తల్లి గర్భంలో 9 నెలలు నీటిలోనే బతికే శిశువు రహస్యం | సైన్స్‌కు ముందే వేదాలు చెప్పిన అద్భుత సత్యం!
Author Name:Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Channel Url:https://www.youtube.com/@Dr_Pasupathi_Raj_Gurejala
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ERtm-bbqKro
Transcript:
(00:00) ఒక సాధారణ మనిషి నీటిలో మునిగిపోతే ఏమవుతుంది? కొద్ది సెకండ్లలోనే అతని ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి తిత్తుల్లోకి గాలికి బదులు నీరు చేరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మరి అలాంటిది ఒక చిన్న ప్రాణం ఏకంగా తొమ్మిది నెలల పాటు అంటే 275 రోజులకి పైగా పూర్తిగా నీటిలోనే మునిగి ఉండి కూడా ఎలా బతుకుతుంది బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా కటిక చీకట్లో కదలడానికి కూడా స్థలం లేని చోట ఆ నీటిలోనే ఉంటూ ఆ జీవం ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్న వెనుక ఉన్న అసలు రహస్యం తెలిస్తే మీ ఒంటి పై రోమాలు నిక్కబడుచుకోవడమే కాదు.
(00:37) అసలు ఈ సృష్టి నియమాల పైనే మీకు ఉన్న అవగాహన మారిపోతుంది. ఈ వీడియో ని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ అంశం గురించి నా విశ్లేషణ లో ఎంత లోతుగా వివరించవచ్చో అంత స్పష్టంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ గర్భధారణ రహస్యాన్ని అనంత విశ్వ సృష్టితో పోల్చి చెప్పారు.
(00:59) ఈ రోజు మోడర్న్ సైన్స్ చెప్తున్న అత్యంత క్లిష్టమైన అద్భుతాలను మన పురాణాలు ఎప్పుడో సాక్షాత్కరింపజేసాయి. ఇది వింటుంటేనే మన సనాతన ధర్మం యొక్క వైజ్ఞానిక పునాది ఏంటో అర్థమై మనసు గర్వంతో నిండిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం లేడీస్ అండ్ జెంటిల్మెన్ యువర్ అటెన్షన్ ప్లీజ్ దిస్ ఇస్ డాక్టర్ పసుపతి రాజ్ అండ్ వెల్కమ్ [సంగీతం] టు మై ఛానల్ మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది.
(01:27) అదే యథాపిండే తథా బ్రహ్మాండే అంటే ఈ అనంత విశ్వంలో ఏముందో అది ఒక చిన్న అణువులోనూ ఒక తల్లి గర్భంలోనూ ఉంటుంది. మనం సైన్స్ పుస్తకాల్లో చదువుకునే జీవక్రియలకు మన పురాణాల్లో ఉన్న ఆధ్యాత్మిక రూపాలకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధాన్ని చూస్తే ఎవరైనా నిశ్చేష్టులు అవ్వాల్సిందే. తల్లి గర్భంలో బిడ్డ ఉండే ఆ నీటిని ఆధునిక వైద్యశాస్త్రం అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అని పిలుస్తుంది.
(01:49) దీనిని రక్షించే ఒక సంచి ఉంటుంది. దానిని అమ్నియోటిక్ సాక్ అంటారు. కానీ మన సనాతన ధర్మంలో దీనిని ఏమన్నారో తెలుసా? భగవద్గీతలోని మూడవ అధ్యాయమైన కర్మయోగంలో 38 వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ గర్భస్థ శిశువు యొక్క రక్షణ కవచాన్ని అద్భుతంగా ప్రస్తావించాడు. యథోల్బేనావృతో గర్భస్తథ తేనేదమావృతం ఈ శ్లోకంలో ఉన్న ఉల్బము అనే పదానికి అర్థం ఉమ్మనీటి సంచి పొగ చేత నిప్పు మురికి చేత అద్దము ఉల్బము చేత గర్భములోని శిశువు ఎలాగైతే కప్పబడి సురక్షితంగా ఉంటాయో అలాగే కామము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది అని కృష్ణుడు వివరించాడు. మన పురాణాలు ఈ గర్భస్థ
(02:29) స్థితిని గర్భోదక సాగరం లేదా క్షీరసాగరం అని కూడా పిలిచాయి. సృష్టి జరగడానికి ముందు ఈ విశ్వమంతా ఎలాగైతే చీకటితో నీటితో నిండి ఉందో ఆ నీటిలో మహావిష్ణువు శేషపాంకుపై బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఎలా సయనిస్తారో తల్లి కడుపులోని నీటిలో కూడా ఆ చిన్నారి అలాగే ఏ చింతా లేకుండా తేలుతూ ఉంటాడు. ఒక విలువైన వస్తువు పగలకుండా చుట్టూ ఉండే బబుల్ రాప్ ఎలా కాపాడుతుందో, ఈ ఉమ్మనీరు కూడా బిడ్డను బాహ్య శక్తుల నుండి అంతలా రక్షిస్తుంది.
