేయడం [నవ్వు] మంది దీనికి చింతిస్తున్నాను అనివార్య కాలంలో పత్రిక మూసిందుకు చింతిస్తున్నాను హిట్లు సంపాదకులు సుభాష్ చంద్ర బోస్ పెట్టి మళ్ళీ పేపర్ ఇంకోటి [నవ్వు] నాకు వద్రాల పేపర్ మనకి జీవితంలో యంగెస్ట్ పత్రికా అనుకోండి మీరు తర్వాత ఈ పుస్తకాలు చదివేప్పుడు ఒక అనుభవం ఉంది.
(1:31:43) అన్ని కొత్త కొత్త పుస్తకాలు వచ్చాయి లైబ్రరీకి మంచి మంచి పుస్తకాలు వచ్చాయి నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఆ కొత్త పుస్తకం రాగానే పుస్తకం ముంద ముందు ఆ వాసన చూస్తాను ఆ పుస్తకం ఇలా అది ఒక పుస్తక పరిమళం నాకు పూల పరిమళం కంటే పుస్తకాల పరిమళం నాకు ఎక్కువ ఇష్టం ఆ పుస్తకం కొత్త పుస్తకం ఇలా అనేసి దాన్ని చూడగానే ఆ పరిమళం ఆ వాసన నాకు తగలగానే ఎంతో ఆనందం అందులో ఏముందో లేదో తర్వాత విషయం ముందు ఆ పుస్తకం పట్టుకుంటే దాన్ని స్పృషిస్తే ఆ కలిగే అనుభూతి మాత్రం గొప్పగా అనిపిస్తుంది నాకు ఒక పుస్తకం వచ్చింది త్రిభాషా నిఘంటు మ్ మూడు భాషలు ఉంటది ఒక పదం ఉంటుంది
(1:32:17) ఇంగ్లీష్లో ఏమంటారు హిందీలో ఏమంటారు అది పుస్తకం వచ్చింది. కొత్తగా తలతలాడుతుంది. నీలి రంగులో ఉంది ఆ పుస్తకం మంచి గట్టిగా ఉంది. చూసాను అరలో ఉందది తెచ్చుకున్నాను అటు ఇటు చూశను ఈలోపు సాయంత్రం ఏడు అయింది. వచ్చున్నారు వచ్చినవాళ్ళందరూ మెల్లమెల్లగా వెళ్తున్నారు అలా అలా జనాలందరూ అలా వెళ్ళపోసి చూసాను అక్కడ ఒక ఫ్యూన్ ఉంటాడు అన్నమాట చంద్రయ్య అనే పేరు ఆ కానీ కానీ కానీ ఇంక త్వరగా కానీ పోవాలి పోవాలి అన్నాడు పోదాం పోదాం ఒక్క నిమిషం అన్న అనేసి ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు మొత్తం అదేదో సర్దుకుంటున్నాడు సర్దుకున్నాడు చూసి ఇంకెవరు లేరు ఒక్కడినే
(1:32:54) ఉన్నా బాగా చీకటి పడింది దినాలు ఎవరు లేరు ఇంకా పుస్తకం తీసాను తీసి త్రిభాష నీకు అంటూ ఇది ఇది ఇక్కడ ఉండాల్సింది ఆ పుస్తకం నన్ను చెప్పేసి లోపల పెట్టా పెట్ట మన దగ్గర ఉండాల్సి వస్తంది [నవ్వు] అవసరం అని చెప్పేసి తీసుకొని జంప్ వచ్చేసి చంద్ర ఏదో హడావిలో తాలం వేసుకున్నాడు ఆ పద పద పద వెళ్ళిపోదాం చంద్ర అంటే పక్కిళ్లే దూకి ఆ గోడ దూకి పుస్తకం మన దగ్గరికి వచ్చేసింది ఓకే చూసి పహ మురిసిపోయాను ఈ పుస్తకం మనదే దాని ఖరీదు ఎంతో తెలుసా ఎంత ఎంత ఎంత అనుకుంటా చెప్పండి 90స్ లో సార్ ఇది దాని ఖరీదు ఎంత 100 200లో 50 అప్పడ కరెన్సీ వరక కానీ ఖరీదు అప్పుడు
(1:33:35) ఇప్పుడు ఖరీదు ఎంత ఏమ ఉండొచ్చమో 50 రూపాయలు ఉండొచ్చమో అప్పట్లో 40 లక్షలు ఓ బుక్ ఖరీదా [నవ్వు] చెప్తాను వినండి ఓకే ఆ పుస్తకం తెచ్చుకున్నాను ఆ బుక్కు ఖరీదు 40 రూపాయలు ఓకే బుక్ ఖరీదు 40 రూపాయలు కానీ అసలు ఖరీదు 40 లక్షలు ఎలా అంటే పుస్తకం తెచ్చుకున్నాను. చదువుకున్నాను దాని గురించి ఏదో అక్కడక్కడ దాని గురించి నాకు ఇష్టం ఇక ఆ పుస్తకం పట్టుకొని తిరగడం తర్వాత తర్వాత తర్వాత తర్వాత నేను నేను పాలిటెక్నిక్ చేసినప్పుడు నాతో పాటే ఉంది ఇంజనీరింగ్ చేసినప్పుడు నాతో పాటే ఉంది రచయితగా జీవితం ప్రారంభించిన తర్వాత నాతోనే ఉంది ఇప్పటికీ నా దగ్గరే ఉంది ఆ
