#శ్రధ్ధాంజలి.🌹✍️🏻
మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానేకాదు
మమతనే మధువు లేనిదే చేదు.
ప్రతి మనసును తాకుతాయి ఈ ఆత్రేయ జీవాక్షరాలు.
సర్దుకు పోతేనే మనుగడ సాధ్యం ఇల.
#గుండెను_మీటే_అనేక_చిత్రాలు_మనకందించిన #భారతీరాజా_ఈ_రోజు_జర్నీ_చాలనుకున్నారు.
మొదటి చిత్రం పదహారేళ్ళ వయస్సు తోనే ఆకట్టేసుకున్నాడు.
అప్పటిదాకా పల్లెటూరి బ్యాగ్ గ్రౌండ్ తో అంత చక్కని మూవీస్ రాలేదు.
పైగా శ్రీదేవి ని స్టార్ చేసేశాడు అ మూవీతో.
ఇక తూర్పు వెళ్ళే రైలు బాపూ తీసినా...తమిళ మాతృక భారతీ రాజా దే.
కామెంట్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు కదా. సున్నంలో సూక్ష్మం వెతుకుతూ.
రాజా పల్లెటూరి సినిమాలైతేనే తియ్యగలడు....అంటూ విసుర్లు.
అందుకే....సిగప్పు రోజాక్కల్( ఎర్ర గులాబీలు) , టిక్ టిక్ టిక్ వంటి చిత్రాలు తీసి చూపించాడు.
కొత్త జీవితాలు , సీతాకోకచిలుక వంటి యూత్ ఫుల్ కథలు రమ్యంగా తియ్యడమే కాదు...
వేదం పుదిదు వంటి సమాజాన్ని ప్రశ్నించే అద్భుతమైన మూవీలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
ప్రతి మనిషి గుండెను మీటి ఆర్ద్రత నింపిన.....ముదల్ మరియాదై( తెలుగు లో ఆత్మబంధువు) అపూర్వం.
కడల్ పూక్కల్ , అందిమందారై , కరుతమ్మ....
తమిళంలో అద్భుతాలు సృష్టించిన భారతీ రాజా తెలుగు లో డైరెక్ గా తీసిన చిత్రాల్లో ఆరాధన & జమదగ్ని కూడా ఉన్నాయి.
#భారతీ_రాజా_చిత్రాలకు_ఇళయరాజా_సంగీతం...
#పూవు - #తావిలా_అమిరాయి.
#6_జాతీయ_పురస్కారాలు
1982 - సీతాకోక చిలుక
1986 -ముదల్ మరియాదై( ఆత్మ బంధువు)
1988 -వేదం పుదిదు.
1995 -కరుతమ్మ
1996 -అందిమందరై
2001 -కడల్ పూక్కల్.
#4_ఫిల్మ్_ఫేర్_అవార్డ్స్ & #6_తమిళ్_నాడు_స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.
దర్శకుడుగా భారతీరాజా మూవీ అంటే.....అది ఓ స్థాయి లో ఉంటదనిపించారు.
#పద్మశ్రీ ఇచ్చారు.
#వివాదాలు లేకుండా ఎవ్వరూ ఉండరు కదా.
కావేరీ జలాల వివాదం
రాధిక -శరత్ కుమార్ లతో వివాదం( రాధిక కు తొలి అవకాశం ఇచ్చిందే భారతీరాజా)
ఎల్.టి.టి.ఇ....వివాదం...
దర్శకుడు బాల తో వివాదం...
సరే వివాదాలు ప్రక్కన పెట్టి...వివాహానికొద్దాం.
1974 లో చంద్రలీల ను పెళ్ళాడి...ఇద్దరు పిల్లల్ని కన్నారు.
1976 లో పుట్టిన #మనోజ్_భారతీరాజా కూడా నటుడే. కానీ 2025 లో గుండె పోటుతో మరణించారు.
1979 లో జనని పుట్టారు.
2018 లో #డీమోనిటైజేషన్ ను వ్యతిరేకిస్తూ....నవంబర్ 8 ఇరవు 8 మణి అనే చిత్రం 2 షెడ్యూల్స్ తీసి....ఎందుకో మళ్ళీ మానేశారు.
2020 లో తీసిన మీండుం ఒరు మరియాదై....
ఆయనే నటించారు కూడా. పెద్ద అప్లాజ్ రాలేదనే చెప్పాలి.
#అదే_భారతీరాజా_డైరెక్ట్_చేసిన_చివరి_చిత్రం.
కానీ 2025 వరకు....నటుడి గా కొనసాగారు.
నిజం చెప్పాలంటే...నటన లో అంత పరిపక్వత కనిపించదు.
అందరికీ అన్నీ రావు కదా.
ఒక తరాన్ని తన వినూత్న పంథా సినిమాలతో అలరించిన భారతీరాజా జన్మ ధన్యం.
ఈ రోజు 84 ఏళ్ళ వయస్సులో తనువు చాలించిన... ఆ గొప్ప దర్శకుడికి...
శ్రధ్ధాంజలి.🌹
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
No comments:
Post a Comment