(02:59) తల్లి నడుస్తున్నప్పుడు. కూర్చుంటున్నప్పుడు బిడ్డకు ఎలాంటి దెబ్బలు తగలకుండా శిశువు శరీర ఉష్ణోగ్రత అస్సలు మారకుండా చూసే ఒక అద్భుతమైన రక్షణ కవచం ఇది. ఈ విశ్వాన్ని రక్షించే ఆ మహావిష్ణువును మనం పద్మనాభుడు అని పిలుస్తాం. దీని వెనుక ఎంతటి అద్భుతమైన మైక్రోబయోలాజికల్ సైన్స్ ఉందో తెలిస్తే మన సనాతన శాస్త్రవేత్తల జ్ఞానానికి తలవంచక తప్పదు.
(03:24) పురాణాల ప్రకారం క్షీరసాగరంలో పడుకున్న విష్ణుమూర్తి బొడ్డు నుండి ఒక పద్మనాళం అంటే తామరకాడ పైకి వస్తుంది. ఆ తామర పువ్వుపై సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. మన పూజల్లో చదివే ఈ అద్భుతమైన శ్లోకాన్ని ఒక్కసారి లోతుగా గమనించండి. శాంతాకారం, భుజగసయనం, పద్మనాభం సురేశం, విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం, యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం, భవభయహరం, సర్వలోకైకనాథం.
(03:55) ఈ శ్లోకంలో ఉన్న పద్మనాభం అనే పదం కేవలం ఒక దేవుడి రూపం కాదు. అది తల్లికి బిడ్డకు మధ్య ఉండే బంధానికి ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ విష్ణుమూర్తి తల్లికి ప్రతీక అయితే బ్రహ్మదేవుడు పుట్టబోయే బిడ్డకు ప్రతీకగా నిలుస్తాడు. విష్ణువు నాభి నుండి వచ్చిన ఆ పద్మనాళమే తల్లి గర్భంలో ఉండే అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డుతాడు. తామరకాడ లోపల ఎలాగైతే చిన్న చిన్న నాళాలు ఉండి పోషణను చేరవేస్తాయో బొడ్డుతాడు లోపల కూడా రెండు ధమనులు ఒక సిర ఉండి రక్తాన్ని చేరవేస్తాయి.
(04:26) [సంగీతం] ఈ సాదృశ్యం మనల్ని విస్మయానికి గురి చేస్తుంది. బ్రహ్మదేవుడికి విష్ణువు ఎలాగైతే జీవనాధారమో గర్భంలో ఉన్న శిశువుకు తల్లి అంతకంటే పెద్ద జీవనాధారం. ఈ అద్భుతమైన బయోలాజికల్ కనెక్షన్ ను మన వాళ్ళు ఎప్పుడో పద్మనాభ తత్వంగా ప్రపంచానికి చూపించారు. ఇక్కడ మనం భగవద్గీతలోని మరో పరమ అద్భుతమైన శ్లోకాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తాడు.
(04:53) అహం వైశ్వానరు భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ పాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం దీని అర్థం ఏంటంటే నేను ప్రతి ప్రాణి శరీరంలోనూ వైశ్వానరుడు అనే జీర్ణశక్తిగా మారి వారు తీసుకునే నాలుగు రకాల ఆహారాన్ని జీర్ణం చేస్తాను. గర్భంలో ఉన్న బిడ్డ స్వయంగా ఆహారం తీసుకోలేడు నమలలేడు జీర్ణం చేసుకోలేడు. మరి ఆ బిడ్డకు పోషణ ఎలా లభిస్తుంది? తల్లి శరీరంలో ఉండే ఆ వైశ్వానర అగ్ని అంటే జీర్ణ శక్తి తల్లి తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి దానిని పరమ పవిత్రమైన రసంగా మారుస్తుంది.