(1:34:16) పుస్తకం ఓకే గ్రంధాలయం నుంచి ఒక పుస్తకాన్ని దొంగిలించాను నా లోపల నాతో పాటే ఆ పాప భారం పెరుగుతూ వస్తుంది. [నవ్వు] ఒరేయ్ నాయన ఒక దొంగ పని చేసామరా బాబు అని చెప్పేసి మెలిమెగా బరువు పెరుగుతూ వస్తుంది నాకు ఓకే ఏం చేయాలి ఏం చేయాలి ఈ పాప భారం పెరుగుతుంది పుస్తకం చూసి ఉండాలా తప్పు కదా ఇన్నిన్ని పాటలు రాస్తున్నాం ఇన్ని మంచి పనులు చేస్తున్నాం ఇన్ని మంచి విషయాలు చెప్తున్నాం కొడితే కొట్టాల సిక్స్ కొట్టాలి ఎదగాలిరా అంటున్నాం మౌనంగా ఎదగమంటున్నాం చీకటితో వెలిగే అంటున్నాం పుస్తకం ఏంటిరా నువ్వు పని చేసిన పనిఏంటిరా అని ఎప్పుడు వెంటాడతాం
(1:34:47) అది వెంటాడుతాం వెంటాడుతాం అంటాం అంటే సరే దేనికైనా ఒక సమయం వస్తుంది. ఆస్కార్ ఆస్కార్ ఎలాగైతే సమయం ప్రకారం వచ్చిందో ఆస్కార్ తో మా ఊరికి వెళ్ళాడు నేను మా ఊరి వెళ్ళిన తర్వాత మా ఇంటి పక్కనే గ్రంధాలయం వెళ్లి నేను మా ఆవిడ మా ఆవిడని తీసుకొని ఆ గ్రంధాలయంలోకి వెళ్ళా ముందు గుడిలోకి వెళ్ళాను గుడిలో పూజలు చేసుకుని దండం పెట్టుకుని దేవుడికి ఆ గుడి ఆవరణలో గ్రంధాలయం గ్రంధాలయంలోకి వెళ్లి సుచి మా ఆవిడ పేరు సుచిత్ర సుచి ఇక్కడే చదువుకున్నా ఆయన సుచి నేను ఈ పుస్తకాలు ఇక్కడ ఇక్కడ కూర్చునేవాడిని మారిపోయింది నేను గ్రంధాలయం ఈ పుస్తకాలు చదివాను ఇక్కడే ఈ పుస్త
(1:35:19) ఇక్కడే నేను అన్ని చిన్నప్పుడు అంతా చదివాను అని చెప్పేసి మా ఆవిడకి చూపిస్తున్నాను చూపిస్తుంటే చూసింది. ఆ కొంచెం అటు ఇటుగా ఉంది ఒకలాగా ఉంది ఏంటండి ఇదంతా ఒక బాగా పాతపడిపోయిందంట పాతపడి శిధిలం అయిపోయింది అన్న పాత పడ్డండి పాత శిధిలం అయిపోయింది పైన పెచ్చులు ఊడిపోతున్నాయి అని నేను అన్నాను నాకు కొంచెం అక్కడ కొద్దిగా కదలికవచ్చి రిపేర్ రిపేర్ చేద్దామా అన్నా రిపేర్ రిపేర్ ఏమ వద్దండి ఇది కొత్తది కట్టించండి అంతే అమ్మ ఆ లేదు లేదు అప్పటికి నాకు లోపల ఒకటి ఉంది ఒక ఒక అపరాధ భావం ఉంది నన్ను వెంటాడుతుంది చూసి అనుకున్నాను మా సరే ఏం చెప్పలేదు
(1:36:07) మౌనంగా ఉన్నాను అక్కడి నుండి గ్రంధాలయం నుంచి బడికి వెళ్ళాను బడిలో నాకు సన్మానం 72 నుంచి 1970 నుంచి 72 నుంచి 2023 వరకు అన్ని బ్యాచ్ల వాళ్ళందరూ వచ్చారు వచ్చి సన్మానం చేశారు నాకు 72 నుంచి 2023 బ్యాచ్ అందరూ వచ్చి ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ డాక్యుమెంటరీ కూడా వచ్చింది కదా సర్ అది డాక్యుమెంటరీ వచ్చింది చెప్తా దాని సంగతి చెప్తా ఓకే నన్ను మాట్లాడమన్నారు.
