తెలుగు లో ఉన్న వారాల పేర్లు (సోమ, మంగళ మొ||) సంస్కృతం నుంచి వచ్చాయా? వాటికి అచ్చమైన తెలుగు పేర్లు ఉన్నాయా?
అసలు వారం అనే కాన్సెప్ట్ మనకు లేదు ఉన్నదల్లా తిధులు మాత్రమే, ఆది మన్వంతరం నుంచి మనకు ఇప్పటి వర్కింగ్ లేదా నాన్ వర్కింగ్ డేస్ లా ఉన్నవన్నీ తిధుల ప్రకారమే, ఇంకా చెప్పలంటే మనం అరువు తెచ్చుకున్న గ్రీకు భాషలోంచి పుట్టిన ఈ వారాంతరాలు ఖండాంతరాలు పాకి మనకు చేరాయి, కానీ దీన్ని ఎప్పటి నుంచో ఉందని సమర్ధించారు, భాగవత సప్తాహాలు చూపించి ఈ వరం నుంచి మొదలుపెడితే ఈ రోజుకు అయిపోవాలి అలా, కానీ భాగవతం అనేది సప్తాహం కాదు, 7 రోజులలో మృత్యువు చవిచూసే వ్యక్తి జ్ఞానం కోసం ముక్తి కోసం చేసిన ఒక పని అంతే, దీనికి వారానికి సంబంధం లేదు.
అందుకే అవన్నీ మనం అచ్చుగుద్దినట్టు తర్జుమా చేసి వాడుకుంటున్నాము, sun అంటే రవి, mon అంటే సోమా, ఇలా అప్పటినుంచే మనం చూస్తున్న తిథివారయోగకరణం అని చెప్పుకుంటున్న 5 అంగాలు కల పంచాంగం వచ్చిందేమో.
కానీ ఇక్కడి గ్రహ అనుగ్రహా వైశేషిక జ్యోతిష్యాది శాస్త్రాలన్నీ అక్కడికి వెళ్లడం మూలాన్ని అక్కడి నుంచి వచ్చిన వారు సౌలభ్యత కోసం నియోగించిన రోజులనని నా అభిప్రాయం.
కానీ కొద్దిమంది గ్రోగేరియన్ కేలండర్ అనుసరించి శుక్ల కృష్ణ పక్షాలున్నాయి మనం వారి నుంచో లేదా గ్రీక్ కన్నా ముందటి నార్స్ లేదా మెసపోటానిన్ కేలండర్ ఏమో అనుకుంటారు కానీ మన తిధులు మొత్తం జ్యోతిష సంబంధమైనవి కాబట్టి మన కాలమానమంతా సౌరమానం చాంద్రమానం మాత్రమే నాకు ఊహ ఏంటంటే ఈ కేలండర్ లో తిధులు దాటి ఒక కాలగణన వ్యవస్థ ఉండేదేమో అని అభిప్రాయం ఎందుకంటే కచ్చితంగా ఈ రోజుకి అమావాస్య పౌర్ణమి ఇలా లెక్కించిన ఋషులు ఇంతకన్నా అడ్వాన్స్ ఐన టెక్నాలజీ తో కాలగమనం చేసి ఉంటారు.
No comments:
Post a Comment