(05:25) ఆ రసమే బొడ్డుతాడు ద్వారా బిడ్డకు అందుతుంది. అంటే గర్భంలో ఉన్న బిడ్డ ఆకలిని తీరుస్తూ అతని ఎదుగుదలకు కారణమయ్యే ఆ జీవక్రియను భగవద్గీత ఎంత స్పష్టంగా వివరించిందో చూడండి. తల్లి కడుపులోని ఆ వ్యవస్థ బిడ్డ కోసం ఆహారాన్ని ముందే వండి వార్చి రసము రూపంలో పంపుతుందన్నమాట. ఈ విషయాలను కేవలం పైపైన చెప్పడమే కాదు మన గ్రంథాల్లో దీనికి సంబంధించిన పూర్తి జీవక్రియల వివరణలు కూడా ఉన్నాయి.
(05:53) శ్రీమద్భాగవతం మూడవ స్కంధం 31వ అధ్యాయంలో కపిల మహర్షి తన తల్లి దేవహూతికి వివరిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. మాతుర్ జగ్ధ అన్నపానాది రసప్రస్రవ పుష్టితః షేతే విన్ మూత్ర గర్తేస్మిన్ జంతుహ కృమిభిరాకులః ఈ శ్లోకం యొక్క భావాన్ని వింటే ఆధునిక వైద్యులు సైతం ముక్కున వేలేసుకుంటారు. తల్లి తీసుకునే అన్నపానాదుల యొక్క రసము ఏ భాగం నుండి అయితే ప్రసవిస్తుందో అంటే రక్త ప్రసరణ ద్వారా అందుతుందో దాని ద్వారానే గర్భంలో ఉన్న జీవుడు పోషింపబడుతూ పెరుగుతాడు.
(06:23) ఆధునిక వైద్యశాస్త్రం ఈ రోజు చెప్తున్న ప్లాసెంటా అంటే మాయ అనే అవయవం చేసే పనిని మన భాగవతం నాడే స్పష్టంగా మాతుర్జగ్ధ అన్న పానాది రస ప్రస్రవ పుష్టితః అని పేర్కొంది. అంటే తల్లి తినే ఆహారం రసంగా మారి బిడ్డను పోషిస్తుందని అర్థం. ఒక చెట్టువేర్ల ద్వారా భూమి నుండి పోషకాలను ఎలా లాక్కుంటుందో అలాగే తల్లి కడుపులోని ప్లాసెంటా అనే వ్యవస్థ తల్లి రక్తం నుండి కేవలం బిడ్డకు కావలసిన మంచి పదార్థాలను మాత్రమే వడపోసి బొడ్డుతాడు ద్వారా అందిస్తుంది.
(06:58) ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి రక్తం బిడ్డ రక్తం నేరుగా ఒకదానితో ఒకటి కలవవు. వాటి మధ్య ఒక అద్భుతమైన రక్షణ కూడా ఉంటుంది. దానినే సైన్స్ ప్లాసెంటల్ వారియర్ అంటుంది. ఈ వ్యవస్థ ద్వారానే తల్లి తీసుకున్న ఆహారంలోని సారం ఆక్సిజన్ బిడ్డకు చేరుతాయి. ఒకవేళ తల్లికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అది బిడ్డకు సోకకుండా ఈ గోడ అడ్డుకుంటుంది.
(07:20) ఈ అద్భుతమైన వడపోత ప్రక్రియను కపిల మహర్షి భాగవతంలో ఎంతో స్పష్టంగా వివరించారు. మన సనాతన గ్రంథాల్లో ఉన్న ఈ సైన్స్ చూస్తుంటే మన పూర్వీకుల మేదస్సుకు గూస్ బంస్ రావడం కాయం. కేవలం భాగవతంలోనే కాదు యజుర్వేదానికి చెందిన గర్భోపనిషత్తు మరియు ఆయుర్వేద పితామహుడు సుశృత మహర్షి రాసిన సుశృత సంహిత లోని శారీర స్థానంలో పిండం ఏర్పడిన మొదటి రోజు నుండి తొమ్మిదవ నెల వరకు జరిగే ప్రతి మార్పును అత్యంత శాస్త్రీయంగా వివరించారు.