(1:36:36) ఇంకా మాట్లాడమంటే మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు ఊర్లో పుట్టినందుకు నేను అదే ఇదే రకరకాలని ఈరోజు ఇంత గొప్ప పురస్కారాన్ని నేను పొందినందుకు మనసంతా సంతోషంతో పొంగుతుంది. ఈ సంతోషంలో నేను ఒక మాట ఇవ్వబోతున్నాను మనం ఇదంతా ఇంత నాకు ఈ ప్రజ్ఞ కావచ్చు ఇది కావచ్చు తెలివితేటలు కావచ్చు ఏదో కొంత ఈ విద్వత్ రావడానికి కారణం మన ఊరి గ్రంధాలయం పుస్తకాలే ఆ గ్రంధాలయం ఈరోజు శిధిలం అయింది అది పూర్తిగా కొత్త గ్రంధాలయం కట్టించబోతున్నాను అని ఆరోజు వాగ్దానం చేశాను ఆరు నెలల్లో 40 లక్షల వ్యయంతో కొత్త గ్రంధాలయం కట్టించేసాను దానికి ఆస్కార్ గ్రంధాలయం అని పేరు పెట్టాను
(1:37:12) అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఆ పుస్తకం ఖరీదు 40 రూపాయలు 40 [నవ్వు] లక్షలు తర్వాత ఈ ఊరిలో జరిగిన ఈ తంగం ఈ తంత అంతా కూడా ఈ నాకు జరిగిన సన్మానం ఈ వేడుక అంతా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ ఒకాయన సుశీల్ రావు గారు మొత్తం రికార్డ్ చేసి 17 నిమిషాలు ఎడిట్ చేసి దాన్ని ఇంగ్లీష్ సబ్టైటిల్స్ వేసి దాన్ని కాన్స్ ఫిలిం ఫెస్టివల్ పంపించాడు.
(1:37:39) పంపిస్తే అక్కడ బెస్ట్ డాక్యుమెంటరీగా సెలెక్ట్ అయిపోయింది. 17 మినిట్స్ ఆ బెస్ట్ డాక్యుమెంటరీ గా సెలెక్ట్ అయిన ఆ డాక్యుమెంటరీ పేరు ఆస్కార్ చల్లగరిగా చల్లగరిగా మా ఊరి పేరు ఆస్కార్ చల్లగరి బెస్ట్ డాక్యమెంటరీ నిజంగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సెలెక్ట్ అవ్వడం అన్నది ఒక రకంగా ఆస్కార్ స్థాయి అది అది ఇంకొ అది ఆస్కార్ అంత స్థాయి అది కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అంత సులభంగా అవ్వదు కాబట్టి అదిఒక మైలు రాయి మళ్ళీ మన జీవితంలో అలాగ ఆ లైబ్రరీ నా జీవితంలో ఎంతో నన్ను నడిపించింది నన్ను కదిలించింది నా చేత కొత్త లైబ్రరీ కట్టింది [నవ్వు]
(1:38:16) బాగున్నాయి సర్ స్టోరీలో సర్ ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ లో ఒక త్రీ ఫోర్ పార్ట్స్ ఉండొచ్చు. సో సన్నివేశాన్ని బట్టి లేకపోతే సిచువేషన్ బట్టి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. అయితే ఇదివరకు నేను రైటర్స్ దగ్గర కంపోజ అంటే రిజిస్టర్ దగ్గర కంపోసర్స్ మ్యూజిక్ కంపోజర్స్ దగ్గర విన్న విషయం ఏంటంటే అప్పట్లో ఎంత పెద్ద హీరో అయినా కూడా మెయిన్ గా పాటలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వచ్చి ఇంట్లల్లో కూర్చొని రైటర్స్ తో రాయించుకోవడం కంపోసర్స్ తో ఇలా చేస్తే బాగుంటుదని మాట్లాడుకునే అంత ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు అప్పట్లో ఆక్టర్స్ అని చెప్పి అదఒకటి విన్నా
(1:38:43) శ్రద్ధ పెట్టేవాళ్ళు రైట్ సాహిత్యం గురించి రైట్ రచన గురించి కరెక్ట్ దానినుంచి ఇప్పుడు ఇవాళ మీ రోల్ గురించి ఆలోచిస్తారు ఇందాక మీరు చెప్తున్న వాటన్నిటి గురించి ఆలోచిస్తారు నాకు కొత్త క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు అంటే మీరు ఒక యక్టర్ తన యక్టింగ్ శైలిని దృష్టిలో పెట్టుకొని పాట రాయాలి. ఆ సిచువేషన్ లో ఆ ఎమోషన్ ని మీరు పండించుకుంటూ మీరు అనుభవిస్తూ రాయాలి.
