ప్రాణాయమము ఎలా మనల్ని రక్షిస్తుంది ? అద్భుత శాస్త్రీయ రహస్యం -BY SAGAR SINDHURI
Author Name:SAGAR SINDHURI
Youtube Channel Url:https://www.youtube.com/@SAGARSINDHURI
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ERFJ0FcYsuo
Transcript:
(00:01) [సంగీతం] నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధు YouTube ఛానల్ ప్రపంచంలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రాణాయామాలు యోగసాధనలు కంపల్సరీగా చేయాలా లోకంలో చాలామంది చాలా జంతువులు ప్రాణాయామాలు చేయకపోయినా యోగసాధన చేయకపోయినా అవి చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి ఇది ఎలా సాధ్యం ఈ సందేహాన్ని నేను శాస్త్రీయంగా వివరిస్తాను ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అసలు ప్రాణాయామము ఎలా మనకు పూర్ణష్యును
(00:48) ప్రసాదిస్తుంది అన్నటువంటి విషయం చూడండి సెల్ ఫోన్ లో మామూలుగా మోడ్స్ ఉంటాయి స్లీప్ మోడ్ అని సైలెంట్ మోడ్ అని వైబ్రేషన్ మోడ్ అని ఏరోప్లేన్ మోడ్ అని ఆయా మోడ్ లో ఆయా రకాలుగా సెల్ ఫోన్ పనిచేస్తుంది. మనం ఎప్పుడైనా ఆ స్విచ్ స్వైప్ చేసినప్పుడు మోడ్ మారుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా ఎప్పుడూ రెండు మోడ్స్ లో పనిచేస్తుంది.
(01:14) ఒకటిది యక్టివ్ మోడ్ రెండోది స్లీప్ అండ్ రిలాక్సేషన్ మోడ్ రిపేర్ మోడ్ అంటారు దీన్ని యక్టివ్ మోడ్ రిలాక్సేషన్ మోడ్ మరి మనం ఫుల్ గా యాక్టివ్ గా ఉన్నప్పుడు మనం బాగా కదులుతూ ఆలోచిస్తూ మాట్లాడుతూ పని చేస్తున్నప్పుడు మన శరీరంలో శరీరం యాక్టివ్ మోడ్లో ఉంటుంది. మరి ఎవరు మన శరీరాన్ని యాక్టివ్ మోడ్ లో ఉంచుతారు అంటే లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అటానమిక్ నెర్వస్ సిస్టం స్వయంచాలక నాడీ వ్యవస్థ అంటారు.
(01:45) ఈ నాడీ వ్యవస్థలో రెండు రకాల నాడీ వ్యవస్థ ఉంటుంది. ఎప్పుడైతే మనం యాక్టివ్ గా ఉంటామో అప్పుడు మన శరీరంలో కావాల్సిన హార్మోన్లు రిలీస్ అవ్వాలి. అదేవిధంగా కాళ్ళు చేతుల్లోకి ఎక్కువ రక్తం సరఫరా కావాలి. గుండె వేగం పెరగాలి శ్వాస వేగం పెరగాలి అప్పుడు మాత్రమే మనం యాక్టివ్ మోడ్ లో ఉన్నట్టు మనం యాక్టివ్ మోడ్ లో ఉన్నామఅంటే మన శరీరంలో సింపథటిక్ నర్వ్స్ సిస్టం యక్టివేషన్ లో ఉందని అర్థం మనక ఏదైనా ప్రమాదం సంభవించినా మనం పారిపోవాలనుకున్నప్పుడు గాని లేదా తిరిగి తిరగబడడం ఫ్లైట్ ఆర్ ఫైట్ సిచువేషన్ ఇలా వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా యక్టివ్ మోడ్ లోకి వచ్చేస్తుంది. ఎలా
(02:28) వచ్చేస్తుంది దానికి ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఎప్పుడైతే ఒక ప్రమాదం గాని భయము ఆందోళన ఒత్తిడి లేదా ఇమ్మీడియట్ గా మనం కదలాలి వేగంగా పని చేయాలి పరిగెత్తాలి అన్న సిచువేషన్ వచ్చినప్పుడు మన యొక్క గుండె వేగం పెరిగిపోతుంది. అదేవిధంగా ఊపిరి తీసుకునే ఊపిరి వేగం కూడా పెరిగిపోతుంది ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. మన బ్రీత్ రేటు హార్ట్ బీట్ రేటు ఇవి రెండు మన మెదడుకు సిగ్నల్స్ అన్నమాట ఎప్పుడైతే మన మెదడు ఈ యొక్క బ్రీత్ రేట్ ని హార్ట్ బీట్ ని ఎక్కువ అయిపోవడం గమనించిందో అప్పుడు ఇమ్మీడియట్ గా మన మెదడు మన శరీరంలో సింపాథటిక్ నర్వస్
(03:08) సిస్టం ని యాక్టివేట్ చేసేస్తుంది. ఈ మోడ్ గనుక ఆన్ అయింది అనుకోండి వెంటనే మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. మన యొక్క రిపేర్ మోడ్ అంటే మన శరీరం హీలింగ్ చేసుకునే హీలింగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. మామూలుగా రెస్ట్ లో ఉన్నప్పుడు మన శరీరంలో అవయవాలు తమకు తామే హీల్ చేసుకుంటూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది.