(07:49) గర్భోపనిషత్తులోని మంత్రం ఇలా ఉంటుంది. మాతురాహార రసేన నాడ్యాప్యాయతే దీని అర్థం తల్లి తినే ఆహార రసము ఒక నాడి ద్వారా బిడ్డకు చేరి అతనికి ఎదుగుదలను ఇస్తుంది. గర్భోపనిషత్తు మరియు సుశృత సంహితలో పిండం యొక్క ఎదుగుదలను నెలల వారీగా వర్ణించిన తీరు నిజంగా అమోఘం మొదటి రాత్రి శుక్ర సోనితాల కలయిక వల్ల పిండం కలల రూపంలో అంటే ఒక ద్రవ బిందువులా ఉంటుంది.
(08:15) ఏడు రాత్రుల తర్వాత అది బుద్బుద అంటే ఒక చిన్న నీటి బుడగలా మారుతుంది. 15 రోజులకు అది ఒక పేసి అంటే మాంసపు ముద్దగా మారి ఒక నెల రోజులకు ఘనరూపం దాల్చి గట్టిపడుతుంది. రెండు నెలలకు సిరా అంటే తలభాగం ఏర్పడుతుంది. మూడు నెలలకు కాళ్ళు చేతులు వస్తాయి. నాలుగు నెలలకు పొట్ట నడుము భాగాలు వస్తాయి. ఐదు నెలలకు వెన్నుముక ఏర్పడుతుంది.
(08:40) ఆరు నెలలకు కళ్ళు ముక్కు చెవులు వస్తాయి. ఏడు నెలలకు జీవం [సంగీతం] పూర్తిగా మేల్కొంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఈ ఏడు నెలలోనే ప్రాణవాయువులు శిశువులో విభజించబడి చేతనా శక్తి జాగ్రత్త అవుతుంది. ఎనిమిది నెలలకు అన్ని అవయవాలు పరిపూర్ణం అవుతాయి. తొమ్మిదో నెల వచ్చేసరికి బిడ్డ జన్మించడానికి సిద్ధంగా ఉంటాడు. ఈరోజు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూసి చెప్తున్న ఈ ఎంబ్రియాలజీ విషయాలను మన ఋషులు ఎలాంటి పరికరాలు లేకుండా ఎలా చెప్పగలిగారు గర్భోపనిషత్తు కేవలం శారీరక మార్పులనే కాదు ఆ సమయంలో బిడ్డ యొక్క చేతన శక్తి ఎలా ఉంటుంది తొమ్మిదో నెలలో బిడ్డకు పూర్వజన్మల జ్ఞానం ఎలా గుర్తుకు వస్తుంది
(09:15) అనే మానసిక ఆధ్యాత్మిక కోణాలను కూడా అద్భుతంగా ఆవిష్కరించింది. గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ తాను చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడని కూడా ఇందులో వివరించబడింది. గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ గుండెలో కొన్ని ప్రత్యేకమైన తాత్కాలిక దారులు ఉంటాయని సైన్స్ చెప్తుంది. వాటిని ఫోరమెన్ ఓవెల్ మరియు డక్టస్ ఆర్టీరియోసిస్ అంటారు.
(09:38) ఇవి రక్తాన్ని ఊపిరితిత్తుల వైపు వెళ్ళకుండా అడ్డుకుంటాయి. ఎందుకంటే అక్కడ ఊపిరి తిత్తులు అవసరం లేదు. ఈ అద్భుతమైన ఫీటల్ సర్క్యులేషన్ లేదా కార్డియోవాస్కులర్ బైపాస్ సిస్టం [సంగీతం] గురించి మన ఉపనిషత్తులు ఎప్పుడో ప్రస్తావించాయి. బిడ్డ శరీరం తనకు ఏ సమయంలో ఏ అవయవం అవసరమో ముందే నిర్ణయించుకునే ఒక అద్భుతమైన ప్రోగ్రామింగ్ కలిగి ఉంటుందని దీని ద్వారా అర్థమవుతుంది.
(10:02) రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా నేరుగా మెదడుకు శరీర భాగాలకు ఎలా వెళ్లాలో ఆ చిన్న గుండెకు ముందే తెలుసు. ఇది ఒక సూపర్ కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసే జీవ రక్షణ వ్యవస్థ. గుండెలోని [సంగీతం] ఈ చిన్న రంధ్రం పుట్టిన వెంటనే మూసుకుపోవడం ప్రకృతి చేసే ఒక పెద్ద మాయాజాలం. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే గర్భంలో ఉన్నంతసేపు బిడ్డ మలమూత్ర విసర్జన చేయడు.