(1:39:04) ఉ దాంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కంపోజ్ చేస్తారో ఆయన ఉద్దేశంలో ఇది బాగుంటదా బాగుంటదా ఆయన చేయగలుగుతారా లేదా అన్న ఉద్దేశంతో చేసుకుంటూ సింగర్ ఎలా పాడతాడు ఆయన సింగ అంటే అమ్మాయి అయితే అబ్బాయి అయితే బేస్డ్ ఆన్ ది వోకల్ వాళ్ళు ఎలా పాడబోతున్నారు వాళ్ళ అడిక్షన్స్ ఎట్లా ఉంటాయి దాని ప్రకారం రాస్తూ మళ్ళీ మీ ఫిలాసఫీ ఆర్ మీ బౌండరీస్ లో ఉంటూ ఇన్ని రకాల రోల్స్ లో ఉండి చేస్తున్నప్పుడు ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా వస్తే మీరు అనుకున్నట్టు రాకపోవడం పాడలేకపోవడం లేకపోతే మీకు ఇచ్చిన బాని ఒకటి తీరా వచ్చేసరికి ఆన్ ది స్పాట్ మార్క్ చేయడం
(1:39:36) లాంటి కాన్ఫ్లిక్ట్స్ లాంటివి ఏమైనా అయ్యాయా సో నేను ఇందాక చెప్పినట్టు అప్పట్లో ఇలా అయ్యేదా మీకు కూడా అంటే పెద్ద యాక్టర్స్ వచ్చి మీతో కూర్చొని రాయడం ప్లస్ ఇప్పుడే ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయా వస్తే ఎలా చేసుకుంటారు ఆ ముందు మొదటి ప్రశ్న యా మొదటి ప్రశ్నలో అంటే పూర్వం పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద కథానాయకులు కూర్చొని రచయితలతో కూర్చొని వాళ్ళకి కావాల్సినట్టుగా అందులో పాలుపంచుకునే వాళ్ళు పాల్గొనే వాళ్ళు సాహిత్య చర్చలు కావచ్చు ఆ సృజన ప్రక్రియలో నాకు చాలా జరిగింది అలా నాకు నాకు ముఖ్యంగా నా జీవితంలో అలా జరిగిన సందర్భాలు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి
(1:40:07) నాకు ఓకే ఆ గుడుంబ శంకర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నన్ను కలిసారు అంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను ఇక్కడ నంది హిల్స్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సందర్భం చెప్పి ఎలా అయితే బాగుంటుంది ఎలా అయితే బాగుంటుంది అని అంటే నేను అన్నాను నాకు ముందు బానే ఉందని ట్యూన్ ఉంది చూశర్మ గారు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఇలా ఇలా రెండు మూడు రకాలుగా అనుకుంటున్నాను నాకేం అర్థం కావట్లేదు.
(1:40:30) మీరు మీరు మీరే చెప్పండి నాకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పగా నేను ఒకటి రాసుకొస్తాను సార్ అన్నాను అనేసి చెప్పేసి ఇంటికి వచ్చాను. నేను తనతోనే ఫోన్ లోనే ఫోన్ నెంబర్ ఇచ్చారు రేణు దేశ గారి ఫోన్ నెంబర్ ఇచ్చి మీకుేమి అనుమానం ఉన్నా ఫోన్ చేయండి తను మాట్లాడుతుంది అన్నారు. నేను నాకు అనుమానం ఏం రాలేదు. ఉమ్ వచ్చాను వచ్చిన తర్వాత నేను రాసుకొని ఆయన దగ్గరికి మళ్ళీ ఫోన్ చేసి రావచ్చుఅంటే సమయం ఇచ్చారు వెళ్ళాను అంటే అంత చనువు ఉండేది నాకు వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత నేను రాశను చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది చెడ్డోళ్లకు చెడు చేయడమే మంచి చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది చేదన్నది
(1:41:12) ఉన్నప్పుడేగా తీపి ఎడముంది ఉంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది ఎటుకైనా గమ్యం ఒకటేలే చావుంది బ్రతుకుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే లేలే ఇవ్వాలే లేలే లేలే ఈరోజుల్లే లేలే అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లి రెండంటే రెండున్నాయి బాటలే వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లి ఉంటేనే పోతుంటాయి బాధలే లేలే లేలే లేలే రాసి షూటింగ్ శంషాబాద్ దగ్గర గుడిలో అవుతుంది అక్కడికి రమ్మన్నారు అడికి వెళ్ళాను వెళ్లి వెళ్లి వినిపించాను పాటంతా ఏక బిగిన మొత్తం పాటంతా వినిపించారు వినిపించగానే ప్యాడ్
(1:42:17) తీసుకున్నారు ప్ాడ్ తీసుకొని ప్రతి లైన్ ప్రతి లైన్ ప్రతి లైన్ ఇలా టిక్ పెట్టుకుని టిక్ రెండు పేపర్లు ఉన్నాయి మొత్తం రెండు పేపర్లు అన్ని లైన్లకి టిక్కులు పెట్టుకుని టిక్కులు పోకుండా ఏం మార్చాలి ఏం మార్చమని అడుగుద్దాం అని అన్నారు ఒకటే మాట రైట్ పవన్ కళ్యాణ్ గారు తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమాని బాలులో కూడా ఇంకొక పాట కూడా ఆయన దగ్గరుండి మాట్లాడుతూ ఆ సన్నివేశాన్ని బాగా వివరిస్తూ చెప్పిన తర్వాత నేను రాశాను దాంట్లో ఏం రాసానంటే దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి అన్ని పనుల్లోను శ్రామికుడల్లే పగలురేయి
(1:42:57) కార్మికుడల్లే సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే జనం మెచ్చే నాయకుడవుతావు జగం మెచ్చే ఉత్తముడవుతావు ప్రపంచంలో దేవుడివవుతావు అప్పుడు భూమ్మీద దా అసలు సిస్సలు మానవుడవుతావు అని రాసాను పలే అసలు నచ్చి ఆయన అంటే ఇంక వెంటనే ఫోన్లో వినగానే ఫోన్ లో చెప్పాను రెండో చరణం చెప్పగానే చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇంకా రికార్డింగ్ కి వెళ్ళిపోవచ్చు రికార్డింగ్ కి వెళ్ళిపోవచ్చు అన్నారు అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి అడిగాను కదా ఉమ్ ఏంటంటే దర్శకుడికి నచ్చాలి సంగీత దర్శకుడికి నచ్చాలి చివరికి గాయకుడికి నచ్చాలి ప్రేక్షకుడికి నచ్చాలి నిర్మాతకు నచ్చాలి
(1:43:44) రైట్ ఓ నేను అది మర్చిపోయాను ఎంతమంది ఉన్నారు దర్శకుడు సంగీత దర్శకుడు నిర్మాత గాయకుడు తర్వాత ప్రేక్షకుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఐదు కవి అనేవాడు ద్రౌపది అని చెప్పారు విటర్ గారు [నవ్వు] పంచభర్తృక అంటే ఐదుగురు భర్తలు ఉంటారు కవికి ద్రౌపదికి ఎలాగైతే ఐదుగురు భర్తలు ఉన్నారో కవికి ఐదుగురు భర్తలు అంటే వీళ్ళు ఐదుగురు భర్తలు అన్నమాట వీళ్ళందరి మధ్య అలా నెగ్గుకుంటూ నెగ్గుకుంటూ నెగ్గుకుంటూ రావాలి అందరినీ సంతోష పెట్టాలి అట్లా ఉంటూ మన ప్రత్యేకతను చాటుకోవాలి.