(03:36) కానీ ఎప్పుడైతే మన శరీరం సింపాథటిక్ నెర్వస్ సిస్టం ఆన్ అయ్యి యాక్టివ్ మోడ్ లోకి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఈ హీలింగ్ మోడ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్లు రక్తంలో కలిసిపోయి బ్లడ్ ప్రెషర్ ఇంక్రిమెంట్ చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ ఈ రక్తం అంతా కూడా మన యొక్క కాళ్ళు చేతులు తలలోకి సప్లై అయిపోతుంది. అంటే శరీరంలో అవయవాలు హీలింగ్ చేసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవన్నమాట.
(04:09) మొత్తం శక్తి మొత్తము కాళ్ళు చేతుల్లోకి సరఫరా అయిపోతుంది రోగ నిరోధక వ్యవస్థకు కానీ జీర్ణ వ్యవస్థకు కానీ అది సరఫరా చేయబడదు. అలా కాకుండా మన శరీరం ఎప్పుడైతే రిలాక్స్డ్ మోడ్లోకి మనం హాయిగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా మన శ్వాస వేగం తగ్గిపోతుంది. అలా ఇంకొకటి మన యొక్క గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గిపోతుంది.
(04:35) మరి ఈ రెండు మెదడుకు సిగ్నల్ ఇస్తాయి వెంటనే మెదడు అర్థం చేసుకుంటుంది ఇప్పుడు ఏ ప్రమాదం లేదు ఎక్కడికి కదలాల్సిన పని లేదు శరీరాన్ని నేను ఇప్పుడు స్లీప్ అండ్ డైజెషన్ మోడ్ రిపేర్ మోడ్ లోకి ఉంచుతాను అని వెంటనే ఇంకొక నాడీ వ్యవస్థను ఆన్ చేస్తుంది దాని పేరు పారాసింపథటిక్ నాడీ వ్యవస్థ ఈ పారాసింపథటిక్ నాడీ వ్యవస్థ ఆన్ లో ఉన్నప్పుడు డైజెషన్ జరుగుతుంది అదేవిధంగా రక్త సరఫరా ఈవెన్ గా ఉంటుంది మన యొక్క గుండె వేగం తగ్గిపోతుంది మన యొక్క శ్వాస యొక్క వేగం కూడా తగ్గిపోతుంది.
(05:11) శరీరంలో ప్రతి కణము ఈ మోడ్లోనే రిపేర్ హీల్ చేసుకోవడం ప్రారంభిస్తాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషి ఎప్పుడు చూసినా సింపాథటిక్ నర్వస్ సిస్టం ఆన్ లో ఉంటే యక్టివ్ మోడ్ లో ఉంటే తన యొక్క హీలింగ్ కెపాసిటీని కోల్పోతాడు శరీరం ఎప్పుడూ కూడా హీలింగ్ మోడ్ లో ఉండదు ఆఫ్ అయిపోతుంది. ఈ మోడ్ ఆన్ లో ఉన్నప్పుడు ఈ మోడ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మరి ఎప్పుడు మనం ఎందుకు మనం నిరంతరం కూడా ఆందోళనతో అనారోగ్యంతో ఎప్పుడ కూడా జబ్బులతోనే మన మనిషి అల్లాడిపోతూ ఉంటాడు అంటే ఒకటే ఒక కారణం ఎప్పుడు చూసిన ఎక్కువ సేపు సింపాథటిక్ నర్వస్ సిస్టం ని ఆన్లో పెట్టుకోవడమే అతను తెలియకుండా
(05:55) చేస్తున్నటువంటి తప్పు మరి తాను అనుకొని ఆ పని చేస్తున్నాడు అంటే మన యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే అది జరిగిపోతూ ఉంటుంది మరి ఎప్పుడైతే మనం ప్రాణాయామం చేస్తామో ప్రాణాయామం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క సింపాథటిక్ నర్వస్ సిస్టం ఆన్ లో గనుక ఉంటే ఇమ్మీడియట్ గా ప్రాణాయామం అనేది శ్వాస వేగాన్ని తగ్గిస్తుంది.