(10:26) ఎందుకంటే అతను తీసుకునేది నేరుగా శుద్ధి చేయబడిన ఆహార రసము మాత్రమే. అతని జీర్ణ వ్యవస్థ పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అతని పేగులలో ఏర్పడే మొదటి వ్యర్థాన్ని సైన్స్ మెకోనియం అంటుంది. ఇది పుట్టేవరకు బయటకు రాకుండా ప్రకృతి బంధించి ఉంచుతుంది. ఒకవేళ అది ముందే బయటకు వస్తే ఉమ్మనీరు కలుషితమై బిడ్డ ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది.
(10:48) అందుకే గర్భంలో జీర్ణక్రియ శూన్యం. అలాగే అతని ఊపిరితిత్తులు కూడా ఎలాంటి గాలిని పీల్చవు. అవి కేవలం నీటితో నిండి ఉంది. గుండ్రంగా ముడుచుకొని ఉంటాయి. ఒక అంతరిక్ష నౌకలో వెళ్లే ఆస్ట్రోనాట్ కు బయటి వాతావరణంతో సంబంధం లేకుండా స్పేస్ సూట్ ఎలా ఆక్సిజన్ అందిస్తుందో అలాగే తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు ప్లాసెంటా మరియు బొడ్డు తాడు ఒక లైఫ్ సపోర్ట్ సిస్టం లాగా పనిచేస్తాయి.
(11:12) ఈ అద్భుతమైన బయోలాజికల్ ఇంజనీరింగ్ వెనుక ప్రకృతి ఎంతటి అపారమైన మేదస్సును దాచిందో కదా బిడ్డకు కావాల్సిన ప్రతి అణువును తల్లి శరీరం ఒక కర్మాగారంలా తయారు చేసి పంపుతుంది. అయితే ఈ ప్రయాణంలో గర్భోపనిషత్తు చెప్పిన మరో అత్యంత అద్భుతమైన రహస్యం ఒకటి ఉంది. తొమ్మిదో నెల నిండగానే బిడ్డ గర్భం నుండి బయటకు వచ్చే సమయంలో ఒక ప్రత్యేకమైన శక్తి లేదా గాలి అతనిని తాకుతుంది.
(11:37) దానిని మన గ్రంథాలు వైష్ణవ వాయువు అని పిలిచాయి. ఆ వైష్ణవ వాయువు ప్రభావం వల్లే అంతవరకు బిడ్డకు ఉన్న పూర్వజన్మల జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా తుడిచి పెట్టుకుపోతాయి. బిడ్డ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతాడు. ఈ భూమిపైకి వచ్చే ప్రతి జీవి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ప్రకృతి చేసే అద్భుతమైన ఏర్పాటే ఈ వైష్ణవ వాయువు.
(11:58) గర్భాశయ సంకోచాల వల్ల అంటే లేబర్ పెయిన్స్ వల్ల బిడ్డపై పడే తీవ్రమైన ఒత్తిడిని సైన్స్ ఎలా వివరిస్తుందో మనవాళ్ళు దానిని వాయువు రూపంలో అంతకంటే లోతుగా చెప్పారు. ఆ వాయువు బిడ్డను క్రిందికి నెట్టి ఈ భూ ప్రపంచంలోకి ప్రవేశపెడుతుంది. ఇక ఈ ప్రయాణంలో అత్యంత భావోద్వేగమైన మరియు ప్రతి ఒక్కరికి గూస్ బంస్ [సంగీతం] తెప్పించే క్షణం ఎప్పుడు వస్తుందంటే బిడ్డ జన్మించే ఆఖరి సెకండ్లలోనే తొమ్మిది నెలల పాటు ఒక రకమైన నీటి వాతావరణంలో ఉన్న బిడ్డ శరీరం హటాత్తుగా ఒకే ఒక్క సెకన్ లో పూర్తిగా మారిపోతుంది.
(12:31) బిడ్డ తల్లి గర్భం నుండి బయటకు రాగానే బాహ్య ప్రపంచంలోని చల్లని గాలి అతని శరీరానికి తగలగానే అతనిలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. బిడ్డ మొదటిసారి నోరు తెరిచి గాలిని లోపలికి పీల్చుకుంటాడు. ఆ క్షణంలో అంతవరకు ముడుచుకుని ఉన్న ఊపిరి తిత్తులు ఒక బెలూన్ లాగా ఒక్కసారిగా విచ్చుకుంటాయి. అంతవరకు గుండెలో ఉన్న ఆ తాత్కాలిక దారులు అంటే బైపాస్ మార్గాలు శాశ్వతంగా మూసుకుపోతాయి.