(1:44:15) మీరు ఒక ఆ ప్రశ్నలోనే ఉంది అంటే మీదైన భావజాలన్ని మీ సూత్రాలను మీ సిద్ధాంతాలను కూడా చొప్పించాలి అంటే ఖచ్చితంగా చెప్పించాలి. ఎందుకంటే ఒక డెన్ లో పాట మ్ ఒక డెన్ డెన్ ఎదురుగా ప్రతినాయకుడు ఉంటాడు విలన్ ఉంటాడు. మ్ ఇక్కడ హీరో హీరోయిన్ పాడాలి. మామూలుగా డెన్ లో హీరో విలన్ చూసి ఏం పాడతాడు? నీ భరతం పడతా నీ పని పడతా నీకు మొగుడిని నేనే ఇంకా నీకు అంత చూస్తాను మొదలెట్టాను అన్నట్టుగా పాడాలి కానీ ఆ సందర్భాన్ని దేనికి ఉపయోగించుకున్నా ఒక స్ఫూర్తి గీతం రాయడానికి ఉపయోగించుకున్నాను ఓకే పాట ఏంటి సినిమా ఏంటి చూడాలని ఉంది.
(1:44:55) ఆ ఓ మరియా ఓ మరియా ఓ మరియా ఓ మరియా రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మరియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చూద్దామంటే చేద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు డెన్ లో మీరు చూడండి ప్రకాష్ రాజు గారు పక్కన వెళ్ళ ఉంటారు వాళ్ళందరూ ఇలా చూసుకుంటారు కానీ పాడే పాట ఏంటి స్ఫూర్తి మోటివేషన్ సాంగ్ రాయగలిగాం అక్కడ కాబట్టి ఇన్నిటి మధ్యలో కూడా మన ప్రత్యేకతను మనం చాటుకునే ప్రయత్నం మనం చేయాలి.
(1:45:32) రైట్ కచ్చితంగా మనం గెలుస్తాం ఫలితం మన పక్షాన ఉంటుంది. ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి చాలామంది విజయం అనేది ఒక పని చేస్తాం. విజయం అనేది అంటే పూర్తిగా విజయం వస్తుంది చూసారా అది 100 మ్ అది 100 అంటే అంతిమ విజయం అంటారు అంతిమ విజయం అని 100తో అనుకుంటే ప్రథమ విజయం కూడా ఒకటి ఉంటుంది 10 అనేది విజయం అనేది అంటే విజయానికి రకరకాల అంచలంచలుగా విజయం ఉంటుంది.
(1:46:02) ప్రథమ విజయం ద్వితీయ విజయం తృతీయ విజయం అలా ఉండి అంతిమ విజయం అనేది 100 అనుకుంటే ప్రథమ విజయం కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రథమ విజయం ఏంటో తెలుసా ప్రయత్నమే ప్రథమ విజయం. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా మునిగి మునిగి తేలనిదే మహా సంద్రమే లొంగేనా కరిగి కరిగి వెలగనిదే కరిగి కరిగి కొవ్వత్తి వెలుతురులను పంచేనా ముగింపే ఏదైనా మధ్యలో ఆపొద్దురా నీ సాధన ప్రయత్నమే ప్రథమ విజయం ప్రయత్నమే నీ ఆయుధం రైట్ అండ్ మీ అంటే మీ పాడ్కాస్ట్ లో కూడా మీరు మల్టిపుల్ టైమ్స్ మీ అమ్మగారిని గుర్తు చేసుకోవడం గానీ
(1:46:47) మీ పాటల్లో కూడా ఒక రెండు చాలా నాకు బాగా నచ్చిన పాటల్లో పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ అనేది ఒక పాట తర్వాత కనిపించిన ఆ మనం సినిమాలో ఆ పాట ఈ రెండు సాంగ్స్ చాలా కనెక్ట్ అయితాయి సర్ అంటే ఎంత మీరు ఎంత ఫీల్ అయ్యి రాసిఉంటే మీరు ఎంత ఆలోచించి రాసిఉంటే అమ్మ గురించి గానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ యూస్ చేసుకొని అదే ప్రతిసారి ప్రతి పాటకు మనం ఆ పాట ఆ పాట తాలూకు పాత్రగా మనం మారిపోతుంటాం ఎందుకంటే అందుకోసమే రచయితలకు మీరు చూడండి ఆయుర్ధాయం చాలా తక్కువ ఉంటుంది.