(06:21) తద్వారా గుండె యొక్క కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఈ మూడు సిగ్నల్స్ ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి అందుతాయి. అప్పుడు వెంటనే మన బ్రెయిన్ మన బాడీని రిలాక్స్డ్ మోడ్ లోకి పారాసింపథటిక్ నర్స్ సిస్టం మోడ్ లోకి షిఫ్ట్ చేసుకుంటుంది. చూడండి చాలామంది ఇందాక మనం అనుకున్నాం చాలామంది ప్రాణాయామం చేయకపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
(06:45) చాలా జంతువులు యోగా ప్రాణాయామం చేయకపోయినా ఆరోగ్యంగా ఉంటాయి. మరి అవి ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఒక కుక్క ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే అది రెస్పాండ్ అవుతుంది అది కొట్లాడుతుంది మొరుగుతుంది వేగంగా కదులుతుంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది లేదా పోరాడడానికి వేటాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రమాదం అయిపోంగానే అది రిలాక్స్డ్ గా ఒకచోట కూర్చొని ప్రశాంతంగా నిద్రపోతుంది.
(07:14) ఇమ్మీడియట్ గా ప్రకృతి తనక ఇచ్చినటువంటి వరం ఏంటంటే ఆటోమేటిక్ గా అది తన హీలింగ్ మోడ్ ని రీసెట్ మోడ్ ని ఆన్ చేసుకుంటుంది. ఎందుకంటే అది ఇంతకుముందు జరిగిపోయినటువంటి ప్రమాదాన్ని మనసులో ఎప్పటికీ మొయదు ప్రెసెంట్ టెన్స్ లో మాత్రమే ప్రమాదాన్ని అది గుర్తిస్తుంది. ఆ క్షణం దాటిపోంగానే ప్రమాదం వెళ్ళిపోంగానే అది ప్రశాంతంగా దాన్ని మర్చిపోయి తన బాడీని రిపేర్ మోడ్లోకి మార్చుకోగలుగుతుంది.
(07:43) కానీ మనిషి మాత్రమే మనిషి మాత్రం ప్రమాదం అయిపోయినా కూడా ఒక చెడు సంఘటన ఎప్పుడో జరిగిపోయినా కూడా ప్రశాంతంగా తన రూమ్లో పడుకొని బాడీని అయితే రిలాక్స్ చేయగలుగుతాడు కానీ మనసులో మాత్రం అదే జ్ఞాపకాలని మోస్తూనే ఉంటాడు. అది మరింత స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. కావాలంటే మీరు మీ గదిలో ఉండి ఒక భయానకమైన దృశ్యాన్ని మీరు చూడండి లేదా గుర్తు తెచ్చుకోండి వెంటనే మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది శ్వాస యొక్క వేగం పెరిగిపోతుంది.
(08:18) ఈ రెండు మారితే గనుక ఆటోమేటిక్ గా మన సిస్టం లో సింపథటిక్ నర్వస్ సిస్టం యక్టివ్ మోడ్ ఆన్ అయిపోతుంది. అది స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఇక మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఆఫ్ అయిపోతుంది. అంటే మనం నిజానికి ప్రమాదం లేకపోయినా కూడా మన మనసులో జ్ఞాపకాలను మోయడం జ్ఞాపకాలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం ఎప్పుడు ఆందోళనకరమైనటువంటి ఆలోచనను కంటిన్యూ చేయడం అనే ఈ అలవాటు మనకు ఉండటం చేత ఎప్పుడు చూసినా మనం టెన్షన్ లోనే ఆ యొక్క ఒత్తిడిలోనే ఉంటాం.
(08:52) ఎందుకంటే లోపల ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాబట్టి మనకు మనంగా అనుకొని మరి నాలో పారాసింపథటిక్ నర్వ సిస్టం ఆన్ అవ్వాలి నా శరీరం రెస్ట్ మోడ్ లోకి రావాలి అని మనం అనుకుంటే ఈ పని జరగదు. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు కూడా ఇన్వాలంటరీగా పనిచేస్తాయి. అంటే ఆ స్వయం నియంత్రితకంగా పని చేస్తాయి.
(09:20) మనం అనుకుంటే మన కంటిని మనం కంట్రోల్ చేయలేం. మన గుండె వేగాన్ని మనం అనుకొని తగ్గించలేం కడుపు నొప్పి వస్తుంది అనుకోండి మనం అనుకొని కడుపు నొప్పి తగ్గిపోవాలి తగ్గిపోవాలి అనుకున్న కూడా ఇంకా ఎక్కువ ఆందోళన పెరుగుతుంది కానీ మన కడుపు మన మాట వినదు మన శరీరంలో ఏ అవయవం కూడా మన మాట వినదు. కానీ శ్వాస మనిషికి ఎలా డిజైన్ చేయబడింది అంటే ఇది వాలంటరీగా ఉంటుంది.
