మంగళం అంటే శుభం కదా ; మరి మంగళ వారం అశుభం యెట్లయ్యింది ? ఆ రొజు కొత్త వ్యాపారాలు , కొత్త కార్యాలు గాని మొదలు పెట్టారు. ఎందుకు?
ఓ విషయం గమనించారా. ప్రపంచంలో అధిక సంపన్నదేశం, శక్తివంతమైన దేశం అయిన అమెరికా తన ముఖ్యమైన నిర్ణయాలు అన్నీ మంగళవారమే తీసుకుంటుందని. ఎన్నికలు, ఫలితాలు వంటి కార్యక్రమాలు కూడా మంగళవారమే ఉంటాయి.
వారంలో ఒక్కో రోజుకి ఒక గ్రహబలం ఉంటుంది అని గ్రహించారు మన ఋషులు. రోజుల పేర్లు అలాగే వచ్చాయి, పెట్టారు. మంగళవారానికి కుజుడు అధిపతి. ఆయన యుద్ధప్రియుడు. అగ్ని, వేడి సంబంధం కలిగినవారు. వివాహం వంటి జీవితంలో ఒకేసారి జరిగే కార్యక్రమాలు ప్రశాంతంగా ఉండే అంటే గురు, శుక్ర బలాలు బాగా ఉండే సమయాలలో ఎక్కువగా చేస్తారు. అదే సంప్రదాయంగా వస్తూంది.
మనకు సంప్రదాయాలను ఇచ్చినది ఋషులు. ఇటువంటివి వారు తమకు తోచినట్లు చెప్పినవి కావు. వారు ప్రతీదానిని ఆచరించి, ఫలితాలను పరిశీలించి ఏవి మనకు సుఖమయ జీవితానికి ఉపయోగపడతాయో గ్రహించి వాటిని సంప్రదాయాలుగా ఇచ్చారు.
ఒక్క మంగళవారమే కాదు మూడమిలో ముహుర్తాలు ఉండవు, శూన్యమాసాలలో ఉండవు. ఇంట్లో దగ్గర బంధువులు కాలం చేస్తే ముహూర్తాలు ఉండవు అంటే శుభకార్యాలు చేయరు.
ముఖ్యమైన కార్యక్రమాలలో ఎవరూ సంప్రదాయాలను ప్రక్కన పెట్టి మరీ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు.
అందుకని మరీ ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా మన ఋషులు ఇచ్చిన సంప్రదాయాలను పాటిద్దాం.
శుభమస్తు
No comments:
Post a Comment