(1:47:20) మొత్తం లోపలంతా ఒక జ్వలనం ఒక మదనం ఒక అగ్ని శిఖలు చెలరేగుతా ఉంటాయి. రాత్రి పోటని ఎంతమంది పాట రాసేవాడిని రాత్రి 9మది గంటలకు భోం చేసి 9:30రకు మొదలుపెట్టేవాడిని పాట పూర్తి చేసరికిమూడు నాలుగు అయిపోయింది అలాగ ఆలోచనలు అలా అగ్నిలాగా అగ్నిశిఖలు అగ్నికిలు అలాగా అలా ఉప్పు ఇంక పైకి వెళ్ళిపోతాయి ఏదిమూడు గంటల వరకుతొమ్మిదిన్నర నుంచి అలా అలా అలా అలా అలా అలా అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ లోపలంతా ఇలా ఒక అగ్ని పైకి వచ్చేస్తది నాలుగు అయిపోద్ది పడుకుంటాం మనిషి పడుకుంటాం ఆలోచ ఎక్కడ పడుకుంటాయి మెదరు ఎక్కడ పడుకుంటుంది ఆ అగ్నిశిఖలు అలా చల్లారడానికి మూడు గంటలు పడుతుంది మీకు
(1:48:03) మెల్లిగా పాట అయిపోయింది పాట అయిపోయింది పాట అయిపోయింది పాట అయిపోయింది ఏడు గంటలు నిద్ర పడుతుంది. ఒక నాలుగు గంటలు పడుకుంది 11 గంటలు లే ప్రతిరోజు ఇదే తనతో ప్రతిరోజు ఇతనితో ఆరోగ్యం ఏమైపోతుంది సీతారామ శాస్త్రి గారి ఆరోగ్యం ఇలాగే ఆత్రేయ గారి ఆరోగ్యం ఇలాగే ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఆలోచించి పడుకుంటారు ఇలా ఆత్రేయ గారు పడుకుంటారు చూస్తే అందరూ పడుకున్నారు అనుకుంటారు.
(1:48:30) అందరూ అమ్మ బ్రహ్మాండంగా పడుకున్నాడు గురువుగారు అనుకుంటారు కానీ కాళ్ళు ఇలా ఇలా ఇలా ఇలా ఇలా కొట్టుకుంటా ఉంటాయి. ఇలా కాళ్ళు బట్టన వేళ్ళు ఇలా ఇలా ఇలా అంటుంటే అంటే ఇంకా పడుకోలేదు ఒంటి గంట అవుతుంది అందరూ పడుకున్నారు పక్కన అందరూ పాటలు గురువుగారు చెప్తే రాసుకుందాం అని పడుకుంటారు వాళ్ళు కూడా ఉంటారు రెడీగా ఉంటారు ఈయన పడుకుంటారు కానీ పడుకోరు ఆలోచిస్తూనే ఉంటారు ఆలోచిస్తూ ఒంటి గంటకు లేస్తారు లేచి నాన్న అన్నపూర్ణ ఎవరు అనగానే అన్నపూర్ణ నేనండి అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు నేను ఓ చంగా చీర కట్టకున్న నచ్చింది అది అతను
(1:49:09) మొత్తం ఎలా చెప్తాడుఅంటే పెద్దగా ఇప్పుడు నేనేదో గట్టిగా చెప్ప చెప్పడంట అలాగ రహస్యంగా ఎక్కడో విని చెప్తున్నట్టు చెప్తుంటాడు గుసగుసగుస మొత్తం పాట రాసుకుంటాడు అమ్మయ్య నాకే జాగరణ దగ్గర నాయన అని చెప్పేసి వెళ్ళిపోతాడు అంటే రాత్రి ఆలోచిస్తూ కొన్ని రోజులు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటారు సీతారామశాస్త్రి గారు కూడా రాత్రి అంతా పాట రాసేవాడు కొన్ని వేల రాత్రులు నిద్ర లేకుండా గడిపారు.
(1:49:35) నిద్ర లేకుండా గడిపి ఆలోచించి ఆ జ్వలించి మధించి పాటలు మనకు అమృతాన్ని మనకు అందించి హాలాహలం తను తీసుకున్నారు. అమృత లాంటి మన పాటలు గీతామృతం మనకు అందించి ఆ అనారోగ్య హాలాహలం ఆయన తీసుకున్నారు. తీసుకున్నా ఆయన అది రచయిత పరిస్థితి. రైట్ ఆత్రేయ గారు కూడా అలాగే నిద్ర లేకుండా నిద్ర లేకుండా సిగరెట్లు కాలుస్తూ రాత్రిపట రాస్తూ రాస్తూ రాస్తూ ఎన్నో అద్భుతమైన గీతాలు మనకు అందించి ఆయుర్ధాయం తక్కువ ఎందుకంటే ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఎవరికీ తెలిీదు పైకి చెప్పుకుంటాం మనం పైకి చెప్పుకోలేంు కదా ఇవన్నీ కూడా పైకి చెప్పే విషయాలు కాదు రాయగానే చక్కగా వచ్చారు కార్లో వచ్చారు ఓ బెంజ్ కార్
(1:50:13) దిగాడు బ్రహ్మాండంగాన మంచి మంచి చొక్కాలు వేసుకున్నారు చక్కగా సెల్ ఫోన్లు పట్టుకున్నారు అనగానే కానీ వెనకాల ఏం జరుగుతుంది తెలియదు చాలా మందికి తెలియదు అందువల్ల నేను ఇంకా రాత్రిపూట రాయడం మానేసి నేను కొత్త రకమైన అభ్యాసం మొదలపెట్టాను దీంట్లో అంటే రచయితగా నేను కొత్త మార్గాలు అన్వేషించాను ఏంటంటే రాత్రిపూట రాయడం మానేయాలి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి.