(12:55) రక్తం నేరుగా ఊపిరితిత్తుల వైపు ప్రవహించడం మొదలవుతుంది. సరిగ్గా అదే క్షణంలో ఈ ప్రపంచం మొదటిసారి ఆ బిడ్డ ఏడుపును వింటుంది. చాలా మంది బిడ్డ ఏడుస్తున్నాడు అనుకుంటారు కానీ ఆ ఏడుపు వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ కారణం ఉంది. బిడ్డ మొదటిసారి గాలి పీల్చినప్పుడు ఆ గాలి ఊపిరితిత్తులలోని నీటిని బయటకు నెట్టేస్తుంది.
(13:17) ఆ ఒత్తిడికి వోకల్ కార్డ్స్ కదిలి ఆ శబ్దం వస్తుంది. అది కేవలం ఏడుపు కాదు. ఆ చిన్నారి మొదటిసారి ఈ భూమిపై తన సొంత శక్తినే నమ్ముకొని శ్వాస తీసుకోవడం ప్రారంభించిన విజయనాథం. అంతవరకు తల్లి ఆధారంగా బతికిన జీవం ఇప్పుడు స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టిన క్షణం అది. ఒకే ఒక్క సెకనులో ఒక మనిషి శరీరం ఇంత పెద్ద మార్పుకు లోనవ్వడం అనేది ఈ సృష్టిలోనే అతి పెద్ద వింత.
(13:40) ఈ మార్పు సరిగ్గా జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం. కానీ ప్రకృతి ఈ మార్పును ఎంత సునాయాసంగా చేస్తుందో కదా. ఈ అద్భుతాలన్నీ విన్నాక కూడా మన సనాతన ధర్మాన్ని మన వేదాలను కేవలం కల్పిత కథలు అని కొట్టిపారేసే వాళ్ళకి మన సంస్కృతిని ఎగతాళి చేసే వాళ్ళకి ఒకటే గట్టి సమాధానం చెప్పాలి. ఆధునిక సైన్స్ ఒక మైక్రోస్కోప్ కనిపెట్టి గర్భంలో ఏముందో చూడటానికి వేల సంవత్సరాలు పట్టింది.
(14:05) ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి స్కానింగ్ మిషన్లు కనిపెట్టిన తర్వాతే గర్భంలోని శిశువు యొక్క రక్త ప్రసరణ గురించి తెలుసుకోగలిగారు. కానీ మన మహర్షులు ఎలాంటి లాబొరేటరీలు లేకుండా ఎలాంటి పరికరాలు లేకుండానే కేవలం తమ దివ్య దృష్టితో యోగశక్తితో తల్లి గర్భంలో జరిగే ప్రతి అణువు మార్పును అక్షరబద్ధం చేశారు. ఇది కేవలం ఊహ కాదు ఇది పరమ సత్యం మన గ్రంథాల్లో ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకోలేక వాటిని పుక్కిటి పురాణాలు అని హేళన చేసే మూర్ఖులకు ఈ విషయాలు కనువిప్పు కలిగించాలి.
(14:39) మన సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదు అది మోడరన్ సైన్స్ ఊహకందని పరమ విజ్ఞానం మన సంస్కృతిని తక్కువ చేసి చూసే మేధావులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన గ్రంథాలు పురాణాలు కావు. అవి రాబోయే తరాలకు దిక్సూచీలు ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో ఎవరో చెప్తేనే సైన్స్ అనుకునే బానిస ఆలోచనల నుండి బయటకు రండి. మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న ప్రతి మాట వెనుక ఒక ప్రగాఢమైన శాస్త్రీయ సత్యం దాగి ఉంది.
(15:07) సనాతన ధర్మం అనేది ఒక అనంతమైన మహాసముద్రం. అందులో ఈరోజు సైన్స్ కనుక్కుంటున్న విషయాలన్నీ కేవలం చిన్న నీటి బిందువులు మాత్రమే అని గర్వంగా చాటి చెబదాం. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవిద్దాం. మన సనాతన మూలాలను గర్వంగా ప్రపంచానికి చాటుదాం. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
(15:34) ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు [సంగీతం] నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కి వస్తుంది.
(16:01) థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్యూ ఆల్.
No comments:
Post a Comment