Friday, July 17, 2026

 మన భారత దేశంలో దత్త క్షేత్రములు.........!!
దత్తావతారం.......
*1.పిఠాపురం....
దత్తుని ప్రదమ దత్తావతారం  శ్రీపాద శ్రీ వల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంద్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది..

*2.కురువపురం.....
ప్రదమ దత్తావతారులైన శ్రీపాదవల్లబులు తపసు చేసిన స్థలం... 
ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్ లో వెళ్ళవచ్చు.

*3.గోకర్ణము.....
ప్రదమ దత్తావతారు లైన శ్రీపాద వల్లబులు తపసు చేసిన స్థలం... ఇది కర్నాటక రాష్ట్రము హుబ్లి నుండి బస్ లో వెళ్ళవచ్చు.
                       
*4.కరంజా....
రెండవ దత్త అవతారం, నృశింహ సరస్వతి (శ్రీ గురుడు) జన్మస్థలం ఇది.. మహరాష్ట్రఅమరావతి జిల్లాలో ఉన్నది.

*5.నర్సో బావాడి...
శ్రీ గురుడు 12 సం||తపసుచేసిన స్థలం,... 
ఇది కొల్హా పూర్ మీరజ్ రూటులో ఉన్నది.

*6.గాణగా పూర్.....
 శ్రీ గురుడు 23 సం. నివసించినస్థలం, ఇది కర్నాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీ గురుని నిజపాదుకలు కలవు, చూడవలసి స్థలం, బీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.

*7.ఔదుంబర్.....
శ్రీ గురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహరాష్ట్రులో ఉన్నది.
"చూడవలస స్థలం," బీమా-అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం.

*8. మీరజ్.....
ఇచట శ్రీ గురుడు తపసు చేసిన స్థలం కొల్హపూరు రూటులో  జైసింగ్ పూరు వద్ద నుండి వెళ్ళవచ్చు. 
      
*9.శ్రీశైలం....
శ్రీ గురుడు అంతర్ధానమైన ప్రదేశం.
ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంట..  దత్తాత్రేయ స్వామి అనుగ్రము ఉంటే చేరుకోగలరు.
ఇది ఆంద్రప్రదేశ్ కర్నూలు జిల్లా లో ఉంది.

*10.మూడవ దత్తావతారం.....
*మాణిక్య ప్రభువులు......
మాణిక్య నగర్ .. మూడవ దత్తావతారం, శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాది, ప్రభువుల వారి సంస్థానం, కర్నాటక గుల్బర్గా - హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది.
తప్పక చూడవలసిన క్షేత్రము.

 *11.అక్కల్ కోట......
*నాలుగవ దత్తావతారం,.....
 స్వామిసమర్ద (అక్కల్ కోటస్వామి ) సమాది మందిరం ఇది చెన్నయి - ముంబాయి రూటులో అక్కల్ కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటో పై వెళ్ళవచ్చు.
తప్పక చూడవలసిన దత్త క్షేత్రము.

*12 ఏక ముఖ దత్తుని ఆలయం.....
ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది ఆటోలో వెళ్ళి రావచ్చు.

*13. నాసిక్....
ఇచట ఏకముఖ దత్త విగ్రహం ఉంది.

ప్రముఖ దత్త క్షేత్రములు......

*14. గిరినార్.....
ఇచ్చట దత్తపాదుకలు కలవు
ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది.
ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది, ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లబిస్తుందని భక్తుల నమ్మకం.

*15. షేగాం......
ఇచ్చట మరో దత్త రూపుడు గజానన మహరాజ్ సమాది మందిరం ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు ఇది కూడ చూడదగ్గ క్షేత్రం.

*16.  ఖేడ్గవ్......
సమర్దనారాయణమహరాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు.

*17ఖాండ్వా.....
శ్రీ దున వాలా దాదా వారి సమాదిమందిరం ఉంది. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో కలదు.

*18 మాన్ గవ్.....
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం, గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలోఉంది
ఇది చూడదగ్గ క్షేత్రం.

*19. గరుడేశ్వర్......
శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాది మందిరం కలదు గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది ఇది తప్పక చూడవలసిన క్షేత్రం

*20. మౌంటు అబూ........
ఇచట దత్త శిఖరము కలదు. రాజస్తాన్ రాష్ట్రములో కలదు..

పైన తెలుపబడిన దత్త అవతారముల అయిదు క్షేత్రములు మరియు ఈ 1నుండి 14 వరకు గల క్షేత్రములు దర్శించిన దత్త  అనుగ్రహం తప్పక ఉండను. అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చను.

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభా దిగంబర

No comments:

Post a Comment