నాకే ఎందుకు ఇలా జరిగింది?" అని బాధ పడుతున్నారా? "దీని నుండి నేను ఎలా ఎదగాలి?" అని ఆలోచిస్తున్నారా?
" ఆర్థర్ ఆష్ ఒక ప్రసిద్ధ అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు మానవ హక్కుల కార్యకర్త. వింబుల్డన్, యుఎస్ ఓపెన్ మరియు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన ఏకైక నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించారు.
క్రీడారంగంలో ఆయన చూపిన ప్రతిభకు గాను, యుఎస్ ఓపెన్ జరిగే ఫ్లషింగ్ మెడోస్ పార్క్‌లోని ప్రధాన స్టేడియానికి 'ఆర్థర్ ఆష్ స్టేడియం' అని పేరు పెట్టారు .
ఆయనకు ఓ భయంకరమైన వ్యాధి పట్టుకుంది. 50 ఏట చనిపోయారు ( 1943–93 ).
ఆ రోగంతో బాధపడుతూన్నప్పుడు " నాకే ఎందుకు ఇలా జరిగింది " అని మీకు అనిపించిందా అని అడిగినప్పుడు ఆయన ఓ అద్భుతమయిన సమాధానం ఇచ్చారు ఇలా:
ప్రపంచంలో ఎన్నో లక్షల మంది పిల్లలు టెన్నిస్ నేర్చుకోవాలని ఉబలాటపడతారు. అందులో కొన్ని లక్షల మంది నేర్చుకోవడం మొదలుపెడతారు. అందులో కొన్ని వేలమంది పట్టు సాధిస్తారు. అందులో కొన్ని వందలమంది జాతీయ స్థాయిలో రాణిస్తారు. అందులో కొన్ని పదుల మంది అంతర్జాతీయ స్థాయిలో ఆడుతారు. అందులో సుమారు ఓ పదిమంది అంతర్జాతీయ ఛాంపియనులు అవుతారు. అలా ఆ స్థాయికి వచ్చి ఛాంపియన్ గా కప్పును ముద్దాడినప్పుడు నేను " నన్నే ఇలా ఎందుకు అనుగ్రహించావు తండ్రీ అని భగవంతుడిని అడగలేదు " అన్నారు. ఎంతటి అద్భుత విషయం.
ఎవరూ అలా అడగరూ కూడా మంచి జరిగినప్పుడు. ఏదయినా తేడా వస్తే మటుకు " నాకే ఎందుకు ఇలా " అని బాధపడిపోతూంటారు.
మనం పది అనుకుంటే 7/8 ఎప్పుడూ పూర్తయి ఆనందాన్ని ఇస్తాయి. కాని ఆ ఆనందం తాత్కాలికం మనకు.
అవని 3/2 కోసం మాత్రం శాశ్వత బాధ అనుభవిస్తాం. మానవనైజం అటువంటిది.
అనుకున్నామని జరగవు అన్నీ
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని " - మురళీకృష్ణ సినిమా.
ఇలా అనుకోగలిగితే సత్ చిత్ ఆనందమే.
శుభమస్తు
No comments:
Post a Comment