(1:50:36) చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఓ సరే ప్రయత్నిద్దాం. సరే నేను ఒక్కడినే సినిమా రాస్తున్నప్పుడు సుకుమార్ గారితో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి కూర్చుని ఆయనతో పాటు రోజు అంటే పగలే ఆయనతో కూర్చొని సరదాగా సరదాగా కూర్చొని రాసేవాడిని రాస్తూ రాస్తూ రాస్తూ రాస్తూ అలవాటు అయిపోయింది పగలే రాత్రి తీసేసాను ఇంకా చక్కగా పడుకోవడం పొద్దున్నే ఆయనతో పాటు కూర్చుం పాటలన్నీ పగలే అంతా రాసుకున్నాం మంచి పద్ధతిలో మంచి మార్గంలో మనం రాసి మనం చేసి చెప్తే అది మనం పాటించాలి మనం పాటిస్త మన ఆరోగ్యాన్ని కూడా చెప్తే గనుక ఇలా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ
(1:51:09) కూడా ఒక మార్గ దర్శకంగా ఉండాలని భావంతో కొత్త రచయితలు అందరూ దాదాపు అందర మంచి అలవాట్లతో ఉన్నాం. మేము కూడా కొంత అగ్నికి ఆహుత అయ్యాం. ఉమ్ కాస్త కొంచెం మేలుకొని జాగ్రత్త వాడాలిరా బాబు అని చెప్పేసి ఇంకా మెల్లిగా కొంచెం పద్ధతులు మార్చుకుందాం రైట్ ఫన్నీ సాంగ్ ఒకటి మాడదాం అనుకున్నాను సర్ ఏంటది ఎవరిని ఉద్దేశించి కాదు అది మీ దాంట్లో ఒకటి పాట నమ్మొద్దు నమ్మొద్దు అనుకుంటే ఒక పాట ఉంది.
(1:51:33) మ్ సో మగవాళ్ళ సైడ్ నుంచి ఆడవాళ్ళ గురించి ఫన్నీగా ఒక పాట దాంతో పాటు దాన్ని సెన్సార్ బోర్డ్ లో కూడా ఏదో వర్డ్ మార్చాలని చెప్పి ఏదో అయిందని దాని గురించి ఒకసారి మాట్లాడి ఒక చిన్న గాయం అనుకుంటే ఉదాహరణ చెప్తాను దీంట్లో నిజం ఉంది మ్ సినిమాలో ఒక హీరో నటిస్తున్నాడు మ్ ఒక హత్య చేస్తున్నాడు అత్యాచారం చేస్తున్నాడు ఒక గొప్ప విజన్స్ ఒక క్రీడలో గొప్పగా గెలుస్తున్నాడు గొప్ప గొప్ప స్వర్ణ పథకాలు పంప సంపాదిస్తున్నాడు అవి నిజమా హత్య చేస్తాడా అత్యాచారం చేస్తాడా అలాంటి మనుషులు ఉంటారా చేయరు కదా గొప్పగా క్రీడలో రాణిస్తాడు నిజమైన హీరో చేస్తారా ఉత్తదే
(1:52:14) కదా అదంతా కాదా కల్పితం కల్పితం అట్లాగే అది నటన అది నటన నటన గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత గొప్పగా నటించావు అన్నది ముఖ్యం ఇక్కడ రచనలో కూడా నువ్వు ఎంత గొప్పగా నటించి రాసావు అన్నది ముఖ్యం రైట్ రైట్ రైట్ ఏది నీ భావం కాదు ఏది నీ సొంతం కాదు ఇది నటనే కానీ ఎంత గొప్పగా నటించావు అన్నదే చూడాలి ఒక ప్రత్యేక గీతం రాసావు ఇలా ఎందుకు రాశవ్ అది నటన రచన కూడా నటనే ఏదైనా నటనే దర్శకుడి ఆలోచన మేరకు కథ ప్రకారం మేము నటిస్తా రచన కూడా నటన అనే విషయాన్ని నమ్మితే ఏ గొడవ ఉండదు నమ్మాలి నమ్మకు నమ్మకు వాడలలోని ప్రేమలని నమ్మినవాడికి చూపిస్తుంది నరకాన్ని
(1:53:00) కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాజేస్తుంది అన్నయ్య అంటూ ఆపై నీ గొంతును కోసేస్తుంది వంశి ఆడాళ్ళు హింసావాదులు మన మగవాళ్ళు ఆశావాదులు నమ్మాలి నమ్మాలి ఆడోళ్ళలో నీ ప్రేమలని నమ్మాలి నమ్మాలి ఆడళ్ళలో నీ ప్రేమలని నమ్మినవాడికి పంచిస్తుంది ప్రాణం కష్టంలో ముందుంటుంది విజయంలో వెనకుంటుంది అన్నింటా తోడవుతుంది అనురాగం తానవుతుంది ఈ లోకానికి అందం ఆడది మగజన్మానికి మూలం ఆడది ఇదే నమ్మాలి అదే నమ్మాలి ఎందుకంటే రెండు నటనే కాబట్టి [నవ్వు] అసలు ఎక్కడ ఎక్కడ నుంచి ఎక్కడ కొంచం వెళ్ళిపోయాం సర్ అయితే సో జనరల్ గా ప్రతి పాడ్కాస్ట్ లో ఆ లాస్ట్