(09:46) ఇన్వాలంటరీగా కూడా ఉంటుంది అంటే దానికదే పనిచేస్తుంది మరియు మనం కంట్రోల్ చేస్తే కూడా పనిచేస్తుంది. ఈ శ్వాసకు మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. అందుకే యోగులు మహర్షులు ఈ యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని శ్వాస విద్యను మనకు ప్రాణ విద్యను మనకు అందించారు. శ్వాసను మనిపులేట్ చేసుకోవడం ద్వారా మన శరీరాన్ని యాక్టివ్ మోడ్ లో నుంచి రెస్ట్ మోడ్ లోకి ఇమ్మీడియట్ గా తీసుకొని రావచ్చు అంటే రిపేర్ మోడ్ లోకి తీసుకొని రావచ్చు.
(10:13) కాబట్టి చూడండి మనం నిద్రపోయినా కూడా శ్వాస జరుగుతుంది మనం స్పృహ కోల్పోయినా కూడా శ్వాస జరుగుతుంది. అంటే వాలంటరీగా పని చేస్తుంది. ఒక్కొక్కసారి ఇన్వాలంటరీగా కూడా అంటే మనం అనుకుంటే గనుక శ్వాస వేగాన్ని తగ్గించుకోవచ్చు మన ప్రాణాయామ సాధన ద్వారా అదేవిధంగా గుండె వేగాన్ని తగ్గించుకోవచ్చు మన బీపీ ని మనం అనుకొని మనం తగ్గించుకోవచ్చు శ్వాసను శ్వాస విద్యను నేర్చుకోవడం ద్వారా అంటే ప్రాణాయామము మన యొక్క శ్వాస శ్వాసను నియంత్రించి ప్రాణాన్ని పదిలంగా స్థిరంగా ఉంచి గుండె వేగాన్ని నియంత్రించి రక్త సరఫరా వేగాన్ని నియంత్రించి మన శరీరం ఇమ్మీడియట్ గా
(10:53) పారాసింపథటిక్ మోడ్ లోకి ఆన్ అవ్వడానికి ఇది ట్రిగ్గర్ గా పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మీకు భయం గాన ఆందోళన గాని వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా ఊపరి తీసుకొని నెమ్మదిగా ఊపిరి వదిలారు అనుకోండి ఇప్పుడు ఆటోమేటిక్ గా మీ బ్రీత్ పాటర్న్ చేంజ్ అవుతుంది గుండె వేగం మారుతుంది. మీ శరీరం హీలింగ్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది.
(11:19) మరి మనిషి నిరంతరము విపరీతమైనటువంటి ఒత్తిరిని జీవితాంతం మోయడం చేత విపరీతమైన నెగిటివ్ ఆలోచనలు జీవితాంతం మోయడం చేత తాను ఆరోగ్యంగా ఉండాలనుకున్న ఉండలేడు. కానీ ప్రాణాయామము చేత ఇమ్మీడియట్ గా మన శరీరంలో నాడి వ్యవస్థలో మనం మార్పు తీసుకొని రావచ్చు కాబట్టి ఒక శిక్షణ ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గురువు దగ్గర వెంటనే మీరు వెళ్లి ప్రాణాయామ సాధన నేర్చుకోండి.
(11:46) ప్రాణాయామ సాధన నిజానికి నిండు నూరేళ్ళు మనకు ఆయుష్యును ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. మీకు గనుక ప్రాణాయామం నేర్చుకునే గురువు అందుబాటులో లేకపోతే మా మహర్షి తపోవన్ యోగాశ్రమానికి రండి ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క జబ్బుకు ఏ విధమైనటువంటి ప్రాణాయామం ఏ సీక్వెన్స్ లో చేయాలి [సంగీతం] ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు సంపూర్ణమైనటువంటి యోగిక్ థెరపీని మేము [సంగీతం] ఇక్కడ శిక్షణ ఇస్తూన్నాం.
(12:17) చాలామంది ఇక్కడికి వచ్చి వారి యొక్క జబ్బులను పూర్తిగా నయం చేసుకని వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ప్రాణాయామను నేర్చుకొని సాధన చేయండి మీరు మీ కుటుంబానికి నేర్పించండి సదా అందరూ సంతోషంగా సవ్యంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆయుషషుతో సమృద్ధితో మీరంతా జీవించండి. ప్రాణవిద్య నిజానికి మన యొక్క సంపూర్ణ ఆయుష్యుని ఇచ్చే విద్య సంపూర్ణ జీవితాన్ని ఇచ్చే విద్య మన చైతన్యాన్ని పరిపక్వత చేసే విద్య కాబట్టి యతో మనః తతో ప్రాణః మన ప్రాణం ఎలా ఉంటుందో మన మనసు ఎలా ఉంటుంది మన మనసు ఎలా ఉంటే మన శరీరము ఆరోగ్యం అలా ఉంటుంది
No comments:
Post a Comment