(1:54:04) లో ఒక అడ్వైస్ అడుగుతా. మ్ సో ఈసారి రెండు అడ్వైస్ లో ఒకటి నాకు మా టీం్ కి ఈ కాంటెంట్ న్యూ ఇయర్ స్పెషల్ కింద మేము కొత్తగా తెలుసుకోవాల్సినవి లేకపోతే మీ సైడ్ నుంచి ఏదైనా ఒక చిన్న అడ్వైస్ ఉంటే తీసుకుంటాం. ఇంకోటి చూసే వాళ్ళకి కూడా ఒక అడ్వైస్ కావాలి. అందరికీ కలిపి ఒకటి ఇస్తే అభ్యంతరం ఎస్ ప్లీజ్ పడు పడు పడు పడు పడు పడు పడు పడు లేచి నిలబడు పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు ఓటమి నీదొని చెబితే విధితోనే తలబడు కలబడు నిలబడు తలబడు విజయాలు వెంటపడు పడు పడు పడు పడు లేచి నిలబడు పడుతూ లేస్తూ పడుతూ లేచి కలబడు ఓట టమి నీదని చెబితే విధితోనే తలపడు నిలబడి
(1:54:51) కలబడి తలబడి విజయాల వెంటపడు పడు పడు పడు పడు అంతే థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అడగగానే ఒప్పుకున్నందుకు టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్న ఆస్కార్ వచ్చినప్పుడు కలుద్దాం మిమ్మల్ని పాడ్కాస్ట్ కోసం అని చెప్పి అక్కడి నుంచి అలాగే పుష్ అవుతూ పుష్ అవుతూ ఇప్పుడు జస్ట్ విత ఇన్ ఫ్యూ డేస్ ఇట్లా కావాలి సర్ అనగానే మీరు ఒప్పుకోవడం థాంక్యూ వెరీ మచ్ నిజానికి నిజానికి నేను ఈ పాడ్కాస్ట్ కి వచ్చే ముందు ఆ అసలు నేను ఇంట్లో మా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూంటే ఇట్లా పాడుకాస్ట్ కి వస్తున్నాను గన నా ఫోన్ లో నుంచి మీ గొంతు మా మా అమ్మాయి విని ఎవరి పాడ్కాస్ట్ కి
(1:55:27) వెళ్తున్నాను తన గొంతు ఎక్కడో విన్నాను అంటగానే ఇట్లా వంశి అనగానే అవునా అని చెప్పేసి ఆ సుశీల గారు ఆవిడ పేరుఏంటి సునీత గారు సునీత గారి గురించి చెబుతూ ఆ పాడ్కాస్ట్ చూసాను నాన్న రెండున్నర గంటలుఏమో చూసా నేను ఒక అంటే అమ్మ నేను ఒక రీల్ చూసే నాకు కంగారు పడిపోయింది నేను రెండు గంటలు చూసాను నాకు ఇంకా ఏంటంటో అయిపోయింది అనేచా చాలా అంటే తను చాలా ఇంట్రెస్ట్ గా ఒక క్యూరియస్ గా వెళ్ళండి నాన్న వెళ్ళండి అని చెప్పేసి ఈ డ్రెస్ నేను ఏం డ్రెస్ వేసుకెళ్తున్నా ఫలానా అంటే రా చూపించి నాకని మ్యాచ్ అవుతుందా లేదా చూసి బ్యాగ్ లో పెట్టేసి చక్కగా వెళ్లిరా బాగా చెయి
(1:55:59) అని చెప్పేసి ప్రోత్సహించి పంపించింది అంటే జంజి తను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతుంది. అంటే వాళ్ళను కూడా వాళ్ళ పైన కూడా ఈ పాడ్కాస్ట్ లో ప్రభావం ఉంది. థాంక్యూ సర్ కాబట్టి ఈ పాడ్కాస్ట్ కి రావడం నేను రావడం మీకు ఎంత ఆనందంగా ఉందో ఇక్కడికి రావడం నాకు అంతకంటే ఆనందం ఉంది ఎందుకంటే దీని ద్వారా చాలా మందికి చాలా విషయాలు తెలుస్తాయి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ తప్పకుండా మళ్ళీ కూర్చుంద టాక్స్ [నవ్వు] థాంక్యూ వెరీ మచ్ సర్ థాంక్యూ
No comments:
Post a Comment